Wednesday, February 29, 2012

తపస్కాల రెండవ ఆదివారము, మార్చి 4, 2012

తపస్కాల రెండవ ఆదివారము, మార్చి 4, 2012
ఆది కాండము 22: 1-2, 9-13, 15-18; భక్తి కీర్తన 116: 10-18;
రోమీ 8: 31-34; మార్కు 9: 2-10

- little brother gopu

ఓ సర్వేశ్వరా! మీ ముఖ సౌందర్యమును ఆశించుచున్నాను. మీ ముఖ అందమునే కోరుచున్నాను. కావున, మీ ముఖమును నానుండి త్రిప్పుకొనకుడు అని నా హృదయం మీతో చెప్పుచున్నది.

దైవ పిలుపు వ్యక్తిగతమైనది మరియు ఆవశ్యకమైనది. దేవునియందు విశ్వాసముతోను, సంపూర్ణ నమ్మకముతోను, ఆయన పవిత్రతలో ప్రవేశించుటకు ఆహ్వానం దైవపిలుపు. మనతో మాట్లాడే దేవునితో మనం ఎదురుపడుతూ ఉన్నాము. ఆయనను ఆలకించి, ప్రత్యుత్తరమిచ్చుటకు మనం పిలువబడుచున్నాము. తపస్కాల రెండవ వారములోనికి ప్రవేశించిన మనం, మన ఆత్మ పరిశీలన, మార్పు, మారుమనస్సును కొనసాగిస్తూ పాస్కా ఉత్సవమును యోగ్యరీతిన కొనియాడుటకు ముందుకు సాగుదాం. మన ఆలోచనలు దేవుని ఆలోచనల వంటివి కావు. మన మార్గములు దేవుని మార్గముల వంటివి కావు. మానవ మాత్రులమైన మనం మార్పును కోరుకోము, ఇష్టపడము. మార్పును నిరోధించుటకు ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఎదేమైనప్పటికిని, మార్పు మన జీవితములో భాగము. గతములో మనం సాధించిన విజయాలపై, కార్యాలపై, ఈ రోజు ఆధారపడలేము. ఈ లోకములో మనం కేవలం ప్రయాణికులము మాత్రమే. మన ఈ ప్రయాణం నిత్య జీవనమువైపునకు, దేవునిలో సంపూర్ణ ఐక్యతవైపునకు కొనసాగుచున్నది.

అబ్రహాము విశ్వాసం - దేవుని వాగ్ధానం

మొదటి పఠనం ఆది కాండము నుండి వినియున్నాం. దేవుడు అబ్రహామును పిలచియున్నాడు. అబ్రహామును దేవుడు పరీక్షించాడు. తాను ఎంతగానో ప్రేమించే తన కుమారుడైన ఇసాకును బలిగా అర్పించమని దేవుడు ఆదేశించాడు. అబ్రహాము విశ్వాసము చాలా దృఢమైనది. దేవుని ఆదేశాన్ని ఎలాంటి తొట్రుపాటు లేకుండా, ఎలాంటి అనుమానము లేకుండా విధేయించుటకు నిర్ణయించి, మరునాటి వేకువజామునే, ఇసాకుతో ప్రయాణమయ్యాడు. దేవుడు చూపించిన ప్రదేశమునకు చేరగానే, అబ్రహాము బలిపీఠమును నిర్మించి, కట్టెలు పేర్చి తన కుమారున్ని బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఆసమయముననే, దేవదూత అబ్రహామును పిలచి, ఇసాకుపై చేయి వెయ్యరాదని ఆజ్ఞాపించియున్నది. దేవుడు అబ్రహాము విశ్వాసమును పరీక్షించాడు. తన కార్యముల ద్వారా, విధేయత ద్వారా, అబ్రహాము తన హృదయం చాలా స్వచ్చమైనదని నిరూపించాడు. అబ్రహాము తన జీవితాంతము దేవునికి విధేయుడై జీవించాడు. తన కుమారునికి బదులుగా, దేవుడు ఒసగిన పొట్టేలును బలిగా అర్పించాడు. అబ్రహాము విధేయతకు ముగ్ధుడైన దేవుడు అతనితో వాగ్దానాన్ని చేసియున్నాడు. అబ్రహాము సంతతి ఆకాశములోని నక్షత్రములవలె, సముద్రతీరమున ఇసుకరేణువులవలె వ్యాప్తిచెందునని, అన్ని దేశములు ఆయన కుటుంబమునందు ఆశీర్వాదము పొందునని వాగ్దానము చేసియున్నాడు.

మనం ఎందుకు భయపడాలి?

రెండవ పఠనములో, పునీత పౌలుగారు ఓర్పు, సహనము కలిగి విశ్వాసపాత్రులుగా ఉండాలని చెబుతున్నాడు. ఆదిక్రైస్తవులు ఎన్నో హింసలకు గురయ్యారు. వారు తమ ప్రాణాలు కోల్పోతారని భయపడ్డారు. వారిని ఉద్దేశించి, 'దేవుడు మన వైపు ఉన్నప్పుడు మనకు ఎవరు విరుద్ధముగా ఉంటారు?' (రోమీ 8:31) అని చెప్పాడు. మనందరికోసం దేవుడు తన ఏకైక కుమారున్ని బలిగా అర్పించాడు. తన కుమారునితో మనకి సకలాన్ని ఇస్తాడు. కనుక, మనం భయపడనవసరము లేదు.

క్రీస్తు తనను తాను, తండ్రి చిత్తాను సారముగా, తండ్రికి విధేయుడై మనందరి కోసం ఒక బలిగా మారాడు. మన పాపాలకోసం ఆయన అర్పించిన బలి మహోన్నతమైన మరియు పరిపూర్ణమైన బలి. ఆయన మనకోసం మరణించి, మృతులలోనుండి సజీవముగా లేచాడు. తండ్రి కుడి ప్రక్కన కూర్చుండి, మనందరి కోసం తండ్రిని అర్ధిస్తున్నాడు. కనుక, మనం దేనికీ భయపడనవసరములేదు. మన బాధలలో, కష్టాలలో, హింసలలో, ఓర్పు, సహనము కలిగి తండ్రి దేవుణ్ణి విశ్వసించాలి. "క్రీస్తు ప్రేమనుండి మనల్ని ఎవరు దూరం చెయ్యగలరు? కష్టం, దు:ఖం, హింస, కరువు, దిగంబరత్వం, అపాయం, ఖడ్గం, మనల్ని దూరం చెయ్యగలరా?" (రోమీ 8:35).

యేసు దివ్యరూపధారణ

సువిశేష పఠనములో, యేసు ప్రభు దివ్యరూపధారణ గూర్చి వినియున్నాం (మార్కు 9:2-10). 'దివ్యరూపధారణ' ముఖ్య ఉద్దేశం యేసు దైవత్వమును బహిరంగ పరచడము. ఈ సంఘటన, యేసు తన మరణాన్ని గురించి చెప్పిన తర్వాత జరిగియున్నది. "మనుష్య కుమారుడు కష్టాలు అనుభవిస్తాడు. పెద్దలు, ప్రధానార్చకులు, శాస్త్రులు ఆయన్ని త్రుణీకరిస్తారు. ఆయన చంపబడి మూడు రోజుల తర్వాత మళ్ళీ బ్రతికి వస్తాడు" (మార్కు 8:31). ఇది శిష్యులను ఎంతగానో కలువర పరచింది. వారు మెస్సయ్య గూర్చి ఎంతో గొప్పగా ఊహించారు. ఆయన శ్రమలు పొంది, మరణించవలసి ఉన్నదని వారు ఎన్నడూ ఊహించలేదు. ఈ సమయములో యేసు దివ్యరూపధారణ వారికి ఊరటను కలిగించియుండవచ్చు. దివ్యరూపధారణ విశ్వాసముతో సహనము కలిగి జీవించిన వారికి మహోన్నత్వం వేచియున్నదని తెలియ జేస్తున్నది. యోహాను, తన సువిషేశములో, యేసుని మహోన్నత్వమును వారు చూసారని రాసాడు. ఇది యేసు దైవత్వమునకు నిదర్శనం. ఏలియా, మోషేల దర్శనం ప్రవక్తలు, చట్టము యేసు ప్రభువునిలో పరిపూర్ణ మయ్యాయని సూచిస్తున్నది.

"ఈయన నా ప్రియమైన కుమారుడు. ఈయన మాట వినండి" (మార్కు 9:7) అను స్వరమును శిష్యులు వినియున్నారు. క్రీస్తు తండ్రి దేవుని సందేశమును ఈ లోకానికి తెచ్చియున్నాడు. ఆయన సందేశమును మనం ఆలకించాలి. ఆలకించడము మాత్రమే కాక, ఆ సందేశానికి మన ప్రత్యుత్తరాన్ని ఇవ్వాలి. దేవుడు మనతో అనేక విధాలుగా, అనేక రూపాలలో మాట్లాడు చున్నాడు. ఆయన స్వరమును ఆలకించుదాం. దేవుని పిలుపునకు ప్రత్యుత్తర మిద్దాం.

క్రీస్తును ఆలకించాలి. ఎందుకన, ఆయన నిత్య జీవపు మాటలు కలవాడు. ఈనాడు లోకములోనున్న ప్రభుని సాన్నిధ్యాన్ని గాంచుదాం. ఈ తపస్కాలములో మన హృదయాలను తెరచి, ప్రేమను అనుభవించుదాం. ఆ ప్రేమను ఇతరులతో పంచుకొందాం. మన జీవితాలను దేవునికి, ఇతరులకు అర్పించుటకు సిద్ధ పడుదాం.

Tuesday, February 28, 2012

నాలుక - మాట

little brother
Fr. Praveen Gopu, OFM Cap.

మనం చేసే పాపాలలో అబద్దాలు చెప్పడం ఒకటి. సత్యమును చెప్పడానికి బదులుగా, అబద్ధం చెప్పడానికే ఎక్కువగా ఆసక్తిని చూపుతుంటాము. మన అవసరాలనుబట్టి, పరిస్థితినిబట్టి, సత్యాన్ని కూనిచేస్తూఉంటాము. అనేకచోట్ల, అనేకసార్లు, అసత్యమే, సత్యముగా నిరూపించబడుతుంది, వాదించబడుతుంది, నిర్ణయించబడుతుంది. ఈ రోజు, నిజం చెప్పవలసి వస్తుందని బయపడేవారు ఎందరో!


Monday, February 27, 2012

2nd Sunday of Lent (Year B), 4 March 2012

2nd Sunday of Lent (Year B), 4 March 2012
THIS IS MY BELOVED SON
Gen. 22: 1-9, 10-13, 15-18; Ps. 115; Rm. 8:31-34; Mk. 9:2-10

As our Lenten retreat advances, we hear today three of the most powerful readings in scripture:

Abraham is asked by God to sacrifice the only son of his old age. To us, this seems a monstrous idea. Not only is human sacrifice involved, but Abraham is asked to give up his only son, his whole future, the one on whom all his human hopes depend. On the mountain, Abraham prepares his only son for sacrifice!

Meanwhile in the gospel, Jesus – the only-begotten Son of God - takes his closest disciples with him up another mountain. He is utterly transformed, his whole body shining in brilliant light. And he hears his Father say: “This is my Son, my beloved”. The disciples want to remain there, but they only get this brief glimpse. After that, Jesus hints of his future death and resurrection, but they “do not understand”.

“God did not spare His own Son, but gave Him up for us all. After such a gift, who can be against us?” (2nd reading) St Paul did understand. He saw the link between the two readings, grasped their deepest meaning. During our Lenten retreat, we too must ponder the same amazing truths:

• Sooner or later, like Abraham, every Christian will experience something that will show whether he or she has real faith in God or not. It may be the loss of someone dear; it may be a sudden serious illness; the collapse of everything on which you had built your life… will you still be able to trust in God?

• Even in the midst of great suffering, we get glimpses of light – the conviction that this is not the end of the story, that the suffering is somehow necessary and that through it we are being transformed – transfigured – into something infinitely beautiful. In this life, there are only brief glimpses of glory. They are there to give us courage, hope and faith, beyond appearances.

• At the heart of our prayer during Lent – the heart-to-heart conversation with our heavenly Father – we need to hear God saying to each of us “You are my beloved son, my beloved daughter”. (Everything that is said of Jesus applies also to you and me!). You are loved by God! If we never experience love, how can we love back? “God loved the world so much that He gave his only Son…”

Once we truly believe this, our transfiguration begins.

Sunday, February 26, 2012

Church in Andhra Pradesh

CHURCH IN ANDRHA PRADESH, INDIA

1. Andhra Pradesh (ఆంధ్ర ప్రదేశ్) is one of the 28 states of India, situated on the country's south eastern coast. It is India's third largest state by area and fifth largest by population. Its capital and largest city is Hyderabad. Andhra Pradesh lies between 12°41' and 22°N latitude and 77° and 84°40'E longitude, and is bordered by Maharashtra, Chhattisgarh and Orissa in the north, the Bay of Bengal in the east, Tamil Nadu to the south and Karnataka to the west.

Andhra Pradesh has the second-longest coastline of 972 km (604 mi) among the states of India.


LENT = Leave Every Negative Thing

LENT = Leave Every Negative Thing

As we begin this Holy Season of LENT, we may discover the true meaning of LENT, by leaving behind all Negative things of the past and strive for a Future filled with Hope!
(Phi 3: 7 – 14).

A Different Approach to Fasting...

Fasts have a tendency to be oriented toward things like giving up food or television. But there are many other creative ways we can welcome Jesus' healing touch.

Here are suggestions you may want to consider.

1. Fast from anger and hatred. Give your family an extra dose of love each day.
2. Fast from judging others. Before making any judgments, recall how Jesus overlooks our faults.
3. Fast from discouragement. Hold on to Jesus' promise that He has a perfect plan for your life.
4. Fast from complaining. When you find yourself about to complain, close your eyes and recall some of the little moments of joy Jesus has given you.
5. Fast from resentment or bitterness! Work on forgiving those who may have hurt you.
6. Fast from spending too much money. Try to reduce your spending by ten percent and give those savings to the poor.

Wishing you all Peace, Love, and Happiness during LENT - Leaving every Negative Thing.

Inbaraj Velskumar, Mumbai, IDNIA

Friday, February 24, 2012

తపస్కాల మొదటి ఆదివారము, Year B, 26 February 2012

తపస్కాల మొదటి ఆదివారము, Year B, 26 February 2012
ఆదికాండము 9:8-15; భక్తి కీర్తన 25:4-9; 1 పేతురు 3 :18-22; మార్కు 1:12-15

"యేసు ఆత్మప్రేరణ వలన ఎడారి ప్రయాణమునకు కొనిపోబడి సైతానుచే శోధింప బడెను"

యేసు శోధన పరమార్ధం:

ఈ లోకములో మనషి సంతోషం, వ్యామోహాల లేమిలో కాదు, కాని వాటిని జయించడములో ఉంది. తపస్కాలం దేవుడిచ్చిన ప్రత్యేక కాలం. యేసు ప్రభువు చేసిన ఉపవాసం, ప్రార్ధనలో పాలుపంచుకొని పరివర్తన పొందడానికి, తపస్కాలం ఒక మంచి అవకాశం.

నేటి సువిషేశములో యేసు ప్రభువు ఎడారిలో ఎదుర్కొన్న మూడు శోధనల గురించి చెప్పబడింది. ఆత్మ ప్రేరణ వలన ఎడారికి నడిపింపబడి, నలుబది దినములు గడిపినపుడు సైతానుచే శోధింపబడెను. సైతాను యేసు ప్రభువును శోధించినది. ఎందుకంటే, యేసు దేవునికి ప్రియమైన కుమారుడు, లోక రక్షకుడు. ప్రపంచముపై ఆధిపత్యం చెలాయించాలన్న కోరికతో సైతాను యేసు ప్రభువును శోధించడానికి వెదకని మార్గం లేదు. అయితే, మనం గమనించ వలసిన ముఖ్య విషయం, యేసు సాతాను శోధనలను త్రోసిపుచ్చిన తీరు. "సైతాను, నానుండి దూరముగా పొమ్ము!" అని గద్దించాడు. ఈ భావాన్ని యేసు పేతురుపట్ల చూపించాడు. "ఛీ, పో! సైతాను! నీ భావములు మనుష్యులకు సంబంధించినవే కాని, దేవునికి సంబంధించినవి కావు" (మార్కు 8:33).

పునీత పౌలుగారు హేబ్రీయులకు వ్రాసిన లేఖలో, అంత్యంత తీవ్రమైన శోధనలపై యేసు ప్రభువు విజయం, సకల మానవాళిలో, సరిక్రొత్త నమ్మకాన్ని, సరిక్రొత్త ఆశను నింపుతుంది అని చెబుతున్నారు.

యేసు ప్రభువు, శోధనలపై మరియు సాతానుపై తాను సాధించిన విజయము ద్వారా గొప్ప సందేశమును ఇస్తున్నారు:

మొదటి శోధన: " నీవు దేవుని కుమారుడవైనచో ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుము". మానవుడు కేవలము రొట్టేవలన జీవింపడు. కాని దేవుడు వచించు ప్రతీ వాక్కు వలన జీవించును" అని యేసు సమాధానమిచ్చాడు. నిజమైన ఆనందం దైవ వాక్కును ఆలకించి దేవుని చిత్తం నెరవేర్చడములో ఉన్నది అని అర్ధము. యేసు దైవ కార్యాన్ని గురించి చేసిన భోదనల అంతరార్ధం ఈ వాక్యములో ఇమిడి ఉన్నది: "కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తన చెంది సువార్తను విస్వసింపుడు" (మార్కు 1:15).

దేవుని వాక్యం మనకు మార్గ దర్శం కావాలంటే రెండు ముఖ్య విషయాలున్నాయి. మొదటగా, దానిని సరిగా అర్ధము చేసుకోవాలి. రెండధిగా, దైవ చిత్తానికి పూర్తిగా లోబడటము. మనం వాక్యాన్ని చదివినప్పుడు, మన స్వంత ఇష్టము కంటే, దైవ చిత్తానికి అధిక ప్రాధాన్యం ఇవ్వకుంటే, పరిశుద్ధ గ్రంధం మనలకు నిరాశాపరిచేదిగానే ఉంటుంది. కొంత మంది విశ్వాసులు కొన్ని సార్లు వాక్యములోని ఆజ్ఞలకు అడ్డదారి కనిపెట్టి తమకు ఇష్టం వచ్చినట్లుగా జరిగిస్తూనే తమకు తాము సమర్హ్దించుకొనే మార్గం వెదకుతూ ఉంటారు. ఉదా: పరిసయ్యులు.

రెండవ శోధన: "నీవు దేవుని కుమారుడవైనచో, ఈ శిఖరమునుండి క్రిందికి దుముకుము." అని సాతాను శోధించెను.

యేసు మరొకసారి తిరస్కరించారు. "ప్రభువైన నీ దేవుని నీవు శోధింపరాదు. మన సామర్ధ్యాలను, గర్వముగా ప్రదర్శించుకొనే శోధన, ఆడంబరముగా గొప్పలు చెప్పుకొనే శోధనలో మనము అప్పుడప్పుడూ పడుతూ ఉంటాము. ఇవి దేవుని చిత్తాన్ని నేరవేర్చలేవు. యేసు లేఖన భాగాలను ఉదాహరించడము ద్వారా, వీటన్నింటిని జయించాడు. దేవుని వాక్యానికి కట్టుబడి ఉంటే, సాతాను శోధనలు ఎప్పటికీ మనపై విజయం సాధించలేవు. యేసు ప్రభువు ఎన్ని అద్భుతాలు చేసిన తన గొప్ప తనాన్ని, తన సామర్ధ్యాన్ని, తన బలాన్ని నిరూపించుకొనే ప్రయత్నం ఏనాడు చేయలేదు. ఎప్పుడుకూడా, ప్రతీ అద్భుతాన్ని దేవుణ్ణి మహిమపరచడానికి చేసాడు. ఉదా: "నీవు నీ ఇంటికి నీ బంధువుల యొద్దకు పోయి, ప్రభువు నిన్ను కనికరించి, నీకు చేసిన మేలును గూర్చి వారికి తెలియ చెప్పుము" (మార్కు 5:19).

మూడవ శోధన: "నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన యెడల నీకు సమస్తమును ఇచ్చెదను". అప్పుడు యేసు, "సైతానూ! పొమ్ము! ప్రభువైన నీ దేవుని ఆరాధింపుము. ఆయనను మాత్రమే సేవింపుము" అని చెప్పెను. అధికారం, ప్రభావం అంతా తనదేనని, యేసుకు దానినంతటినీ ఇవ్వగలననే సాతాను అబద్ధం చెప్పాడు. చెడుతనముతో, లోకముతో రాజీ పడితే దేవుని కోసం ఏదైనా చేయడం మరింత సులువుగా సాధ్యపడుతుందని అప్పుడప్పుడూ మనం భావిస్తాం.

ఇటువంటి బేరసారాలకి మన జీవితములో అనేక సార్లు లొంగి పోతాం. దేవునికి దగ్గరగా ఉండాలని ఆరాటపడతాం. కాని, లోకాశాలకులోనై సాతాను శోధనలకు లొంగి పోతాం. ఇక్కడ ఒక వాక్యాన్ని గుర్తుకు చేసికోవాలి. "మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమి ఈయగలదు? (మ 16:26).

యేసు ప్రభువు సాతాను శోధనలను జయించిన తీరు ఎంతో గొప్పది. మానవుని జీవితములో ప్రతీ రోజు సాతాను శోధనలకు గురి అవుతున్నాడు. శోధనలను జటించే శక్తి కోసం దేవుణ్ణి ప్రార్ధించాలి. తపస్సు కాలములో ఉపవాసం, త్యాగ క్రియలు చేయడము ద్వారా సాతానుకి చిక్కకుండా దేవునికి ప్రియమైన బిడ్డలముగా, దేవుని నామానికి మహిమను చేకూర్చి పెట్టే బిడ్డలుగా జీవించడానికి కావలసిన శక్తిని దయచేయమని దేవుణ్ణి ప్రార్ధిద్దాం.

Fr. Karunakar Kasu OFM Cap., Andhra Pradesh, INDIA

Lent Sunday 1, YEAR B, 26 February 2012

Lent Sunday 1, (YEAR B), 26 February 2012
Gen 9: 8-15; Ps. 24; I Pt 3:18-22; Mk 1:12-15

40 DAYS WITH JESUS

Yes, the point about Lent is that we are on a journey with Jesus. Its purpose is to help restore the relationship of love between God and human beings. These things are said very clearly in today’s readings. God had threatened to destroy humanity because of their rebellion. The flood is a sign of that destruction. But, after 40 days, he shows mercy, and renews the solemn agreement of love (the Covenant). Now, the rainbow is the symbol of restored union between heaven and earth.

We make the same journey that Jesus did. Mark’s account is shorter than in the other gospels. All we are told is that Jesus was in the company of wild beasts, that he was tempted, and that angels comforted him. And at the end of 40 days, he emerges with the message: change your lives and believe the good news!

What about our journey? What does Lent mean for us?

Imagine spending 40 days in a desert. In a desert, most of the things we rely on are stripped away. Not much food or water; no distractions; no computers or modern gadgets; no entertainments; only you and God, and any wild creatures you might meet – some of them possibly dangerous.

Just you and God. And coming face to face with the “wild beasts” that live in you and in me, that make us centred on ourselves and cause fear, and keep tempting us to give in and take an easier way. It’s clear that there are things that need to change in our lives too. Some things we must die to, to find new life. We are journeying with Jesus towards Easter!

The desert isn’t for cowards. But we are not left alone. We have the angels with us. And we have tools for the journey: prayer (in our private space, face to face with God); fasting (from too much food; from harmful habits; from self); works of mercy (anything we can do to show a needy person how generous and merciful God is).

Happy Lent!

Br. Charles Sérignat OFM Cap, Rome

Tuesday, February 21, 2012

A PROGRAMME FOR LENT

A PROGRAMME FOR LENT

Lent is a time of Preparation for BAPTISM or RENEWAL OF BAPTISM at the Easter Vigil.
In tune with the Liturgy, there is a gradual build-up leading up to the “Great Week” that culminates in the re-enactment of Jesus’ Paschal mystery, in which He takes us with Him.
Therefore Lent is a time of Re-CONVERSION, leading to a NEW EXPERIENCE of Baptism.

THE BASIC TOOLS OF THE LENTEN SEASON (every day until Holy Saturday):
See Gospel for Ash Wednesday: (Mt 6, 1-8,16-18).

PRAYER, (to the Father [(i.e. Jesus’ prayer in us), especially “behind closed doors”], in our “private space”

FASTING, According to Lenten preface IV, God uses fasting:
to keep our vices in check!
to heighten our awareness of Him;
to give us strength
and rewards ...


LENT

LENT

Lent is a forty-day preparation for Easter. It begins on Ash Wednesday, 22 February 2012 and ends on 7 April 2012, the day before Easter. We travel with Jesus in the desert, reflecting on His Life, Sacrifice, Death, Burial and Resurrection.

“So it is written that the Christ would suffer and on the third day rise from the dead” 
- Luke 24:46

The Lenten season offers us once again an opportunity to reflect upon the very heart of Christian life: Charity. It is a favourable time to renew our journey of faith, both as individuals and as a community, with the help of the Word of God and the Sacraments. This journey is marked by prayer and sharing, silence and fasting, in anticipation of the joy of Easter (Message of his Holiness Benedict XVI for Lent 2012). Lent is a favorable time of conversion and reconciliation. Conversion means taking a different way of thinking and doing, putting God and his will in the first place, ready, if necessary, to give up anything else, however important or costly it may be.


Friday, February 17, 2012

తపస్కాలము, విభూతి పండుగ 22 February 2012

తపస్కాలము, విభూతి పండుగ 22 February 2012

little brother gopu

ఓ సర్వేశ్వరా! మమ్మందరిని కరుణించుము. మీరు సృజించిన దానిలో దేనిని మీరు ద్వేషించరు. పశ్చాత్తాపము చూపినపుడు మానవుల పాపములను క్షమించి వారిని విముక్తులను చేసి, మీరు సర్వాధికారియగు దేవుడనని వెల్లడి చేసికొంటిరి.

తపస్కాలము

తపస్కాలము, ఉత్థాన మహోత్సవమునకు 40 దినాల ఆయత్తము. తపస్కాలము విభూతి పండుగతో ప్రారంభమవుతుంది. ఈ సం,,ము 22 ఫిబ్రవరి విభూతి పండుగతో ప్రారంభమై 7 ఏప్రిల్ తో ముగుస్తుంది. ఈ కాలములో యేసు ప్రభువుతో ఎడారిలో ప్రయాణము చేస్తూ ఆయన జీవితము, త్యాగము, మరణము, సమాధి మరియు ఉత్థానము గూర్చి ధ్యానిస్తూ ఉంటాము.


Tuesday, February 14, 2012

7 వ సామాన్య ఆదివారము Year B, 19 February 2012

7 వ సామాన్య ఆదివారము Year B, 19 February 2012
యెషయా 43:18-25; భక్తి కీర్తన 41:1-4, 12-13;
2 కొరింతు 1:18-22; మార్కు 2:1-12

Fr. John Antony Polisetty OFM Cap.
Germany
ఓ సర్వేశ్వరా! మీ దయను నమ్ముకొనియున్నాను. మీ రక్షణయందు నా హృదయము ఆనందించుచున్నది. నాకు మేలుచేసిన సర్వేశ్వరునికి స్తుతిగానము చేయుదను.

చూపుల్లో తేడా!

ఈనాటి మొదటి పఠన సందర్భమును పరిశీలించినచో, బాబిలోనియా దేశములో, బానిసత్వములో మ్రగ్గుతున్న ఇస్రాయేలియుల కష్టాలు, బాధలు, హృదయభారం, ఆవేదన, ఆక్రందన మనం చూడవచ్చు. ఆ సమయమున వారు తమచుట్టూ ఉన్న దుస్థితినిచూస్తూ దు:ఖిస్తున్నారు. పూర్వము దేవుడు తమ పూర్వీకుల జీవితాలలో చేసిన కార్యములను స్మరిస్తూ రోదిస్తున్నారు. ఆ సమయమున యెషయ ప్రవక్త దేవునిచేత ప్రేరేపి౦పబడిన మాటలతో వారికి ఓదార్పును కలిగిస్తున్నాడు. ఈ కష్టాలను, బాధలను, బానిసత్వమును మాత్రమే మీరు చూడవద్దు. చీకటి తర్వాత వచ్చు వెలుగును, రాబోవు కాలములో మీ కొరకు ప్రభువు చేయు కార్యములను చూడండి. మీ చూపును అడ్డంకుల మీద కాకుండా, ఆవలి తీరముపై కేంద్రీకరించండి. దూరదృష్టిని కలిగియుండండి. రాబోవు స్థితి
7th Sunday Ordinary. Year B 19 February 2012
Is. 43: 18-19, 21, 22-25; Psalm 41: 1-4, 12-13; II Cor. 1: 18-22; Mark 2: 1-12

Fr. Charles Sérignat OFM Cap.


This is a very striking scene: crowds of people milling around Jesus, so many that they couldn’t move. A group of four men carrying a paralysed man, determined to bring him to Jesus for healing. Nothing was going to stop them. They even let the paralysed man down through the flat roof!

Isn’t it strange that the first thing Jesus says to the man, seeing their faith, is “My son, your sins are forgiven”? We would expect Jesus to heal the man first, before anything else. It was commonly thought in Jesus’ day that sickness and even natural disasters were punishments for sin, but, as with the man who was blind from birth, Jesus had already assured people that this was not the case. (cf. John 9,2). And yet, the first thing he says to the paralysed man is “Your sins are forgiven”.

It is true, though, that our sins can cause ill health! When we make ourselves literally sick with worry (lack of trust), stress, a sense of unworthiness or guilt over something we did or failed to do, perhaps many years ago; when we refuse to forgive someone who did or said something that hurt us in the past, and we keep the resentment alive, maybe even refusing to speak to that person again! Oh yes, we can let past sins eat away at us like a cancer… gradually undermining our spiritual and physical health. All of us need to let go of the past, and trust in God’s power to heal our memories. “No need to recall the past”, says our first reading, “See, I am doing something totally new!”

Jesus, the good physician, goes to the root of the problem. He attacks the sin first, which is the real enemy. And the physical healing – in this case, the cure of the paralysed man – is performed only as a proof of Jesus’ power to forgive sin, which only God can do. It is easy to say, in words, “Your sins are forgiven”, but nobody can prove it. Much harder to say “Get up and walk”, because everyone will be able to see whether your words come true or not: the man will either get up or stay paralysed on his sick-bed. So, if people see that Jesus can cure a paralysed man, they will believe that he can forgive sin. And if Jesus can do what only God can do, then the conclusion is obvious: God has come among us, making his love and mercy visible.

This, surely, is the heart of the “good news”!

పునీత ఫ్రాన్సిస్ శౌరి వారు

పునీత ఫ్రాన్సిస్ శౌరి వారు - 7 ఏప్రిల్ 1506 - 3 డిశంబర్ 1552

పునీత ఫ్రాన్సిస్ శౌరివారు 7 ఏప్రిల్ 1506 వ సం,,లో ఉత్తర స్పెయిన్ దేశములోని క్సవేరి అను నగరములో, జువాన్ ది జాస్సో, మరియ దంపతులకు జన్మించాడు. వారిది సంపన్నుల కుటుంబము. ఫ్రాన్సిస్ వారికి తొమ్మిది సం,,ల వయస్సునే తండ్రి మరణించాడు. 1525 వ సం,,ము వరకు తన కుటుంబముతోనే ఉండి చదువులను పూర్తి చేసాడు. 1525 వ సం,,లో పైచదువుల నిమిత్తమై పారిస్ లోని సెయింట్ బార్బర విశ్వవిద్యాలయమునకు వెళ్ళాడు. 1528 వ సం,,లో చదువులు పూర్తి చేసికొని పట్టభద్రులైనారు. ఆ తరువాత అక్కడే అధ్యాపకులుగా పని చేసారు. పారిస్ లో ఉన్నంతకాలము జీవితములో తనకంటూ ఓ ప్రత్యేక పేజీ ఉండాలని కోరుకొన్నాడు. ఈ లోకములో ఏదో సాధించాలనే పట్టుదలతో ఉండేవాడు. 1529 వ సం,,లో పునీత ఇన్యాసి వారిని కలిసి ఆయనకు

Sunday, February 12, 2012

Fr. Benedict Vadakkekara OFM Cap.

Establishment of Capuchin Order in India
II. Breaking the deadlock and striking root
(1916-1926)

At the extraordinary meeting held at Meerut on 23 February 1916 the Regular Superior of the Mission of Agra with his Council determined of one accord that the Friary of Mussoorie was ill-adapted for being a novitiate house. The special session had been convoked precisely to deliberate on the pressing request for the restart of the Novitiate and Study advanced by Mgr Poli of Allahabad and the Order's General Procurator. The Friary of Mussoorie was declared climatically wanting on account of its adjacency to two schools. This net verdict consequently rendered the various moves to reopen the House of Mussoorie look like flogging a dead horse; to all intents the issue was shelved indefinitely. The Regular Superior's dusty answer unwittingly brought also to the fore a certain unwished situation that then prevailed in the Capuchin Mission in India. As the movement for national autonomy for India was gaining momentum, the Church's all-European clerical cadre especially in the north of the country, was beginning to stick out like a sore thumb; there were already calls for a change.

1. Striking root natively

Despite the undiplomatic disavowal from Agra, Mgr Poli of Allahabad refused to call it a day and resolved upon pursuing the idea single-handedly. He had the unstinting support from the Order's general superiors and the authorities of the Propaganda. According to him a
జీవితమా !!!

ఎక్కడ దాకా నీ పయనం ప్రభు యేసు లేని నీ గమనం ?
ఎటువైపు నీ ప్రయాణం ప్రభు యేసు కాని నీ గమ్యం ?

అందని ద్రాక్ష కొరకు వేట
అక్కరకు రాని అర్ధం (ధనం) కోసం ఆట
అందలమెక్కాలనే కలల కోట
అది ప్రభు దారినే పట్టించుకోని పరిపాట

చెడు సావాసాల నిండైన పొదరిల్లు
గొడవలు తగాదాలకు పుట్టినిల్లు
కార్య దీక్షను భగ్నంచేయు బాణపువిల్లు
అది దైవప్రేమను మరిపింపచేయు ఔషదముల్లు

అధికారం కొంతమందికి పర్వతారోహణం
అందుకే అర్రులు చాస్తూ అధికారం కోసం
వదలి వేయుచున్నారు దైవ కైంకర్యం (సేవ)
కాని నిజ దైవ సేవకునికి అది ఒక సేవాభావం.

ఓ జీవితమా !!!
ఎక్కడ దాకా నీ పయనం ప్రభు యేసు లేని నీ గమనం ?
ఎటు వైపు నీ ప్రయాణం ప్రభు యేసు కాని నీ గమ్యం ?

ఆలోచించవలసిన నిర్ణయాత్మకమైన యుక్త తపస్కాలమిది
ప్రభు మార్గ ప్రేమ సేవల అనుభవాన్వేషణనల సమయమిది.

Br. Kiran Kumar Avvari OFM Cap
Switzerland

Friday, February 10, 2012

6 వ సామాన్య ఆదివారం, Year B, 12 February 2012

6 వ సామాన్య ఆదివారం, Year B, 12 February 201
లేవీకాండము 13: 1-2, 44-46; భక్తి కీర్తన 32: 1-2, 5-11;
1 కోరింతు 10: 3-11:1; మార్కు 1: 40-45

Fr. Inna Reddy Allam, Switzerland


నా రక్షణ దేవుడవుగాను, నా శరనముగాను ఉంది, నాకు రక్షణమును ప్రసాదింపుడు. ఎందుకన మీరే నా ఆధారమును, నా శరీరమును, మీనామ గౌరవార్ధము నాకు నాయకులుగా ఉండి నన్ను పోషించుచున్నారు.

క్రీస్తు మన ఆదర్శం 

మన సమాజములో అనేక మంది వ్యక్తులు తమను తాము ఎదుటి వారితో పోల్చుకొంటూ ఉంటారు. వివిధ రంగాలలో పేరు గడించిన, ఆరితేరిన వ్యక్తులను చూసి, వారిని ఉదాహరణగా చేసికొని, వారిలా జీవితములో ఎదగదానికి ప్రయత్నిస్తూ ఉంటారు. క్రీడా రంగములో సచిన్ ని చాల మంది క్రికెట్ అభిమానులు దేవుడిగా చూస్తారు. ఆయనలా ఆడాలని ఆశించి, నేర్చుకొని జీవితములో పైకి ఎదిగిన వారు చాలామంది ఉన్నారు. సంగీతరంగములో ఎంతో మంది గొప్ప సంగీతకారులను చూసి, వారిని అనుసరించి, జీవితములో మంచి సంగీత విద్వాంసులుగా ఎదిగినవారూ ఉన్నారు. రాజకీయరంగములో కూడా మనకు అనేకమంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. వారిని ఆదర్శముగా తీసుకొని వారిలాగా రాజకీయములో ఎదిగినవారు ఉన్నారు. అదే విధముగా, సినిమా రంగములో కూడా ఈ లాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఈ విధముగా, ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక విషయాన్నిగాని, వ్యక్తినిగాని చూసి వారిని ఒక మోడల్ గా తీసుకొని జీవితములో పైకి ఎదగగలిగారు.

మంచి క్రైస్తవులుగా జీవించడానికి మనకు ఆదర్శముగా ఎంతో మందిని మనం శ్రీసభలో చూస్తూ ఉన్నాము. వారే పునీతులు, మరియు మంచిజీవితాన్ని జీవించేవారు. వారు, ఒక ప్రాంతానికి, ఒక కాలానికి చెందినా, వారు ఎల్లప్పుడూకూడా మనకు మార్గ దర్శకులుగా, ఆదర్శ మూర్తులుగా ఉన్నారు. ఈనాటి రెండవ పటనములో, పునీత పౌలు క్రైస్తవులైన కోరింతీయులకు తనను ఆదర్శముగా తీసుకొనమని చెప్పుచున్నాడు. "నా వలెనే ప్రవర్తింపుడు. స్వార్ధములేక ఇతరుల మేలుకొరకై నేను చేయు పనులన్నింటియందును అందరిని ఆనందింపచేయుటకు ప్రయత్నింతును" (1 కోరింతు 11 :1). పౌలుగారు తననుతాను ఒక 'గురువు' తో పోల్చుకొంటూ ఉన్నారు. తన జీవితము ద్వారా, తాను అనేక క్రైస్తవ సంఘాలకు వ్రాసిన లేఖల ద్వారా మనకు ఒక మోడల్ గా. ఆదర్శముగా ఉండగలిగారు.

పునీత పౌలుగారు ఏవిధముగా మనకు ఆదర్శముగా ఉన్నారో, అదే విధముగా, తన ఆదర్శం "క్రీస్తు" అని చెప్పుచూ ఉన్నారు. అందుకే, నేను ఏవిధముగా క్రీస్తును అనుసరిస్తూ ఉన్నానో, అదే విధముగా మీరు కూడా నన్ను అనుసరించండి అని చెప్పారు. "నాలో జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నాడు," అని పౌలుగారు చెప్పగలిగారంటే, అతను ఎంతగా క్రీస్తును అనుసరించాలని ఆశించాడో తెలియుచున్నది. అదేవిధముగా, పునీత బాప్తిస్మ యోహానుగారు కూడా, క్రీస్తు యోర్దాను నదిలో జ్ఞానస్నానం పొందిన తరువాత, తన శిష్యులకు యేసును చూపుతూ, "ఇదిగో, నిజమైన గొర్రెపిల్ల, ఆయనను అనుసరించండి" అని చెప్పాడు. కనుక క్రీస్తు మన అందరి ఆదర్శం.

క్రీస్తు ప్రభువును మనం ఆదర్శముగా తీసుకొన్నప్పుడు ఒక్క విషయాన్ని మనం గుర్తించాలి. మనం అందరం కూడా ఆయనలో సృష్టింపబడినవారమని, కనుక మన జీవితదృష్టి అంతా కూడా ఆయన వైపే ఉండాలి. ఎందుకన, క్రీస్తే మనకి జీవితాన్ని, జీవనాన్ని ఒసగుచున్నారు. ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు రూపములో ఉన్నారు. తండ్రి దేవుని రూపం, అటు క్రీస్తులో, ఇటు మనలో జీవాన్ని నింపుతూ ఉంది. అదే మన జీవితానికి, ఒక అర్ధాన్ని ఇస్తూ ఉంది.

మనలో ఏ ఒక్కరు కూడా అనుకోకుండా, దేవుని దృష్టిలో ముందుచూపు లేకుండా సృష్టింప బడలేదు. దేవుడు మనందరినీ ఒక ప్రణాళిక ప్రకారం, ఒక ఉద్దేశము కొరకు క్రీస్తులో సృష్టించారు. అందుకే తండ్రి దేవుడు మనలను క్రీస్తు ద్వారా, క్రీస్తులో ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే క్రీస్తు మనందరికీ కూడా ఒకే ఒక ఉత్తమ ఆదర్శం.

ప్రతి క్రైస్తవ విశ్వాసి, తనను తాను క్రీస్తుగా మలచుకోవాలి. క్రీస్తు ఆదర్శం, మనలను ప్రేమలో, ఐక్యతలో, శాంతిలో జీవించడానికి మార్గం చూపుతూ ఉంది. ఈనాటి పటనాలు, మనల్ని మనం క్రీస్తు రూపములోనికి మార్చుకొనమని ఆహ్వానిస్తూ ఉన్నాయి. ప్రతీ ఒక్కరు బాహ్యముగా కాక, అంతరంగీకముగా క్రీస్తు ఆదర్శాన్ని చూడగలగాలి. క్రీస్తులో ఒక నూతన జీవితానికి నాంది పలకగలగాలి. క్రీస్తు వాక్యాన్ని గురించి తెలుసుంటే చాలదు. ఆ వాక్యాన్ని చెప్పటం, ప్రచారం చేయటం మాత్రమే చాలదు. కాని క్రీస్తు వాక్యం మన జీవితాన్నిమార్చి, నూతన జీవితానికి నాంది పలకాలి. పరిశుద్ధాత్మ శక్తి మరియు మన సహకారం వలన సాధ్యంకాగలదు. పరిశుద్ధాత్మ దేవునిశక్తి మనలో పనిచేసినప్పుడు మనమూ అట్టి జీవితాన్ని పొందుతూ ఉన్నాము. క్రీస్తు ఆదర్శము ద్వారా, మన క్రియలు, మాటలు, ఆలోచనలు క్రీస్తును పరిపూర్తిగా పోలి ఉంటె, మనం దేవునికి మహిమను, ఆరాధనను చెల్లించిన వారం అవుతాము.

పరిపూర్ణ రూపము

మానవుడు దేవుని రూపములో సృష్టింపబడ్డాడు. మానవుడు తన నిజమైన మరియు పరిపూర్ణమైన రూపాన్ని కలిగిఉండాలని దేవుడు ఎల్లప్పుడూ ఆశిస్తూ ఉంటాడు. కాని మానవుడు, నేటి ప్రపంచములో అభివృద్ది, ప్రాపంచికరణ, నిజమైన స్వేచ్చ అను సిద్ధాంతాలను అనుసరిస్తూ తన పరిపూర్ణరూపాన్ని, దేవునిరూపాన్ని, క్రీస్తురూపాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఈ లోక వ్యామోహాలు, ఆశలు, అసూయ, ప్రేమలేమి, మనలో ఉన్న క్రీస్తురూపాన్ని చిందరవందర చేస్తున్నాయి. మానసిక, శారీరక బాధలు, వివిధ రకాల వ్యాధులు, జబ్బులు మనిషిని క్రుంగదీస్తున్నాయి. ఈ ప్రపంచంలో చెడు పెరిగేకొద్దీ, మనలో ఉన్న దేవునిరూపం పరిపూర్ణతను కోల్పోతూ ఉంది, నాశనం చేయబడుతూ ఉంది.

ప్రతి మనిషిలో ఉన్న దేవుని రూపాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడుకూడా ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఈ సృష్టిలో దేవుని రూపాన్ని కాపాడటానికి, చెదరిన రూపాన్ని సరిచేయటానికి, తండ్రి దేవుడు క్రీస్తును ఈ లోకానికి పంపాడు. క్రీస్తు చెప్పిన ప్రతీ మాట, చేసిన ప్రతీ పని, చేసిన ప్రతీ అద్భుతం కూడా ఈ లోకములో కోల్పోయిన దేవుని రూపాన్ని తిరిగి కల్పించడానికి చేసియున్నారు. మనలో ఉన్న క్రీస్తురూపాన్ని ఎలా క్షేమముగా కాపాడుకోవాలో యేసు తన జీవితంద్వారా చూపించారు. అందుకే ఈనాటి సువిశేషములో క్రీస్తుప్రభు కుష్టి వ్యాధితో ఉన్న వ్యక్తికి స్వస్థతను కలుగ జేసి, చెదరిన తన రూపాన్ని పరిపూర్ణం చేసారు. కుష్టి రోగి యేసువద్దకు వచ్చినప్పుడు, యేసు అతనిని చూచి జాలిపడ్డాడు. కారణం, వ్యాధి వలన దేవుని పూర్తిరూపాన్ని పొందలేక పోయాడు. అదేవిధముగా, మనం కూడా, ముఖ్యముగా, మన పాపక్రియల ద్వారా, మన చెడు నడవడిక ద్వారా, క్రీస్తు రూపాన్ని పోగొట్టుకున్నప్పుడు, క్రీస్తు మనలను చూసి కూడా జాలిపడతాడు. మనలో ఉన్న దేవుని రూపాన్ని కాపాడు కోలేకపోయాము.

ప్రియులారా, మనలో కూడా వివిధ రకాలైన కుష్ట వ్యాధులు ఉన్నాయి. ఎంతో మంది తమ అనుదిన జీవితములో, శారీరక, మానసిక, కుష్ట వ్యాధులతో భాదపడుతూ ఉన్నారు. వారందరు కూడా క్రీస్తు నిజరూపాన్ని కోల్పోతూ ఉన్నారు. మనలో చెడుక్రియలు, ఆలోచనలు ఎక్కువైనప్పుడు, క్రీస్తురూపం తగ్గుతూ ఉంది. ఈ చెడు ప్రపంచములో, మానవుని జీవితములో తారా స్థాయికి చేరితే అది మానవుని జీవితాన్ని ప్రశ్నార్ధకం చేస్తూ ఉంది. అందుకే, యేసు తనవంతుగా, కుష్టివానికి స్వస్థతను కలుగజేసియున్నాడు. ఈ స్వస్థత ద్వారా, ఆ వ్యక్తి మరల తిరిగి తన నిజరూపాన్ని పరిపూర్ణ జీవితాన్ని కలిగి యున్నాడు.

కుష్టివాని స్వస్థత, దేవుని పరిపూర్ణ రూపాన్ని మానవుడు పొందుటను సూచిస్తూ ఉంది. అందుకే, క్రీస్తురూపం మనలో ఎల్లప్పుడూ పరిపూర్తిగా ఉండునట్లు జాగ్రత్తపడాలి. తండ్రి దేవుడు క్రీస్తులో సంపూర్ణముగా ఉన్న విధముగా మన జీవితములో కూడా క్రీస్తును సంపూర్ణముగా కలిగి ఉండాలి. దానికి క్రీస్తునే ఆదర్శముగా తీసుకోవాలి. పునీత పౌలుగారు ఇలా అన్నారు: "ఇక జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తూ ఉన్నాడు." ఈ మాటల ద్వారా, పౌలుగారి నరనరాల్లో క్రీస్తు ప్రభువే జీవించి యున్నారు. ఈ కారణముగానే, పౌలు ఈనాటి రెండవ పటనములో 'మీరందరు నన్ను ఆదర్శముగా తీసుకొనండి' అని చెప్పాడు.

క్రీస్తు బిడ్డలుగా, శిష్యులుగా, మనం మంచి మాటలద్వారా, క్రియలద్వారా, చూపులద్వారా, మన చుట్టూ చెదరిపోయిఉన్న క్రీస్తురూపాన్ని, కాపాడటానికి ప్రయత్నిద్దాం. నీతి, నిజాయితి కలిగిన జీవితం, స్వార్ధాన్ని, అసూయను వీడి సర్వ మానవాళిని ప్రేమిస్తూ, ఆదరిస్తూ, క్రీస్తు ప్రేమను పంచుట ద్వారా, ఈ లోకములో క్రీస్తు రూపాన్ని కాపాడగలుగుతాము. చెదరి పోయిన క్రీస్తు రూపాన్ని, ప్రపంచములో, ప్రజలలో చూచి, దాన్ని సరిచేసి, క్రీస్తుకు నిజ బిడ్డలుగా జీవించుదాం. క్రీస్తు ఆదర్శాన్ని పాటించుదాం. మనలో ఉన్న క్రీస్తు రూపాన్ని కాపాడుకొను శక్తి కొరకు ప్రార్ధిద్దాం. ఆమెన్.
Wednesday, February 8, 2012

6th Sunday Ordinary, Year B - 12 February

6th Sunday Ordinary, Year B - 12 February
Lev. 13: 1-2, 44-46; Psalm 32: 1-2, 5-11;
I Cor. 10: 31-11:1; Mark 1: 40-45

Fr. Charles Sérignat OFM Cap.


Compassion beyond words

Lepers were the outcasts of ancient society, forced to live away from the general population. They were regarded then as some people with HIV-AIDS or mental illness are still regarded today. Furthermore, the Jewish religious customs even prevented lepers from associating with others of the same faith-community.

What is striking is that Jesus reaches out to touch the afflicted man as he heals him. At this time touching lepers was forbidden because of how contagious leprosy could be. They were literally “untouchable”.

We should not feel self-satisfied, just because leprosy may be rare in our societies today, and think that such things could not happen among us. After all, how many “untouchables” are there in our own communities and churches, under a different name?

There are two things that strike me about this gospel. One is that touch.

With that simple human gesture, Jesus tells the man “I am with you”. The man can feel the compassion of Jesus. Sometimes, when someone is suffering, compassionate words are not enough; they have to be accompanied by a human gesture. We should not be afraid to hold, and touch, when this is appropriate and needed.

That human touch by Jesus also signals that no-one is unclean or unworthy in God’s eyes: it’s enough that the person wants to be healed. It is we, not God, who make the distinctions between classes and types of people, welcoming some and keeping others away.

The second striking thing is that, as soon as Jesus has healed the leprous man,

“The man went away and began to publicize the whole matter. He spread the report far and wide so that it was impossible for Jesus to enter any town openly. He remained outside in deserted places, and people kept coming to him from everywhere”.

The regulations of Moses about how to treat a leper – reported in our first reading - had said:  “Since he is unclean he shall dwell apart, and live outside the camp.”

So, Jesus and the leper change places! Jesus takes on himself the leper’s fate, and becomes the outcast. No wonder sinners and outcast flocked to him, sensing that he was “one of their own”.

He would even end up crucified, on a hill outside the city, taking on himself the burden of human sin.

Thursday, February 2, 2012

5 వ సామాన్య ఆదివారము, Year B, 5 జనవరి 2012

5 వ సామాన్య ఆదివారము, Year B, 5 జనవరి 2012
యోబు 7:1-4; 6-7, భక్తి కీర్తన 147; 1-6, 1 కోరింతు 9:16-19, 22-23; మార్కు 1: 29-39

"రండు, మనలను సృజించిన సర్వేశ్వరుని ముందు సాగిలపడి ఆయనను ఆరాధింతము. ఎందుకన, ఆయనే సర్వాధికారి, ఆయనే మన కర్త.""అందరు మిమ్ము వెదకుచున్నారు" (మార్కు 1:37 ).బాధలు మన జీవితములో అనివార్యము. ఈలోక బాధలలో చివరిది మరియు తీవ్రమైనది మరణం. మన బాధలలో మనం అశక్తులం. అందుకే, మన బాధలకు అర్ధాన్ని వెదకుటకు ప్రయత్నం చేస్తూ ఉంటాము. క్రైస్తవులకు, క్రీస్తును విశ్వసించి అనుసరించు వారైన మన బాధలకు, క్రీస్తు శ్రమలు అర్ధాన్ని చేకూర్చుతున్నాయి. బాధలను, మరణాన్ని జయించుటకు క్రీస్తు ఒక రక్షకునిగా ఏతెంచాడు. క్రీస్తు శారీరక బాధలను మాత్రమే గాక, సంపూర్ణ వ్యక్తిని స్వస్థత పరచును. అంతర్గత స్వస్థత, పాపమన్నింపు ఆయన ప్రేషిత కార్యాలు. మన బాధల ఉపశమనము కొరకు, దేవుడు మన జీవితాలలో జోక్యము చేసికొనును. అయినప్పటికిని, బాధలను ఆయన అనుమతించును. "దేవుని మహిమ వీనియందు బయలుపడుటకై వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను" (చూడుము యో 9:1-3). బాధలలోనున్న వ్యక్తి, దేవున్ని వెదకుటకు ప్రయత్నిస్తాడు.ఈనాటి మొదటి పఠనం యోబు జీవిత గాధనుండి వింటున్నాం. యోబు ఆయన జీవితములో ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించాడు. ఆయన పొందే బాధలను మాటలలో వ్యక్త పరస్తున్నాడు. తన స్నేహితులు ఆయన విడచిపోయారు. యోబు పాపం చేసాడని ఒకరు, పశ్చాత్తాప పడాలని ఒకరు, చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందేనని మరొకరన్నారు. చివరికి, ఆయన భార్యకూడా శంకించింది. దేవున్ని శపించి మరణింపుము అని కోరింది. కాని, యోబు, "దేవుడు మనకు శుభములు దయచేసినప్పుడు స్వీకరించితిమి. కీడులను పంపినపుడు మాత్రము స్వీకరింప వలదా?" అని ప్రశ్నించాడు. ఆవిధముగా, బాధలలోనే యోబు ఇంకా ఎక్కువగా దేవున్ని వెదికాడు. ఆయనకు మరింత దగ్గరయ్యాడు. మన కష్టాలకు, బాధలకు క్రుంగి క్రుశించక, ఆధ్యాత్మిక హృదయముతో, వాటిద్వారా దేవుడు మనకి అందిస్తున్న సందేశాన్ని తెలుసుకొనడానికి ప్రయత్నం చేయాలి. బాధలలో, ప్రభువు మనలను పరిశుద్ధులను చేయుచున్నాడా? మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడా? మన నిలకడను పరీక్షిస్తున్నాడా? మన పరప్రేమను పరీక్షిస్తున్నాడా? ప్రార్ధనతో, పవిత్రాత్మ శక్తితో జవాబు వెదకిన వారికి సరియైన సమాధానం దొరకును.ఈనాటి సువిశేష పఠనములో కూడా, కష్టాలలో, బాధలలో ఉన్న ప్రజలందరు ప్రభువు కొరకు వెదకుచున్నారు. ప్రార్ధనా మందిరములో అధికారపూర్వకముగా బోధించి, అపవిత్రాత్మ ఆవేశించిన వానిని స్వస్థత పరచి, ఆయన మరెంతో మందిని స్వస్థత పరచాడు. వేకువ జామున, ఒక నిర్జన ప్రదేశమున ప్రార్ధన చేయుచుండగా, సీమోను అతని సహచరులు ప్రభువును వెదకుచు వెళ్లి ఆయనను కనుగొని, "అందరు మిమ్ము వెదకుచున్నారు" అని చెప్పిరి.ఈ రోజుకి కూడా, అందరు ఆయన కొరకు వెదకుచున్నారు. మన కష్టాలు, బాధలు ఎంతవైనను, ఆత్మశక్తితో వాటన్నింటిని జయించవచ్చు. దేవుని కృపవలన, యేసు నామమున ఏలాంటి బాధలనైనను ఎదుర్కొనవచ్చు. దేవునినుండి మనం ఎన్నో అనుగ్రహాలను పొందియున్నాము. ఏదీ ఆశించకుండా, ఇతరులతో ఆ వరాలను పంచుకొందాం. మన జీవితానికి ఓ అర్ధాన్ని చేకూర్చుకోవాలని ప్రభువు ఆశిస్తున్నారు. ప్రార్ధనతో కూడిన జీవితం, దేవునికి దగ్గరగా చేరు జీవితం, ఇతరులతో పంచుకొను జీవితం, స్వస్థత, పశ్చాత్తాపముతో కూడిన జీవితాన్ని జీవించాలని ప్రభువు ఆశిస్తున్నారు. తండ్రి చిత్తాన్ని కనుగొనుటకు యేసు ప్రతిదినం ప్రార్ధన చేసాడు. అదేవిధముగా, దైవ చిత్తాన్ని తెలుసుకొనుటకు, మనకూ ప్రార్ధన నేర్పించాడు. మన జీవిత అంధకారమునుండి బయటపడుటకు ప్రార్ధన ఎంతో ప్రాముఖ్యం. క్రీస్తానుచరులుగా, క్రీస్తువలే మారుటకు ప్రయత్నంచేద్దాం. తండ్రి చిత్తం, ప్రభువు కార్యమైనప్పుడు, అదే దేవుని చిత్తం, ప్రభువు కార్యం, మన కార్యము కూడా కావలయును. తండ్రితో ప్రభువు ఇలా ప్రార్ధించాడు: "నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి, నిన్ను ఈ లోకమున మహిమ పరచితిని" (యో 17:4). మనతో ప్రభువు ఇలా అంటున్నాడు, "ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి యెడల ప్రకాశింపనిండు" (మ 5:16).ప్రభువు ప్రేషిత కార్యములో మనమూ భాగస్తులమే. తండ్రి కుమారున్ని పంపినట్లే, మనలను కూడా పంపియున్నాడు. "నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును. అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను" (యో 14:12). ఈనాటి రెండవ పఠనములో పౌలుగారు ఇలా అంటున్నారు, "ఈ పనిని (సువార్తా బోధన) నేనే చేసినచో ప్రతిఫలమును ఆశింపవచ్చును. కాని, ఇది నా విధి అని భావించినచో, నాకు ఒక పని ