యేసు-సమరీయ స్త్రీ తో - మన ప్రయాణం

యేసు-సమరీయ స్త్రీ తో - మన ప్రయాణం

    యేసు యెరూషలేము దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బు మార్చువారిని వెడలగొట్టి, దేవాలయమును శుభ్రపరచిన తరువాత, యెరూషలేములో అనేక అద్భుతములను చేసియున్నారు. పాపము అనే పాముకాటుకు బాధపడుచున్నవారి కొరకు మరణించుటకు వచ్చియున్నానని యేసు నికోదేముతో పలికియున్నాడు (యోహాను 3:14-17). యేసును నిరాకరించిన యెరూషలేము పట్టణమును వీడి అన్యులు నివాసముండే గలిలీయ ప్రాంతమునకు ప్రయాణమయ్యాడు. యూదయా సీమనుండి, గలిలీయ సీమకు ‘పెరీర’ అనే ప్రాంతముగుండా మార్గము ఉన్నది. అన్యులు నివసించే ప్రాంతమును తప్పించుకొనుటకు యూదులు ఈ మార్గమునే ఎన్నుకొనెడివారు (యూదులు అన్యును అసహ్యించు కొనెడివారు). కాని, యేసు ఆ మార్గమును ఎన్నుకొనలేదు. అన్యులు వసించే ప్రదేశాలగుండా తన ప్రయాణాన్ని కొనసాగించాడు (దీని పరమార్ధం: యేసు నిర్మింపబోయే దేవాయం లేదా శ్రీసభ అన్ని దేశమువారికి వర్తిస్తుంది. ఆయన ఈ లోకమునకు, అన్ని మతమువారి కొరకు అంకితమై సేవచేయడానికి, రక్షించడానికి వచ్చియున్నాడు).

    ‘‘ఆయన సమరియా మీదుగా వెళ్ళవసి యుండెను’’ (4:4). క్రీస్తు మరణము, రక్షణము తప్పని సరియని సువిశేషము బోధిస్తున్నది. సమరియాలో జరిగిన సంఘటనన్ని కూడా యేసు జీవితం, బాధతో కూడి మానవాళికి అంకితం చేయబడినదని తెలియజేస్తున్నాయి. యూదయా, గలిలీయ ప్రాంతమును వేరుపరచేది సమరియా ప్రాంతము. సమరీయులు పూర్తిగా అన్యులు కారు, అలాగని పూర్తిగా యూదులు కూడా కాదు. అస్సీరియా బానిసత్వములోనున్నప్పుడు, సమరియా జాతి ఉద్భవించినది. సమరీయు మోషే వ్రాసిన ఐదు గ్రంధమును విశ్వసించెడివారు. అనేకమైన ఇతర పూర్వనిభందన గ్రంధమును నిరాకరించారు. ఎందుకనగా, అవి ఎక్కువగా యూదుగూర్చి ప్రస్తావిస్తున్నాయి. యూదులు ఆరాధించెడి స్థము యెరూషలేము అయితే, సమరీయులు ‘గిరిజిమ్‌, అనే పర్వతముపై ఆరాధన చేసేడివారు (4:20).

    యూదులు సమరీయ అనే పదమును ఉచ్చరించెడివారు కాదు. ఎందుకన, సమరియానుగాని, సమరీయునుగాని వారు మిక్కిలిగా ద్వేషించెడివారు. ఎవరినైనా అవమానించానిగాని, కించపరచానిగాని అనుకొన్నప్పుడు, వారిని ‘సమరీయులు’ అని సంబోధించెడివారు.

    యేసు ప్రభువు ఎప్పుడుకూడా సమరీయును నిర్లక్ష్యం చేయలేదు. వారినుండి దూరముగా పారిపోలేదు. వారిని ఎన్నడు అవమానింపలేదు, కించపరచలేదు. ఆయన సర్వమానవాళి రక్షకుడు. సక సృష్టికి మూలాధారము. అందరిపై తన అనంతమైన ప్రేమను చూపించాడు.

    యేసు సమరియాలోని సిఖారు అను పట్టణమునకు వచ్చెను. అది యాకోబు తన కుమారుడగు యోసేపునకు ఇచ్చిన పొము సమీపములో ఉన్నది. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణపు బడలికచే ఆ బావి వద్ద కూర్చుండెను. అది మధ్యాహ్నపు వేళ. ఆ సమయములో ఒక సమరీయ స్త్రీ నీటి కొరకు అక్కడకు వచ్చియున్నది (4:5-7). యేసు సర్వజ్ఞుడు. వెమ్మటే ఆమె హృదయాన్ని చవిచూచాడు. యేసు ప్రయాణపు బడలికచే ఉన్నప్పటికిని, ఆమెతో ఓపికగా మాట్లాడి, తను ఎవరో తెలియజేసి, దైవరాజ్యంగూర్చి ఆమెకు బోధించాడు. ఆమె జీవితాన్ని చక్కబరచాడు.

    ఒక స్త్రీ నీటి కొరకు మిట్ట మధ్యాహ్నం బావి వద్దకు రావడం సాధారణముగా జరిగే సంఘటన కాదు. అదే సమయములో ఇది ఉద్దేశపూర్వకముగా జరిగిన సంఘటనకూడా కాదు. సమరీయ స్త్రీ, యేసును చూడానే తలంపుతో అచ్చటకు రాలేదు. తను లోకరక్షకుడిని చూస్తానని కలోకూడా భావించకపోయి ఉండవచ్చు. ఇదంతయు కూడా దేవుని చిత్తమని గుర్తించాలి. దేవునికి తెలియకుండా ఏదీ జరగదు. దేవుడు ఎప్పుడు కూడా తన వారికోసం వెదకుతూ వస్తూ ఉంటాడు. ‘‘నేను ప్రజ మనవును ఆలించుటకు సిద్ధముగనే ఉన్నాను. నేను వారికి దర్శనమీయ గోరితిని’’ (యెషయ 65:1). ఉదాహరణకు, జక్కయ్య ఎప్పుడు ప్రభువును వెదకలేదు. ప్రభువే అతన్ని కనుగొన్నాడు. పౌలును కూడా ప్రభువే కనుగొన్నాడు. ‘‘నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడును నా యొద్దకు రాలేడు’’ (యోహాను 6:44).

    సమరీయ స్త్రీ యేసును చూచిన వెంటనే, తన కడవను నింపుకొని త్వరగా అక్కడనుండి వెడలి పోవాని భావించి ఉంటుంది. ఎందుకన, యేసును ఒక యూదునిగా గుర్తించింది. యూదుకు, సమరీయుకు ఎట్టి పొత్తులేదు (4:9). కాని, ఆమె ఆశ్చర్యపడునట్లుగా, యేసు ఆమెను నీరిమ్మని కోరాడు.

    ‘‘నాకు త్రాగుటకు నీరు ఇమ్ము’’ (4:7). యేసు ప్రతీసారి ఇతరుకు ఉపకారము చేయుటకు ముందుగా, ఒక ప్రశ్నతో తన సంభాషణను ప్రారంభిస్తాడు. ఆ ప్రశ్న అర్ధించెడిది కాదు. అది విన్నపముతో కూడినదై ఉంటుంది. ‘‘త్రాగుటకు నీరిమ్ము’’ అని విన్నవించుకున్నాడు. మన దగ్గర ఏదైన లేనియెడ ఇతరును అడుగుతాము. ఇక్కడ, దేవుడు మానవున్ని నింపడానికి, కరుణించడానికి, తననుతాను ఏమిలేనివానిగా చేసుకున్నాడు. యేసు నీరిమ్మని కోరినప్పుడు, ఆ స్త్రీ తన ఆశ్చర్యాన్ని ఇలా వ్యక్తపరచినది: ‘‘యూదుడవైన నీవు సమరీయ స్త్రీనగు నన్ను నీరు ఇమ్మని ఎట్లు అడుగుచున్నావు? (4:9).

    వారిరువురి మధ్య జరిగిన సంభాషణలో ఆధ్యాత్మిక ప్రగతి చిగురించినది. ఎందుకన, తర్వాత, ఆ యూదుడు క్రీస్తు అని, రక్షకుడని ఆమె తెలుసుకున్నది. ఆయన తీసుకొనువాడు కాదని, ఇచ్చువాడని ఆమె గ్రహించినది. ఆయన తన సహాయం కోరి రాలేదని, తనే ఆయన సహాయం అవసరమైయున్నదని ఆమె తెలుసుకున్నది.

    ‘‘నీవు దేవుని వరమును గ్రహించియున్న యెడ ‘త్రాగుటకు నీరు ఇమ్ము’ అని అడుగుచున్నది ఎవరు అని తెలుసుకొని ఉన్న యెడ, నీవే ఆయనను అడిగి ఉండెడి దానవు. అపుడు ఆయన నీకు జీవజమును ఇచ్చి ఉండెడివాడు’’ (4:10).

    యేసు మానవాళి అవసరమును తీర్చువాడు. అందరి హృదయావసరాను ఎరిగియున్నవాడు. ఆస్త్రీ జీవజలావసరముతో నుండుటచేత, తననుతాను నీరుగా వ్యక్తపరచాడు. దాహముతోనున్నాను, త్రాగుటకు నీరిమ్మని కోరాడు. ఎవరైన జీవాహారావసరముతో ఉన్నయెడ తననుతాను ఆహారముగా వ్యక్తపరచు గొప్ప దేవుడు ఆయన. తను దేవుని నుండి వచ్చిన మానవాళికి వరమునని చెప్పియున్నప్పటికినీ, ఆ స్త్రీ, యేసుని ఒక యూదునిగా, ఒక బాటసారిగా, ప్రయాణపు బడలికచే, అలిసిపోయిన ప్రయాణికుడిగా మాత్రమే గుర్తించినది. ఆయనలో నున్న దైవస్వభావమును, దైవస్వరూపమును ఆమె చవిచూడలేక పోయింది. ఆమె ఒక యూదున్ని మాత్రమే చూసింది కాని, దేవుని కుమారున్ని చూడలేక పోయింది. అసిపోయిన వానిగా గుర్తించినది కాని అసి సొసియున్న సమస్త జనుకు ఊరట నిచ్చువాడని ఆ క్షణాన గుర్తించలేక పోయింది. దాహముతోనున్న ప్రయాణికునిగా గుర్తించింది కాని, ఈలోక దాహమును తీర్చువాడని, జీవజము నొసగువాడని ఆ క్షణాన గుర్తించలేక పోయింది. ఇహలోక మోహముతో, కార్యముతో, ఆలోచనతో మునిగి తేలెడివారు, ఆధ్యాత్మిక సంపదను, పరలోక సంపదను తెలుసుకోలేరు. అయితే, చివరికి ఎలాగో ఆయనపై ఈవిధముగా గౌరవాన్ని వ్యక్తపరచింది: ‘‘అయ్యా! ఈ బావి లోతైనది. నీరు చేదుటకు నీయొద్ద ఏమియు లేదు. జీవజమును నీవు ఎక్కడనుండి తెచ్చెదవు? మా పితరుడగు యాకోబు మాకు ఈ బావిని ఇచ్చెను. అతడు, అతని కుమారులు, ఈ బావి నీటిని త్రాగిరి. నీవు అతని కంటె గొప్పవాడవా?’’ (4:11-12).

    ఇప్పుడు ఆ స్త్రీ యేసుని యూదుడని పిలువక ‘‘అయ్యా!’’ అని సంభోదించినది. యేసు చెప్పినది అర్ధం కానప్పటికిని, ఆయన పలుకుపై అనుమానాన్ని వ్యక్తపరచింది. ఆ బావిని ఇచ్చిన యాకోబును, ఆయన కుమారును, సమరియులందరిని భంగపరుస్తున్నాడని తంచినది. ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానముగా, తను యాకోబుకన్నా గొప్పవాడని చెప్పాడు.

    ‘‘ఈ నీటిని త్రాగువాడు మర దప్పిక గొనును. కాని నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికిని దప్పిక గొనడు నేను ఇచ్చు నీరు వానియందు నిత్యజీవమునకై ఊరెడి నీటి బుగ్గగా ఉండును’’ (4:13,14). యేసు ఇచ్చట తన జీవిత తత్వాన్ని వ్యక్తపరచాడు. మానవుని ప్రతీ శరీర కోరిక ఒక లోపాన్ని కలిగి ఉంటుంది. అదేమనగా, ఆ కోరికు శాశ్వతమైన సంతృప్తిని ఇవ్వవు. ప్రస్తుత అవసరాన్ని తీర్చుటకు మాత్రమే తోడ్పడతాయి. కాని, శాశ్వతముగా ఉపశమనాన్ని కలుగజేయవు. కొంత సమయము తరువాత ఆ కోరికలు మర కలుగుతాయి. ఈ లోక జము మర దప్పికగొనునట్లు చేయును. కాని, యేసు ప్రభువు ఒసగే జీవజము వన ఎప్పటికిని దాహము గొనము. మన ప్రభువు ఈలోక కోరికనుండి, పాపపు సంకెళ్ళనుండి శాశ్వతముగా నిర్మూలించుటకు వచ్చియున్నాడు. ఈ లోకమును మంచి లోకముగా తీర్చిదిద్దుటకు పూనుకున్నాడు. అయినప్పటికిని, ఈ లోకములో ప్రవహించే జలాను ఆయన ఖండించలేదు. ఒకవేళ ఆ స్త్రీ ఈ లోకపు నీటిపై మాత్రమే ఆధారపడినచో, శాశ్వతమైన సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించలేదని ప్రభువు ఉద్దేశం! అయితే ఆ స్త్రీ యేసు ఉద్దేశాన్ని అర్ధం చేసుకోకుండా, యేసును ఈ విధముగా అడుగుచున్నది: ‘‘అయ్యా! నేను మర దప్పికగొనకుండునట్లును, నీటికై ఇక్కడకు రాకుండునట్లును నాకు ఆ నీటిని ఇమ్ము’’ (4:15).

    యేసును ఆమె ఇక యూదునిగా మాత్రమే పరిగణింపలేదు. ఆయనను ఇప్పుడు ‘అయ్యా’ అని సంబోధిస్తున్నది. అయితే ఇప్పటికి కూడా ఆమెలోని అనుమానాలు తీరలేదు. ఆమె ఇక నీటికొరకు బావి దగ్గరకు రాకుండా శాశ్వతముగా శారీరక దాహమును తీర్చు నీటిని ఇస్తాడని ఆశపడుతూ ఉంది. కాని, ప్రభువు ఆధ్యాత్మిక దాహముగూర్చి ప్రస్తావించియున్నాడు. ఆమె హృదయపు ద్వారము పాపముతో కూడుకొని యున్నందువన, ఆధ్యాత్మిక జీవజమును అర్ధం చేసుకొనలేక పోయింది.

    అది గమనించిన ప్రభువు, ఆమె ఎందుకు అర్ధం చేసుకొనలేక పోయిందో విశ్లేషించాడు. ఆమె జీవితం అవినీతి పరమైనది. ఇహలోకమైనది. ఆమె హృదయంతరంగాలోనికి చూచి ఆమెతో ఈవిధముగా పలికాడు: ‘‘నీవు పోయి నీ భర్తను పిుచుకొని రమ్ము’’ (4:16). ఆమె జీవిస్తున్న దుర్లభమైన, అవినీతిపరమైన జీవితాన్ని సరిచేయుటకు ఆమె భర్తని పిుచుకొని రమ్మని చెప్పాడు. ‘పోయి’...అనగా ‘నీవు వెళ్లి నీ జీవిత వాస్తవాన్ని చూడు’ అని అర్ధం. ‘రమ్ము’ అనగా ‘వచ్చి జీవజమును స్వీకరించు’ అని అర్ధం. అందుకు ఆ స్త్రీ, ‘‘నాకు భర్త లేడు’’ (4:17) అని సమాధానం ఇచ్చినది.

    ఆమె సత్యమునే పలికినది. తన అవినీతిపరమైన జీవితాన్ని అంగీకరించినది. అంగీకరించిన మాత్రాన ఆమె జీవజమును పొందలేక పోయింది. ఎందుకనగా, జీవజమును పొందుటకు జీవితము అనే బావిని లోతుగా త్రవ్వవసి యున్నది. తన హృదయపు లోతులోనే జీవజమున్నదని గ్రహించలేక పోయింది. ఆమె పాప జీవితము వన, చెడు తలంపు ఆలోచన మూముగా జీవజమును పొందలేక పోయింది. జీవజమును పొందుటకు వీటన్నింటిని త్రవ్వవసి యున్నది. రక్షణ పొందబోవు ముందు పాపమును ఒప్పుకోవసి ఉంటుంది. ఆప్పుడు ఆమెలో కలిగిన ఆవేదనని, తప్పు చేశాననే మనస్తాపాన్ని ప్రభువు గమనించి ఇలా పలికాడు: ‘‘‘నాకు భర్త లేడు’ అని నీవు యథార్దముగా చెప్పితివి’’ (4:17). ఆమె నిజాయితీకి ప్రభువు ఆమెను పొగిడాడు. ఇతరులైతే ఆమెను విసుగుకొనేవారు, హేళన చేసేడివారు. ప్రభువు యథార్దమే పలికితివని చెప్పి ఈవిధముగా అన్నాడు: ‘‘నీకు ఐదుగురు భర్తుండిరి. ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాడు’’ (4:18).

    యేసు ఎవరిని అడగకుండానే చెబుతున్నాడని భావించినది. తన ప్రవర్తనని, జీవితమును సూక్ష్మముగా పరిశీలిస్తున్నాడని, తద్వారా, తను పొందవసిన వరము పొందలేమోనని తలంచు చున్నది. సంభాషణను మార్చడానికి ప్రయత్నించినది. తన గూర్చి సంభాషణను మార్చడానికి ఇలా పలికింది: ‘‘అయ్యా! నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది’’ (4:19). మొదటగా ప్రభువుని ‘యూదుడు’ అని, తరువాత ‘అయ్యా’ అని ఇపుడు ‘ప్రవక్త’ అని సంబోధించుచున్నది. తన జీవితము గూర్చి మాట్లాడటానికి యిష్టము లేక, ఆమె ఇలా సంభాషణను మార్చినది. సంభాషణను మతముపైకి మరల్చినది: ‘‘మా పితరులు ఈ పర్వతము మీద ఆరాధించిరి. కాని, దేవుని ఆరాధించవసిన స్థము యెరూషలేములో నున్నదని మీ యూదు చెప్పుచున్నారు’’ (4:20).

    మతం పేరిట స్వల్పమైన విషయమై తర్కించుటకు ప్రయత్నించినది. యూదు యెరూషలేములో ఆరాధించెడివారు. సమరీయు ‘గరిజిమ్‌’ పర్వతముపై ఆరాధన చేసెడివారు. దానికి సమాధానముగా ప్రభువు ఇలా పలికి యున్నాడు, ‘‘స్త్రీ నా మాట నమ్ముము. సమయము ఆసన్నమగుచున్నది. మీరు ఈ పర్వతము మీద కాని, యెరూషలేములో కాని తండ్రిని ఆరాధింపరు. మీరు ఎరుగని వానిని మీరు ఆరాధింతురు. మేము ఎరిగిన వానిని మేము ఆరాధింతుము. ఏయన రక్షణ యూదునుండియే వచ్చును. కాని, నిజమైన ఆరాధనకు ఆత్మయందును, సత్యమందును తండ్రిని ఆరాధించు సమయమిపుడే వచ్చియున్నది. నిజముగ తండ్రి ఆశించునది ఇటువంటి ఆరాధకునే. దేవుడు ఆత్మస్వరూపి కనుక, ఆయనను ఆరాధించువారు ఆత్మయందును, సత్యమునందును ఆరాధింపవయును’’ (4:21-24).

    యూదుకు, సమరీయుకు మధ్యనున్న వివాదాన్నీ సమసిపోతాయని యేసు తెల్చుపుచున్నాడు. యేసు గూర్చి సిమియోను పల్కిన ప్రవచనాలు నెరవేరాయి, ‘‘అన్యుకు ఎరుకపరచు వేలుగు, నీ ప్రజగు యిస్రాయేలీయుకు మహిమను చేకూర్చు వెలుగు’’ (లూక 2:32). యేసు ప్రభువు కూడా ఈ ప్రవచనాన్ని మరో విధముగా చెప్పియున్నారు, ‘‘రక్షణ యూదునుండియే వచ్చును’’ (4:22).

    నిజముగా రక్షకుడు సమరీయునుండిగాక, యూదునుండి రావసియున్నాడు. ‘రక్షణ’ అనేది ‘రక్షకుడికి’ మరో పేరు. ‘‘ప్రభూ నీవు ఏర్పరచిన ‘రక్షణమును’ కనులారా గాంచితిని’’ (లూక 2:30,31). లోకానికి రక్షణము నొసగుటకు యిస్రాయేలును సాధనముగా ఎన్నుకొన్నాడు.

    యేసు పలుకులు ఈ పాపాత్మురాను ఎంతగానో తాకాయి. సత్యము అనెడి పరిధిలోనికి ఆమెను తీసుకొని వెళ్ళాయి. కాని ‘‘ఆత్మయందును, సత్యమందును తండ్రిని ఆరాధించు సమయమిపుడే వచ్చియున్నది’’ అను వాక్యము ఆ స్త్రీకి అర్ధము కాలేదు. ఎందుకనగా, సమరీయులు కూడా మెస్సియా యొక్క రాకడను విశ్వసించెడివారు. ఆమె ఇలా సమాధానం చెప్పియున్నది: ‘‘క్రీస్తు అనబడు మెస్సియా రానున్నాడని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయమును తెలియజేయును’’ (4:25).

    సమరీయులు పాత నిబంధన గూర్చి తగినంత జ్ఞానమును కలిగియున్నారు. అందుకే, దేవుడు ఆశీర్వదించబడిన వానిని ఈ లోకానికి పంపుతాడని విశ్వసించారు. కాని ఆ వ్యక్తి ఒక ప్రవక్తగా మాత్రమే వస్తాడని సమరీయు విశ్వాసం. యూదులు, ఆ వ్యక్తి భూలోకాన్ని పాలించే రాజుగా వస్తాడని విశ్వసించారు. యేసు ఆమె అల్ప విశ్వాసాన్ని ఎరిగి ఇలా పల్కియున్నాడు: ‘‘నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను’’ (4:26). ఈ ప్రవచనము ద్వారా ఆరాధన సల్పెడి స్థము యెరూషలేముగాని, గిరిజిమ్‌ పర్వతముగాని కాదని, అది క్రీస్తేనని స్పష్ఠమగుచున్నది.

    ఈ ప్రవచనాన్ని విన్న ఆ సమరీయ స్త్రీ ఆశ్చర్యముతో నీటి కొరకు తెచ్చుకున్న కడవను అక్కడే వదిలిపెట్టి పట్టణములోనికి వెళ్లి ప్రజతో ఈవిధముగా చెప్పినది: ‘‘ఒక మనుష్యుడు నేను చేసినవి అన్నియు చెప్పెను. వచ్చి చూడుడు. ఆయన ‘క్రీస్తు’ ఏమో!’’ (4:29).

    ఇచ్చట స్త్రీ, యేసును మరో క్రొత్త విధముగా సంబోధించినది. ఆయనను ‘‘క్రీస్తు’’ అని సంబోధించినది. ప్రజతో ఆరాధనగూర్చి చెప్పిన విషయమునుగాక, యేసు ఆమె జీవితమును గూర్చి చెప్పిన విషయమున్నియు చెప్పినది. సూర్యుడు ఉదయించిన క్షణముననే వెలుగును ప్రకాశించును. నిప్పు రగుల్కొనిన క్షణముననే మండుతుంది. అదేవిధముగా, మానవుని హృదయం దేవునితో సహకరించిన క్షణముననే, ఆయన కృప పనిచేస్తుంది. ఆ సమరీయ స్త్రీ, క్రైస్తవ చరిత్రలోనే, మొట్టమొదటి మత ప్రచార బోధకులో ఒక ప్రచారకురాలై యున్నది. మొదటగా, ఆమె నీటి కొరకు బావి దగ్గరకు వచ్చినది. కాని, నిజమైన జీవజ ఊటను కనుగొన్న తరువాత, శిష్యులు ఏవిధముగానైతే, తమ వలను వదిలి ఆయను అనుసరించారో, ఈ స్త్రీ కూడా తన కడవను అచ్చటనే వదిలి పెట్టినది.

    యేసు కూడా తన ఆకలి దప్పుగూర్చి పూర్తిగా మరచి పోయాడు. శిష్యులు, ‘‘బోధకుడా! భోజనము చేయుడు’’ (4:31) అని అడిగినప్పుడు, ‘‘భుజించుటకు మీరు ఎరుగని ఆహారము నాకు కదు’’ (4:32) అని వారితో పలికాడు.

    ఆమె ప్రచారము ఎంతగానో పని చేసినది. ‘‘ఆ పట్టణములోని సమరీయు అనేకులు ఆయనను విశ్వసించిరి’’ (4:39). నేను చెప్పెడిది మీరందరు విశ్వసించాలి అని ఆమె చెప్పలేదు. ‘‘వచ్చి చూడుడు’’ అని చెప్పియున్నది. ఆమె చెప్పిన మాటను బట్టి ఆమెలోని అత్రుతను, విశ్వాసాన్ని చూసిన అనేకమందికి నమ్మకం కలిగినది. కొన్ని గంట తరువాత, ఆ స్త్రీ మర యేసు వద్దకు తిరిగి వచ్చినది. కాని ఈసారి నీటి కొరకు రాలేదు. జీవజము కొరకు, రక్షణ పొందుటకు వచ్చియున్నది.

    ‘‘ఆ సమరియ వాసులు వచ్చి ఆయనను తమయొద్ధ ఉండుమని వేడుకొనగా, ఆయన అచట రెండు రోజులు ఉండెను. ఆయన ఉపదేశమును ఆకించి ఇంకను అనేకులు ఆయనను విశ్వసించిరి’’ (4:40,41). ప్రభువును చూసిన ప్రజలు ఆ స్త్రీతో ఈవిధముగా పలికారు, ‘‘మేము ఇప్పుడు నీ మాటను బట్టి విశ్వసించుట లేదు. మేము స్వయముగా ఆయన ఉపదేశమును వింటిమి. వాస్తవముగా ఆయన లోకరక్షకుడని మాకు తెలియును’’ (4:42).

    ప్రభువు ‘‘లోకరక్షకుడు’’ అని మొదటిసారిగా, సమరీయుచేత పిలువబడినాడు. ఆ స్త్రీయొక్క ఆధ్యాత్మిక ప్రగతి సంపూర్ణమైనది. మొట్టమొదటిగా యేసు ఆ స్త్రీకి ‘యూదుడు’, తరువాత ‘మనుష్యుడు’, తరువాత ‘అయ్యా’, తరువాత ‘ప్రవక్త’, తరువాత ‘మెస్సియా’, చివరిగా ‘లోకరక్షకుడు’ అయ్యాడు. ఇచట ఎటువంటి శారీరకమైన అద్భుతము జరిగియుండలేదు. ఎటువంటి స్వస్థత చేకూర్చబడలేదు. కాని, ఒక పాపి హృదయములో అద్భుతము జరిగియున్నది. ఈ మారిన పాపి మనసే యేసు ‘లోకరక్షకుడు’ అని గుర్తించినది. చక్కటి సంభోదనకి, నామానికి నాంది పలికినది. ఇచ్చట సిలువ గూర్చి ఏమియు చెప్పబడలేదు. కాని, సిలువపై వ్రేలాడబడిన యేసు ‘‘లోకరక్షకుడు’’గా పిలువబడ్డాడు.

    ఆ కాములో పరిసయ్యులు అనే వర్గం వారు ఉన్నారు. వారు పాపాన్ని వ్యతిరేకించారు గాని పాపపు ఫలితాన్ని కలిగియున్నారు. వారిలో హింస, ద్వేషం, భయం, అసంతృప్తి, అశాంతి, గర్వం, అగంకారం తొణికిసలాడాయి. ఒకవేళ, పాపాత్ములు పాపాన్ని నిరాకరించినచో వారికి ఎవరు రక్షకుడయ్యెదరు. గర్వితులైన పరిసయ్యును చూసి ప్రభువు ఇలా అన్నాడు, ‘‘వ్యాధిగ్రస్తుకేగాని ఆరోగ్యవంతుకు వైద్యుడు అక్కర లేదు గదా!’’ (ూక 5:31).

    ఈ లోకములో రెండు రకా ప్రజలు ఉన్నారు. ఒకరు దేవున్ని కనుగొన్నవారు. రెండు ఆయన కొరకు ఎదురు చూస్తున్నవారు. గర్వముతో కూడిన విజ్ఞానవంతుకన్న పాపాత్ములే త్వరితముగా దేవుని రక్షణను పొందగరు. ప్రేమలేని పునీతుకన్న, ప్రేమ కలిగిన పాపాత్మును దేవుడు తన అక్కున చేర్చుకుంటాడు. తనకే సర్వము తెలుసునని అనుకొను వ్యక్తికి, సత్యము ఎన్నటికి తెలియదు. ఆ సమరీయ స్త్రీవలె లేనితనాన్ని, వాస్తవాన్ని ఎరిగినవారు, శాంతిని, సంతోషాన్ని, రక్షణ భాగ్యాన్ని సుళువుగా పొందగరు. దేవుని వరమును పొందియున్నవారు, నమ్మినవారు వారి హృదయాలో దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించెదరు. దేవుని అనుగ్రహమును పొందలేని వారు, నమ్మనివారు, వారిలో దైవసాన్నిధ్యాన్ని అనుభవించలేరు. సమరీయ స్త్రీ ఎప్పుడైతే యేసు క్రీస్తు అనుగ్రహాన్ని విశ్వసించెనో ఆమె దేవున్ని దర్శించినది. సర్వలోక రక్షకుడిని కనుగొని యున్నది.

1 comment: