దైవసేవకుని 75వ వర్ధంతి మహోత్సవాలు (Editorial, "Thamby Velugu" January 2020)
ప్రియ ‘‘తంబి వెలుగు’’ పాఠకులారా!
జనవరి మాసం రాగానే, మనకందరికీ ‘దైవసేవకుడు’ బ్రదర్ జోసఫ్ తంబిగారి వర్ధంతి మహోత్సవాలు గుర్తుకొస్తాయి. 13,14,15 తారీఖులలో అవుటపల్లిలోని ఆ మహాశయుని సమాధిని దర్శించుకొని, ప్రార్ధించి, దివ్యపూజాబలిలో పాల్గొని, మొక్కుబడులు చెల్లించుకొని, క్రీస్తు యేసు శాంతి, సమాధానము పొందుకొని సంతోషంతో, ఆనందముతో యింటికి తిరిగి వెళ్లాని బ్రదర్ జోసఫ్ తంబిగారి భక్తుంలందరూ ఎదురుచూస్తూ ఉంటారు.
ఈ సంవత్సరం బ్రదర్ జోసఫ్ తంబిగారి 75వ వర్ధంతి మహోత్సవాలు. ఆ పునీతుడు మరణించి 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. దేవుని పట్ల భయభక్తులుగలు వారికి ఆయన మధ్యస్థ ప్రార్ధన ద్వారా ఎన్నో మేలులు అద్భుతాలు చేస్తున్నారు. దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ మహనీయుని గురించి తెలుసుకుందాం...
కుటుంబము, బ్యాము, యౌవ్వనము
బ్రదర్ జోసఫ్ తంబిగారి తల్లిదండ్రులు తంబుసామి శవరిముత్తు, రోసమల్లె మరియ (అన్నమలె). వీరి స్వస్థం దక్షిణ భారతదేశముననున్న తమిళనాడు రాష్టములోని పాండిచ్చేరి సమీపములోని ‘కరైకల్’ గ్రామము. తండ్రి శవరిముత్తు ప్రభుత్వ ఉద్యోగి. తల్లి రోసమల్లె మరియ గృహిణి.
ఉద్యోగం నిమిత్తమై, శవరిముత్తు తన భార్యను తీసుకొని ఆగ్నేయ ఆసియాలోని ‘సైగోన్’ దేశమునకు వెళ్ళాడు. వారు ఆచటనుండగనే, 11 నవంబరు 1890వ సంవత్సరములో వీరికి పండంటి మగబిడ్డ జన్మించాడు. ఆ ముద్దు బిడ్డకు ‘రాయప్ప జోసఫ్ శౌరి’ అని పేరును పెట్టారు. అయితే, ప్రస్తుతం, ‘బ్రదర్ జోసఫ్ తంబి’గా ప్రసిద్ధి గాంచారు.
జోసఫ్ తంబికి రెండేళ్ళ వయస్సు ఉన్నప్పుడు, అనగా 1892వ సంవత్సరములో శవరిముత్తు, రోసమల్లె మరియు తన కుమారుని తీసుకొని భారత దేశమునకు తిరిగి వచ్చారు.
జోసఫ్ తంబికి ఏడు సంవత్సరము వయస్సు ఉన్నప్పుడు అనగా 1897వ సంవత్సరములో తల్లి రోసమల్లె మరియ మరణించినది. అప్పుడు అతని తండ్రి శవరిముత్తు ‘మేరి తెరేసా’ను రెండవ వివాహము చేసుకున్నాడు. అయితే సవతి తల్లి జోసఫ్ తంబిని ఇష్టపడలేదు. రోజూ చిటపటలు, చికాకులే! జోసఫ్ తంబిని ఎన్నో హింసలకు గురిచేసింది. రోజూ సరిగా భోజనం కూడా పెట్టేది కాదు.
సవతి తల్లి పెట్టే హింసలను, బాధలను తాళలేక జోసఫ్ తంబి యింటిని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకున్నాడు. యింటినుంచి పారిపోయిన తంబి కేరళ రాష్ట్రమునకు వెళ్ళాడు. ఎర్నాకుళం అను ప్రదేశములో ఒక పుణ్యాత్మురాలి చల్లని పిలుపు తంబికి వినబడినది. ఆమె సంరక్షణలో, ఆలనాపాలనలో, ఊరడింపులో, ఆదరణలో విద్యాబుద్ధులు నేర్చుకొంటూ పెరిగాడు. నిండైన ఆత్మవిశ్వాసములోను, క్రైస్తవ విశ్వాసములోను అంచలంచలుగా ఎదిగాడు.
పెరిగి పెద్దవాడైన జోసఫ్ తంబి, శ్రీసభ విశ్వాసములో ఎదిగాడు. కేరళలోని ‘వేరాపొలి’ మేత్రాసణములోను, ఆ తరువాత కార్మలైట్ మిషనరీ ఆధ్వర్యములోను జోసఫ్ తంబి, గురువుకు సహాయకునిగా ఉంటూ, ఉపదేశిగా దైవ సన్నిధిలో తన సేవను అందించియున్నాడు.
మానవత్వమున్న ప్రతీ మనిషిలో కన్నవారిపై, తోబుట్టువులపై, బంధువులపై, ఆప్తులపై మరచిపోలేని మమకారాలు సహజముగా ఉంటాయి. జోసఫ్ తంబి తరచుగా స్వస్థలమును సందర్శించేవాడు. కాని ఎవరును ఆయనను గుర్తించేవారు కాదు, ఎందుకన, భిక్షాటన చేస్తూ వెళ్ళేవాడు.
వేషం మారింది, రూపం మారింది, వయోజనుడయ్యాడు. అందుకే ఎవరూ తనను గుర్తింప లేకపోయిరి. ఒకానొక సందర్భములో కన్నతండ్రి కూడా అతనిని గుర్తించలేదు. ఒక అణా ధర్మం చేసి పంపించివేసాడు. జోసఫ్ తంబి కూడా తన గురించి ఎవరికి చెప్పేవాడు కాదు.
అయితే, ఒకసారి, అతని బంధువుని అంత్యక్రియలో పాల్గొనుటకు వచ్చిన జోసఫ్ తంబిగారిని అతని నాయనమ్మ గుర్తించడం జరిగింది. ఈవిధముగా, జోసఫ్ తంబిగారి ప్రారంభ జీవితము కొనసాగినది.
పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ ‘తృతీయ సభ’ సభ్యుడు
కేరళలోని ‘వేరాపొలి’ మేత్రాసణములో కార్మలైట్ మిషనరీ ఆధ్వర్యములో జోసఫ్ తంబి ఉపదేశిగా తన సేవను అందించుచున్న సమయములోనే, కార్మలైట్ మిషనరీ ద్వారా 1929 లేదా 1930 సంవత్సరాలో ‘కొల్లం’ (‘కోయిలోన్’) అను ప్రదేశానికి, ఫ్రెంచ్ కపూచిన్ మిషనరీ ఆగమనం గురించి జోసఫ్ తంబిగారు తెలుసుకొని యున్నాడు. జోసఫ్ తంబి ఫ్రెంచ్ పౌరసత్వమును కలిగియుండటము వలన, అలాగే ఫ్రెంచ్ భాషకూడా వచ్చియుండుట వలన, ఫ్రెంచ్ కపూచిన్ మిషనరీలను కలుసుకొనుటకు ఆసక్తిని చూపాడు.
ఈవిధంగా, జోసఫ్ తంబి ఫ్రెంచ్ కపూచిన్ మిషనరీలను ‘కొల్లం’ అను ప్రదేశములో కలుసుకొని, వారితో కొంత కాలము గడిపియున్నాడు. బహుశా, సభలో చేరి కపూచిన్ మఠసభ సభ్యునిగా అగుటకు నిర్ణయించుకొని కూడా ఉండవచ్చు. ఆ కాలములో కపూచిన్ సభలో చేరిన ఆరంభములోనే పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి ‘తృతీయ సభ’కు చెందిన అంగీని ఇచ్చెడివారు. ఆవిధముగానే, జోసఫ్ తంబి 1930వ సంవత్సరములో ‘కొల్లం’లోని కపూచిన్ మఠములో చేరినప్పుడు ‘తృతీయ సభ’కు చెందిన అంగీని స్వీకరించి ధరించాడు.
ఆరంభ తర్ఫీదు అనంతరం, కపూచిన్ మఠవాసు జోసఫ్ తంబిని తరువాతి తర్ఫీదునకు తీసుకొనుటకు నిరాకరించారు. దీనికి ముఖ్య కారణం, జోసఫ్ తంబి కుడికాలు బోదకాులు అగుటవన, అలాగే తరుచూ భక్తి భావోద్రేకములకు లోనై మూర్చవ్యాధి లక్షణములను కలిగియుండుట వలన, మఠమును వీడి వెళ్ళవసి వచ్చినది. మఠమును వీడినప్పటికిని ‘తృతీయ సభ’ అంగీని ధరించే అనుమతి ఉండెడిది. ఈవిధంగా, జోసఫ్ తంబి కపూచిన్ సభ మఠమును వీడినప్పటికిని, స్థానిక మేత్రాణుల అనుమతితో తృతీయ సభ అంగీని ధరించియున్నాడు. బహుశా జోసఫ్ తంబి 1933వ సంవత్సరములో కపూచిన్ సభ మఠమును వీడి ఉండవచ్చు. కపూచిన్ సభ మఠమును వీడిన తరువాత, అనేక సార్లు స్వస్థలమైన పాండిచ్చేరిని సందర్శించి అచ్చటి ప్రజలకు అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారు స్థాపించిన ‘తృతీయ సభ’ గురించి తెలియజేశాడు. అస్సీసిపుర ఫ్రాన్సిస్‌వారి జీవితమును ఆదర్శముగా తీసుకొని, తాను ఎక్కడికి వెళ్ళినను ‘తృతీయ సభ’ను గూర్చి తెలియజేస్తూ, సభ సంఘాలను లేదా శాఖలను ఏర్పాటు చేస్తూ తన జీవితాన్ని కొనసాగించాడు.
ఈవిధముగా, తను ఎక్కడికి వెళ్ళినను ఫ్రాన్సిస్‌వారి ‘తృతీయ సభ’ను వ్యాప్తిచేయుటకు ప్రయత్నం చేసాడు. పాండిచ్చేరిలో ప్రజలు జోసఫ్ తంబిగారిని ఎంతో ఆప్యాయంగా ఆదరించేవారు. ప్రేమగా ఆయనను ‘‘తంబి’’ అని పిలిచేవారు.
‘మణత్తిడల్’లో దైవసేవ, తృతీయ సభ స్థాపన
1933వ సంవత్సరములో, జోసఫ్ తంబి పాండిచ్చేరిని వీడి ప్రస్తుతం ‘కుంభకోణం’ అతిమేత్రాసణములో ఉన్న ‘మణత్తిడల్’ గ్రామమునకు వెళ్ళారు. అప్పటిలో ‘మణత్తిడల్’ గ్రామము ‘మైకేల్‌పట్టి’ అను విచారణ క్రింద ఉండెడిది. గురుశ్రీ జ్ఞానాధిక్యం వారు విచారణ గురువుగా ఉన్నారు. కొద్ది కాములోనే తన మంచి ప్రవర్తనతో, మాటలతో అచ్చటి ప్రజల మన్ననలను చూరగొన్నాడు. వారుకూడా జోసఫ్ తంబిగారిని గొప్ప దైవ సేవకునిగా గుర్తించారు. అచ్చటి ప్రజలు దేవాలయ ఆవరణలో ఒక చిన్న ఇంటిని నిర్మించి దానిలో ఉండుటకు ఏర్పాటు చేసారు. దేవాలయము వద్దకు తరచుగా ప్రజలను పిలచి ప్రార్ధనలు చేసేవారు. జబ్బు పడిన వారికి తనకు తెలిసిన ఆకులతో మందును తయారు చేసి ఇచ్చేవారు. ప్రార్ధనచేసి, వారి రోగాలను స్వస్థపరచేవారు. చిన్న పిల్లలకు సత్యోపదేశ సంక్షేపాన్ని బోధించేవారు. పిల్లలను ఎంతో ఆప్యాయముగా చేరదీసేవారు. వారు విధేయించని యెడల, వారి ఎదుట మోకరిల్లి విధేయించమని ప్రాధేయపడెడివారు.
‘మణత్తిడల్’ గ్రామములోనున్న కతోలిక క్రైస్తవులను, దివ్యపూజాబలిలో, ఆరాధనలో పాల్గొనడానికి, ప్రతీ ఆదివారము మరియు మొదటి శుక్రవారము ప్రోగుచేసి ‘మైకేల్‌పట్టి’ విచారణ దేవాలయమునకు తీసుకొని వెళ్లేవారు. 1933-1934 సంవత్సర కాలములో, జోసఫ్ తంబిగారు ‘మణత్తిడల్’ గ్రామములో అస్సీసిపుర ఫ్రాన్సిస్‌వారి ‘తృతీయ సభ’ను స్థాపించియున్నారు.
‘మణత్తిడల్’ గ్రామమును విచారణగా చేయడానికి జోసఫ్ తంబిగారు ఎంతగానో కృషి చేశారు. అప్పటి మేత్రాణుల వద్దకు వెళ్లి, ‘మణత్తిడల్’ గ్రామములో స్థానికముగా ఉండుటకు ఒక గురువును పంపుమని కోరియున్నారు. దాని ఫలితముగానే మేత్రాణులు గురుశ్రీ పి.ఎస్. ఇగ్నేషియస్ వారిని ‘మణత్తిడల్’ గ్రామమునకు పంపియున్నారు.
తమ ఆధ్యాత్మిక బాగోగులు చూసుకోవడానికి వారి మధ్యన ఒక గురువు వచ్చినందుకు ‘మణత్తిడల్’ ప్రజలు ఎంతగానో సంతోషించారు, సంబరపడ్డారు. కాని జోసఫ్ తంబిగారు మాత్రం వారితో, ‘‘ఇప్పుడు మీ ఆధ్యాత్మిక బాగోగులు చూసుకోవడానికి ఒక గురువు మీ మధ్యన ఉన్నారు. ఇక నేను మీనుండి సెవు తీసుకొని దైవసేవను కొనసాగించుటకు వేరొక చోటుకు వెళతాను’’ అని చెప్పియున్నారు. అది విన్న ప్రజలు ఎంతగానో బాధపడ్డారు. వెళ్లిపోవద్దని జోసఫ్ తంబిగారిని ఎంతగానో ప్రాధేయపడ్డారు. కాని జోసఫ్ తంబిగారు 1936వ సంవత్సరములో అచటనుండి సువార్తా నిమిత్తమై వేరొక చోటుకు వెళ్ళిపోయారు.
‘పచ్చమలై’కు పయనం
1936వ సంవత్సరములో ‘మణత్తిడల్’ గ్రామమునకు గురుశ్రీ ఇగ్నేషియస్ వారి రాకతో జోసఫ్ తంబిగారు ముందుగా ‘కొత్త పాల్యం’ అను విచారణకు వెళ్ళారు. అక్కడ విచారణ గురువులైన గురుశ్రీ అధిరూపం వద్ద పదిరోజులు ఉన్నారు. తక్కువ సమయములోనే గురుశ్రీ అధిరూపంతో జోసఫ్ తంబిగారికి చక్కటి స్నేహం ఏర్పడినది.
‘కొత్త పాల్యం’ నుండి ‘తొండమదురై’ అను స్థమునకు వెళ్లి అచటనుండి ‘పచ్చమలై’ అను మారుమూల గ్రామమునకు వెళ్లియున్నారు. ఇది ‘కొత్త పాల్యం’ విచారణకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ‘పచ్చమలై’ అనునది తిరుచునాపల్లి జిల్లాలోని కొండ ప్రాంతం. ‘కుంభకోణం’ మేత్రాసణములోని ‘తొండమన్‌దురై’ విచారణ సమీపములో ఉన్నది. ఇది గిరిజనుల ప్రాంతం. ఆ గ్రామములో జోసఫ్ తంబిగారు స్వయముగా ఒక గుడిసెను నిర్మించుకొని దానిలో నివసించేవారు. తను భిక్షాటన చేసి సంపాదించిన భోజనమును, దుస్తులను, సొమ్మును వారికి సహాయం చేసేవాడు. సాధారణముగా వారు ఎప్పుడు సగం దిగంబరులై ఉండేవారు. తరుచూ పాండిచ్చేరి వెళ్లి బట్టలను, సొమ్మును తీసుకొని వచ్చి తనవంతూ ఈ కొండజాతి ప్రజలకు సహాయం చేసేవారు. నిదానముగా వారికి దేవుని గూర్చి, దేవుని ప్రేమ, మహిమగూర్చి వివరించడం మొదలు పెట్టారు. ఒకరినొకరు సహాయం చేసుకోవాలని బోధించారు. జోసఫ్ తంబిగారు తనకు తెలిసిన నాటుమందు సహాయముతో వారికి వైద్య సహాయాన్ని అందించేవారు.
కేరళ రాష్ట్రములో...
తమిళనాడు నుండి కేరళ చేరుకున్న జోసఫ్ తంబి అనేక చోట్ల తిరిగి త్రిశూరు జిల్లాకు చేరుకున్నాడు. అచ్చట లతీను దేవాలయమును కనుగొని, ప్రతిరోజు క్రమం తప్పకుండా అక్కడ ఉన్నన్ని రోజులు దివ్యపూజలో పాల్గొన్నాడు. ఈ సమయంలో రాత్రులో ‘పుత్తూరు’ (‘పొన్నుకర’)లోని మిషన్ దేవాలయములో పడుకొనెడివాడు. అప్పుడప్పుడు సిరియన్ గురువు చేసే దివ్యపూజా బలిలో కూడా పాల్గొనేవాడు. జోసఫ్ తంబి తన ప్రేషిత సేవను ఎక్కువగా ‘ఎర్నాకులం,’ అనే ప్రాంతములో కొనసాగించి యున్నాడు. ‘కొచ్చిన్’ అను ప్రదేశములో వీధులో తిరిగుతూ పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌వారి గురించి, ‘తృతీయ సభ’ గురించి బోధించాడు. జోసఫ్ తంబి అక్కడినుండి వెళ్ళిపోయి ‘వీరాపోలి’ అగ్రమేత్రాసణ అగ్రపీఠాధిపతులైన జోసఫ్ అట్టిపెట్టి వారిని కుసుకున్నాడు. పీఠాధిపతులు జోసఫ్ తంబిని తన ఆధ్యాత్మిక జీవితమును జీవించుటను కొనసాగించుమని ప్రోత్సహించాడు. అగ్రపీఠాధిపతులైన జోసఫ్ అట్టిపెట్టి వారు జోసఫ్ తంబిగారిని ‘థెరేసియన్ సహోదరుల’ సభ కేంద్రమైన, త్రిశూరు జిల్లాలోని ‘పుత్తూర్’ అను స్థలమునకు వెళ్ళమని 1936వ సంవత్సరము చివరిలో కోరియున్నారు. అగ్రపీఠాధిపతులు ఇద్దరు థెరేసియన్ సహోదరును ‘పుత్తూరు’లో ఉంచియున్నారు. వారు ఆ విచారణలో తమ సేవలను అందిస్తూ ఉండేవారు. ‘పుత్తూరు’లో ఉంటూ, ఆ ఇరువురు సహోదరులకు తర్ఫీదు ఇవ్వుమని, ఆధ్యాత్మిక విషయాలలో వారికి సహాయము చేయమని పీఠాధిపతులు జోసఫ్ తంబిగారిని కోరియున్నారు.
ఆంధ్రప్రదేశ్ - బిట్రగుంటలో పరిచర్య
1937వ సంవత్సరములో జోసఫ్ తంబిగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు ఏతెంచారు. మొదటగా నెల్లూరు జిల్లాలోని బిట్రగుంట అను ప్రదేశములో నాలుగు నెలల పాటు ఉన్నారు. బిట్రగుంటలో తమిళనాడు నుండి రైల్వే ఉద్యోగులుగా పనిచేయుచున్నవారి మధ్యన తన ప్రేషిత కార్యాన్ని కొనసాగించారు. వారితో తమిళ భాషలో సంభాషించేవారు.
