స్వేచ్ఛ

స్వేచ్ఛ

    కతోలిక శ్రీసభ సత్యోపదేశం (1731, 32, 33, 34, 40, 41): మన స్వంత బాధ్యతతో ఉద్దేశపూర్వకమైన చర్యను చేపట్టు శక్తియే స్వేచ్ఛ. సత్యములోను, మంచితనములోను అభివృద్ధికి, పరిణతికి అవసరమయ్యే శక్తియే స్వేచ్ఛ. మనిషి స్వేచ్ఛ దేవుని వైపుకు నిశ్చితముగా సాగాలి. ఈ స్వేచ్ఛ మానవ చర్యకు విక్షణతను ఆపాదిస్తుంది. మనం ఎంత ఎక్కువగా మంచిని చేస్తే అంత ఎక్కువగా స్వేచ్ఛపరులము అవుతాము. అలాగే, స్వేచ్ఛ మనలను బాధ్యత కలిగి జీవించునట్లు చేస్తుంది. స్వేచ్ఛను వినియోగించడమనగా ఏదిబడితే అది చెప్పడం, చేయడం కాదు. స్వేచ్ఛకు కర్త మనిషి. అట్టి మనిషి ‘‘స్వయం సంపత్తిగ వ్యక్తియని, స్వప్రయోజనా సంతృప్తి కోసం ఇహలోక వస్తువులను భోగించడమే తన జీవన గమ్యం’’ అని భావింపడం పొరపాటు. ‘‘స్వేచ్ఛను ధర్మబద్ధంగా వినియోగింపటానికి అవసరమైన ఆర్ధిక, సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితును చాలాసార్లు  ఉపేక్షింపటమో, ఉల్లంఘింపటమో జరుగుతుంది. అలాంటి గుడ్డి, అన్యాయ పరిస్థితుల నైతిక జీవనాన్ని కుంటుబరచి, బవంతును, బలహీనులను ప్రేమకు విరుద్ధంగా పాపం చేసే శోధనల్లో పడవేస్తుంది. నైతిక చట్టం నుండి వైదొలగటం ద్వారా మనిషి తన స్వంత స్వేచ్ఛను ఉ్లంఘిస్తాడు, తనలోతానే బంధీ అవుతాడు, ఇరుగుపొరుగుతో సహవాసాన్ని భంగపరుస్తాడు, దైవ సత్యాన్ని ఎదిరిస్తాడు.’’ క్రీస్తు మనందరికి రక్షణను, స్వేచ్ఛను సంపాదించాడు. పాపమునుండిమనను విమోచించాడు. ‘‘స్వేచ్ఛ కోసం క్రీస్తు మనల్ని విముక్తుల్ని జేశాడు’’ (గతీ 5:1). ‘‘సత్యము (యేసు) మిమ్ము స్వతంత్రులను చేయును’’ (యోహాను 8:32). ‘‘ప్రభువు ఆత్మ ఎచట ఉండునో అచట స్వాతంత్రము ఉండును’’ (2 కొరి. 3:17). ‘‘దేవుని పుత్రులు మహిమోపేతమైన స్వాతంత్రము నందు పాలుపంచు కొనుచున్నాము’’ (రోమీ 8:21).

    మనము స్వేచ్ఛలో జీవించుటకు, దేవుని సంతోషమును, ఆశీర్వాదమును పొందుటకు సృష్టింపబడినాము. నిజమైన స్వేచ్ఛ పెండ్లి కుమారుడు (యేసు) మనతో ఉన్నాడను (మ 9:15) సంతోషమును అనుభవించడము. దేవుని ఐక్యతలో జీవించడం నిజమైన స్వేచ్ఛ. క్రైస్తవుమైన మనకు నిజమైన స్వేచ్ఛ యేసు క్రీస్తుని ఎన్నుకొని ఆయన మార్గమును అనుసరించడమే - ఇది స్వేచ్ఛ ‘‘కొరకు’’, అంతేగాని, స్వేచ్ఛ ‘‘నుండి’’ కాదు. ఈ స్వేచ్ఛ దేవుని కొరకు, మంచి కొరకు, సత్యమును ఎంచుకొనుట కొరకు. మంచిని ఎన్నుకొనుటలో విఫమైనప్పుడు మనం సాతానుకు, పాపమునకు బానిసమవుతాము. స్వతంత్రులుగ జీవించుటకై క్రీస్తు మనకు విముక్తి కలిగించాడు కనుక మనము దృఢముగా నిబడాలి. బానిసత్వము అను కాడిని మర మనపై పడనీయకుండా జాగ్రత్త పడాలి (గతీ 5:1). ‘‘ప్రేమ ద్వారా పనిచేయు విశ్వాసమే ముఖ్యము’’ (గతీ 5:6). కనుక స్వేచ్ఛ సోదర ప్రేమలో, పొరుగు వారికి మంచిని చేయుటలో పాతుకొని పోయినది. కనుక మన చర్యలో మంచిని లేదా చెడును ఎన్నుకొనుటకు మనము స్వేచ్ఛను కలిగియున్నాము. దేవునికి మన ‘సమ్మతిని’ లేదా ‘అసమ్మతిని’ తెలిపే స్వేచ్ఛ మనకున్నది. అయితే, మనము నిర్ణయించే ప్రతీ చర్యకు పరిణామాలు ఉంటాయని గుర్తుంచు కోవాలి. మన చర్యకు మనమే బాధ్యుము. ఈ బాధ్యతలో మనము ఎప్పుడు కూడా మంచిని ఎన్నుకొనుటకు పిలువబడి యున్నాము. చెడును ఎన్నుకొనిన యెడ, పరిణామాను అనుభవించవసి ఉంటుంది.

    మామూలుగా స్వేచ్ఛ అనగా సామాజిక న్యాయం, సమానత్వం, ఎంచుకొను హక్కు, అనియంత్రిత, మెరుగైన జీవితము...మొదగునవిగా భావిస్తూ ఉంటాము. ఈ రోజుల్లో, ‘స్వేచ్ఛ’ అనే పదమును వ్యక్తిగత, స్వార్ధపూరిత ప్రయోజనాకు, వ్యక్తిగత ఆలోచనకు వక్రీకరించ బడుచున్నది. క్రైస్తవుకు నిజమైన స్వేచ్ఛ ఏమిటో యేసు ప్రభువు చెప్పియున్నారు, ‘‘మీరు నా మాటపై నిలిచి యున్నచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు. మీరు సత్యమును గ్రహించెదరు. సత్యము మిమ్ము స్వతంత్రును చేయును’’ (యోహాను 8:31-32).

    బాధ్యతతో కూడిన స్వేచ్ఛ ఫవంతమైనది, అర్ధవంతమైనది. అది సోదర ప్రేమతో ముడిపడి యున్నది. కనుక, మానవ జీవితమును మనము రక్షించాలి, గౌరవించాలి. సోదరప్రేమ కలిగి జీవించాలి. మన స్వేచ్ఛను దుర్వినియోగం చేయరాదు. స్వార్ధమునకు ఉపయోగించరాదు. ఈనాటి సమాజములోనున్న చెడును మనము వ్యతిరేకించాలి: గర్భస్రావం, అనాయాస మరణం, ఆడ శిశుహత్య, వ్యభిచారం, వరకట్నం, గృహహింస, అవినీతి, తీవ్రవాదం, యుద్ధం, స్వార్ధం, అధికార దుర్వినియోగం, రాజ్యంగ హక్కును ఉ్లంఘించడం, మతంపట్ల ద్వేషం, మైనారిటీ పట్ల చిన్న చూపు, కుపిచ్చి, మతపిచ్చి....

    కొన్నిసార్లు చెడు మంచిగా కనిపించవచ్చు. అలాంటి సమయాలో బైఋ గ్రంధములో తమ స్వేచ్ఛను ఉపయోగించు కొనిన వ్యక్తు అనుభవాను ఉదాహరణముగా చూడవయును. మొదటిగా, ఆదాము-ఏవను చూచినట్లయితే, ఏవ ‘పండు’ను ఎంచుకొనుటకు స్వేచ్ఛను కలిగియున్నది. అది మంచిగా ఉన్నట్లు ఏవకు కనిపించినది. సర్పము (సాతాను, మనలోని అవిధేయతా శక్తి) ఏవను ఇలా శోధించినది,  ‘‘ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగునని, మీరు మంచి చెడులు తెలిసికొని దేవునివలె అగుదురని ఎరిగి ఆయన మీకట్లు చెప్పెను’’ (ఆ.కాం.3:5). దేవున్ని, మంచిని ఎన్నుకొనుటలో విఫమై ఆదాము-ఏమ అనేక పరిణామాను అనుభవించవసి వచ్చినది (చదువుము ఆ.కాం. 3:14-19).

    కయీను-హెబేలులను చూచినట్లయితే, వారిరువురు దేవునికి కానుకను అర్పించారు. హెబేలు కానుకను దేవుడు ప్రసన్న దృష్టితో చూచుట వన, కయీనుకు మిక్కిలి కోపం వచ్చి ముఖము చిన్నబుచ్చు కొనెను. అప్పుడు ప్రభువు కయీనుతో, ‘‘కోపముతో చిన్నబోయితివే? మంచి పనులు చేసినచొ తలయెత్తుకొని తిరుగగలవు. చెడుపని చేసినతో పాపము వచ్చి వాకిట పొంచియుండి నిన్ను మ్రింగ జూచును. కాని నీవు దానిని అణగ ద్రొక్కవలెను’’ (ఆ.కాం. 4:6-7). కాని, కయీను ఈర్ష్యతో, అసూయతో రగిలిపోయాడు. కయీను తన సోదరుడిని చంపుటకు లేదా ప్రేమించుటకు స్వేచ్ఛను కలిగియున్నాడు. కాని కయీను తమ్ముడిని చంపుటకే నిర్ణయించుకున్నాడు. ‘‘నీ తమ్ముడు హెబేలు ఎక్కడ?’’ అని ప్రభువు కయీనును ప్రశ్నించినపుడు, ‘‘నాకు తెలియదు. నేనేమైన వానికి కావలివాడనా?’’ అని యెదురు చెప్పాడు (ఆ.కాం.4:9). సోదరప్రేమ అను ఆజ్ఞను పాటించుటలో విఫమైన కయీను, తనకు ఇవ్వబడిన స్వేచ్ఛను బాధ్యాతాయుతముగా ఉపయోగించు కొననందులకు అనేక పరిణామాలను అనుభవించవసి వచ్చినది (చదువుము ఆ.కాం. 4:11-16).

    దావీదును చూచినట్లయితే, అతను వివాహమాడినాడు. అయినప్పటికిని, మరో స్త్రీపై (బత్షెబ) వ్యామోహాన్ని కలిగియున్నాడు. తన చర్యలో దేనిని ఎన్నుకొనుటకైనను స్వేచ్ఛను కలిగి యున్నాడు. అయితే దావీదు వ్యభిచారమును ఎన్నుకొనుట మాత్రమే గాక, తన పాపమును కప్పిపుచ్చుకొనుటకు ఆ స్త్రీ భర్తను (ఊరియా) చంపుటకు నిర్ణయించుకున్నాడు (2 సమూ 11:2-5, 14-15). తన స్వేచ్ఛను బాధ్యాతాయుతముగా  ఉపయోగించు కొననందులకు దావీదు అనేక పరిణామాలను అనుభవించవసి వచ్చినది (చదువుము 2 సమూ 12:14-23).

    మనము నిజముగా స్వతంత్రుమై యున్న యెడల, ఎల్లప్పుడూ, మంచిని చేయుటకే నిర్ణయిస్తాము. మనంఎల్లప్పుడూ దేవుని చిత్తాన్ని మాత్రమే ఎన్నుకుంటాము. ఇదే క్రీస్తు శిష్యరికం, క్రీస్తును అనుసరించడము. స్వతంత్రులు'గా ఉండుటకు పవిత్రతలో ఎదగాలి. నిజమైన స్వేచ్ఛ సోదరప్రేమలో ఉన్నదని గుర్తించాలి. అలాగే స్వేచ్ఛ-సత్యమునకు, స్వేచ్ఛ-మంచికి, స్వేచ్ఛ-పవిత్రతకు, స్వేచ్ఛ-శిష్యరికమునకు మధ్యనున్న సంబంధమును చూడగలగాలి. అలాగే మనము ఆత్మచేత నడిపింప బడాలి. అప్పుడే నిజమైన స్వేచ్ఛ బాటలో నడుస్తాము. అలాగే క్రీస్తు ఒసగిన స్వేచ్ఛలో జీవించాలి.

    కనుక, క్రైస్తవ స్వేచ్ఛ ఇదే! పాపమునుండి స్వేచ్ఛ, దాని వేతనమైన మరణము (రోమీ 6:22) నుండి స్వేచ్ఛ. స్వేచ్ఛ వన శాశ్వత జీవనము లభించును (రోమీ 6:22,23). అనగా ఇక జీవించునది నేను కాదు. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు (గతీ 2:20). ఈ స్వేచ్ఛ వలన మనము (మరియ తల్లి వలె) దేవుని పిుపునకు, చిత్తానికి ప్రత్యుత్తరము ఇవ్వగలము: ‘‘నీ మాట చొప్పున జరుగును గాక!’’ (లూకా 1:38). కనుక నిజమైన స్వాతంత్రము పాపమునుండి, సాతాను దుష్క్రియలనుండి విముక్తి కావడం. తద్వారా, మన మనస్సులో, హృదయములో విముక్తిని అనుభవించడమే నిజమైన స్వేచ్ఛ.

    ‘‘ఈనాడు పాపము నుండి విముక్తి పొంది, దేవునికి దాసులమైతిమి. పవిత్రతకు చెందిన ఫలితమును స్వీకరించితిమి. చివరకు శాశ్వత జీవితము భించును’’ (రోమీ 6:22).

No comments:

Post a Comment