దేవుని కృప - దివ్య సంస్కారాలు

దేవుని కృప - దివ్య సంస్కారాలు

    సాధారణంగా, దేవుని కృప యనగా మానవుల పట్ల దేవుని మంచితనం, దయ, కరుణ. కృప యనగా మనిషి జీవనం పట్ల దేవుని ప్రేమ. సంకటమగు మానవుని పాపస్థితి, అశాశ్వతమగు జీవిత నేపధ్యంలో మనం ‘కృప’ను చూడవలయును. పాపస్థితి నేపధ్యంలో ‘కృప’ మనకు దయ, క్షమ వలెనె కనిపించును. అశాశ్వత జీవనం, మరణం నేపధ్యంలో, ‘కృప’ మనకు రక్షణవలె కనిపించును. కనుక, కృప మనను త్రిత్వైక దేవుని అన్యోన్యతలోనికి ప్రవేశింప జేస్తుంది. ‘‘క్రీస్తు కృపావరం ఉదార కానుక. దాని మూలంగా దేవుడు తన స్వంత జీవాన్ని ఇచ్చాడు. మన పాపం నుంచి స్వస్థపరచి, పవిత్ర పరచటానికి దీన్ని పవిత్రాత్మ మన ఆత్మలో ప్రవేశపెడతాడు’’ (కతోలిక శ్రీసభ సత్యోపదేశం 1999).

    ప్రప్రధమంగా, కృపావరం పవిత్రాత్మ కానుక. ఆ పవిత్రాత్మే మనను నీతిమంతును, పవిత్రును చేయును (కతోలిక శ్రీసభ సత్యోపదేశం 2003). సంప్రదాయకంగా, ‘కృప’ యనగా దేవుడు తన వ్యక్తిత్వమును వ్యక్తిగతంగా మానవునితో పంచుకోవడం లేదా దేవుని వ్యక్తిగత సాన్నిధ్యాన్ని మానవునితో పంచుకోవడం. ఈవిధంగా, ‘కృప’ యనగా దేవుని ఆత్మ అని అర్ధమగుచున్నది. ‘కృప’ యనగా దేవుని ఆత్మ, దేవుని వ్యక్తిత్వం. ‘‘‘దేవుని యొక్క ఆత్మ’, ‘దేవుని ఆత్మ’, ‘దేవుడు ఆత్మ’ అను భావాలు సృష్టిలో దేవుడు ఆత్మగా కార్యసాధన చేయుచున్నట్లుగా మనను ఆలోచింప జేయుచున్నది. కనుక, ‘కృప’ యనగా దేవుడే స్వయంగా తన వ్యక్తిత్వం వెలుప ఆత్మ రూపమున కార్యసాధన చేయుచున్నాడని మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ ఆత్మ, కృప, దేవునికి-మానవునికి మధ్యగ ‘ప్రేమ సంభాషణ’గా అర్ధమగుచున్నది. అయితే ఇది నైరూప్య మైనది గాక, స్పష్టమైనది. ఎందుకన, సృష్టి ఆరంభము నుండి సర్వ సృష్టిపై దేవుని ఆత్మ తిరుగాడుచూ రూపమును, జీవమును ఒసగుచుండెను.

    మొదటిగా, దేవుని కృపను అర్ధం చేసుకొనే జ్ఞానమునకు మూలం, ‘యూద-క్రైస్తవ పవిత్ర గ్రంధాలు’. ‘‘ప్రభువు దయకవాడు, దేవుని కృపయే దేవుడు ఒసగు రక్షణ. అన్ని అంశాలో మానవుడు పొందు దేవుని రక్షణయే దేవుని కృప.’’ యూద సంప్రదాయం (పూర్వ నిబంధనము) దేవుని కృపను స్థిరమైన, నమ్మదగిన దేవుని ప్రేమగా వివరిస్తుంది. క్రైస్తవ సంప్రదాయం (నూతన నిబంధనము) దేవుడు ప్రేమ స్వరూపి, యేసు ప్రభువు దేవుని ప్రేమకు నిదర్శనం అని వివరిస్తుంది (1 యోహా. 4:7-21). కనుక, యేసు కేవలం దేవుని ప్రేమ మాత్రమే గాక, దేవుని కృప కూడా అని మనకు అర్ధమగుచున్నది. దీనిని సిలువపై క్రీస్తు తన రక్షణ కార్యం ద్వారా సాధించి యున్నాడు. ‘‘ఉత్థాన క్రీస్తు దేవుని కృప. కృపయైన దేవుడు ఆత్మగా యేసు క్రీస్తు ద్వారా మానవ హృదయాలో నింపబడి వాసము చేయుచున్నాడు.’’ మానవ రక్షణ లేదా శాశ్వత జీవితం దేవునిచేత సాధించబడినది. దేవుని కృప యనగా దేవుని యొక్క ప్రేమ యేసు క్రీస్తు ద్వారా మానవాళిపై కుమ్మరింపబడుట.

    రెండవదిగా, దేవుని కృపకు ప్రాముఖ్యమైన మూలం ‘దివ్యసంస్కారమును కొనియాడుట’, ‘స్వీకరించుట’. ఇది ‘శుద్ధీకరించే కృపావరం లేదా దైవత్యును చేసే కృపావరం’ (కతోలిక శ్రీసభ సత్యోపదేశం 1999). ఈ కృపావరం క్రీస్తు ఒసగిన వివిధ సంస్కారా ద్వారా, పవిత్రాత్మ ద్వారా అందజేయబడును. దివ్యసంస్కారాల వేదాంత అధ్యయనం, ప్రతీ దివ్య సంస్కారంలో దాగియున్న పరమ రహస్యమును వివరిస్తుంది. తద్వారా, సంస్కారాలను స్వీకరించువారు దేవుడు తననుతాను వ్యక్తపరచుకొను రక్షణ కార్యసన్నిధిలో, క్రీస్తు పరమరహస్యాలలో పాల్గొనెదరు.

    మూడవదిగా, దేవుని కృపను పొందుటకు మూలం  ‘ఉప సంస్కారాలు’. ఇవి చిహ్నాలు, సంకేతాలు, వ్యక్తీకరణలు, కార్యములు. ఇవి మానవ విశ్వాసమును, ఆదర్శాలను మాత్రమేగాక, వాటిలోనున్న దైవసాన్నిధ్య అంశమును కూడా తెలియ జేయును. ఆరాధనలో, మతాచారాలోని ఉపసంస్కారాల ఉపయోగం, దేవుడు-మానవుల మధ్యనున్న సంబంధ వాస్తవమును చాటును. ఉపసంస్కారాలు బాహ్యంగా కనిపించెడు గురుతుల, చిహ్నాలు లేదా సంకేతాలు. అయినను, అవి ఆధ్యాత్మిక ప్రభావాన్ని ఒసగును. ‘‘మానవ శుద్ధీకరణకు, దైవారాధనకు దోహదం చేసే ఇంతటి శక్తిమంతమైన ఆధ్యాత్మిక సాధనాలు భౌతిక ప్రపంచంలో మరేవీ కనిపించవు’’ (పవిత్ర దైవార్చనా చట్టం, 61).

    నాలుగవదిగా, దైవకృపకు మూలం ‘ప్రత్యేక కృపానుగ్రహాలు’. వ్యక్తిగత పవిత్ర జీవితమునకు, సువార్తా విలువలను అనుసరించుటకు, క్రీస్తులో జీవితమును కలిగియుండుటకు సబంధించి, క్రైస్తవుని క్రియలు, చర్యల ద్వారా ఈ ‘ప్రత్యేక కృపానుగ్రహాలు’ పొందబడును. ‘‘తన కృపావర కార్యంలో సహకరింపటానికి మనిషిని దేవుడు స్వచ్చందంగా ఎన్నుకున్నాడు’’ (కతోలిక శ్రీసభ సత్యోపదేశం 2008) అను వాస్తవం వన ఈ కృపానుగ్రహాలు' పొందబడును. ఈ ‘ప్రత్యేక కృపానుగ్రహాలు’ క్రైస్తవ జీవిత బాధ్యతను, శ్రీసభలోని ప్రేషిత కార్యమును నిర్వహించుటకు నిర్దేశింపబడినవి (రోమీ. 12:6-8).

కతోలిక శ్రీసభలో దివ్యసంస్కారాలు - దైవ కృప
    పవిత్రమైన ప్రేషిత కార్యమును కొనసాగించుటకు కతోలిక శ్రీసభకు ఉన్న ప్రధానమైన మార్గం ‘దివ్యసంస్కారాలు’. అగోచరమగు శ్రీసభ, క్రీస్తు కార్యముకు దివ్యసంస్కారాలు గోచరమగు సంకేతాు. దివ్యసంస్కారాల ద్వారా శ్రీసభ విశ్వాసం వ్యక్తపరచబడును, దేవునకు ఆరాధన అర్పించబడును, మానవాళి శుద్దీకరింపబడును. దివ్యసంస్కారాలు క్రీస్తు ప్రభువు చేత స్థాపించబడినవి. దివ్యసంస్కారాల వలన విశ్వాసం బహిర్గత మవుతుంది, వృద్ధి చెందుతుంది, బపడుతుంది. అంతేగాక, విశ్వాసులు శుద్ధిగావింపబడుదురు. కృపావరంను ఒసగుట వలన, సద్గుణాలను వృద్ధిచేయుట వలన దివ్యసంస్కారాలు పవిత్రతను ఆర్జించును. విశ్వాసంతో దివ్యసంస్కారాలను స్వీకరించు వారికి నిత్య జీవితము వాగ్దానం చేయబడును.

    ‘దివ్యసంస్కారాలు కృపను ఒసగును’ అను విశ్వాసం దాదాపు మొదటి రెండు శతాబ్దాలనుండే ఉన్నది. ‘దివ్యసత్ప్రసాదము నిత్య జీవితంనకు ఔషధమని, పరిష్కారమని తద్వారా మనం మరణించాక ఎల్లకాలం యేసు క్రీస్తునందు జీవింతుమని, అలాగే దివ్యసంస్కారాను విశ్వాసంతో స్వీకరించువారికి అవి కేవలం నిత్యజీవితంను సూచించుటేగాక దానిని ఆర్జించి పెట్టును అని పునీత అంతియోకు ఇన్యాసిగారు తెలిపియున్నారు. జ్ఞానస్నానము పొందువారు పరిశుద్ధాత్మ ద్వారా ‘పునర్జన్మ’ను పొందెదరు అని పునీత అంబ్రోసుగారు తెలిపియున్నారు. దివ్యసంస్కారాులు దైవకృపావరంను సమర్ధవంతంగా ఒసగును అని పునీత అగస్టీనుగారు తెలిపియున్నారు. చిహ్నములైన సంస్కారాలు విశ్వసించువారి పరిశుద్ధత కొరకు దేవుని చేత మాత్రమే ఎన్నుకొనబడి, స్థాపించబడి, సరియైన అధ్యాత్మికమగు, అర్ధవంతమగు మాటచే అనుకరింపబడినవి అని పునీత తోమాసు అక్వినాసుగారు తెలిపియున్నారు. యేసు ప్రభువు స్వయంగా ఏడు దివ్యసంస్కారములను స్థాపించెనని, మన రక్షణకు తప్పనిసరియని, కృపను కల్గియున్నవని ‘ట్రెంటు మహా సభ’ (1545-1563) స్పష్టంగా పేర్కొన్నది.

    ‘రెండవ వాటికన్‌ మహాసభ’ దివ్యసంస్కారాల వేదాంతమును మూడు దశలుగా విభజించినది: సామూహిక దైవార్చన, క్రీస్తు రక్షణ కార్యము, దైవవ్యాక్యార్చనందు విశ్వాసము (పవిత్ర దైవార్చనా చట్టం, 5-12). దివ్యసంస్కారాల ప్రధానోద్దేశం విశ్వాసులను శుద్దీకరించడం... నిజానికి దివ్యసంస్కారాలన్నీ సహజంగానే విశ్వాసులకు దేవుని కృపావరాను ఆర్జించి పెడతాయి, కాని, దీనితోపాటు, దివ్యసంస్కారాలను ఆచరించడం ద్వారా విశ్వాసులు విశిష్టమైన కృపావరాలను స్వీకరించి ఆధ్యాత్మిక లబ్ధిని పొందగుగుతారు, త్రికణశుద్ధిగా దేవుని ఆరాధించ గలుగుతారు, ప్రేమ సేవాధర్మా ప్రకారం జీవించ గుగుతారు (పవిత్ర దైవార్చనా చట్టం, 59).

    దివ్యసంస్కారాలు శుద్దీకరణకు సాధనాలు, దైవీక అనుగ్రహాలకు మూలాలు. దివ్యసంస్కారా లద్వారా విశ్వాసులు కృపావరంను పొందు విధానం గూర్చి పునీత తోమాసు అక్వినాసు గారు వివరించియున్నారు. మానవుడు పాపపు స్థితిలో ఉన్నాడు కనుక ఆధ్యాత్మిక విషయాలను అవగతం చేసుకొనలేడు. కనుక దివ్యసంస్కారాలు మానవుని ఆధ్యాత్మిక విషయాలవైపు నడిపించును. ‘‘పాపముచేత గాయపడిన ఆత్మకు దివ్యసంస్కారాలు ఆధ్యాత్మిక ఔషధాలుగా ఉంటాయి.’’ పాపపుస్థితిలోనున్న మానవుడు దివ్యసంస్కారాల ద్వారా క్రీస్తుని కలుసుకొని, పాత (పాపపు) స్థితినుండి రక్షింపబడి ఆధ్యాత్మిక విషయాలను అవగతం చేసుకొనును. ఈ ‘కలయిక’ దివ్యసంస్కారాల బాహ్య సంకేతాల ద్వారా ఆపాదించు కృపానుగ్రహము వలన సాధ్యమగును. ‘‘ఈ దివ్యసంస్కారాల కృపానుగ్రహం పరిశుద్దాత్మచే కృమ్మరింపబడిన ప్రత్యకమైన దైవీక సహాయము. ఈ దైవీక సహాయము దివ్యసంస్కారాలచేత నిర్దేశింపబడిన ధ్యేయాన్ని ఆత్మ సాధించుటకు తోడ్పడును.’’ ఈ దివ్యసంస్కారాల కృపావర దివ్యశక్తి, క్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా (పాస్కా పరమ రహస్యం) భించును. ఇదియే మానవుడు దైవత్వములో పాలుపంచు కోవడం. దేవుడే స్వయంగా మానవునితో జీవమునొసగు బంధాన్ని ఏర్పరచుకోవడం. ఈ బంధానికి పునాది ప్రేమ. ఈ బంధంయొక్క ధ్యేయం దైవత్వం. మానవాళి దైవత్వంలో భాగస్థువటం దైవీక జీవిత పరిపూర్ణం.

No comments:

Post a Comment