Showing posts with label My Editorials. Show all posts
Showing posts with label My Editorials. Show all posts

తపస్కాలము - ప్రాముఖ్యత

తపస్కాలము - ప్రాముఖ్యత

   కతోలిక శ్రీసభలో ‘తపస్కాలం’ ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక కాలము. ఇది ‘విభూతి బుధవారము’తో ప్రారంభ మవుతుంది. ఆదివారమును మినహాయించి, క్రీస్తు ఉత్థాన పండుగకు ముందు 40 రోజుల కాలము తపస్కాలము. 

    తపస్కాలములో విశ్వాసులు సంపూర్ణముగా దేవునివైపు మరలటంద్వారా, క్రీస్తు ఉత్థాన పండుగకు సంసిద్ధ పడాని శ్రీసభ కోరుచున్నది. దీనినిమిత్తమై విశ్వాసులు పాటించవసిన కొన్ని నియమాను శ్రీసభ ప్రతిపాదించుచున్నది. అవియే ‘ప్రార్ధన’, ‘ఉపవాసము’, ‘దానధర్మములు’. తపస్కాము మనను దేవునినుండి దూరము చేసే విషయాను త్యజించు కాము, అలాగే దేవునిలో మనను ఐఖ్యము చేయు పవిత్రమైన, ఆధ్యాత్మిక విషయాను ఆలింగనము చేసుకొను కాము.

    శ్రీసభ తపస్కాములో క్రీస్తు శ్రమను జ్ఞాపక పరచుకొనుచున్నది. క్రీస్తు ప్రభువు 40 రోజులు ఎడారిలో చేసిన ఉపవాస ప్రార్ధనను తపస్కాములో క్రైస్తవులు అనుసరిస్తున్నారు. భోజనములో కొంత భాగమును త్యజించడం, అలాగే కొన్ని ఉత్సవాను మానుకొనుట తపస్కాములో భాగమే!

    శ్రీసభలో తపస్కా ఆచరణ అనాది కాలముగా వస్తున్న దైవార్చన ఆచరణయే! శ్రీసభ ఆరంభము నుండియే, ఉత్థాన పండుగకు ఆయత్తపడు విధానమును చూస్తున్నాము.

    తపస్కాలము 40 రోజులుగా ఏర్పాటు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. యూదుల పవిత్ర గ్రంధములో 40 ముఖ్యమైన సంఖ్య. వినాశకరమైన వాన ‘నలువది పగళ్ళు, నలువది రాత్రులు ఎడతెగక కురిసెను’ అని ఆదికాండము 7:4, 12లో చూస్తున్నాము. వాగ్దత్త భూమికి చేరక ముందు ఇశ్రాయేలు ప్రజలు 40 సం.లు ఎడారిలో పయనించారు. సినాయి పర్వతముపై పది ఆజ్ఞను పొందబోవు ముందు మోషే 40 రోజులు ఉపవాసం చేసాడు. బహిరంగ ప్రేషిత కార్యమును ప్రారంభించుటకు ముందు యేసు 40 రోజులు ఎడారిలో ఉపవాస ప్రార్ధనలో గడిపాడు.

    తపస్కాము, ప్రాపంచిక శోధనను జయించుటకు, 40 రోజుపాటు ఉపవాసములో, ప్రార్ధనలో ‘ఏకాంతముగా ఎడారి’లో జీవించు కాము. ఒక వ్యక్తి తనకుతానుగా ఆధ్యాత్మికముగా బమును పుంజుకొను కాము తపస్కాలము. దైవీక, మానవ సంబంధాలను మెరుగుపరచుకొను కాము. దేవుని వాక్కుకు, ప్రార్ధనకు ఎక్కువ సమయాన్ని కేటాయించు కాము. క్రీస్తు శ్రమను ధ్యానించు కాము.

ప్రార్ధన, ఉపవాసము, దానధర్మములు
ప్రార్ధన, ఉపవాసము, దానధర్మములు తపస్కాములో ముఖ్యమైన మూడు స్తంభా వంటివి. మన ప్రాయశ్చిత్తమునకు, పశ్చత్తాపమునకు, జ్ఞానస్నాన వాగ్దానముకు విశ్వాస జీవితాన్ని పునర్మించుటకు ఎంతగానో తోడ్పడతాయి.

ప్రార్ధన: 
    తపస్కాములో ఎక్కువ సమయాన్ని ప్రార్ధనలో గడపాలి. అది ప్రభువునకు మనను దగ్గరగా చేస్తుంది. మన జ్ఞానస్నాన ప్రమాణాను జీవించుటకు కావసిన శక్తికోసం ప్రార్ధన చేయాలి. ఉత్థాన పండుగ దినమున జ్ఞానస్నానము పొందు వారి కొరకు ప్రార్ధన చేయాలి. పాపసంకీర్తనము చేయు వారి కొరకు ప్రార్ధన చేయాలి.

ఉపవాసము: 
    ఉపవాసము పవిత్రమైన కార్యము. ఉపవాసము కేవలం ఇంద్రియనిగ్రహము కోల్పోకుండా ఉండుటకు మాత్రమేగాక, ప్రార్ధన చేయుటకు సహాయ పడును. శారీరక ఆకలి, మన ఆధ్యాత్మిక ఆకలిని గుర్తు చేస్తుంది. అయితే, దేవునికి ఇష్టమైన ఉపవాసము ఇదే: ‘‘నేను ఇష్టపడు ఉపవాసమిది. మీరు అన్యాయపు బంధమును విప్పుడు. ఇతరుల మెడమీదికి ఎత్తిన కాడిని తొలగింపుడు. పీడితును విడిపింపుడు. వారిని ఎట్టి బాధలకును గురిచేయకుడు. మీ భోజనమును ఆకలి గొనిన వారికి వడ్డింపుడు. ఇల్లు వాకిలి లేని వారికి ఆశ్రయమిండు. బట్టలు లేనివారికి దుస్తులిండు. మీ బంధువుకు సహాయము నిరాకరింపకుడు (యెష 58:6-7).

  మన సమాజములో, ఎంతోమంది పేదరికము వన రోజూ ఉపవాసము ఉంటున్నారని గుర్తించుదాం. సమానత్వము కొరకు, అందరూ క్షేమముగా ఉండటానికి కృషి చేద్దాం.

దాన ధర్మములు:  
    దానధర్మాలు \ తోటి వారిపట్ల మనకున్న బాధ్యతను గుర్తుచేస్తుంది. దేవుడు మనకు ఇచ్చిన వరములకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అవసరములో నున్నవారికి సహాయం చేయాలి, దానధర్మములు చేస్తూనే, సమాజములో నీతి, న్యాయస్థాపనకు కృషి చేయాలి.

సిలువ మార్గము: 
    తపస్కాములో ‘సిలువ మార్గము’నకు ప్రత్యేక స్థానము ఉన్నది. తపస్కాములో మనం ముఖ్యముగా క్రీస్తు శ్రమను, మరణముగూర్చి ధ్యానిస్తూ ఉంటాము. సిలువ మార్గముద్వారా, క్రీస్తు శ్రమలో మనమూ పాలుపంచుకొనాలి. సిలువ మార్గము, క్రీస్తు శ్రమను పొందిన విధముగా, దేవునకు విశ్వాస పాత్రులుగా ఉండాలంటే, మనముకూడా శ్రమను పొందాని గుర్తు చేస్తూ ఉంటుంది.

దైవసేవకుని 75వ వర్ధంతి మహోత్సవాలు

దైవసేవకుని 75వ వర్ధంతి మహోత్సవాలు (Editorial, "Thamby Velugu" January 2020)

ప్రియ ‘‘తంబి వెలుగు’’ పాఠకులారా!
జనవరి మాసం రాగానే, మనకందరికీ ‘దైవసేవకుడు’ బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి వర్ధంతి మహోత్సవాలు గుర్తుకొస్తాయి. 13,14,15 తారీఖులలో అవుటపల్లిలోని ఆ మహాశయుని సమాధిని దర్శించుకొని, ప్రార్ధించి, దివ్యపూజాబలిలో పాల్గొని, మొక్కుబడులు చెల్లించుకొని, క్రీస్తు యేసు శాంతి, సమాధానము పొందుకొని సంతోషంతో, ఆనందముతో యింటికి తిరిగి వెళ్లాని బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి భక్తుంలందరూ ఎదురుచూస్తూ ఉంటారు.

ఈ సంవత్సరం బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి 75వ వర్ధంతి మహోత్సవాలు. ఆ పునీతుడు మరణించి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. దేవుని పట్ల భయభక్తులుగలు వారికి ఆయన మధ్యస్థ ప్రార్ధన ద్వారా ఎన్నో మేలులు అద్భుతాలు చేస్తున్నారు. దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ మహనీయుని గురించి తెలుసుకుందాం... 

కుటుంబము, బ్యాము, యౌవ్వనము
బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి తల్లిదండ్రులు తంబుసామి శవరిముత్తు, రోసమల్లె మరియ (అన్నమలె). వీరి స్వస్థం దక్షిణ భారతదేశముననున్న తమిళనాడు రాష్టములోని పాండిచ్చేరి సమీపములోని ‘కరైకల్‌’ గ్రామము. తండ్రి శవరిముత్తు ప్రభుత్వ ఉద్యోగి. తల్లి రోసమల్లె మరియ గృహిణి.

ఉద్యోగం నిమిత్తమై, శవరిముత్తు తన భార్యను తీసుకొని ఆగ్నేయ ఆసియాలోని ‘సైగోన్‌’ దేశమునకు వెళ్ళాడు. వారు ఆచటనుండగనే, 11 నవంబరు 1890వ సంవత్సరములో వీరికి పండంటి మగబిడ్డ జన్మించాడు. ఆ ముద్దు బిడ్డకు ‘రాయప్ప జోసఫ్‌ శౌరి’ అని పేరును పెట్టారు. అయితే, ప్రస్తుతం, ‘బ్రదర్‌ జోసఫ్‌ తంబి’గా ప్రసిద్ధి గాంచారు.

జోసఫ్‌ తంబికి రెండేళ్ళ వయస్సు ఉన్నప్పుడు, అనగా 1892వ సంవత్సరములో శవరిముత్తు, రోసమల్లె మరియు తన కుమారుని తీసుకొని భారత దేశమునకు తిరిగి వచ్చారు.

జోసఫ్‌ తంబికి ఏడు సంవత్సరము వయస్సు ఉన్నప్పుడు అనగా 1897వ సంవత్సరములో తల్లి రోసమల్లె మరియ మరణించినది. అప్పుడు అతని తండ్రి శవరిముత్తు ‘మేరి తెరేసా’ను రెండవ వివాహము చేసుకున్నాడు. అయితే సవతి తల్లి జోసఫ్‌ తంబిని ఇష్టపడలేదు. రోజూ చిటపటలు, చికాకులే! జోసఫ్‌ తంబిని ఎన్నో హింసలకు గురిచేసింది. రోజూ సరిగా భోజనం కూడా పెట్టేది కాదు.

సవతి తల్లి పెట్టే హింసలను, బాధలను తాళలేక జోసఫ్‌ తంబి యింటిని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు. యింటినుంచి పారిపోయిన తంబి కేరళ రాష్ట్రమునకు వెళ్ళాడు. ఎర్నాకుళం అను ప్రదేశములో ఒక పుణ్యాత్మురాలి చల్లని పిలుపు తంబికి వినబడినది. ఆమె సంరక్షణలో, ఆలనాపాలనలో, ఊరడింపులో, ఆదరణలో విద్యాబుద్ధులు నేర్చుకొంటూ పెరిగాడు. నిండైన ఆత్మవిశ్వాసములోను, క్రైస్తవ విశ్వాసములోను అంచలంచలుగా ఎదిగాడు.

పెరిగి పెద్దవాడైన జోసఫ్‌ తంబి, శ్రీసభ విశ్వాసములో ఎదిగాడు. కేరళలోని ‘వేరాపొలి’ మేత్రాసణములోను, ఆ తరువాత కార్మలైట్‌ మిషనరీ ఆధ్వర్యములోను జోసఫ్‌ తంబి, గురువుకు సహాయకునిగా ఉంటూ, ఉపదేశిగా దైవ సన్నిధిలో తన సేవను అందించియున్నాడు.

మానవత్వమున్న ప్రతీ మనిషిలో కన్నవారిపై, తోబుట్టువులపై, బంధువులపై, ఆప్తులపై మరచిపోలేని మమకారాలు సహజముగా ఉంటాయి. జోసఫ్‌ తంబి తరచుగా స్వస్థలమును సందర్శించేవాడు. కాని ఎవరును ఆయనను గుర్తించేవారు కాదు, ఎందుకన, భిక్షాటన చేస్తూ వెళ్ళేవాడు.

వేషం మారింది, రూపం మారింది, వయోజనుడయ్యాడు. అందుకే ఎవరూ తనను గుర్తింప లేకపోయిరి. ఒకానొక సందర్భములో కన్నతండ్రి కూడా అతనిని గుర్తించలేదు. ఒక అణా ధర్మం చేసి పంపించివేసాడు. జోసఫ్‌ తంబి కూడా తన గురించి ఎవరికి చెప్పేవాడు కాదు.

అయితే, ఒకసారి, అతని బంధువుని అంత్యక్రియలో పాల్గొనుటకు వచ్చిన జోసఫ్‌ తంబిగారిని అతని నాయనమ్మ గుర్తించడం జరిగింది. ఈవిధముగా, జోసఫ్‌ తంబిగారి ప్రారంభ జీవితము కొనసాగినది.

పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ ‘తృతీయ సభ’ సభ్యుడు
కేరళలోని ‘వేరాపొలి’ మేత్రాసణములో కార్మలైట్‌ మిషనరీ ఆధ్వర్యములో జోసఫ్‌ తంబి      ఉపదేశిగా తన సేవను అందించుచున్న సమయములోనే, కార్మలైట్‌ మిషనరీ ద్వారా 1929 లేదా 1930 సంవత్సరాలో ‘కొల్లం’ (‘కోయిలోన్‌’) అను ప్రదేశానికి, ఫ్రెంచ్‌ కపూచిన్‌ మిషనరీ ఆగమనం గురించి జోసఫ్‌ తంబిగారు తెలుసుకొని యున్నాడు. జోసఫ్‌ తంబి ఫ్రెంచ్‌ పౌరసత్వమును కలిగియుండటము వలన, అలాగే ఫ్రెంచ్‌ భాషకూడా వచ్చియుండుట వలన, ఫ్రెంచ్‌ కపూచిన్‌ మిషనరీలను కలుసుకొనుటకు ఆసక్తిని చూపాడు.

ఈవిధంగా, జోసఫ్‌ తంబి ఫ్రెంచ్‌ కపూచిన్‌ మిషనరీలను ‘కొల్లం’ అను ప్రదేశములో కలుసుకొని, వారితో కొంత కాలము గడిపియున్నాడు. బహుశా, సభలో చేరి కపూచిన్‌ మఠసభ సభ్యునిగా అగుటకు నిర్ణయించుకొని కూడా ఉండవచ్చు. ఆ కాలములో కపూచిన్‌ సభలో చేరిన ఆరంభములోనే పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ వారి ‘తృతీయ సభ’కు చెందిన అంగీని ఇచ్చెడివారు. ఆవిధముగానే, జోసఫ్‌ తంబి 1930వ సంవత్సరములో ‘కొల్లం’లోని కపూచిన్‌ మఠములో చేరినప్పుడు ‘తృతీయ సభ’కు చెందిన అంగీని స్వీకరించి ధరించాడు.

ఆరంభ తర్ఫీదు అనంతరం, కపూచిన్‌ మఠవాసు జోసఫ్‌ తంబిని తరువాతి తర్ఫీదునకు తీసుకొనుటకు నిరాకరించారు. దీనికి ముఖ్య కారణం, జోసఫ్‌ తంబి కుడికాలు బోదకాులు అగుటవన, అలాగే తరుచూ భక్తి భావోద్రేకములకు లోనై మూర్చవ్యాధి లక్షణములను కలిగియుండుట వలన, మఠమును వీడి వెళ్ళవసి వచ్చినది. మఠమును వీడినప్పటికిని ‘తృతీయ సభ’ అంగీని ధరించే అనుమతి ఉండెడిది. ఈవిధంగా, జోసఫ్‌ తంబి కపూచిన్‌ సభ మఠమును వీడినప్పటికిని, స్థానిక మేత్రాణుల అనుమతితో తృతీయ సభ అంగీని ధరించియున్నాడు. బహుశా జోసఫ్‌ తంబి 1933వ సంవత్సరములో కపూచిన్‌ సభ మఠమును వీడి ఉండవచ్చు. కపూచిన్‌ సభ మఠమును వీడిన తరువాత, అనేక సార్లు స్వస్థలమైన పాండిచ్చేరిని సందర్శించి అచ్చటి ప్రజలకు అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ వారు స్థాపించిన ‘తృతీయ సభ’ గురించి తెలియజేశాడు. అస్సీసిపుర ఫ్రాన్సిస్‌వారి జీవితమును ఆదర్శముగా తీసుకొని, తాను ఎక్కడికి వెళ్ళినను ‘తృతీయ సభ’ను గూర్చి తెలియజేస్తూ, సభ సంఘాలను లేదా శాఖలను ఏర్పాటు చేస్తూ తన జీవితాన్ని కొనసాగించాడు.

ఈవిధముగా, తను ఎక్కడికి వెళ్ళినను ఫ్రాన్సిస్‌వారి ‘తృతీయ సభ’ను వ్యాప్తిచేయుటకు  ప్రయత్నం చేసాడు. పాండిచ్చేరిలో ప్రజలు జోసఫ్‌ తంబిగారిని ఎంతో ఆప్యాయంగా ఆదరించేవారు. ప్రేమగా ఆయనను ‘‘తంబి’’ అని పిలిచేవారు.

‘మణత్తిడల్‌’లో దైవసేవ, తృతీయ సభ స్థాపన
1933వ సంవత్సరములో, జోసఫ్‌ తంబి పాండిచ్చేరిని వీడి ప్రస్తుతం ‘కుంభకోణం’ అతిమేత్రాసణములో ఉన్న ‘మణత్తిడల్‌’ గ్రామమునకు వెళ్ళారు. అప్పటిలో ‘మణత్తిడల్‌’ గ్రామము ‘మైకేల్‌పట్టి’ అను విచారణ క్రింద ఉండెడిది. గురుశ్రీ జ్ఞానాధిక్యం వారు విచారణ గురువుగా ఉన్నారు. కొద్ది కాములోనే తన మంచి ప్రవర్తనతో, మాటలతో అచ్చటి ప్రజల మన్ననలను చూరగొన్నాడు. వారుకూడా జోసఫ్‌ తంబిగారిని గొప్ప దైవ సేవకునిగా గుర్తించారు. అచ్చటి ప్రజలు దేవాలయ ఆవరణలో ఒక చిన్న ఇంటిని నిర్మించి దానిలో ఉండుటకు ఏర్పాటు చేసారు. దేవాలయము వద్దకు తరచుగా ప్రజలను పిలచి ప్రార్ధనలు చేసేవారు. జబ్బు పడిన వారికి తనకు తెలిసిన ఆకులతో మందును తయారు చేసి ఇచ్చేవారు. ప్రార్ధనచేసి, వారి రోగాలను స్వస్థపరచేవారు. చిన్న పిల్లలకు సత్యోపదేశ సంక్షేపాన్ని బోధించేవారు. పిల్లలను ఎంతో ఆప్యాయముగా చేరదీసేవారు. వారు విధేయించని యెడల, వారి ఎదుట మోకరిల్లి విధేయించమని ప్రాధేయపడెడివారు.

‘మణత్తిడల్‌’ గ్రామములోనున్న కతోలిక క్రైస్తవులను, దివ్యపూజాబలిలో, ఆరాధనలో పాల్గొనడానికి, ప్రతీ ఆదివారము మరియు మొదటి శుక్రవారము ప్రోగుచేసి ‘మైకేల్‌పట్టి’ విచారణ దేవాలయమునకు తీసుకొని వెళ్లేవారు. 1933-1934 సంవత్సర కాలములో, జోసఫ్‌ తంబిగారు ‘మణత్తిడల్‌’ గ్రామములో అస్సీసిపుర ఫ్రాన్సిస్‌వారి ‘తృతీయ సభ’ను స్థాపించియున్నారు.

‘మణత్తిడల్‌’ గ్రామమును విచారణగా చేయడానికి జోసఫ్‌ తంబిగారు ఎంతగానో కృషి చేశారు. అప్పటి మేత్రాణుల వద్దకు వెళ్లి, ‘మణత్తిడల్‌’ గ్రామములో స్థానికముగా ఉండుటకు ఒక గురువును పంపుమని కోరియున్నారు. దాని ఫలితముగానే మేత్రాణులు గురుశ్రీ పి.ఎస్‌. ఇగ్నేషియస్‌ వారిని ‘మణత్తిడల్‌’ గ్రామమునకు పంపియున్నారు.

తమ ఆధ్యాత్మిక బాగోగులు చూసుకోవడానికి వారి మధ్యన ఒక గురువు వచ్చినందుకు ‘మణత్తిడల్‌’ ప్రజలు ఎంతగానో సంతోషించారు, సంబరపడ్డారు. కాని జోసఫ్‌ తంబిగారు మాత్రం వారితో, ‘‘ఇప్పుడు మీ ఆధ్యాత్మిక బాగోగులు చూసుకోవడానికి ఒక గురువు మీ మధ్యన ఉన్నారు. ఇక నేను మీనుండి సెవు తీసుకొని దైవసేవను కొనసాగించుటకు వేరొక చోటుకు వెళతాను’’ అని చెప్పియున్నారు. అది విన్న ప్రజలు ఎంతగానో బాధపడ్డారు. వెళ్లిపోవద్దని జోసఫ్‌ తంబిగారిని ఎంతగానో ప్రాధేయపడ్డారు. కాని జోసఫ్‌ తంబిగారు 1936వ సంవత్సరములో అచటనుండి సువార్తా నిమిత్తమై వేరొక చోటుకు వెళ్ళిపోయారు.

‘పచ్చమలై’కు పయనం
1936వ సంవత్సరములో ‘మణత్తిడల్‌’ గ్రామమునకు గురుశ్రీ ఇగ్నేషియస్‌ వారి రాకతో జోసఫ్‌ తంబిగారు ముందుగా ‘కొత్త పాల్యం’ అను విచారణకు వెళ్ళారు. అక్కడ విచారణ గురువులైన గురుశ్రీ అధిరూపం వద్ద పదిరోజులు ఉన్నారు. తక్కువ సమయములోనే గురుశ్రీ అధిరూపంతో జోసఫ్‌ తంబిగారికి చక్కటి స్నేహం ఏర్పడినది.

‘కొత్త పాల్యం’ నుండి ‘తొండమదురై’ అను స్థమునకు వెళ్లి అచటనుండి ‘పచ్చమలై’ అను మారుమూల గ్రామమునకు వెళ్లియున్నారు. ఇది ‘కొత్త పాల్యం’ విచారణకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ‘పచ్చమలై’ అనునది తిరుచునాపల్లి జిల్లాలోని కొండ ప్రాంతం. ‘కుంభకోణం’ మేత్రాసణములోని ‘తొండమన్‌దురై’ విచారణ సమీపములో ఉన్నది. ఇది గిరిజనుల ప్రాంతం. ఆ గ్రామములో జోసఫ్‌ తంబిగారు స్వయముగా ఒక గుడిసెను నిర్మించుకొని దానిలో నివసించేవారు. తను భిక్షాటన చేసి సంపాదించిన భోజనమును, దుస్తులను, సొమ్మును వారికి సహాయం చేసేవాడు. సాధారణముగా వారు ఎప్పుడు సగం దిగంబరులై ఉండేవారు. తరుచూ పాండిచ్చేరి వెళ్లి బట్టలను, సొమ్మును తీసుకొని వచ్చి తనవంతూ ఈ కొండజాతి ప్రజలకు సహాయం చేసేవారు. నిదానముగా వారికి దేవుని గూర్చి, దేవుని ప్రేమ, మహిమగూర్చి వివరించడం మొదలు పెట్టారు. ఒకరినొకరు సహాయం చేసుకోవాలని బోధించారు. జోసఫ్‌ తంబిగారు తనకు తెలిసిన నాటుమందు సహాయముతో వారికి వైద్య సహాయాన్ని అందించేవారు.

కేరళ రాష్ట్రములో...
తమిళనాడు నుండి కేరళ చేరుకున్న జోసఫ్‌ తంబి అనేక చోట్ల తిరిగి త్రిశూరు జిల్లాకు చేరుకున్నాడు. అచ్చట లతీను దేవాలయమును కనుగొని, ప్రతిరోజు క్రమం తప్పకుండా అక్కడ ఉన్నన్ని రోజులు దివ్యపూజలో పాల్గొన్నాడు. ఈ సమయంలో రాత్రులో ‘పుత్తూరు’ (‘పొన్నుకర’)లోని మిషన్‌ దేవాలయములో పడుకొనెడివాడు. అప్పుడప్పుడు సిరియన్‌ గురువు చేసే దివ్యపూజా బలిలో కూడా పాల్గొనేవాడు. జోసఫ్‌ తంబి తన ప్రేషిత సేవను ఎక్కువగా ‘ఎర్నాకులం,’ అనే ప్రాంతములో కొనసాగించి యున్నాడు. ‘కొచ్చిన్‌’ అను ప్రదేశములో వీధులో తిరిగుతూ పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌వారి గురించి, ‘తృతీయ సభ’ గురించి బోధించాడు. జోసఫ్‌ తంబి అక్కడినుండి వెళ్ళిపోయి ‘వీరాపోలి’ అగ్రమేత్రాసణ అగ్రపీఠాధిపతులైన జోసఫ్‌ అట్టిపెట్టి వారిని కుసుకున్నాడు. పీఠాధిపతులు జోసఫ్‌ తంబిని తన ఆధ్యాత్మిక జీవితమును జీవించుటను కొనసాగించుమని ప్రోత్సహించాడు. అగ్రపీఠాధిపతులైన జోసఫ్‌ అట్టిపెట్టి వారు జోసఫ్‌ తంబిగారిని ‘థెరేసియన్‌ సహోదరుల’ సభ కేంద్రమైన, త్రిశూరు జిల్లాలోని ‘పుత్తూర్‌’ అను స్థలమునకు వెళ్ళమని 1936వ సంవత్సరము చివరిలో కోరియున్నారు. అగ్రపీఠాధిపతులు ఇద్దరు థెరేసియన్‌ సహోదరును ‘పుత్తూరు’లో ఉంచియున్నారు. వారు ఆ విచారణలో తమ సేవలను అందిస్తూ ఉండేవారు. ‘పుత్తూరు’లో ఉంటూ, ఆ ఇరువురు సహోదరులకు తర్ఫీదు ఇవ్వుమని, ఆధ్యాత్మిక విషయాలలో వారికి సహాయము చేయమని పీఠాధిపతులు జోసఫ్‌ తంబిగారిని కోరియున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ - బిట్రగుంటలో పరిచర్య
1937వ సంవత్సరములో జోసఫ్‌ తంబిగారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమునకు ఏతెంచారు. మొదటగా నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట అను ప్రదేశములో నాలుగు నెలల పాటు ఉన్నారు. బిట్రగుంటలో తమిళనాడు నుండి రైల్వే ఉద్యోగులుగా పనిచేయుచున్నవారి మధ్యన తన ప్రేషిత కార్యాన్ని కొనసాగించారు. వారితో తమిళ భాషలో సంభాషించేవారు.

కేసరపల్లిలో పరిచర్య
1937వ సంవత్సరము చివరిలో జోసఫ్‌ తంబిగారు విజయవాడ నుండి 20 కి.మీ. దూరమున ఉన్న కేసరపల్లి గ్రామమునకు వచ్చియున్నారు. కేసరపల్లిలో పునీత పాదువాపురి అంథోని వారి పేరిట ఒక చిన్న దేవాలయము ఉన్నది. ప్రార్ధన చేసుకోవడానికి ఆ దేవాయములోనికి ప్రవేశిస్తుండగా, కొంతమంది అతనిని ‘పిచ్చివాడు’ అని భావించి అక్కడనుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేసారు. తెలుగు భాషకూడా అప్పటికి జోసఫ్‌ తంబిగారికి వచ్చేదికాదు, కనుక వారితో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడియున్నాడు. ఎక్కడనుండి వచ్చాడో, ఏ ఉద్దేశ్యం కొరకు వచ్చాడో ప్రజలకు కూడా ఏమీ అర్ధం కాలేదు.

నెమ్మదిగా, జోసఫ్‌ తంబిగారి విశ్వాస జీవితాన్ని, ప్రార్ధన జీవితాన్ని గమనించిన కొంతమంది కతోలిక క్రైస్తవులు పశ్చాత్తాప హృదయముతో వచ్చి గ్రామస్థులు చేసిన అవమానాలకు, దూషణలకు, వారిని క్షమించమని వేడుకున్నారు. జోసఫ్‌ తంబిగారు వారిని క్షమించడం మాత్రమేగాక, వారితో ఎంతో స్నేహపూర్వకమైన బంధాన్ని ఏర్పరచుకున్నారు.

కొద్ది కాలములోనే కేసరపల్లిలోని కతోలిక సంఘస్తుందరు కూడా, తమ బాగోగుపట్ల ఆసక్తిగల పుణ్యాత్ముడైన జోసఫ్‌ తంబిగారు వారి గ్రామములో ఉండటం సంతోషపడ్డారు. గ్రామస్తుందరూ కూడా జోసఫ్‌ తంబిగారంటే గౌరవం, ఇష్టం కలిగింది. పిల్లలు, పెద్దలు, ఉపాధ్యాయులు అందరు కూడా ఆయనను గౌరవించేవారు.

కేసరపల్లి గ్రామము, అవుటపల్లి విచారణకు అనుసంధానమైన గ్రామము. అయినప్పటికిని ఆదివారాలలో కూడా దివ్యపూజాబలి ఉండేది కాదు. అప్పుడప్పుడు మాత్రమే దివ్యపూజాబలి ఉండేది. కనుక, తరుచుగా, జోసఫ్‌ తంబిగారు విశ్వాసులను ప్రోగుచేసి దివ్యపూజాబలిలో పాల్గొనుటకు, ముఖ్యముగా ఆదివారములలోను, పండుగ రోజులలోను అవుటపల్లి విచారణ దేవాయమునకు తీసుకొని వెళ్ళేవాడు.

అవుటపల్లిలో నివాసం
అవుటపల్లి (పెదావుటపల్లి) గ్రామము విజయవాడ మేత్రాసనములోని పురాతన విచారణలో ఒకటి. 1925వ సంవత్సరములో అవుటపల్లి గ్రామము విచారణగా ఏర్పడిరది.

1939వ సంవత్సరమునుండి జోసఫ్‌ తంబిగారు తన నివాసాన్ని అవుటపల్లిలో ఏర్పరచుకున్నారు. అప్పటి విచారణ గురువు గురుశ్రీ జాన్‌ బి. కల్దెరారో ఇటలీ దేశస్థుడు. 14 సెప్టెంబరు 1927వ సంవత్సరములో అవుటపల్లికి చేరుకున్న వీరు 1 మార్చి 1928వ సంవత్సరములో విచారణ గురువుగా బాధ్యతలు తీసుకున్నారు. విచారణ గురువుగా 1969 వరకు కొనసాగారు. అవుటపల్లి గ్రామము జోసఫ్‌ తంబిగారి ఆధ్యాత్మిక కార్యాలకు ప్రధాన కేంద్రం అయ్యింది. 1939వ సంవత్సరము నుండి 1945వ సంవత్సరము వరకు ఇక్కడే నివసిస్తూ చుట్టుప్రక్క గ్రామాలలో సువార్తను బోధిస్తూ జీవించారు. విచారణ గురువుకు అన్ని విషయాలో తన వంతు సహాయ సహకారాలను అందించి యున్నారు. అతి త్వరలోనే అవుటపల్లి గ్రామస్తులు, అలాగే చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు జోసఫ్‌ తంబిగారు ఒక పుణ్యాత్ముడని గుర్తించారు.

చుట్టుప్రక్కల గ్రామాలో దైవసేవ
జోసఫ్‌ తంబిగారు అవుటపల్లిలో తన నివాసాన్ని ఏర్పరచుకున్నప్పటికిని, తరుచుగా దైవసేవ నిమిత్తమై చుట్టుప్రక్క గ్రామాలకు వెళుతూ ఉండేవారు. ‘‘అవుటపల్లి అపోస్తుడు’’గా పేరు గాంచిన జోసఫ్‌ తంబిగారు, చుట్టుప్రక్క గ్రామాలలో సాధ్యమైనంత వరకు ప్రజలను రక్షకుడైన క్రీస్తు రక్షణ ‘మార్గము’లో నడిపింపాలనే ధ్యేయముతో, సంకల్పముతో తన సువార్తా పరిచర్యను తనదైన శైలిలో కొనసాగించాడు. దైవాశీస్సులతో జోసఫ్‌ తంబిగారు తన ప్రేషిత కార్యమును అవుటపల్లి చుట్టుప్రక్క గ్రామాలలో విస్తరింప చేసియున్నాడు. జోసఫ్‌ తంబిగారు సందర్శించిన గ్రామాలు మానికొండ, తేలప్రోలు, ఉయ్యూరు, వట్లూరు, దెందుూరు, ఉప్పూరు, కేసరపల్లి, వేంపాడు, అజ్జంపూడి, అ్లపురం, భూతమల్లిపాడు, ప్రొద్దుటూరు, మర్రీడు, కోడూరుపాడు, కిష్టవరం, గొల్లపల్లి, వల్లూరుపాలెం, తొట్లవల్లూరు, అలాగే గుంటూరు జిల్లాలోని పాతరెడ్డిపాలెం మొదగునవి.

తుది ఘడియు...పరలోక పయనం
జోసఫ్‌ తంబిగారు తన మరణమును ముందుగానే ఎరిగియున్నాడు. దానికోసమై ఆధ్యాత్మికముగా సిద్ధపడ్డాడు. తాను 15 జనవరి 1945వ రోజున చనిపోతానని మూడు నెలలకు ముందుగానే కొంతమందితో చెప్పియున్నారు. దాని నిమిత్తమై మూడు నెలలకు ముందుగానే శవపేటికను చేయించుకొని తన గదిలో పెట్టించుకున్నాడు. అది 1944వ సంవత్సరం. క్రిస్మస్‌ పండుగ అయిపోగానే మానికొండ గ్రామమునకు వెళ్ళారు. 6 జనవరి 1945న తీవ్ర జ్వరముతో అవుటపల్లిలోని తన నివాసానికి తిరిగి వచ్చారు. 15 జనవరి 1945 రానే వచ్చింది. ఆరోగ్యము బాగా లేకున్నను ఆరోజు ఉదయము దేవాలయములోనికి తీసుకొని పోవసినదిగా అక్కడ ఉన్నవారిని అడిగారు. జోసఫ్‌ తంబిగారు నీరసముగా ఉన్నప్పటికిని బోయపాటివారి యింటికి చేరుకున్నాడు. వారి యింటిలో తానే స్వయముగా నిర్మించి, అస్సీసిపుర ఫ్రాన్సిస్‌వారికి అంకితం చేసిన పీఠము చెంత మడత కుర్చీలో కూలబడ్డారు. బోయపాటి దంపతులు బాధతో, ఆశ్చర్యముతో జోసఫ్‌ తంబిగారినే చూస్తూ ఉండిపోయారు, ఎందుకన తాను మరణిస్తానని చెప్పిన రోజు అదే కనుక!
సాయంత్రం నాలుగు గంటలకల్ల, జోసఫ్‌ తంబిగారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఇక ఏమీ మాట్లాడలేక పోతున్నారు. ఆ తదుపరి సాయంత్రం ఐదు గంటల సమయానికి తన తుది శ్వాస విడిచారు.

పేదవారిపట్ల మన దృక్పధం - బాధ్యత (నిజమైన క్రిస్మస్)

పేదవారిపట్ల మన దృక్పధం - బాధ్యత

    2017వ సంవత్సరములో పోపు ఫ్రాన్సిస్‌గారు కతోలిక శ్రీసభ, ప్రతీ సంవత్సరంలో ఒక రోజును కేటాయించి ప్రత్యేకంగా ఆరోజు ‘‘పేదరికం ఎలా సువార్తా ప్రధానాంశమో ధ్యానించాలి’’ అని కోరుతూ, ప్రతి సామాన్య 33వ ఆదివారమును ‘ప్రపంచ పేదల దినోత్సవము’నకు అంకితం చేశారు.

1. ఈ సంవత్సరం ‘ప్రపంచ పేద దినోత్సవ’ సందేశంగా పోపు ఫ్రాన్సిస్‌ కీర్తన 9:18ని ధ్యానిస్తున్నారు: ‘‘దేవుడు పీడితు ఆశను ఏనాడు వమ్ము చేయడు.’’ లోకంలోని కోట్లాదిమంది పేదరికంతో బాధనను భవిస్తున్నవారు దేవునిలో నమ్మకమును, ఆశను కలిగియున్నారు. ఎందుకన దేవుడు నమ్మకపాత్రుడని హామీ యిస్తున్నాడు.

    దురహంకారులు, భక్తీహీనులు పేదవారిని పీడిస్తు, వారికున్న కొద్దిదాంట్లోనుండి అన్యాయంగా దోచుకొంటూ, వారిని బానిసత్వంలోనికి నెట్టే నేపధ్యంలో ఈ 9వ కీర్తన కూర్చడం జరిగింది. ఈనాటి పేద పరిస్థితి కూడా అలాగే ఉన్నది...! ఆర్ధిక సంక్షోభంలో కూడా అనేకమంది సంపదను కూడబెట్టుకుంటూనే ఉన్నారు, మరోవైపు పట్టణ వీధులో అనేకమంది పేదవారు, కనీసం, నిత్యావసారాలు కూడా లేకుండా తిరుగాడటం మనం చూస్తున్నాము. వారు అనేకసార్లు దోపిడీకు, వేధింపుకు గురవుతూనే ఉన్నారు.

2. ఈనాడు స్త్రీలు, పురుషులు, యువతీ యువకులు అనేకరకమైన బానిసత్వపు జీవితాకు లోనై ఉన్నారు: మాతృభూమినుండి వెళ్ళగొట్ట బడుచున్న శరణార్ధులు, అనాధులు, నిరాశ్రయులు, మానవ అక్రమ వ్యాపారానికి తరలింపబడుతున్న స్త్రీలు, పిల్లలు, నిరుద్యోగ యువత, దురాశ, దోపిడీ, హింసకు గురవుతున్న బాధితులు.... తరుచుగా పేదవారిని ‘చెత్త’గా పరిగణిస్తున్నారు. వారిని పరాన్న జీవులుగా, సమాజానికి ముప్పుగా భావిస్తున్నారు.

3. పేదవారు ప్రభువునందు నమ్మకము ఉంచువారు (9:10). దేవుడు తమను చేయి విడువడని నమ్మువారు. దేవుడు తమను కాపాడును అనే నమ్మకముతో జీవించువారు.

4. దేవుడు మాత్రమే వారి ఆక్రందనను ఆకించును, వారిని ఆదుకొనును, రక్షించును, కాపాడును, వారికి సహాయము చేయును. దేవుడు మాత్రమే వారికి న్యాయమును ఒసగును. దేవుడు వారిని ఎన్నటికి మరువడు, ఎడబాయడు. దేవుడు వారి ఆదరువు. వారిని ఆదుకొనుటకు ఎన్నడు ఆస్యం చేయడు.

5. యేసు పేదవారితో గుర్తింపబడినాడు, ఆయనే స్వయంగా నిరుపేద అయ్యాడు (2 కొరి 8:9): పేదతోను సంఘ బహిష్క్రుతుతోను కలిసి మెసి జీవించారు. ‘‘ఈ నా సోదరులో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినపుడు అవి నాకు చేసితిరి’’ (మత్తయి 25:40). భవిష్యత్తుపై నమ్మకము లేనివారికి, నిరాశపడు వారికి ప్రభువు ఆశను ఒసగును. యేసు ప్రభువు దైవరాజ్యమును ఈ లోకములో ఆరభించి, దాని కొనసాగింపు, నిర్మాణ బాధ్యతను ఆయన శిష్యుమైన మనకు అప్పగించాడు. పేదకు ఆశను కల్పించు బాధ్యతను మనకు ఇచ్చియున్నాడు.

6. శ్రీసభ దేవుని ప్రజ. శ్రీసభ పేద పక్షాన నివాలి. కనుక ఎవరుకూడా అపరిచితులుగా, బయటివారిగా అనుభూతిని పొందకుండా ఉండుటకు శ్రీసభ అభయాన్ని ఇవ్వాలి. రక్షణ ప్రయాణంలో అందరూ భాగస్తులే. పేదవారినుండి మనము దూరంగా ఉండలేము. వారుకూడా క్రీస్తు శరీరంలో భాగమే. క్రీస్తు వారిలో కూడా శ్రమనుభవించును. మన సేవద్వారా పేదవారిని చేరుకోవాని, వారిని లేవనెత్తానేదే సువర్తా సందేశం.

7. దైవరాజ్యమునకు ప్రాముఖ్యముగా ఏమి కావలెనో కనుగొను విషయంలో మన దృక్పధం మారాలి. ‘‘సమాజంలో అత్యల్పులైన పేదలు, సాటివారి అనాదరణకు నిర్లక్ష్యానికి గురవుతోన్న పేద ప్రజ పక్షాన నిబడి, అన్ని విధా వారిని ఆదుకోవడంలో (సువార్తానందం, 195) శ్రీసభ, క్రీస్తానుచరులు ఎల్లప్పుడు ముందుండాలి. నిజమైన అంకితభావంతో కకాలం వారికి తోడుగా ఉండి వారిలో గొప్ప నమ్మకాన్ని కలిగించాలి.

8. పేదవారి అవసరతలో మనం ఎ్లప్పుడూ వారికి తోడుగా ఉండాలి. అయితే కేవలం భౌతిక సహాయముతో ఆగిపోక వారి ఆధ్యాత్మిక, భావోద్వేగ అవసరతలో కూడా మనం అండగా నిబడాలి. మనం మన ‘‘పొరుగువారికి పునీతులం’’ కావాలి. వారికి దేవుని ప్రేమ, స్నేహ శక్తిని సుస్పష్టంగా తెలియ బరచాలి. తద్వారా, వారిలోని అంత:ర్గత సౌదర్యాన్ని, మంచితనమును చూడగగాలి.

9. పేదవారు మన రక్షణకుపకరించెదరు, ఎందుకన యేసు క్రీస్తు దివ్య ముఖమును గాంచుటకు మనకు సహాయపడుదురు. మనము చేసే కార్యాను, ప్రాజెక్టును పొగడుకొనుటకు పేదవారు గణాంకాలు కాకూడదు. పేదవారు కలుసుకొనబడే వ్యక్తులు. పేదవారిలో ఒంటరివారు, యువకులు, పెద్దవారు, స్త్రీలు, పురుషులు, పిల్లలు ఉన్నారు, వారు మన స్నేహపూర్వకమైన ఒక్క మాటకోసం, ఒక చిరునవ్వుకోసం, వినగలిగే ఒక చెవికోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

10. ఆయనను వెదకువారిని, ఆయన నామమును పిలుచువారిని దేవుడు ఎన్నడు విడనాడడు. ‘‘పేదవారి మొరను దేవుడు తప్పక వినును’’ (కీ. 9:12). వారి స్వరముకు దేవుడు చెవియొగ్గి వినును. నిరాశ నిస్పృహ పరిస్థితిలో కూడా పేదవారు దేవుని యందు నమ్మకం ఉంచెదరు, ఎందుకన, వారు దేవునిచేత ప్రత్యేకంగా ప్రేమింపబడుచున్నారని ఎరిగియున్నారు. ఈ నమ్మకం, వారి బాధలు, శ్రమలు, అవమానము కన్న బమైనది.

    కనుక, మనం క్రైస్తవ నమ్మకమునకు నిజమైన సాక్షుగా నివాలి. ఇది సాధ్యం కావాలంటే, వివిధ కార్యాద్వారా (వ్యక్తిగత / సామూహిక) పేదవారికి నమ్మకమును, ఓదార్పును ఇవ్వగగాలి. పేదవారికి సేవచేయుటలో ఇంకా అనేకమందిని ప్రోత్సహించాలి. మన వ్యక్తిగత, స్థిరమైన అంకింతభావము ద్వారా పేదవారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి.

    పోపు ఫ్రాన్సిస్‌ ‘‘సువార్తానందం’’లో సూచించినట్లుగా, పేద ప్రజకు సమాజంలో గౌరవ స్థానం కల్పించాలి. పేద ఆర్తిని ఆకించి, సకాలంలో స్పందించాలి. దైవ ప్రజలో పేదకు ప్రత్యేక స్థానం ఉంచాలి. పేదరికానికి మూమైన వ్యవస్థాగత సమస్యను సత్వరమే పరిష్కరించాలి. నిస్సహాయుకు (ప్రవాసులు, వస వచ్చేవారు) మనం అండగా ఉండాలి.

దేవుని కృప - దివ్య సంస్కారాలు

దేవుని కృప - దివ్య సంస్కారాలు

    సాధారణంగా, దేవుని కృప యనగా మానవుల పట్ల దేవుని మంచితనం, దయ, కరుణ. కృప యనగా మనిషి జీవనం పట్ల దేవుని ప్రేమ. సంకటమగు మానవుని పాపస్థితి, అశాశ్వతమగు జీవిత నేపధ్యంలో మనం ‘కృప’ను చూడవలయును. పాపస్థితి నేపధ్యంలో ‘కృప’ మనకు దయ, క్షమ వలెనె కనిపించును. అశాశ్వత జీవనం, మరణం నేపధ్యంలో, ‘కృప’ మనకు రక్షణవలె కనిపించును. కనుక, కృప మనను త్రిత్వైక దేవుని అన్యోన్యతలోనికి ప్రవేశింప జేస్తుంది. ‘‘క్రీస్తు కృపావరం ఉదార కానుక. దాని మూలంగా దేవుడు తన స్వంత జీవాన్ని ఇచ్చాడు. మన పాపం నుంచి స్వస్థపరచి, పవిత్ర పరచటానికి దీన్ని పవిత్రాత్మ మన ఆత్మలో ప్రవేశపెడతాడు’’ (కతోలిక శ్రీసభ సత్యోపదేశం 1999).

అస్సీసిపుర ఫ్రాన్సిస్ - మానవాళికి సేవ

అస్సీసిపుర ఫ్రాన్సిస్ - మానవాళికి సేవ (Editorial, "Thamby Velugu" October 2019)

మారుమనస్సు పొందక ముందు ఫ్రాన్సిస్‌, యోహాను (జాన్‌)గా పిలువబడినాడు. అస్సీసి పట్టణంలో (ఇటలి దేశం) ధనికుడైన బట్టల వ్యాపారి కుమారుడు. గొప్ప యోధుడిగా ఎదగాలని కలలు కన్న తను ఒక పోరాటంలో ఖైదీగా పట్టుబడి, ఒక సంవత్సరం పాటు చెరలో ఉంచబడ్డాడు. ఆరోగ్యం క్షీణించింది. ఈ సమయంలో తనలో ఎంతో మార్పు కలిగింది.. కుటుంబ ఆస్తినంతా కూడా త్యజించి, స్వచ్చంధ పేదరికంలో, క్రీస్తుకు నిజమైన శిష్యునిగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. దైవ పిలుపును అర్ధం చేసుకున్నాడు. తన జీవితాన్ని, సేవకు (సంఘంనుండి వెలివేసిన వారికి, పేదవారికి, కుష్ఠురోగుకు) అంకితం చేసుకున్నాడు. అస్సీసి పట్టణ ఆవ జీవిస్తూ ప్రార్ధించాడు, బోధించాడు, రోగుకు సేవ చేసాడు. కుష్ఠురోగు సేవద్వారా తనలో ఆధ్యాత్మిక చింత పెరిగింది, తన మిషన్‌, ప్రేషిత సేవను, దేవుని చిత్తాన్ని తెలుసుకోగలిగాడు. కుష్టురోగును ఆలింగనం చేసుకోవడం ద్వారా, సర్వమానవాళిని గౌరవించాలి, రక్షించాలి అని తెలుసుకున్నాడు. సక సృష్టితో  సహోదర భావంను పెంపొందించు కోవడం కూడా మెల్లమెల్లగా తెలుసుకోగలిగాడు.

తనకున్న ఈ వైఖరి తను ఎంచుకున్న శాంతి, అహింసా, సంభాషణ మార్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. 1219లో జరిగిన ఐదవ క్రూసేడు సమయంలో ఈజిప్టుకు పయనించి సుల్తానుని కలిసి శాంతి సందేశంను బోధించాడు.

త్వరలోనే అస్సీసిలో అనేక మంది మన్ననను పొందాడు. తన పేద, ఆధ్యాత్మిక జీవితాన్ని చూసి ఎంతోమంది ఆయనను అనుసరించారు. ఈవిధంగా, చిన్న సహోదర సంఘం ఏర్పడిరది. ఫ్రాన్సిస్‌ తన స్వచ్చంధ పేదరికం, సహోదరభావం, సంఫీుభావం ద్వారా, లోకాన్నే మార్చివేసాడు.

ఫ్రాన్సిస్‌ అనుచరుడనగా ‘‘స్వచ్చంధ పేదరికం’’లో జీవించడం, సోదరునిగా జీవించడం, మానవ గౌరవాన్ని పెంపొందిచడం (పేదవారు, అణిచివేయబడినవారు, అన్యాయానికి గురైనవారు).

ఫ్రాన్సిస్‌వారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, ఈనాడు ఎంతోమంది తమ జీవితాను అంకితం చేసుకొని, ఫ్రాన్సిస్‌ వారి బాటలో నడుస్తూ, సేవా మార్గంలో జీవిస్తున్నారు. ఈనాడు ఫ్రాన్సిస్‌వారి అనుచరులు, స్వచ్చంధ పేదరికాన్ని జీవిస్తూ, ప్రపంచమంతటా తమ సేవను అందిస్తున్నారు. అలాగే, మానవ హక్కును పరిరక్షిస్తున్నారు.

కతోలిక శ్రీసభలో అతిపెద్ద కుటుంబం ఫ్రాన్సిస్‌గారి కుటుంబము (పురుషులు, స్త్రీతో కలిపి).  ఫ్రాన్సిస్‌ కుటుంబము మూడు శాఖలుగా విభజింప బడినది: 
మొదటి శాఖ మూడు సభలు:
- ఆర్డర్‌ అఫ్‌ ఫ్రైయర్స్‌ మైనర్‌  (OFM)
- ఆర్డర్‌ అఫ్‌ ఫ్రైయర్స్‌ మైనర్‌ కన్వెంచువల్స్‌ (OFM Conventuals)
- ఆర్డర్‌ అఫ్‌ ఫ్రైయర్స్‌ మైనర్‌ కపూచిన్స్‌ (OFM Capuchins)

రెండవ శాఖ పునీత క్లారమ్మ గారి సభ.

మూడవ శాఖ ఇతర ఫ్రాన్సిస్కన్‌ సభలు: థర్డ్‌ ఆర్డర్‌ రెగుర్‌ (TOR, (పురుషు, స్త్రీలు) మరియు సెక్యుర్‌ ఫ్రాన్సిస్కన్‌ ఆర్డర్‌ లేదా SFO (సాధారణ ప్రజల కొరకు).

నాలుక - మాట

నాలుక - మాట (Editorial, "Thamby Velugu" September, 2019)

మనం చేసే పాపాలో ‘అబద్ధాలు చెప్పడం’ ఒకటి. సత్యము పలుకుటకు బదులుగా, అబద్ధం చెప్పడానికే ఆసక్తిని చూపుతూ ఉంటాము. మన అవసరాలను బట్టి, పరిస్థితిని బట్టి, నిజాన్ని కూనీ చేస్తూ ఉంటాము. అనేకచోట్ల, అనేకసార్లు అసత్యమే సత్యముగా నిరూపించబడుతుంది, వాదించబడుతుంది, నిర్ణయించబడుతుంది. ఈరోజు నిజం చెప్పవసి వస్తుందేమోనని భయాడేవారు ఎందరో! మరోవైపు అబద్ధాలు చెప్పడం పాపం కాదని వాదించేవారు ఎందరో! అబద్ధాలు చెప్పడంలో తప్పేముందని వాదించేవారు ఎందరో!

పునీత పాద్రేపియోగారు ఇలా అంటున్నారు: ‘‘అబద్దాలాడటం, సాతాను నామమును స్మరించడమే!’’ అప్పుడు ఒకాయన, ‘ఫాదర్‌, చిన్న చిన్న అబద్ధాలు చెప్పవచ్చా?’ అని ప్రశ్నించగా, ‘‘చెప్పకూడదు’’ అని సమాధానమిచ్చాడు. ‘కాని ఫాదర్‌, వాటివల్ల ఎవరికీ హాని జరగటం లేదుకదా!’ అని ఆ వ్యక్తి అన్నప్పుడు, పియోగారు, ‘‘ఇతరుకు ఏ హాని కలుగకపోవచ్చు, కాని నీ ఆత్మకు తప్పక హాని కుగుతుంది. ఎందుకన, దేవుడు సత్యవాది’’ అని చెప్పారు. ఇది నిజమే కదా!

స్వేచ్ఛ

స్వేచ్ఛ

    కతోలిక శ్రీసభ సత్యోపదేశం (1731, 32, 33, 34, 40, 41): మన స్వంత బాధ్యతతో ఉద్దేశపూర్వకమైన చర్యను చేపట్టు శక్తియే స్వేచ్ఛ. సత్యములోను, మంచితనములోను అభివృద్ధికి, పరిణతికి అవసరమయ్యే శక్తియే స్వేచ్ఛ. మనిషి స్వేచ్ఛ దేవుని వైపుకు నిశ్చితముగా సాగాలి. ఈ స్వేచ్ఛ మానవ చర్యకు విక్షణతను ఆపాదిస్తుంది. మనం ఎంత ఎక్కువగా మంచిని చేస్తే అంత ఎక్కువగా స్వేచ్ఛపరులము అవుతాము. అలాగే, స్వేచ్ఛ మనలను బాధ్యత కలిగి జీవించునట్లు చేస్తుంది. స్వేచ్ఛను వినియోగించడమనగా ఏదిబడితే అది చెప్పడం, చేయడం కాదు. స్వేచ్ఛకు కర్త మనిషి. అట్టి మనిషి ‘‘స్వయం సంపత్తిగ వ్యక్తియని, స్వప్రయోజనా సంతృప్తి కోసం ఇహలోక వస్తువులను భోగించడమే తన జీవన గమ్యం’’ అని భావింపడం పొరపాటు. ‘‘స్వేచ్ఛను ధర్మబద్ధంగా వినియోగింపటానికి అవసరమైన ఆర్ధిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితును చాలాసార్లు  ఉపేక్షింపటమో, ఉల్లంఘింపటమో జరుగుతుంది. అలాంటి గుడ్డి, అన్యాయ పరిస్థితుల నైతిక జీవనాన్ని కుంటుబరచి, బవంతును, బలహీనులను ప్రేమకు విరుద్ధంగా పాపం చేసే శోధనల్లో పడవేస్తుంది. నైతిక చట్టం నుండి వైదొలగటం ద్వారా మనిషి తన స్వంత స్వేచ్ఛను ఉ్లంఘిస్తాడు, తనలోతానే బంధీ అవుతాడు, ఇరుగుపొరుగుతో సహవాసాన్ని భంగపరుస్తాడు, దైవ సత్యాన్ని ఎదిరిస్తాడు.’’ క్రీస్తు మనందరికి రక్షణను, స్వేచ్ఛను సంపాదించాడు. పాపమునుండిమనను విమోచించాడు. ‘‘స్వేచ్ఛ కోసం క్రీస్తు మనల్ని విముక్తుల్ని జేశాడు’’ (గతీ 5:1). ‘‘సత్యము (యేసు) మిమ్ము స్వతంత్రులను చేయును’’ (యోహాను 8:32). ‘‘ప్రభువు ఆత్మ ఎచట ఉండునో అచట స్వాతంత్రము ఉండును’’ (2 కొరి. 3:17). ‘‘దేవుని పుత్రులు మహిమోపేతమైన స్వాతంత్రము నందు పాలుపంచు కొనుచున్నాము’’ (రోమీ 8:21).

దేవుడు మన గొప్ప తండ్రి

దేవుడు మన గొప్ప తండ్రి

    దేవుడు మన (పరలోక) తండ్రి. ఆయన పరిపూర్ణ తండ్రి. మనలను అనంతముగా ప్రేమించే తండ్రి.

    ఒకసారి ఒక తండ్రి తన మూడు సం.ల కవల పిల్లలతో పార్కునకు వెళ్ళాడు. వారికి కావలసిన ఆహారపదార్దాలను, ఆటవస్తువులను మొదలగు వాటినన్నింటిని తీసుకెళ్ళాడు. పార్కులో సరదాగా ఆడుతూ, పాడుతూ గడుపుతున్నారు. కింద పడతారేమోనని, తండ్రి చాలాజాగ్రత్తగా వారిని గమనిస్తూ  ఉన్నాడు. తన చూపును పక్కకు తిప్పుకోకుండా వారినే కనిపెట్టుకొనియున్నాడు. కొద్దిసేపటి తరువాత, తెచ్చిన ఆహారపదార్దాలను వారికి తినిపించాడు. బట్టలనిండా పడిన ఆహార పదార్దాలను, మురికిని ఓపికగా శుభ్రంచేసాడు. కారుతున్న చీమిడిని తుడిచాడు. మూతిని, మొఖమును కడిగాడు. ఇలా వారి అవసరాన్నింటిని తీర్చాడు.

జేసు తిరుహృదయ పండుగ

జేసు తిరుహృదయ పండుగ

జూన్‌ మాసములో మరో నూతన విద్యా / కార్మిక సంవత్సరమును ప్రారంభిస్తున్నాము. ప్రభువు మనందరికీ మరో గొప్ప అవకాశమును ఇచ్చియున్నాడు. దీనిమూలముగా, దేవునకు కృతజ్ఞతలు తెలుపుకొందాము. అలాగే, ఈ అవకాశమును నూరుశాతం సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయుదాం. లూకా సువార్తలోని (12:16-21) లోభివాని వలె, స్వార్ధముగా ఆలోచిస్తూ, సుఖముగా ఉండి, తిని, త్రాగి ఆనందించాలనిగాక, ఈ నూతన సంవత్సరాన్ని ఒక ఆలోచనతో ముందుకు సాగిద్దాం!

జూన్‌ మాసములో యేసు తిరుహృదయము గూర్చి ధ్యానిస్తూ  ఉంటాము. యేసు తిరు హృదయం సున్నితత్వానికి, ప్రేమకు, కరుణకు గురుతుగా ఉన్నది, అలాగే యేసు తిరుహృదయం సరళతకు చిహ్నముగా కూడా ఉన్నది. 

యేసు-సమరీయ స్త్రీ తో - మన ప్రయాణం

యేసు-సమరీయ స్త్రీ తో - మన ప్రయాణం

    యేసు యెరూషలేము దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బు మార్చువారిని వెడలగొట్టి, దేవాలయమును శుభ్రపరచిన తరువాత, యెరూషలేములో అనేక అద్భుతములను చేసియున్నారు. పాపము అనే పాముకాటుకు బాధపడుచున్నవారి కొరకు మరణించుటకు వచ్చియున్నానని యేసు నికోదేముతో పలికియున్నాడు (యోహాను 3:14-17). యేసును నిరాకరించిన యెరూషలేము పట్టణమును వీడి అన్యులు నివాసముండే గలిలీయ ప్రాంతమునకు ప్రయాణమయ్యాడు. యూదయా సీమనుండి, గలిలీయ సీమకు ‘పెరీర’ అనే ప్రాంతముగుండా మార్గము ఉన్నది. అన్యులు నివసించే ప్రాంతమును తప్పించుకొనుటకు యూదులు ఈ మార్గమునే ఎన్నుకొనెడివారు (యూదులు అన్యును అసహ్యించు కొనెడివారు). కాని, యేసు ఆ మార్గమును ఎన్నుకొనలేదు. అన్యులు వసించే ప్రదేశాలగుండా తన ప్రయాణాన్ని కొనసాగించాడు (దీని పరమార్ధం: యేసు నిర్మింపబోయే దేవాయం లేదా శ్రీసభ అన్ని దేశమువారికి వర్తిస్తుంది. ఆయన ఈ లోకమునకు, అన్ని మతమువారి కొరకు అంకితమై సేవచేయడానికి, రక్షించడానికి వచ్చియున్నాడు).

క్రీస్తు ఉత్థానం - పరమార్ధం

క్రీస్తు ఉత్థానం (Editorial, "Thamby Velugu" April 2019)
క్రీస్తు ఉత్థానం - పరమార్ధం

1. దేవునికి మన అంగీకరయోగ్యత

‘‘మన పాపమునకు గాను ఆయన మరణమునకు అప్పగించబడెను. మనలను దేవునకు అంగీకార యోగ్యులముగ ఒనర్చుటకు గాను ఆయన లేవనెత్త బడెను’’ (రోమీ. 4:25). పాపము వలన మానవాళి దేవునినుండి వేరుపరపబడి ఆయనతో సత్సంబంధాన్ని కోల్పోయినది (యెషయ 59:2). పాపము వలన దేవుని ఆగ్రహమునకు గురికావలసిన వారమైతిమి (ఎఫెసీ. 2:3). దేవునితో తిరిగి సత్సంబంధమును కలిగియుండాలని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపియున్నాడు. మనము గురికావలసిన శిక్షను, సిలువలో క్రీస్తుపై మోపియున్నాడు. తద్వారా, మనము దేవునకు అంగీకార యోగ్యులమయ్యాము. మన పాపముల కొరకు క్రీస్తు సిలువపై అర్పించిన బలి తండ్రి దేవుడు అంగీకరించాడనడానికి క్రీస్తు ఉత్థానం దానికి నిదర్శనం.

2.  మరణముపై విజయం

‘‘మరణము నుండి లేవనెత్తబడిన క్రీస్తు మరల మరణింపడని మనకు తెలియును. మృత్యువునకు ఆయనపై ఇక ఎట్టి ఆధిపత్యము లేదు’’ (రోమీ. 6:9). మరణము మానవాళికి శతృవు. ఇది వ్యక్తిగతమైన పాపముకు శిక్ష. ‘‘పాపము యొక్క వేతనము మరణము’’ (రోమీ. 6:23). మరణాల రేటు ఎ్లప్పుడూ 100%. వైద్యసాంకేతికతద్వారా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత డబ్బు ఉన్ననూ మరణకోరలలోనుండి ఎవరునూ తప్పించుకొనలేరు. క్రీస్తు మృతులలోనుండి లేచెను ఎందుకన, మృత్యువునకు ఆయనపై ఎట్టి ఆధిపత్యము లేదు. మరణం ఆయనను జయించలేక పోయినది. క్రీస్తు మరణాన్ని జయించాడు కనుక ఇక మనముకూడా మరణమునకు భయపడనవసరం లేదు. ఇక మరణమనేది శతృవు కాదు ఎందుకన, క్రీస్తులో మరణము తర్వాత వచ్చు శిక్షకు మనము భయపడనవసరం లేదు.

‘‘ఓ మృత్యువా! నీ విజయము ఎక్కడ? ఓ మృత్యువా! బాధకలిగింపగల నీ ముల్లు ఎక్కడ? మరణపు ముల్లు పాపము. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. కాని, మన ప్రభువగు యేసుక్రీస్తుద్వారా మనకు విజయమును ప్రసాదించు దేవునకు కృతజ్ఞతలు!’’ (1 కొరి. 15:55-57).

3. క్రీస్తునందు విశ్వాసుల ఐఖ్యత

‘‘యేసు ప్రభువును మృతులలోనుండి లేపిన దేవుడు, యేసుతోపాటు మమ్ములను లేవనెత్తి, మీతో సహా ఒకచోట చేర్చి, ఆయన సమక్షమునకు తీసుకొని పోగలడు’’ (2 కొరి. 4:14). క్రీస్తును మనము విశ్వసించినప్పుడు, మనము ఆయనందు విశ్వాసములో ఐఖ్యమైయున్నాము. క్రీస్తునందు ఐఖ్యమై యుండుటయనగా, దేవుడు మన అయోగ్యతను పరిగణింపక, క్రీస్తు యోగ్యతను పరిగణిస్తాడు. ‘‘మనము క్రీస్తుతో మరణించియున్నచో ఆయనతో జీవింతుమని విశ్వసింతుము’’ (రోమీ. 6:8).

ఈ ఐఖ్యత కేవలము క్రీస్తు ఉత్థానంద్వారా మాత్రమే సాధ్యమైనది. ఈ ఐఖ్యత వలన మనము దేవునకు అంగీకార యోగ్యులమగు చున్నాము. ‘‘ఆయన జీవము మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అంతేగాక, ఆయన క్రీస్తును మన వివేకముగా చేసెను. క్రీస్తుద్వారా, మనము నీతిమంతులము, పరిశుద్దులము, విముక్తులము అయితిమి’’ (1 కొరి. 1:30). మనము ఇప్పుడు నూతన జీవితములో జీవించగలుగు చున్నాము. ఎందుకన, ‘‘మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలుపంచు కొంటిమి. ఏలయన తండ్రి ప్రభావముచే మరణమునుండి క్రీస్తు లేవనెత్తబడినట్లే, మనమును ఒక క్రొత్త జీవితమును గడుపుటకే అట్లు జరిగెను’’ (రోమీ. 6:4).

4.  దైవ వాక్కు వాస్తవం

యెషయ 53, కీర్తన 16 మొదలగు ఎన్నో ఉదాహరణలు ఉత్థానము గురించి చెప్పవచ్చు. ‘‘అయినను అతనిని బాధాభరితుని చేయవలెననియే నా సంకల్పము. అతని మరణము పాపపరిహార బలియయ్యెను. కనుక అతడు దీర్ఘాయువు బడసి పుత్ర పాత్రులను జూచును. అతనిద్వారా నా సంకల్పము నెరవేరును. బాధలు ముగియగా అతడు మరల ఆనందము చెందును. నీతి మంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును. అతనిని జూచి నేను వారి తప్పిదములను మన్నింతును’’ (యెషయ 53:10-12). ‘‘నీవు నన్ను పాతాళమునకు పంపవు. నీ పరిశద్ధుని గోతిపాలు చేయవు. జీవమునకు చేర్చు మార్గమును నీవు నాకు చూపింతువు. నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును. నీ కుడిచేతిలో శాశ్వత సుఖము కలదు’’ (కీర్తన. 16:10-11).

5.  సువార్తా వాస్తవం

క్రీస్తు సజీవుడు కనుక ఆయన మనలను రక్షింపగలడు. క్రీస్తు ఉత్థానమును పౌలు దృఢముగా ధృవీకరిస్తున్నారు, ‘‘క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్ధమే, మీ విశ్వాసమును వ్యర్ధమే. మీరు ఇంకను మీ పాపములోనే ఉన్నారు. క్రీస్తునందలి విశ్వాసముతో మరణించిన వారును భ్రష్టులైనట్లే. క్రీస్తునందలి మన నిరీక్షణ ఈ జీవితము కొరకే ఐనచో, ప్రపంచములో అందరికంటెను మనము అత్యంత దయనీయులము’’ (1 కొరి. 15:14, 17-19). కనుక క్రీస్తు ఉత్థానం లేనిచో మన విశ్వాసము, నిరీక్షణ లేవు. నిజమైన సువార్త క్రీస్తు ఉత్థానమే! క్రీస్తు ఉత్థానం వలన మన విశ్వాసం, నిరీక్షణ సజీవముగా ఉన్నవి. మన పాపము క్షమింపబడు చున్నవి. క్రీస్తుద్వారా మనము నిత్యజీవమును పొందుచున్నాము.

6. యేసు దేవుని కుమారుడని నిర్ధారణ

‘‘ఆయన మృతులలోనుండి పునరుత్థానుడైనందున పవిత్ర పరచు ఆత్మశక్తితో దేవుని కుమారుడుగా నియమింపబడెను’’ (రోమీ. 1:4). క్రీస్తు ఉత్థానమవనిచో సకల మృతులలో ఒకనిగా నుండెడివాడు. కాని, అలా జరగలేదు. ఆయన మృతులలోనుండి సజీవముగా లేచాడు. ఆయన దేవుని కుమారుడు అను వాస్తవాన్ని ధృవీకరిస్తున్నది.

7. పవిత్రాత్మ రాకడ

క్రీస్తు ఉత్థానమైన తరువాత, పరలోకమునకు కొనిపోబడిన తరువాత ఆయన వాగ్ధానము చేసిన పవిత్రాత్మను భూలోకమునకు పంపియున్నాడు. కనుక క్రీస్తు ప్రేషితకార్యము ఈనాటికిని భూలోకములో పవిత్రాత్మతో నింపబడిన వారితో కొనసాగుచున్నది. ఉత్థాన క్రీస్తు పవిత్రాత్మద్వారా తన ప్రజలతో తోడుగా ఉండి సహాయం చేస్తున్నారు, వారిని బపరచుచున్నారు, దేవునికి ఇష్టపూర్వకమైన జీవితమునకు నడిపించుచున్నారు. ‘‘ఆయన దేవుని కుడిప్రక్కకు చేర్చబడి, తన తండ్రి వాగ్ధానము ప్రకారము పవిత్రాత్మను పొంది, మీరిపుడు చూచుచు, వినుచున్న ఆత్మను కుమ్మరించి యున్నాడు’’ (అ.కా. 2:33).

