అస్సీసిపుర ఫ్రాన్సిస్ - మానవాళికి సేవ (Editorial, "Thamby Velugu" October 2019)
మారుమనస్సు పొందక ముందు ఫ్రాన్సిస్, యోహాను (జాన్)గా పిలువబడినాడు. అస్సీసి పట్టణంలో (ఇటలి దేశం) ధనికుడైన బట్టల వ్యాపారి కుమారుడు. గొప్ప యోధుడిగా ఎదగాలని కలలు కన్న తను ఒక పోరాటంలో ఖైదీగా పట్టుబడి, ఒక సంవత్సరం పాటు చెరలో ఉంచబడ్డాడు. ఆరోగ్యం క్షీణించింది. ఈ సమయంలో తనలో ఎంతో మార్పు కలిగింది.. కుటుంబ ఆస్తినంతా కూడా త్యజించి, స్వచ్చంధ పేదరికంలో, క్రీస్తుకు నిజమైన శిష్యునిగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. దైవ పిలుపును అర్ధం చేసుకున్నాడు. తన జీవితాన్ని, సేవకు (సంఘంనుండి వెలివేసిన వారికి, పేదవారికి, కుష్ఠురోగులకు) అంకితం చేసుకున్నాడు. అస్సీసి పట్టణ ఆవల జీవిస్తూ ప్రార్ధించాడు, బోధించాడు, రోగులకు సేవ చేసాడు. కుష్ఠురోగుల సేవద్వారా తనలో ఆధ్యాత్మిక చింత పెరిగింది, తన మిషన్, ప్రేషిత సేవను, దేవుని చిత్తాన్ని తెలుసుకోగలిగాడు. కుష్టురోగులను ఆలింగనం చేసుకోవడం ద్వారా, సర్వమానవాళిని గౌరవించాలి, రక్షించాలి అని తెలుసుకున్నాడు. సకల సృష్టితో సహోదర భావంను పెంపొందించు కోవడం కూడా మెల్లమెల్లగా తెలుసుకోగలిగాడు.
తనకున్న ఈ వైఖరి తను ఎంచుకున్న శాంతి, అహింసా, సంభాషణ మార్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. 1219లో జరిగిన ఐదవ క్రూసేడు సమయంలో ఈజిప్టుకు పయనించి సుల్తానుని కలిసి శాంతి సందేశంను బోధించాడు.
త్వరలోనే అస్సీసిలో అనేక మంది మన్ననలను పొందాడు. తన పేద, ఆధ్యాత్మిక జీవితాన్ని చూసి ఎంతోమంది ఆయనను అనుసరించారు. ఈవిధంగా, చిన్న సహోదర సంఘం ఏర్పడిరది. ఫ్రాన్సిస్ తన స్వచ్చంధ పేదరికం, సహోదరభావం, సంఫీుభావం ద్వారా, లోకాన్నే మార్చివేసాడు.
ఫ్రాన్సిస్ అనుచరుడనగా ‘‘స్వచ్చంధ పేదరికం’’లో జీవించడం, సోదరునిగా జీవించడం, మానవ గౌరవాన్ని పెంపొందిచడం (పేదవారు, అణిచివేయబడినవారు, అన్యాయానికి గురైనవారు).
ఫ్రాన్సిస్‌వారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని, ఈనాడు ఎంతోమంది తమ జీవితాలను అంకితం చేసుకొని, ఫ్రాన్సిస్ వారి బాటలో నడుస్తూ, సేవా మార్గంలో జీవిస్తున్నారు. ఈనాడు ఫ్రాన్సిస్‌వారి అనుచరులు, స్వచ్చంధ పేదరికాన్ని జీవిస్తూ, ప్రపంచమంతటా తమ సేవను అందిస్తున్నారు. అలాగే, మానవ హక్కులను పరిరక్షిస్తున్నారు.
కతోలిక శ్రీసభలో అతిపెద్ద కుటుంబం ఫ్రాన్సిస్‌గారి కుటుంబము (పురుషులు, స్త్రీలతో కలిపి). ఫ్రాన్సిస్ కుటుంబము మూడు శాఖలుగా విభజింప బడినది:
మొదటి శాఖ మూడు సభలు:
- ఆర్డర్ అఫ్ ఫ్రైయర్స్ మైనర్ (OFM)
- ఆర్డర్ అఫ్ ఫ్రైయర్స్ మైనర్ కన్వెంచువల్స్ (OFM Conventuals)
- ఆర్డర్ అఫ్ ఫ్రైయర్స్ మైనర్ కపూచిన్స్ (OFM Capuchins)
రెండవ శాఖ పునీత క్లారమ్మ గారి సభ.
మూడవ శాఖ ఇతర ఫ్రాన్సిస్కన్ సభలు: థర్డ్ ఆర్డర్ రెగుర్ (TOR, (పురుషు, స్త్రీలు) మరియు సెక్యులర్ ఫ్రాన్సిస్కన్ ఆర్డర్ లేదా SFO (సాధారణ ప్రజల కొరకు).
No comments:
Post a Comment