దైవ సేవకుడు బ్రదర్ జోసఫ్ తంబి (Editorial, "Thamby Velugu" Jan 2019)
తంబిగారి భక్తులకు, ‘తంబి వెలుగు’ పాఠకులకు జనవరి మాసము రాగానే గుర్తుకు వచ్చేది, పెదావుటపల్లిలో జరిగే బ్రదర్ జోసఫ్‌తంబి గారి మూడురోజుల మహోత్సవములు (జనవరి 13,14,15). ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాష్ట్రాలనుండి ఎన్నో వేలమంది క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవేత్తరులు ఈ మహోత్సవములో పాలుగొని తంబిగారి మధ్యస్థ ప్రార్థనల ద్వారా, దైవాశీస్సులను, అనుగ్రహాలను, మేులులను, అద్భుతాలను, శాంతి, సమాధానములను పొంది సంతోషముతో తిరిగి వెళ్లుచున్నారు. వారి జీవితాలో జరిగిన అద్భుతాలకు, మేులులకు సాక్ష్యమిస్తూ ఉన్నారు.
దైవసేవకుడైన బ్రదర్ జోసఫ్ తంబిగారి జీవితంలో ఎన్నో ప్రత్యేకతులున్నాయి. అద్భుత వ్యక్తిగా పేరుగాంచాడు, ఆయన బ్రతికుండగానే ఎన్నో అద్భుతాలు చేసాడు, ఎంతో మందికి స్వస్థతను చేకూర్చాడు. వివిధ రాష్ట్రాలో(తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్) సువార్తను బోధించాడు, గ్రామగ్రామాలకు వెళ్ళి యేసు శుభవార్తను తనదైన శైలిలో బోధించాడు. ప్రజలతోనే ఉండి వారు ఇచ్చిన బోజనాన్ని భుజించేవాడు, ఇచ్చిన స్థములో నివాసముండెడివాడు.
పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి వలె పేదరికాన్ని హత్తుకొని జీవించాడు. ఫ్రాన్సిస్‌వలె పూర్తిగా దేవునిపై ఆధారపడి జీవించాడు. పేదవారిపట్ల ఎనలేని ఇష్టాన్ని కలిగియున్నాడు. తన జీవితాదర్శము ద్వారా, సువార్త ప్రచారాన్ని కొనసాగించాడు. ప్రజలను ప్రార్థనలో, దివ్యపూజా బలిలో పాల్గొనాలని ప్రోత్సహించాడు.
హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మారంపూడి జోజిగారు చెప్పినట్లుగా, ‘‘బ్రదర్ జోసఫ్ తంబిగారి వినయపూర్వక జీవితం, ఉత్సాహపూరిత ప్రేషిత కార్యం పెదావుటపల్లిలోను, చుట్టుప్రక్కల విచారణ గ్రామాలోని వట్లూరు, కేసరపల్లి, మానికొండ, ఉప్పులూరులోను ఆయన దైవాంకిత జీవితములో అత్యంత ప్రాముఖ్యమయిన అంశం ఏమిటంటే, మానవజాతికి ముఖ్యముగా పేదవారికి, నిస్సహాయులకు, వెనుకబడిన వారికి తన సేవను అందించడం.
ప్రార్థనా పరుడు: బ్రదర్ జోసఫ్ తంబిగారు గొప్ప ప్రార్థనాపరుడు. రాత్రింబవళ్ళు గంటల తరబడి మౌన ప్రార్థనలో గడిపెడివాడు. రాత్రిళ్ళు మోకాళ్ళూని ప్రార్థన చేసేవాడు. తన సువార్త ప్రచారములో కూడా ఎక్కడకు వెళ్ళినను స్లీవను తీసుకొని వెళ్ళేవాడు. ప్రజలను ఇంటి వద్ద గాని, గుడిలోగాని కలిసి ప్రార్థన చేయుటకు ఆహ్వానించేవాడు. ఆయనే స్వయముగా ప్రార్థన కూటాన్ని నడిపించేవాడు.
తన ప్రార్థనలో ఎక్కువగా పరలోక తండ్రి దేవుని దయార్ధ్ర హృదయాన్ని, ప్రేమను ధ్యానించేవాడు. అందరిని గౌరవించేవాడు. అందరూ ఒకే దేవుని పోలికలో సృజింపబడినారని ప్రతీ ఒక్కరు దేవుని ప్రతిబింబాన్ని కలిగియున్నారని దృఢముగా విశ్వసించేవాడు. ఆయన హృదయం యేసుపై నాటుకొని పోయింది. తన ప్రేమనంతా సిలువలో మరణించిన యేసుపై చూపి ఆయన సహవాసములో ఉండెడివాడు. క్రీస్తు పొందిన శ్రమలను తానుపొంది, క్రీస్తు శ్రమలకు ఉపశమనాన్ని కలిగించాలనే ఆయన ఆత్మ ఎంతగానో ఆరాటపడేది. అందుకే ఆయన పంచగాయాలాను పొంది, క్రీస్తు శ్రమలలో భాగస్థులైనాడు.
తను ప్రార్థనలో పొందిన దైవ శక్తితో ఇతరును కూడా ఆధ్యాత్మికముగా ఎదుగుటకు ప్రేమకే రూపమైన క్రీస్తులో జీవించుటకు సహాయము చేసెడివాడు. తను పవిత్రతలో ఎదుగుతూ ఇతరులను పవిత్ర జీవితములోనికి నడిపించాడు. యువతీ యువకులను సన్మార్గములో నడిపించడానికి ఎంతో శ్రద్ధను, ఆసక్తిని చూపించాడు. ఆయన ప్రార్థన జీవితము పశ్చాత్తాపము తపస్సుతో బలపడినది. ఇది నిజముగా ఆయనను ఆధ్యాత్మిక మనిషిగా, దేవుని మనిషిగా జీవించుటకు తోడ్పడినది.
ఆయన ప్రార్ధన జీవితం ఒకే ఒక ఆశతో కొనసాగింది. అదే ప్రియ ప్రభునిలో ఎదగడం. వెనుతిరిగి చూడక, ఎ్లప్పుడూ దేవుడు చూపించిన బాటలో కొనసాగుతూ పరిపూర్ణత మార్గములో ముందుకు సాగిపోయేవాడు.
దివ్యపూజా బలి అనగా తంబిగారికి ఎనలేని భక్తి అలాగే మరియతల్లి యెడల, జపమాలయనిన తంబిగారికి ఎనలేని భక్తి, విశ్వాసం. ఆయన ప్రార్థన జీవితములో ఇవి విడదీయరానివి. తనతో ఎప్పుడూ ఒక శిలువను తీసుకొని వెళ్తూ ఉండేవాడు. జపమాలను ధరించేవాడు. వీనిని ఎల్లప్పుడూ ధరించి, ఎక్కడికి వెళ్ళినను తీసుకొని వెళ్ళెడివాడు. తన జీవితమంతా కూడా ప్రజలను ఎ్లప్పుడూ దివ్యపూజా బలిలో పాల్గొనడానికి నడిపించెడివాడు. వారితో కలిసి జపమాలను ప్రార్ధించేవాడు.
స్వస్ధతా పరుడు: తంబిగారు ప్రత్యేకమయిన దేవుని స్వస్ధతా వరమును పొందియున్నాడని అవుటపల్లి చుట్టుప్రక్కల ప్రతీ ఒక్కరికి తెలిసిన సత్యమే, వాస్తవమే! కొన్ని ఆకులు, అలములతో వైద్యం చేస్తూ స్వస్థత పరచేవాడు. కొన్నిసార్లు గుంపులుగుంపులుగా ప్రజలు స్వస్థతను పొందుటకు తను నివసిస్తున్న గృహానికి వచ్చెడివారు. ఎక్కువగా శుక్రవారం వచ్చెడివారు. ఎందుకన, ప్రతీ శుక్రవారం తంబిగారు క్రీస్తు పంచగాయాను పొందెడివాడు, కనుక, ఎక్కడికి వెళ్ళక తన గృహములోనే ఉండెడివాడు. లేనిచో, వారిపై జాలితో దయార్ధ్ర హృదయముతో తానే స్వయముగా తన గృహానికి ఆహ్వానించెడివాడు. ఒకసారి కాలుకు లోతైన గాయముతో మూడు సంవత్సరములు బాధపడుచున్న వ్యక్తిని, తన చేతును రొమ్ముపై ఉంచి, కన్నులెత్తి తీక్షణముగా ప్రార్థన చేసి స్వస్థతను చేకూర్చాడు. ఇలా అనేకమైన స్వస్థతను, అద్భుతాను తంబిగారు చేసియున్నారు. ఆయన మరణానంతరం కూడా, మధ్యస్థ ప్రార్థన ద్వారా పొందిన స్వస్థతగూర్చి చాలామంది సాక్ష్యమిచ్చియున్నారు.
హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మారంపూడి జోజిగారు ఇలా సాక్ష్యమిచ్చి యున్నారు, ‘‘1984-85 సంవత్సరములో ఎముక క్యాన్సర్‌తో భరించలేని బాధకు లోనైయ్యాను. ఎంతో మంది వైద్యులను సంప్రదించి, ఎన్నో మందులను వాడినప్పటికిని, ఆరోగ్యం మెరుగుపడలేదు, నొప్పి తగ్గలేదు. ఆ సమయములో స్వస్థత కొరకు, తంబిగారి ప్రార్థన సహాయాన్ని కోరియున్నాను. ఆ తర్వాత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నాను. వైద్యమునకు నా శరీరం ఎంతగానో సహకరించింది. తంబిగారి ప్రార్ధనవలన, స్వస్ధత వరము వలన, నేను నా వ్యాధి నుండి, బాధనుండి పూర్తిగా స్వస్ధుడనైతినని విశ్వసిస్తున్నాను.’’
దర్శనకారి, ప్రవక్త: బ్రదర్ జోసఫ్ తంబిగారు, రెండవ ప్రపంచయుద్ధములో జరుగుచున్న వాస్తవాలను ఉన్నవి ఉన్నట్లుగా చెప్పెడివాడు. ఆయన ప్రవచించిన విషయాలు మరునాడు వార్తా పత్రికలో ప్రచురింపబడేవి. మరణావస్ధలోనున్న ఒక బాలుని గురించి ‘ఏమీ కాదు, బ్రతుకుతాడు’ అని చెప్పియున్నాడు. పెదావుటపల్లి గ్రామములో అగ్ని ప్రమాదం జరుగునని ముందుగానే చెప్పియున్నాడు. తాను ముందుగానే ప్రవచించిన వాటిలో ప్రాముఖ్యముగా చెప్పుకొనవసినది తన మరణం గూర్చి తాను ముందుగానే చెప్పడం, తన మరణానికి కొన్ని నెలలు ముందుగానే తన శవపేటికను ఏర్పాటు చేసుకొన్నాడు. ఏ రోజు మరణిస్తాడో కూడా ప్రవచించియున్నాడు. ఆ శవ పేటికను తన గదిలోనే ఉంచుకొని, దానిలో పడుకొని మరణము గూర్చి ధ్యానించేవాడు. పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌వారు మరణమును సహోదరి అని సంబోధిస్తూ ఆహ్వానించిన విధముగా, బ్రదర్ జోసఫ్ తంబిగారు మరణం కొరకు సంసిద్ధపడినాడు. ఎంతో సంతోషముగా, నిశ్చమైన హృదయముతో మరణాన్ని స్వాగతించాడు.
మరణం, భూస్ధాపితం: తను ప్రవచించిన విధముననే 15జనవరి 1945వ సంవత్సరములో తంబిగారు తుదిశ్వాసను విడచినారు. మరణానికి ముందుకూడా, గ్రామాకు వెళ్ళి, ప్రజలను కలిసి, సువార్త ప్రచారాన్ని చేసాడు. 6 జనవరి 1945న అస్వస్థతతో పెదావుటపల్లికి తిరిగివచ్చాడు. ఆ రోజునుండి కూడా మంచములోనే ఉండిపోయాడు. ఆ దినాలలో కేవలం నీళ్ళు, డికాషిన్ మాత్రమే త్రాగెడివాడు. 14 జనవరిన అతని పరిస్థితి విషమించినది. 15 జనవరి ఉదయం లింగతోటి శిఖామణి గారి సహాయముతో దేవాలయమును వెళ్ళి ప్రార్ధన చేసుకున్నాడు. విచారణ గురువుయిన ఫాదర్ జె.బి. కల్దిరారో గారిని కలిసి అవస్ధ అభ్యంగమును ఇవ్వమని కోరాడు. కాని విచారణకర్తలు, తంబిగారు ఆరోగ్యముగానే ఉన్నాడని భావించి అవస్ధ అభ్యంగమును ఇవ్వలేదు. ఆ తర్వాత, తంబిగారు పెదావుటపల్లి గ్రామములో, తన సువార్త ప్రచారము ద్వారా జ్ఞానస్నానమును పొందిన బోయపాటి ఫ్రాన్సిస్, క్లారమ్మ గృహానికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే సరాసరి తన స్వహస్తాలతో నిర్మించిన పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ పీఠము వద్దకు వెళ్ళియున్నాడు. ఆరోజే తను మరణిస్తాడని చెప్పియున్నందున అనేకమంది తంబిగారిని చూడటానికి వచ్చియున్నారు. అందరిలో భయం, ఆందోళన! శ్వాసను గట్టిగా తీసుకుంటూ, శక్తిని కూడదీసుకుని అక్కడనున్న వారితో, ‘‘తండ్రికుడి ప్రక్కన కూర్చొనియున్న మహిమగల క్రీస్తు ప్రభువు చెంతకు వెళ్ళుచున్నాను. నేను మీ అందరికోసం ప్రార్థన చేస్తాను. తన ప్రాణాలను అర్పించిన క్రీస్తు మిమ్మును ప్రేమిస్తూ ఉన్నాడని మరువరాదు. ఆయన మిమ్మును బాగుగా చూసుకునే మంచికాపరి. కాబట్టి, భవిష్యత్తుగూర్చి చింతించవద్దు. ఆయన నిన్న, నేడు, ఎల్లప్పుడు ఒక్కటే! దేవుడు తన జ్ఞానముతో మిమ్మును కాపాడును. ఆయన వరమును మీ కొసగును. నన్ను తన సాధనముగా వాడుకొనును. కనుక, నేను వెళ్ళినను, దేవుని ఆశీర్వాదము కొరకు మీ అందరికోసం ప్రార్థిస్తూ ఉంటాను’’ అని బలహీన స్వరముతో వారికి వీడ్కోలు చెప్పియున్నారు. సాయంత్రం 5 గంటలకు బ్రదర్ జోసఫ్ తంబిగారు తుదిశ్వాస విడచినారు. వార్తను తెలుసుకున్న విచారణ గురువు వచ్చి అభ్యంగము ఇచ్చియున్నారు.
ఆ తరువాత, ఆయన భౌతిక కాయమును విచారణ దేవాలయమునకు ప్రక్కగానున్న తన గృహమునకు చేర్చారు. తాను స్వయముగా ఏర్పాటు చేసుకున్న శపపేటికలో ఉంచారు. తంబిగారి మరణవార్త వినగానే అనేకమంది అవుటపల్లి గ్రామస్థుల, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, తమ ఆధ్యాత్మిక తండ్రి చివరి చూపు కొరకు అచ్చట గుమికూడారు.
మరుసటి రోజు 16 జనవరి 1945 పూజానంతంరం, సమాధుల స్ధములో ఆయనను భూస్ధాపితం చేసారు. భూస్ధాపిత కార్యక్రమములో అనేకమంది క్రైస్తవేత్తరులు కూడా పాల్గొని యున్నారు.
ప్రేమమూర్తి, శాంతి స్థాపకుడు: తంబిగారు ప్రేమమూర్తి, అందరిని గౌరవించేవాడు. అందరితో ఎంతో సవ్యముగా మాట్లాడేవాడు. ఎప్పుడు ఎవరిమీద, దేనికోసం, ఫిర్యాదు చేయలేదు. అతను నిరాడంబరి. ఎంతో ప్రేమ కలిగి జీవించాడు. పేదవారు, ఆడపిల్లలు చదువుకోవాని ఆశించాడు. తను పేదరికములో నున్నప్పటికిని, తను స్వీకరించిన వాటిని పేదలకు, పిల్లలకు పంచేవాడు. వారికి సహాయం చేయుటకు భిక్షాటన కూడా చేసేవాడు. ఇలా తంబిగారి జీవితమంతయు కూడా దైవసేవకు, మానవసేవకు అంకితం చేయబడినది. అందరిని సమానంగా ఆదరించాడు. గ్రామ గ్రామాలకు వెళ్ళి తన ప్రేమను పంచాడు.
తంబిగారు ఎప్పుడూ ప్రశాంతముగా ఉండేవాడు. గ్రామాలలో ప్రజలమధ్య శాంతిని నెలకొల్పేవాడు. ప్రజలు ఆయనను ఎంతగానో గౌరవించేవారు.