కేసరపల్లిలో పరిచర్య
1937వ సంవత్సరము చివరిలో జోసఫ్ తంబిగారు విజయవాడ నుండి 20 కి.మీ. దూరమున ఉన్న కేసరపల్లి గ్రామమునకు వచ్చియున్నారు. కేసరపల్లిలో పునీత పాదువాపురి అంథోని వారి పేరిట ఒక చిన్న దేవాలయము ఉన్నది. ప్రార్ధన చేసుకోవడానికి ఆ దేవాయములోనికి ప్రవేశిస్తుండగా, కొంతమంది అతనిని ‘పిచ్చివాడు’ అని భావించి అక్కడనుండి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేసారు. తెలుగు భాషకూడా అప్పటికి జోసఫ్ తంబిగారికి వచ్చేదికాదు, కనుక వారితో మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడియున్నాడు. ఎక్కడనుండి వచ్చాడో, ఏ ఉద్దేశ్యం కొరకు వచ్చాడో ప్రజలకు కూడా ఏమీ అర్ధం కాలేదు.
నెమ్మదిగా, జోసఫ్ తంబిగారి విశ్వాస జీవితాన్ని, ప్రార్ధన జీవితాన్ని గమనించిన కొంతమంది కతోలిక క్రైస్తవులు పశ్చాత్తాప హృదయముతో వచ్చి గ్రామస్థులు చేసిన అవమానాలకు, దూషణలకు, వారిని క్షమించమని వేడుకున్నారు. జోసఫ్ తంబిగారు వారిని క్షమించడం మాత్రమేగాక, వారితో ఎంతో స్నేహపూర్వకమైన బంధాన్ని ఏర్పరచుకున్నారు.
కొద్ది కాలములోనే కేసరపల్లిలోని కతోలిక సంఘస్తుందరు కూడా, తమ బాగోగుపట్ల ఆసక్తిగల పుణ్యాత్ముడైన జోసఫ్ తంబిగారు వారి గ్రామములో ఉండటం సంతోషపడ్డారు. గ్రామస్తుందరూ కూడా జోసఫ్ తంబిగారంటే గౌరవం, ఇష్టం కలిగింది. పిల్లలు, పెద్దలు, ఉపాధ్యాయులు అందరు కూడా ఆయనను గౌరవించేవారు.
కేసరపల్లి గ్రామము, అవుటపల్లి విచారణకు అనుసంధానమైన గ్రామము. అయినప్పటికిని ఆదివారాలలో కూడా దివ్యపూజాబలి ఉండేది కాదు. అప్పుడప్పుడు మాత్రమే దివ్యపూజాబలి ఉండేది. కనుక, తరుచుగా, జోసఫ్ తంబిగారు విశ్వాసులను ప్రోగుచేసి దివ్యపూజాబలిలో పాల్గొనుటకు, ముఖ్యముగా ఆదివారములలోను, పండుగ రోజులలోను అవుటపల్లి విచారణ దేవాయమునకు తీసుకొని వెళ్ళేవాడు.
అవుటపల్లిలో నివాసం
అవుటపల్లి (పెదావుటపల్లి) గ్రామము విజయవాడ మేత్రాసనములోని పురాతన విచారణలో ఒకటి. 1925వ సంవత్సరములో అవుటపల్లి గ్రామము విచారణగా ఏర్పడిరది.
1939వ సంవత్సరమునుండి జోసఫ్ తంబిగారు తన నివాసాన్ని అవుటపల్లిలో ఏర్పరచుకున్నారు. అప్పటి విచారణ గురువు గురుశ్రీ జాన్ బి. కల్దెరారో ఇటలీ దేశస్థుడు. 14 సెప్టెంబరు 1927వ సంవత్సరములో అవుటపల్లికి చేరుకున్న వీరు 1 మార్చి 1928వ సంవత్సరములో విచారణ గురువుగా బాధ్యతలు తీసుకున్నారు. విచారణ గురువుగా 1969 వరకు కొనసాగారు. అవుటపల్లి గ్రామము జోసఫ్ తంబిగారి ఆధ్యాత్మిక కార్యాలకు ప్రధాన కేంద్రం అయ్యింది. 1939వ సంవత్సరము నుండి 1945వ సంవత్సరము వరకు ఇక్కడే నివసిస్తూ చుట్టుప్రక్క గ్రామాలలో సువార్తను బోధిస్తూ జీవించారు. విచారణ గురువుకు అన్ని విషయాలో తన వంతు సహాయ సహకారాలను అందించి యున్నారు. అతి త్వరలోనే అవుటపల్లి గ్రామస్తులు, అలాగే చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు జోసఫ్ తంబిగారు ఒక పుణ్యాత్ముడని గుర్తించారు.
చుట్టుప్రక్కల గ్రామాలో దైవసేవ
జోసఫ్ తంబిగారు అవుటపల్లిలో తన నివాసాన్ని ఏర్పరచుకున్నప్పటికిని, తరుచుగా దైవసేవ నిమిత్తమై చుట్టుప్రక్క గ్రామాలకు వెళుతూ ఉండేవారు. ‘‘అవుటపల్లి అపోస్తుడు’’గా పేరు గాంచిన జోసఫ్ తంబిగారు, చుట్టుప్రక్క గ్రామాలలో సాధ్యమైనంత వరకు ప్రజలను రక్షకుడైన క్రీస్తు రక్షణ ‘మార్గము’లో నడిపింపాలనే ధ్యేయముతో, సంకల్పముతో తన సువార్తా పరిచర్యను తనదైన శైలిలో కొనసాగించాడు. దైవాశీస్సులతో జోసఫ్ తంబిగారు తన ప్రేషిత కార్యమును అవుటపల్లి చుట్టుప్రక్క గ్రామాలలో విస్తరింప చేసియున్నాడు. జోసఫ్ తంబిగారు సందర్శించిన గ్రామాలు మానికొండ, తేలప్రోలు, ఉయ్యూరు, వట్లూరు, దెందుూరు, ఉప్పూరు, కేసరపల్లి, వేంపాడు, అజ్జంపూడి, అ్లపురం, భూతమల్లిపాడు, ప్రొద్దుటూరు, మర్రీడు, కోడూరుపాడు, కిష్టవరం, గొల్లపల్లి, వల్లూరుపాలెం, తొట్లవల్లూరు, అలాగే గుంటూరు జిల్లాలోని పాతరెడ్డిపాలెం మొదగునవి.
తుది ఘడియు...పరలోక పయనం
జోసఫ్ తంబిగారు తన మరణమును ముందుగానే ఎరిగియున్నాడు. దానికోసమై ఆధ్యాత్మికముగా సిద్ధపడ్డాడు. తాను 15 జనవరి 1945వ రోజున చనిపోతానని మూడు నెలలకు ముందుగానే కొంతమందితో చెప్పియున్నారు. దాని నిమిత్తమై మూడు నెలలకు ముందుగానే శవపేటికను చేయించుకొని తన గదిలో పెట్టించుకున్నాడు. అది 1944వ సంవత్సరం. క్రిస్మస్ పండుగ అయిపోగానే మానికొండ గ్రామమునకు వెళ్ళారు. 6 జనవరి 1945న తీవ్ర జ్వరముతో అవుటపల్లిలోని తన నివాసానికి తిరిగి వచ్చారు. 15 జనవరి 1945 రానే వచ్చింది. ఆరోగ్యము బాగా లేకున్నను ఆరోజు ఉదయము దేవాలయములోనికి తీసుకొని పోవసినదిగా అక్కడ ఉన్నవారిని అడిగారు. జోసఫ్ తంబిగారు నీరసముగా ఉన్నప్పటికిని బోయపాటివారి యింటికి చేరుకున్నాడు. వారి యింటిలో తానే స్వయముగా నిర్మించి, అస్సీసిపుర ఫ్రాన్సిస్‌వారికి అంకితం చేసిన పీఠము చెంత మడత కుర్చీలో కూలబడ్డారు. బోయపాటి దంపతులు బాధతో, ఆశ్చర్యముతో జోసఫ్ తంబిగారినే చూస్తూ ఉండిపోయారు, ఎందుకన తాను మరణిస్తానని చెప్పిన రోజు అదే కనుక!
సాయంత్రం నాలుగు గంటలకల్ల, జోసఫ్ తంబిగారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఇక ఏమీ మాట్లాడలేక పోతున్నారు. ఆ తదుపరి సాయంత్రం ఐదు గంటల సమయానికి తన తుది శ్వాస విడిచారు.
No comments:
Post a Comment