నాలుక - మాట

నాలుక - మాట (Editorial, "Thamby Velugu" September, 2019)

మనం చేసే పాపాలో ‘అబద్ధాలు చెప్పడం’ ఒకటి. సత్యము పలుకుటకు బదులుగా, అబద్ధం చెప్పడానికే ఆసక్తిని చూపుతూ ఉంటాము. మన అవసరాలను బట్టి, పరిస్థితిని బట్టి, నిజాన్ని కూనీ చేస్తూ ఉంటాము. అనేకచోట్ల, అనేకసార్లు అసత్యమే సత్యముగా నిరూపించబడుతుంది, వాదించబడుతుంది, నిర్ణయించబడుతుంది. ఈరోజు నిజం చెప్పవసి వస్తుందేమోనని భయాడేవారు ఎందరో! మరోవైపు అబద్ధాలు చెప్పడం పాపం కాదని వాదించేవారు ఎందరో! అబద్ధాలు చెప్పడంలో తప్పేముందని వాదించేవారు ఎందరో!

పునీత పాద్రేపియోగారు ఇలా అంటున్నారు: ‘‘అబద్దాలాడటం, సాతాను నామమును స్మరించడమే!’’ అప్పుడు ఒకాయన, ‘ఫాదర్‌, చిన్న చిన్న అబద్ధాలు చెప్పవచ్చా?’ అని ప్రశ్నించగా, ‘‘చెప్పకూడదు’’ అని సమాధానమిచ్చాడు. ‘కాని ఫాదర్‌, వాటివల్ల ఎవరికీ హాని జరగటం లేదుకదా!’ అని ఆ వ్యక్తి అన్నప్పుడు, పియోగారు, ‘‘ఇతరుకు ఏ హాని కలుగకపోవచ్చు, కాని నీ ఆత్మకు తప్పక హాని కుగుతుంది. ఎందుకన, దేవుడు సత్యవాది’’ అని చెప్పారు. ఇది నిజమే కదా!

‘‘సైతాను అసత్యవాది. అసత్యమునకు తండ్రియై ఉన్నాడు’’ (యోహాను 8:44). మన అబద్దాకు, సాకుకు, ద్రోహాకు, సాతాను తండ్రి. వాటన్నింటికి కారకుడు సాతానే. ఈ వాస్తవాన్ని మనం గ్రహించినట్లయితే , పునీతులు సాతాను శక్తిని ఏవిధముగా జయించారో అర్ధమగుచున్నది.

అవునంటే అవును, కాదంటే కాదు (మత్తయి 5:37)
అసత్యమునుండి లాభపడుటకన్న, సత్యం కొరకు శ్రమ పాలుకావటమే మేలు. సైతానుతో సుఖంకన్నా, దేవునితో శ్రమలే మిన్న! దేవుడు సత్యవాది. సత్యమునకు వెలుగు. సైతాను అసత్యవాది, అంధకారము. పవిత్రమైన హృదయము ఎల్లప్పుడు వెలుగును విరజిమ్ముతుంది. అబద్ధాతో, అసత్యముతో నిండిన హృదయం చీకటితో ఉంటుంది. క్రైస్తవులు వెలుగునకు బిడ్డలుగా జీవింపవయును (యోహాను 12:36). మనం పలికే మాటలు సత్యమైనవిగా, నిజమైనవిగా ఉండవయునని క్రీస్తు ప్రభువు చెప్పియున్నారు: ‘‘మీరు చెప్పదచినది ‘ఔను’, ‘కాదు’ అనువానితో సరిపుచ్చవయును. అంతకు మించిన పలుకులు దుష్టునినుండి వచ్చునవే’’ (మత్తయి 5:37).

సత్యమును దాచి మోసపూరితముగా మాటలాడటం సాతానుయొక్క దుష్టకార్యము. ఆ సాతానే తన అసత్యపు మాటతో ఆదాము అవ్వను మోసం చేసింది (ఆ.కాం.3:17). ‘మోసపూరితమైన ఉద్దేశముతో సత్యమునకు విరుద్ధముగా మాటలాడుటయే’ అబద్ధము.

‘‘అబద్ద సాక్ష్యము పుకకుము’’ (లూకా 18:20). ఇది దేవుని ఆజ్ఞ. ఎలాంటి విపత్తు సమయములోనైనా, సత్యమునే పలుకవయును. ‘‘సత్యమేవ జయతే’’ అను నానుడి మనందరికీ తెలిసినదే! సత్యమును పలుకువారే అంతిమముగా విజయాన్ని సాధిస్తారు.

మోసపూరితమైన భాష
సత్యం చెప్పవసినప్పుడు, నిజాన్ని పకవసినప్పుడు, అవమానముకు లోనుకావసి ఉంటుంది. అయితే, సత్యము కొరకు క్రీస్తు ప్రభువు పొందిన శ్రమతో పోలిస్తే మన శ్రమలు చాలా చిన్నవే! ‘‘మన నాలుక ఒక చిన్న అవయవమే అయినను, తననుతాను పొగడుకొనుట యందు అది దిట్ట. నాలుక నిప్పు వంటిది. అదియొక దోష ప్రపంచము. దానికి నియము మన శరీరము. అది మన శరీరమంతను మలినము చేయును. మన జీవితము సర్వస్వమునకు అది నిప్పు పెట్టును. దానికి, ఆ అగ్నిజ్వా నరకము నుండియే ప్రాప్తించును. నాలుకను లోబరచుకొనిన మానవుడు ఎవ్వడును లేడు. అది విశ్రమింపని చెడుగు. ఘోర విషపూరితము...’’ (యాకోబు 3:5-10). నిజమే కదా! నాలుక చిన్న అవయవమైనప్పటికిని, ఎంతో భయానికి గురిచేయగదు. కనుక మన నాలుకను అదుపులో ఉంచుకోవాలి.

మన మాట (నాలుక)ద్వారా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాము. అందుకే ప్రభువు ఇలా అంటున్నారు: ‘‘తీర్పు దినమున ప్రతియొక్కడు తాను పలికిన ప్రతి వ్యర్ధమైన మాటకు సమాధానము ఇయ్యవసి యున్నదని నేను మీతో చెప్పుచున్నాను. నీ మాటను బట్టి నీవు దోషివో, నిర్దోషివో కాగవు’’ (మత్తయి 12:36-37). ‘‘మృదువుగా మాటలాడినచో కోపము చల్లారును. కటువుగా పలికినచో ఆగ్రహము హెచ్చును. విజ్ఞుడు జ్ఞానముపట్ల ఆకర్షణ కలుగునట్లు మాటలాడును. కాని, మూర్కుడు మూర్కతను ఒలుకుచు మాటలాడును. కరుణాపూరితముగా మాటలాడు జిహ్వ జీవవృక్షము వంటిది. కటువుగా మాటలాడు నాలుక హృదయమును వ్రయ్యలు చేయును’’ (సామెతు 15:1-2,4). ‘‘అబద్ధాలాడువాడు నాశనమై పోవును’’ (సొలోమోను జ్ఞానగ్రంధము 1:11).

సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంధములో నాలుకను గురించి ఇలా చెప్పబడినది: ‘‘నీ మాట వననే నీకు ఖ్యాతియు అపఖ్యాతి కూడా కలుగును నీ నాలుక వననే నీవు నాశనము తెచ్చుకొందువు. నీవు చాడీలు చెప్పుటలో దిట్టవనిపించుకోవదు. నీ నాలుకతో ఉచ్చు పన్నవద్దు. దొంగలు అవమానమునకు గురియైనట్లే, అసత్యవాదులు తీవ్ర నిందకు పాత్రుగుదురు. పెద్ద తప్పును చిన్న తప్పును కూడ మానుకొనుము’’ (5:13-15). ‘‘ఏనాడును తప్పుగా మాటలాడని నరుడు ధన్యుడు’’ (14:1). ‘‘నా నోటికెవరైన కావలియుండి విజ్ఞతతో నా పెదవును మూయించిన ఎంత బాగుండును! అప్పుడు నేను తప్పు చేయకుందును. నా జిహ్వ నన్ను నాశనము చేయకుండును’’ (22:27). ‘‘కత్తివాత పడి చాలా మంది చచ్చిరి. కాని నాలుక వాతబడి చచ్చిన వారు ఇంకా ఎక్కువ...నీ ప్రతీ పలుకును తక్కెడలో పెట్టి తూచుము. నీ నోటికి తలుపు పెట్టి గడె బిగింపుము. నీ నాలుక వల్లనే నీవు నాశనమై పోకుండునట్లు, నీ పతనమును ఆశించువాని ఎదుట నీవు వ్లెకి పడకుండునట్లు, జాగ్రత్త పడుము’’ (28:13-26).

నాలుక నిప్పు వంటిది (యాకోబు 3:6)
నాలుక నిప్పు వంటిది. చిన్న నిప్పురవ్వ పెద్ద అడవిని నాశనం చేయగదో, చిన్నదైన నాలుక మన శరీరమునంతను నాశనం చేయగదు. ‘‘దుష్టుడు ఇతరుకు కీడు చేయు మార్గమును వెదకును. అతని పలుకు కూడ నిప్పువలె కాల్చును’’ (సామెతు 16:27). నాలుకతో పొగడవచ్చు, అదే నాలుకతో శపించవచ్చు. నిప్పురవ్వలైన మాటతో ఇతరును నాశనం చేయకుండ మన నాలుకను అదుపులో ఉంచుకొనవయును. ‘‘నిప్పురవ్వ మీద ఊదినచో మంట లేచును. దానిమీద ఉమ్మివేసినచో అది ఆరిపోవును. ఈ రెండు క్రియను మనము నోటితోనే చేయుదము’’ (సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము 28:12).