ప్రాయశ్చిత్తము, వినమ్రత: తంబిగారి ప్రాయశ్చిత్త జీవితములో ప్రాముఖ్యమైనది, తనను తాను ఇష్టపూర్తిగా దేవునికి అర్పించుకోవటం. పంచగాయాలను పొంది క్రీస్తు శ్రమలో పాలుపంచుకున్నాడు. సువార్త ప్రచారానికి అనేక మైళ్ళు నడచి వెళ్ళేవాడు. ఉపవాసము చేసేవాడు. ఎంతో వినయముగా ఉండెడివాడు. తనను తప్పుగా అర్ధంచేసుకున్నప్పుడు, అవమానించినప్పుడు ఎంతో ఓర్పుగా ఉండెడివాడు. ఆయన వేషధారణ చూసి పిల్లలు పిచ్చివాడని పిలిచేవారు. రాళ్ళు విసిరేవారు. వాటన్నింటిని ఓపికగా భరించేవాడు. పాపములో జీవిస్తున్నారని, మారు మనస్సు పొందాలని వినయముగా వేడుకొనెడివాడు. పాపసంకీర్తనం చేసి దివ్యపూజా బలిలో పాల్గొనాలని చెప్పెడివాడు.
చిన్న పిల్లలనగా ఎనలేని ప్రేమ: బ్రదర్ జోసఫ్ తంబిగారు చిన్న పిల్లలతో ఎంతో ప్రేమగా, అప్యాయముగా ఉండెడివాడు, వారితో ఎంతో ఓపికగా, సహనంగా ఉండెడివాడు. వారికి ప్రార్థనను, జపమాలను నేర్పించెడివాడు. పిల్లలు ఆయనను అవమానించినను, పిచ్చివాడంటూ ఆయనపై రాళ్ళు విసిరినను, కోపగించక వారిని ప్రేమతో చేరదీసేవాడు.
పవిత్ర జీవితం, కీర్తి: మరణించిన కొద్ది కాలానికే ప్రజలు ఆయనను పునీతునిగా గుర్తించారు. భక్తులు ఆయన సమాధిని సందర్శించడం ప్రారంభించారు. ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని వేడుకొనెడివారు. అనేకమంది ఆయన ప్రార్థన ద్వారా ఎన్నో మేలులను పొందియున్నారు. ఇప్పటి వరకు వేలమంది భక్తులు ఆయన సమాధిని సందర్శించి, ప్రార్ధను చేసి ఎన్నో మేలులను పొందియున్నారు. ప్రతీ సంవత్సరము తంబిగారి మహోత్సవములు జనవరి 13,14,15 తారీఖులో నిర్వహింపబడుచున్నాయి.
ముగింపు: నవంబర్ 11,1890 వ సంవత్సరములో తమిళనాడు, పాండిచ్చేరిలోని కరైకల్ అనే గ్రామమునకు చెందిన శవరిముత్తు, అన్నమలై దంపతులకు సైగోన్ (ఫ్రెంచి కానీ) అను ప్రాంతములో జన్మించారు. తన ఏడవ యేటనే తల్లిని కోల్పోయాడు. 1902 వ సంవత్సరములో దివ్య సత్ప్రసాదమును, భధ్రమైన అభ్యంగమును స్వీకరించాడు. అదే సంవత్సరములో ఇంటిని విడచి కేరళ రాష్ట్రమునకు వెళ్ళి అక్కడ ఒక భక్తురాలి దగ్గర పెరిగి, విద్యను అభ్యసించాడు. 1915 వ సంవత్సరములో సన్యాస జీవితమును జీవించుటకు పయణమయ్యాడు.
1931 వ సంవత్సరములో కపూచిన్ సభలో చేరియున్నాడు. అచ్చట పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారి తృతీయ సభకు చెందిన అంగీని స్వీకరించాడు. 1933వ సంవత్సరములో నొవిషియేటులో చేరకముందు అనారోగ్యము కారణముగా, కపూచిన్ సభను వీడాల్సి వచ్చినది. అయినప్పటికిని, తృతీయ సభ అంగీని ధరించడం కొనసాగించాడు. 1936 వ సంవత్సరము వరకు కేరళ, తమిళనాడు రాష్ట్రాలో సువార్త ప్రచారం చేసాడు. 1937వ సంవత్సరములో ఆంధ్రప్రదేశ్‌లోని బిట్రగుంట ప్రాంతములోని, విజయవాడ దగ్గర కేసరపల్లి గ్రామములో సువార్త ప్రచారం చేసాడు. 1939వ సంవత్సరములో తంబిగారు పెదావుటపల్లి గ్రామములో విచారణ ప్రాంగణములోని ఒక చిన్న గృహములో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అచ్చటనే తన మరణమువరకు జీవించాడు. 24 జూన్ 2007 వ సంవత్సరమున తంబిగారు ‘‘దైవసేవకుడు’’గా ప్రకటింపబడియున్నారు.

No comments:
Post a Comment