8. సజీవమగు నిరీక్షణ

పాపములు క్షమింపబడుట, దేవునకు అంగీకార యోగ్యులముగా చేయబడుట క్రైస్తవులమగు మనకు ఒక గొప్ప సజీవమగు నిరీక్షణను ఒసగుచున్నది. పాపము వలన దేవునకు శతృవుగా ఉన్నటువంటి మనము, క్షమింపబడిన దేవుని బిడ్డలుగా మారియున్నాము. శిక్షకు బదులుగా నిత్యజీవమును పొందుచున్నాము. ఇది నిజముగా  క్రీస్తు ఉత్థాన ఫలితము, బహుమానము. ‘‘మృతులలో నుండి యేసు క్రీస్తును ఆయన పునరుత్థాన మొనరించి, దాని మూలమున మనకు నూతన జీవమును ప్రసాదించెను. విశిష్టమగు ఆయన కనికరమే దీనికి కారణము. ఇది మనలను సజీవమగు నిరీక్షణతో నింపును. దేవుడు తన ప్రజల కొరకై ఏర్పరచిన దీవెనలు మహత్తరమైనవి. కనుకనే వానిని పొందుటకు మనము ఎదురు చూచెదము. ఆయన వానిని మీకొరకై పరలోకమున భద్రపరచెను. అట అవి క్షీణింపవు, చెడవు, నాశనము కావు’’ (1 పేతు. 1:3-4).

9.  ఆయనతో జీవించుట

‘‘క్రీస్తు మృత్యువునుండి లేవనెత్తబడిన వారిలో ప్రధముడనుట సత్యము’’ (1 కొరి. 15:20). క్రీస్తు ఉత్థానం సకల విశ్వాసుల ఉత్థానమునకు సూచనగా ఉన్నది. ‘‘ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవేశించినట్లే, మృతుల పునరుత్థానము కూడా ఒక మనుష్యుని మూలముననే వచ్చినది. ఆదామునందు అందరు ఎట్లు మృతిచెందుచున్నారో, అటులనే క్రీస్తునందు అందరు బ్రతికింప బడుదురు’’ (1 కొరి. 15:21-22).

క్రీస్తువలె ఉత్థాన భాగ్య జీవితమును విశ్వాసులుకూడా ఆనందించెదరు. వారి శరీరము అక్షయమగునదిగా లేపబడును. ‘‘మృతులు పునర్జీవితులు చేయబడునపుడు ఇట్లుండును: శరీరము క్షయమగునదిగా విత్తబడి అక్షయమగునదిగా లేపబడును. అది గౌరవములేనిదిగా విత్తబడి, వైభవము గలదిగా లేపబడును. అది బహీనమైనదిగా విత్తబడి, బలముగలదిగా లేపబడును. భౌతిక శరీరముగా అది విత్తబడి, ఆధ్యాత్మిక శరీరముగా అది లేపబడును. భౌతిక శరీరము ఉన్నది కనుక, ఆధ్యాత్మిక శరీరమును ఉండవయును’’ (1 కొరి. 15:42-44). ఈ లోకముననుండగా మనము ఎన్నో బాధలకు, కష్టాలకు గురికావచ్చు కాని ఇహలోక జీవితము తరువాత పరిపూర్ణమైన ఆధ్యాత్మిక శరీరము కలిగి ఆనందముగా జీవిస్తాము.

10. నీతి ప్రకారం తీర్పు చేయుట

‘‘మానవులు అజ్ఞానులుగా ఉన్న కాలములో దేవుడు వారిని గూర్చి పట్టించుకొనలేదు. కాని ఇప్పుడు ఎల్లెడలా ప్రజలందరును హృదయ పరివర్తన చెందవలెనని ఆజ్ఞాపించుచున్నాడు. ఏలయన, ఆయన ఎన్నుకొనియున్న ఒక మనుష్యుని మూలమున ప్రపంచమునంతటిని నీతి ప్రకారము తీర్పు చేయుటకు ఒక రోజును నిర్ణయించియున్నాడు. ఆయన ఆ మనుష్యుని మృతులలోనుండి లేపుటద్వారా ఈ విషయమును గూర్చి అందరకును దృఢపరచెను’’ (అ.కా. 17:30-31). ఒకరోజున మనమందరము (లోకమంతయు) దేవుని సన్నిధిలో తీర్పునకు గురికావలసి యున్నది. మన జీవితమునకు జవాబు చెప్పవలసి ఉంటుంది. దీనికి సూచననే క్రీస్తు ఉత్థానం. క్రీస్తులో పాపక్షమాపణ పొంది, నిత్యజీవితమును పొందవచ్చు. క్రీస్తుని విశ్వసించుటలో ఉత్థాన భాగ్యమును పొందగలము. మన విశ్వాసము క్రీస్తునందు ఐఖ్యము చేసి పాపమునుండి మనలను రక్షించునట్లు చేయును.

‘‘నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికిని మరణింపడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా?’’ (యోహాను 11:25-26).

తపస్కాలము

తపస్కాలము

    ఓ సర్వేశ్వరా! మమ్మందరిని కరుణించుము. మీరు సృజించిన దానిలో దేనిని మీరు ద్వేషించరు. పశ్చాత్తాపము చూపినపుడు మానవుల పాపములను క్షమించి వారిని విముక్తులను చేసి, మీరు సర్వాధికారియగు దేవుడనని వెల్లడి చేసికొంటిరి.

    తపస్కాలము ఉత్థాన మహోత్సవమునకు 40 దినాల ఆయత్తము. తపస్కాలము విభూతి పండుగతో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరము 6 మార్చి విభూతి పండుగతో ప్రారంభమై 13 ఏప్రిల్‌తో ముగుస్తుంది. ఈ కాలములో యేసు ప్రభువుతో ఎడారిలో ప్రయాణము చేస్తూ ఆయన జీవితము, త్యాగము, మరణము, సమాధి మరియు ఉత్థానము గూర్చి ధ్యానిస్తూ ఉంటాము.

    తపస్కాలము, క్రైస్తవ జీవిత పరమ రహస్యాన్ని (ప్రేమ) ధ్యానించుటకు మనము పొందిన మరో గొప్ప అవకాశము. దైవవాక్కు, దివ్యసంస్కారము సహాయముతో, మన విశ్వాస యాత్రను పునర్మించుటకు మరో చక్కటి అవకాశం. తపస్కాల యాత్ర ప్రార్ధన, ఉపవాసం మరియు దానధర్మముతో కూడి ఉంటుంది.

    తపస్కాలము, పశ్చాత్తాపము, మారు మనస్సు పొందు సమయము. మారు మనస్సు అనగా, మన ఆలోచనను, కార్యాలను దైవచిత్తముతో ఏకమై ఉండటము. మన జీవితములో దేవునికి, ఆయన చిత్తానికి ప్రధమ స్థానాన్ని ఇవ్వటం. దానికోసం సమస్తాన్ని త్యాగం చేయడానికి సంసిద్ద పడటము.

    మనము స్వార్ధముతో అన్నీ మన స్వాధీనములో ఉండాలని కోరుకుంటాం. ఇతరుపై అధికారాన్ని చేలాయించాలని చూస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక విషయాలను మరచి, లోకాశలకు లోనై జీవిస్తూ ఉంటాం. పేరు ప్రతిష్టకోసం, ధనంకోసం, పలుకుబడికోసం, అధికారంకోసం జీవిస్తూ ఉంటాం. స్వార్ధముతో, మోహపు తలంపులతో, అన్యాయపు ఆలోచనలతో, ఇతరులను భ్రష్టుపరచాలనే ఉద్దేశముతో జీవిస్తూ ఉంటాము. వీటన్నింటితో, దేవునికి, ఇతరులకు చివరికి మనకు మనం ఏమివ్వగలుగుతున్నాం? వీటితో మనం ఎలాంటి సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాం?

    దైవకుమారుడైన క్రీస్తు వీటన్నింటినుండి మనలను విముక్తులను చేయుటకు, మనమధ్యలోనికి వచ్చాడు. మనలో  సహోదరభావాన్ని పెంపొందించుటకు, అందరు కలిసి మెలిసి జీవించునటుల చేయుటకు, మనలో ప్రేమను నింపుటకు ఆయన మనను నడిపిస్తూ ఉన్నాడు. విబేధాలు లేకుండా, అందరూ సమానులే అన్న భావన మనలో కలుగ జేస్తున్నాడు. మరియు దేవుడు అందరికీ తండ్రీ అని నేర్పిస్తున్నాడు.

    ‘‘మనము ఒకరికి ఒకరము సహాయపడుచు ప్రేమను ప్రదర్శించి, మేలుచేయుటకు పరస్పరము ప్రేరేపించుకొనుటకు దారులు కనుగొందము’’ (హెబ్రీ 10:24). దీనికి తపస్కాము ఓ మంచి దారియే కదా!

    ఒకరికి ఒకరము సహాయ పడుదాం. తోటి వారి పట్ల బాధ్యత కలిగి జీవించుదాం. ముందుగా, మన హృదయాలను యేసు వైపునకు త్రిప్పాలి. ‘‘దేవునిచే పంపబడిన యేసును చూడుడు’’ (హెబ్రీ 3:1). ప్రభువునుండి పొందే శక్తితో, తోటివారిని చూడగలం. వారిపట్ల బాధ్యతగా ఉండగలం. జక్కయ్య అన్యాయముగా తోటివారిని మోసంచేస్తూ ధనం కూడబెడుతూ జీవించేవాడు. కాని, ప్రభువును చూసిన తర్వాత తన జీవితములో మార్పు కలిగింది. మారుమనస్సు పొందాడు. చేసిన పాపాలకు పశ్చాత్తాప పడ్డాడు. అన్యాయముగా మోసంచేసిన తోటివారికి వారి ధనాన్ని తిరిగి ఎక్కువగా ఇచ్చేసాడు. తన జీవితములో, మొట్టమొదటిసారిగా, సంతోషమును, ఆనందమును అనుభవించాడు. తను కూడా దేవుని కుమారుడేనని గుర్తించాడు. తను కూడా, సహోదరులో ఒక సహోదరుడని గుర్తించాడు. దేవున్ని చూసి, మారుమనస్సు పొందిన హృదయం దేవునితో, తనతో మరియు ఇతరుతో సఖ్యతలో, సహవాసములో జీవించును. ‘‘ఎవరికిని ఏమియును బాకీపడి ఉండకుడు. మీకు ఉండవసిన ఒకేఒక అప్పు అన్యోన్యముగా ప్రేమించుకొనుటయే’’ (రోమీ 13:8).

    తోటివారికి మేలు చేద్దాం. తోటివారిపై తీర్పుచేయక, వారిని భ్రష్టుపరచక, పరస్పర ప్రేమకలిగి జీవించుదాం. ‘‘సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు విషయమునే ఆసక్తితో అనుసరించుదము’’ (రోమీ 14:19).

    తపస్కాము, ప్రాయశ్చిత్తము, ధ్యానము, ఉపవాసముతో కూడినటువంటిది. ఈ తపస్కాలములో, మన జీవితములో మార్పు కోసం ఆశిద్దాం. దానికై కృషి చేద్దాం. విభూతి పండుగ రోజున, మనం స్వీకరించే విభూతి దేవునిపై మన సంపూర్ణ ఆధారమును, దేవుని దయ, క్షమను సూచిస్తుంది. ‘సిలువ మార్గము’ పవిత్రాత్మచే ఏర్పాటు చేయబడిన గొప్ప మార్గము. దీనిద్వారా, క్రీస్తు శ్రమను ధ్యానిస్తూ, ఆయన శ్రమలో భాగస్తుమవుతున్నాము.

విభూతి పండుగ
    ‘‘నీవు మట్టి నుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కసి పోవుదువు’’ (ఆ.కాం. 3:19). విభూతిని వాడే ఆచారం, పాతనిబంధన కాలము నుండియే ఉన్నది. విభూతి దు:ఖమును, మరణమును, ప్రాయశ్చిత్తమునకు చిహ్నం. అహష్వేరోషు రాజు యూదును కుట్రపన్ని చంపడానికి రాజశాసనమును చేసాడని విని, మొర్దేకయి ‘‘సంతాపముతో బట్టలు చించుకొనెను. గోనె తాల్చి తలమీద బూడిద చల్లుకొని పరితాపముతో పెద్దగా ఏడ్చెను’’ (ఎస్తేరు 4:1). యోబు తాను పలికిన పలుకులకు సిగ్గుపడి ‘‘దుమ్ము బూడిద పైనచల్లుకొని పశ్చాత్తాప పడెను’’ (యోబు 42:6). ఇజ్రాయేలు ప్రజలు బాబిలోను బానిసత్వమును గూర్చి ప్రవచిస్తూ దానియేలు ఇలా పలికాడు, ‘‘నేను ప్రభువునకు భక్తితో ప్రార్ధన చేయుచు అతనికి మనవి చేసికొని ఉపవాసముండి గోనె తాల్చి బూడిదలో కూర్చుంటిని’’ (దానియేు 9:3). యేసు ప్రభువు కూడా, విభూతిని గూర్చి సూచించాడు, ‘‘మీయందు చేయబడిన అద్భుత కార్యము, తూరు సీదోను పట్టణములో జరిగియుండినచో, ఆ పుర జనులెపుడో గోనెపట్టలు కప్పుకొని, బూడిద పూసికొని హృదయ పరివర్తనము పొంది యుండెడివారే’’ (మత్త 11:21).

    శ్రీసభ ఈ ఆచారాన్ని తపస్కాల ఆరంభానికి, ప్రాయశ్చిత్తానికి గురుతుగా తీసుకొనియున్నది. తపస్కాములో మన మరణముగూర్చి తలంచి, పాపాలకు దు:ఖపడుతూ ఉంటాము. గురువు విభూతిని ఆశీర్వదించి విశ్వాసుల నుదిటిపై శిలువ గురుతు వేస్తూ, ‘‘ఓ మానవుడా! నీవు ధూళి నుండి పుట్టితివనియు, తిరుగ ధూళిగ మారిపోవుదవనియు స్మరించుకొనుము’’ లేక ‘‘పశ్చాత్తాపపడి క్రీస్తు సువిశేషమును నమ్ముకొనుము’’ అని చెప్పును.

    విభూతి యొక్క తాత్పర్యం, ‘పశ్చాత్తాపపడి పాపాలకు ప్రాయశ్చిత్త పడటము’. మన రక్షణార్ధమై శ్రమనుపొంది, మరణించి, ఉత్థానుడయిన ప్రభువునకు మన హృదయాను అర్పించి మారుమనస్సు పొందటము. మన జ్ఞానస్నాన వాగ్దానాలను తిరిగి చేయడం. క్రీస్తులో పాత జీవితమునకు మరణించి, నూతన జీవితమునకు ఉత్థానమవడము. భూలోకములోనే, దైవరాజ్యమును జీవించుటకు ప్రయాసపడి, పరలోకములో దాని పరిపూర్ణతకై ఎదురు చూడటము.

    నినేవే వాసులు గోనెపట్టలు, బూడిదతో పశ్చాత్తాపపడిన విధముగా, మనము కూడా విభూతిని మన నుదిటిపై ధరించి మన పాపాలకోసం, చెడు జీవితముకోసం పశ్చాత్తాప పడుచున్నాము. ఈ లోక జీవితము శాశ్వతము కాదని గుర్తుకు చేసుకొంటున్నాము. మన హృదయాను అణకువపరచు కొంటున్నాము.

ప్రార్ధన, ఉపవాసము, దానధర్మము
    ప్రార్ధన, ఉపవాసము, దానధర్మము తపస్కాలములో ముఖ్యమైన మూడు స్తంభాల వంటివి. మన ప్రాయశ్చిత్తమునకు, పశ్చాత్తాపమునకు, జ్ఞానస్నాన వాగ్దానముకు విశ్వాస జీవితాన్ని పునర్మించుటకు ఎంతగానో తోడ్పడతాయి.

ప్రార్ధన: 
    తపస్కాలములో ఎక్కువ సమయాన్ని ప్రార్ధనలో గడపాలి. అది ప్రభువునకు మనను దగ్గరగా చేస్తుంది. మన జ్ఞానస్నాన ప్రమాణాలను జీవించుటకు కావసిన శక్తికోసం ప్రార్ధన చేయాలి. ఉత్థాన పండుగ దినమున జ్ఞానస్నానము పొందువారి కొరకు ప్రార్ధన చేయాలి. పాపసంకీర్తనము చేయు వారికొరకు ప్రార్ధన చేయాలి.

ఉపవాసము:
    ఉపవాసము పవిత్రమైన కార్యము. ఉపవాసము కేవలం ఇంద్రియ నిగ్రహము కోల్పోకుండా ఉండుటకు మాత్రమేగాక, ప్రార్ధన చేయుటకు సహాయపడును. శారీరక ఆకలి, మన ఆధ్యాత్మిక ఆకలిని గుర్తు చేస్తుంది. అయితే, దేవునికి ఇష్టమైన ఉపవాసము ఇదే: ‘‘నేను ఇష్టపడు ఉపవాసమిది. మీరు అన్యాయపు బంధములను విప్పుడు. ఇతరుల మెడమీదికి ఎత్తిన కాడిని తొగింపుడు. పీడితును విడిపింపుడు. వారిని ఎట్టి బాధకును గురిచేయకుడు. మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు. ఇల్లు వాకిలి లేనివారికి ఆశ్రయమిండు. బట్టలు లేనివారికి దుస్తులిండు. మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు (యెష 58:6-7).

మన ఉపవాసము వలన, మన సమాజములో ఎంతోమంది పేదరికము వలన రోజూ ఉపవాసము ఉంటున్నారని గుర్తించుదాం. సమానత్వము కొరకు, అందరూ క్షేమముగా ఉండటానికి కృషి చేద్దాం.

దానధర్మము: 
    దానధర్మాలు తోటి వారిపట్ల మనకున్న బాధ్యతను గుర్తుచేస్తుంది. దేవుడు మనకు ఇచ్చిన వరములకు కృతజ్ఞతు తెలుపుకోవాలి. అవసరములో నున్నవారికి సహాయం చేయాలి, దానధర్మము చేస్తూనే, మన సమాజములో నీతి, న్యాయ స్థాపనకు కృషి చేయాలి.

సిలువ మార్గము
    తపస్కాములో ‘సిలువ మార్గము’నకు ప్రత్యేక స్థానము ఉన్నది. తపస్కాములో మనం ముఖ్యముగా క్రీస్తు శ్రమను, మరణము గూర్చి ధ్యానిస్తూ ఉంటాము. సిలువ మార్గము ద్వారా, క్రీస్తు శ్రమలో మనమూ పాలుపంచుకొనాలి. సిలువ మార్గము, క్రీస్తు శ్రమలను పొందిన విధముగా, దేవునకు విశ్వాసపాత్రులుగా ఉండాలంటే, మనము కూడా శ్రమలను పొందాని గుర్తు చేస్తూ ఉంటుంది.

యేసు క్రీస్తు నా ప్రియుడు


యేసు క్రీస్తు నా ప్రియుడు
పరమ గీతం 1:2-4 (వ్యాఖ్యానము)
"నీ పెదవులతో నన్ను ముద్దు పెట్టుకొనుము (1:2)
    ప్రేమ, రైలు పట్టాలవలె కలువకుండా చేసెడి ప్రయాణము కాదు. ఇద్దరు వ్యక్తుల ఐక్యతను దృఢపరచెడిది ప్రేమ.  ప్రేమ ఎంతో ఘనమైనది. ప్రియుడు ప్రియురాలు కలుసుకున్న ప్రతీ క్షణములో వారి ఐక్యత దృఢపడుతూ ఉంటుంది. వారి కలయిక, సంభాషణలు, ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం, మొదలగు వానిలో ఇంతకు ముందెన్నడూ అనుభవించనటువంటి తీవ్రతను అనుభవిస్తూ ఉంటారు. ఒక్కో క్షణం, ఒక్కో రీతిలో నూతనోత్తేజముతో గడుస్తూ ఉంటుంది. ప్రియులకు కాలము ఎటుల గతించునో తెలియదు. ఒకరి ఒడిలో ఒకరు సేద తీరుతూ, కష్ట సుఖాలను పంచుకొంటూ, ఆప్యాయతా అనురాగాలను, మూగగా, తీయగా అనుభవిస్తూ ఉంటారు. ఒకరి స్పర్శ ఒకరికి నూతన ఉత్తేజాన్ని, బలాన్ని ఇస్తూ ఉంటుంది. నాకు తోడుగా నీవుంటే ఈ లోకాన్ని జయించగలను అని చెప్పుకొనే స్థితికి ప్రియులు చేరుకుంటారు. వారి మధ్య ప్రేమ బలమైనది. మతం, కులం, ధనం, అధికారం, స్వార్ధం, మొదలగు తుఫానులు వారిని చెదరగొట్టలేవు.

దైవ సేవకుడు బ్రదర్‌ జోసఫ్‌ తంబి

దైవ సేవకుడు బ్రదర్‌ జోసఫ్‌ తంబి (Editorial, "Thamby Velugu" Jan 2019)

తంబిగారి భక్తులకు, ‘తంబి వెలుగు’ పాఠకులకు జనవరి మాసము రాగానే గుర్తుకు వచ్చేది, పెదావుటపల్లిలో జరిగే బ్రదర్‌ జోసఫ్‌తంబి గారి మూడురోజుల మహోత్సవములు (జనవరి 13,14,15). ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాష్ట్రాలనుండి ఎన్నో వేలమంది క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవేత్తరులు ఈ మహోత్సవములో పాలుగొని తంబిగారి మధ్యస్థ ప్రార్థనల ద్వారా, దైవాశీస్సులను, అనుగ్రహాలను, మేులులను, అద్భుతాలను, శాంతి, సమాధానములను పొంది సంతోషముతో తిరిగి వెళ్లుచున్నారు. వారి జీవితాలో జరిగిన అద్భుతాలకు, మేులులకు సాక్ష్యమిస్తూ ఉన్నారు.
దైవసేవకుడైన బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి జీవితంలో ఎన్నో ప్రత్యేకతులున్నాయి. అద్భుత వ్యక్తిగా పేరుగాంచాడు, ఆయన బ్రతికుండగానే ఎన్నో అద్భుతాలు చేసాడు, ఎంతో మందికి స్వస్థతను చేకూర్చాడు. వివిధ  రాష్ట్రాలో(తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌)  సువార్తను బోధించాడు, గ్రామగ్రామాలకు వెళ్ళి యేసు శుభవార్తను తనదైన శైలిలో బోధించాడు. ప్రజలతోనే ఉండి వారు ఇచ్చిన బోజనాన్ని భుజించేవాడు, ఇచ్చిన స్థములో నివాసముండెడివాడు.
పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ వారి వలె పేదరికాన్ని హత్తుకొని జీవించాడు. ఫ్రాన్సిస్‌వలె పూర్తిగా దేవునిపై ఆధారపడి జీవించాడు. పేదవారిపట్ల ఎనలేని ఇష్టాన్ని కలిగియున్నాడు. తన జీవితాదర్శము ద్వారా, సువార్త ప్రచారాన్ని కొనసాగించాడు. ప్రజలను ప్రార్థనలో, దివ్యపూజా బలిలో పాల్గొనాలని ప్రోత్సహించాడు.
హైదరాబాద్‌ అగ్రపీఠాధిపతులు మారంపూడి జోజిగారు చెప్పినట్లుగా, ‘‘బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారి వినయపూర్వక జీవితం, ఉత్సాహపూరిత ప్రేషిత కార్యం పెదావుటపల్లిలోను, చుట్టుప్రక్కల విచారణ గ్రామాలోని వట్లూరు, కేసరపల్లి, మానికొండ,          ఉప్పులూరులోను ఆయన దైవాంకిత జీవితములో అత్యంత ప్రాముఖ్యమయిన అంశం ఏమిటంటే, మానవజాతికి ముఖ్యముగా పేదవారికి, నిస్సహాయులకు, వెనుకబడిన వారికి తన సేవను అందించడం.
ప్రార్థనా పరుడు: బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారు గొప్ప ప్రార్థనాపరుడు. రాత్రింబవళ్ళు గంటల తరబడి మౌన ప్రార్థనలో గడిపెడివాడు. రాత్రిళ్ళు మోకాళ్ళూని ప్రార్థన చేసేవాడు. తన సువార్త ప్రచారములో కూడా ఎక్కడకు వెళ్ళినను స్లీవను తీసుకొని వెళ్ళేవాడు. ప్రజలను ఇంటి వద్ద గాని, గుడిలోగాని కలిసి ప్రార్థన చేయుటకు ఆహ్వానించేవాడు. ఆయనే స్వయముగా ప్రార్థన కూటాన్ని నడిపించేవాడు.
తన ప్రార్థనలో ఎక్కువగా పరలోక తండ్రి దేవుని దయార్ధ్ర హృదయాన్ని, ప్రేమను ధ్యానించేవాడు. అందరిని గౌరవించేవాడు. అందరూ ఒకే దేవుని పోలికలో సృజింపబడినారని ప్రతీ ఒక్కరు దేవుని ప్రతిబింబాన్ని కలిగియున్నారని దృఢముగా విశ్వసించేవాడు. ఆయన హృదయం యేసుపై నాటుకొని పోయింది. తన ప్రేమనంతా సిలువలో మరణించిన యేసుపై చూపి ఆయన సహవాసములో ఉండెడివాడు. క్రీస్తు పొందిన శ్రమలను తానుపొంది, క్రీస్తు శ్రమలకు ఉపశమనాన్ని కలిగించాలనే ఆయన ఆత్మ ఎంతగానో ఆరాటపడేది. అందుకే ఆయన పంచగాయాలాను పొంది, క్రీస్తు శ్రమలలో భాగస్థులైనాడు.
తను ప్రార్థనలో పొందిన దైవ శక్తితో ఇతరును కూడా ఆధ్యాత్మికముగా ఎదుగుటకు ప్రేమకే రూపమైన క్రీస్తులో జీవించుటకు సహాయము చేసెడివాడు. తను పవిత్రతలో ఎదుగుతూ ఇతరులను పవిత్ర జీవితములోనికి నడిపించాడు. యువతీ యువకులను సన్మార్గములో నడిపించడానికి ఎంతో శ్రద్ధను, ఆసక్తిని చూపించాడు. ఆయన ప్రార్థన జీవితము పశ్చాత్తాపము తపస్సుతో బలపడినది. ఇది నిజముగా ఆయనను ఆధ్యాత్మిక మనిషిగా, దేవుని మనిషిగా జీవించుటకు తోడ్పడినది.
ఆయన ప్రార్ధన జీవితం ఒకే ఒక ఆశతో కొనసాగింది. అదే ప్రియ ప్రభునిలో ఎదగడం. వెనుతిరిగి చూడక, ఎ్లప్పుడూ దేవుడు చూపించిన బాటలో కొనసాగుతూ పరిపూర్ణత మార్గములో ముందుకు సాగిపోయేవాడు.
దివ్యపూజా బలి అనగా తంబిగారికి ఎనలేని భక్తి అలాగే మరియతల్లి యెడల, జపమాలయనిన తంబిగారికి ఎనలేని భక్తి, విశ్వాసం. ఆయన ప్రార్థన జీవితములో ఇవి విడదీయరానివి. తనతో ఎప్పుడూ ఒక శిలువను తీసుకొని వెళ్తూ ఉండేవాడు. జపమాలను ధరించేవాడు. వీనిని ఎల్లప్పుడూ ధరించి, ఎక్కడికి వెళ్ళినను తీసుకొని వెళ్ళెడివాడు. తన జీవితమంతా కూడా ప్రజలను ఎ్లప్పుడూ దివ్యపూజా బలిలో పాల్గొనడానికి నడిపించెడివాడు. వారితో కలిసి జపమాలను ప్రార్ధించేవాడు.
స్వస్ధతా పరుడు: తంబిగారు ప్రత్యేకమయిన దేవుని స్వస్ధతా వరమును పొందియున్నాడని అవుటపల్లి చుట్టుప్రక్కల ప్రతీ ఒక్కరికి తెలిసిన సత్యమే, వాస్తవమే! కొన్ని ఆకులు, అలములతో వైద్యం చేస్తూ స్వస్థత పరచేవాడు. కొన్నిసార్లు గుంపులుగుంపులుగా ప్రజలు స్వస్థతను పొందుటకు తను నివసిస్తున్న గృహానికి వచ్చెడివారు. ఎక్కువగా శుక్రవారం వచ్చెడివారు. ఎందుకన, ప్రతీ శుక్రవారం తంబిగారు క్రీస్తు పంచగాయాను పొందెడివాడు, కనుక, ఎక్కడికి వెళ్ళక తన గృహములోనే ఉండెడివాడు. లేనిచో, వారిపై జాలితో దయార్ధ్ర హృదయముతో తానే స్వయముగా తన గృహానికి ఆహ్వానించెడివాడు. ఒకసారి కాలుకు లోతైన గాయముతో మూడు సంవత్సరములు బాధపడుచున్న వ్యక్తిని, తన చేతును రొమ్ముపై ఉంచి, కన్నులెత్తి తీక్షణముగా ప్రార్థన చేసి స్వస్థతను చేకూర్చాడు. ఇలా అనేకమైన స్వస్థతను, అద్భుతాను తంబిగారు చేసియున్నారు. ఆయన మరణానంతరం కూడా, మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందిన స్వస్థతగూర్చి చాలామంది సాక్ష్యమిచ్చియున్నారు.
హైదరాబాద్‌ అగ్రపీఠాధిపతులు మారంపూడి జోజిగారు ఇలా సాక్ష్యమిచ్చి యున్నారు, ‘‘1984-85 సంవత్సరములో ఎముక క్యాన్సర్‌తో భరించలేని బాధకు లోనైయ్యాను. ఎంతో మంది వైద్యులను సంప్రదించి, ఎన్నో మందులను వాడినప్పటికిని, ఆరోగ్యం మెరుగుపడలేదు, నొప్పి తగ్గలేదు. ఆ సమయములో స్వస్థత కొరకు, తంబిగారి ప్రార్థన సహాయాన్ని కోరియున్నాను. ఆ తర్వాత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నాను. వైద్యమునకు నా శరీరం ఎంతగానో సహకరించింది. తంబిగారి ప్రార్ధనవలన, స్వస్ధత వరము వలన, నేను నా వ్యాధి నుండి, బాధనుండి పూర్తిగా స్వస్ధుడనైతినని విశ్వసిస్తున్నాను.’’
దర్శనకారి, ప్రవక్త: బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారు, రెండవ ప్రపంచయుద్ధములో జరుగుచున్న వాస్తవాలను ఉన్నవి ఉన్నట్లుగా చెప్పెడివాడు. ఆయన ప్రవచించిన విషయాలు మరునాడు వార్తా పత్రికలో ప్రచురింపబడేవి. మరణావస్ధలోనున్న ఒక బాలుని  గురించి ‘ఏమీ కాదు, బ్రతుకుతాడు’ అని చెప్పియున్నాడు. పెదావుటపల్లి గ్రామములో అగ్ని ప్రమాదం జరుగునని ముందుగానే చెప్పియున్నాడు. తాను ముందుగానే ప్రవచించిన వాటిలో ప్రాముఖ్యముగా చెప్పుకొనవసినది తన మరణం గూర్చి తాను ముందుగానే చెప్పడం, తన మరణానికి కొన్ని నెలలు ముందుగానే తన శవపేటికను ఏర్పాటు చేసుకొన్నాడు. ఏ రోజు మరణిస్తాడో కూడా ప్రవచించియున్నాడు. ఆ శవ పేటికను  తన గదిలోనే ఉంచుకొని, దానిలో పడుకొని మరణము గూర్చి ధ్యానించేవాడు. పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌వారు మరణమును సహోదరి అని సంబోధిస్తూ ఆహ్వానించిన విధముగా, బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారు మరణం కొరకు సంసిద్ధపడినాడు. ఎంతో సంతోషముగా, నిశ్చమైన హృదయముతో మరణాన్ని స్వాగతించాడు.
మరణం, భూస్ధాపితం: తను ప్రవచించిన విధముననే 15జనవరి 1945వ సంవత్సరములో తంబిగారు తుదిశ్వాసను విడచినారు. మరణానికి ముందుకూడా, గ్రామాకు వెళ్ళి, ప్రజలను కలిసి, సువార్త ప్రచారాన్ని చేసాడు. 6 జనవరి 1945న అస్వస్థతతో పెదావుటపల్లికి తిరిగివచ్చాడు. ఆ రోజునుండి కూడా మంచములోనే ఉండిపోయాడు. ఆ దినాలలో కేవలం నీళ్ళు, డికాషిన్‌ మాత్రమే త్రాగెడివాడు. 14 జనవరిన అతని పరిస్థితి విషమించినది. 15 జనవరి ఉదయం లింగతోటి శిఖామణి గారి సహాయముతో దేవాలయమును వెళ్ళి ప్రార్ధన చేసుకున్నాడు. విచారణ గురువుయిన ఫాదర్‌ జె.బి.  కల్దిరారో గారిని కలిసి అవస్ధ అభ్యంగమును ఇవ్వమని కోరాడు. కాని విచారణకర్తలు, తంబిగారు ఆరోగ్యముగానే ఉన్నాడని భావించి అవస్ధ అభ్యంగమును ఇవ్వలేదు. ఆ తర్వాత, తంబిగారు పెదావుటపల్లి గ్రామములో, తన సువార్త ప్రచారము ద్వారా జ్ఞానస్నానమును పొందిన బోయపాటి ఫ్రాన్సిస్‌, క్లారమ్మ గృహానికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే సరాసరి తన స్వహస్తాలతో నిర్మించిన పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ పీఠము వద్దకు వెళ్ళియున్నాడు. ఆరోజే తను మరణిస్తాడని చెప్పియున్నందున అనేకమంది తంబిగారిని చూడటానికి వచ్చియున్నారు. అందరిలో భయం, ఆందోళన! శ్వాసను గట్టిగా తీసుకుంటూ, శక్తిని కూడదీసుకుని అక్కడనున్న వారితో, ‘‘తండ్రికుడి ప్రక్కన కూర్చొనియున్న మహిమగల క్రీస్తు ప్రభువు చెంతకు వెళ్ళుచున్నాను. నేను మీ అందరికోసం ప్రార్థన చేస్తాను. తన ప్రాణాలను అర్పించిన క్రీస్తు మిమ్మును ప్రేమిస్తూ ఉన్నాడని మరువరాదు. ఆయన మిమ్మును బాగుగా చూసుకునే మంచికాపరి. కాబట్టి, భవిష్యత్తుగూర్చి చింతించవద్దు. ఆయన నిన్న, నేడు, ఎల్లప్పుడు ఒక్కటే! దేవుడు తన జ్ఞానముతో మిమ్మును కాపాడును. ఆయన వరమును మీ కొసగును. నన్ను తన సాధనముగా వాడుకొనును. కనుక, నేను వెళ్ళినను, దేవుని ఆశీర్వాదము కొరకు మీ అందరికోసం ప్రార్థిస్తూ ఉంటాను’’ అని బలహీన స్వరముతో వారికి వీడ్కోలు చెప్పియున్నారు. సాయంత్రం 5 గంటలకు బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారు తుదిశ్వాస విడచినారు. వార్తను తెలుసుకున్న విచారణ గురువు వచ్చి అభ్యంగము ఇచ్చియున్నారు.
ఆ తరువాత, ఆయన భౌతిక కాయమును విచారణ దేవాలయమునకు ప్రక్కగానున్న తన గృహమునకు చేర్చారు. తాను స్వయముగా ఏర్పాటు చేసుకున్న శపపేటికలో ఉంచారు. తంబిగారి మరణవార్త వినగానే అనేకమంది అవుటపల్లి గ్రామస్థుల, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, తమ ఆధ్యాత్మిక తండ్రి చివరి చూపు కొరకు అచ్చట గుమికూడారు.
మరుసటి రోజు 16 జనవరి 1945 పూజానంతంరం, సమాధుల స్ధములో ఆయనను భూస్ధాపితం చేసారు. భూస్ధాపిత కార్యక్రమములో అనేకమంది క్రైస్తవేత్తరులు కూడా పాల్గొని యున్నారు.
ప్రేమమూర్తి, శాంతి స్థాపకుడు: తంబిగారు ప్రేమమూర్తి, అందరిని గౌరవించేవాడు. అందరితో ఎంతో సవ్యముగా మాట్లాడేవాడు. ఎప్పుడు ఎవరిమీద, దేనికోసం, ఫిర్యాదు చేయలేదు. అతను నిరాడంబరి. ఎంతో ప్రేమ కలిగి జీవించాడు. పేదవారు, ఆడపిల్లలు చదువుకోవాని ఆశించాడు. తను పేదరికములో నున్నప్పటికిని, తను స్వీకరించిన వాటిని పేదలకు, పిల్లలకు పంచేవాడు. వారికి సహాయం చేయుటకు భిక్షాటన కూడా చేసేవాడు. ఇలా తంబిగారి జీవితమంతయు కూడా దైవసేవకు, మానవసేవకు అంకితం చేయబడినది. అందరిని సమానంగా ఆదరించాడు. గ్రామ గ్రామాలకు వెళ్ళి తన ప్రేమను పంచాడు.
తంబిగారు ఎప్పుడూ ప్రశాంతముగా ఉండేవాడు. గ్రామాలలో ప్రజలమధ్య శాంతిని నెలకొల్పేవాడు. ప్రజలు ఆయనను ఎంతగానో గౌరవించేవారు.
ప్రాయశ్చిత్తము, వినమ్రత: తంబిగారి ప్రాయశ్చిత్త జీవితములో ప్రాముఖ్యమైనది, తనను తాను ఇష్టపూర్తిగా దేవునికి అర్పించుకోవటం. పంచగాయాలను పొంది క్రీస్తు శ్రమలో పాలుపంచుకున్నాడు. సువార్త ప్రచారానికి అనేక మైళ్ళు నడచి వెళ్ళేవాడు. ఉపవాసము చేసేవాడు. ఎంతో వినయముగా         ఉండెడివాడు. తనను తప్పుగా  అర్ధంచేసుకున్నప్పుడు, అవమానించినప్పుడు ఎంతో ఓర్పుగా ఉండెడివాడు. ఆయన వేషధారణ చూసి పిల్లలు పిచ్చివాడని పిలిచేవారు. రాళ్ళు విసిరేవారు. వాటన్నింటిని ఓపికగా భరించేవాడు. పాపములో జీవిస్తున్నారని, మారు మనస్సు పొందాలని వినయముగా వేడుకొనెడివాడు. పాపసంకీర్తనం చేసి దివ్యపూజా బలిలో పాల్గొనాలని చెప్పెడివాడు.
చిన్న పిల్లలనగా ఎనలేని ప్రేమ: బ్రదర్‌ జోసఫ్‌ తంబిగారు చిన్న పిల్లలతో ఎంతో ప్రేమగా, అప్యాయముగా ఉండెడివాడు, వారితో ఎంతో ఓపికగా, సహనంగా ఉండెడివాడు. వారికి ప్రార్థనను, జపమాలను నేర్పించెడివాడు. పిల్లలు ఆయనను అవమానించినను, పిచ్చివాడంటూ ఆయనపై రాళ్ళు విసిరినను, కోపగించక వారిని ప్రేమతో చేరదీసేవాడు.
పవిత్ర జీవితం, కీర్తి: మరణించిన కొద్ది కాలానికే ప్రజలు ఆయనను పునీతునిగా గుర్తించారు. భక్తులు ఆయన సమాధిని సందర్శించడం ప్రారంభించారు. ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని వేడుకొనెడివారు. అనేకమంది ఆయన ప్రార్థన ద్వారా ఎన్నో మేలులను పొందియున్నారు. ఇప్పటి వరకు వేలమంది భక్తులు ఆయన సమాధిని సందర్శించి, ప్రార్ధను చేసి ఎన్నో మేలులను పొందియున్నారు. ప్రతీ సంవత్సరము తంబిగారి మహోత్సవములు జనవరి 13,14,15 తారీఖులో నిర్వహింపబడుచున్నాయి.
ముగింపు: నవంబర్‌ 11,1890 వ సంవత్సరములో తమిళనాడు, పాండిచ్చేరిలోని కరైకల్‌ అనే గ్రామమునకు చెందిన  శవరిముత్తు, అన్నమలై దంపతులకు సైగోన్‌ (ఫ్రెంచి కానీ) అను ప్రాంతములో జన్మించారు. తన ఏడవ యేటనే తల్లిని కోల్పోయాడు. 1902 వ సంవత్సరములో దివ్య సత్ప్రసాదమును, భధ్రమైన అభ్యంగమును స్వీకరించాడు. అదే సంవత్సరములో ఇంటిని విడచి కేరళ రాష్ట్రమునకు వెళ్ళి అక్కడ ఒక భక్తురాలి దగ్గర పెరిగి, విద్యను అభ్యసించాడు. 1915 వ సంవత్సరములో సన్యాస జీవితమును జీవించుటకు పయణమయ్యాడు.
1931 వ సంవత్సరములో కపూచిన్‌ సభలో చేరియున్నాడు. అచ్చట పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ గారి తృతీయ సభకు చెందిన అంగీని స్వీకరించాడు.  1933వ సంవత్సరములో నొవిషియేటులో చేరకముందు అనారోగ్యము కారణముగా, కపూచిన్‌ సభను వీడాల్సి వచ్చినది. అయినప్పటికిని, తృతీయ సభ అంగీని ధరించడం కొనసాగించాడు. 1936 వ సంవత్సరము వరకు కేరళ, తమిళనాడు రాష్ట్రాలో సువార్త ప్రచారం చేసాడు. 1937వ సంవత్సరములో ఆంధ్రప్రదేశ్‌లోని బిట్రగుంట ప్రాంతములోని, విజయవాడ దగ్గర కేసరపల్లి గ్రామములో సువార్త ప్రచారం చేసాడు. 1939వ సంవత్సరములో తంబిగారు పెదావుటపల్లి గ్రామములో విచారణ ప్రాంగణములోని ఒక చిన్న గృహములో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అచ్చటనే తన మరణమువరకు జీవించాడు. 24 జూన్‌ 2007 వ సంవత్సరమున తంబిగారు ‘‘దైవసేవకుడు’’గా ప్రకటింపబడియున్నారు.