‘నాలుక నిప్పు వంటిది’ అని చెప్పడానికి రెండు కారణాలు\ ఉన్నాయి. మొదటిది, మన మాటతో ఎంతటి వారినైనను, ఎంత దూరములో నున్నవారినైనను నాశనం చేయవచ్చు, అవమానపరచవచ్చు. జీవించడం, మరణించడం నాలుకపై ఆధారపడి ఉన్నది. రెండవది, ఏవిధముగనైతే నిప్పంటుకున్న అడవిని అదుపు చేయలేమో, ఒకసారి పలికిన మాటను అదుపుచేయడం అసాధ్యం.

నాలుక యొక దోష ప్రపంచము (యాకోబు 3:6)
నాలుక దోషప్రపంచాన్ని సూచిస్తుంది. నాలుక సాతానుకు, దాని క్రియకు అంకారముగా ఉంటుంది. నాలుక సాతానును ఆకర్షించగదు. మాటతో చెడ్డ విషయాను కూడా మంచి విషయాలుగా, అసత్యాన్ని సత్యముగా, అబద్ధాన్ని నిజముగా మార్చేయవచ్చు. మాట గారడితో మూర్కపు పనులు'ను ఒప్పుగా వాదించవచ్చు. మాటతో ఇతరును కూడా పాపం చేయడానికి లోపరచవచ్చు.

దోష ప్రపంచము గురించి బైఋ ఇలా చెబుతుంది: ‘‘లోకము సత్యస్వరూపియగు ఆత్మను ఎరుగదు’’ (యోహాను 14:17). ‘‘లోకము మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలిసికొనుడు...లోకము మిమ్ము ద్వేషించు చున్నది’’ (యోహాను 15:18-19). క్రీస్తు రాజ్యము ఈ లోకమునకు సంబంధించినది కాదు. ‘‘నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు’’ (యోహాను 18:36). పౌలుగారు ఈలోక జ్ఞానాన్ని త్రోసిపుచ్చుతున్నారు. (1 కొరి. 1:20). క్రైస్తవుడు ఈ లోకముతో తననుతాను పోల్చుకొనరాదు. ‘‘మీరు ఈ లోకపు ప్రమాణమును అనుసరింపకుడు’’ (రోమీ 12:2). దోష ప్రపంచమనగా దేవుడు లేని ప్రపంచము. ఎప్పుడయితే, మన నాలుక దోష ప్రపంచముగా మారుతుందో, అప్పుడు మనలో దేవుడు లేడని అర్ధము. అదుపులో లేని నాలుక దేవుడు లేని దోష ప్రపంచము. అప్పుడు నాలుక మనలో భాగమే కాని దేవున్ని విధేయించదు.

నాలుకను లోబరచుకొనిన మానవుడు ఎవ్వడును లేడు (యాకోబు 3:8)
సృష్టిలో సకలాన్ని మచ్చిక చేసుకొనవచ్చు (ఆది కాండము 1:26, 9:2, సీరా. 17:4, కీర్తన 8:6-8). కాని నాలుకను మచ్చిక చేసికొనిన వ్యక్తి, నాలుకను లోబరచిన వ్యక్తి ఎవ్వరును లేరు.

స్తుతించడం - శపించడం (యాకోబు 3:9-12)
ప్రతి మనిషిలో కూడా రెండు వ్యక్తిత్వాలు ఉంటాయి. ఈ విబేధ ప్రవర్తన మన నాలుక విషయములో స్పష్టముగా కనిపించును. ‘‘మన ప్రభువును, పితయునగు దేవుని స్తుతింతుము. కాని, ఆదేవుని ప్రతిరూపముగా సృజింపబడిన మనతోటి మానవును అదే నోటితో శపింతము’’ (3:9). అలా జరగకుండా ప్రయత్నం చేద్దాం. ‘‘నేను మరణింప వసి వచ్చినను మిమ్ము ఎరుగనని పలుకను’’ (మత్తయి 26:35) అని పలికిన పేతురు, అదే నోటితో ఆయన ఎవరో ఎరుగనే ఎరుగను అని బొంకాడు (మత్తయి 26:69-75).

మరియ మన ఆదర్శం
తన కుమారుని మాటన్నింటిని ఆమె మనస్సున పది పరచుకొని మననము చేసినది (లూకా 2:19). ఆమెను ఆదర్శముగా తీసుకొని జీవించుదాము. మన నాలుకను, మాటను పరిశుద్ధ పరచమని ప్రార్ధన చేద్దాం. అలాగే, ‘‘ఎవరును మిమ్ము వ్యర్ధపు మాటతో మోసపుచ్చకుండ చూచుకొనుడు’’ (ఎఫెసీ 5:6) అను పౌలుగారి మాటను గుర్తించుదాం.

No comments:

Post a Comment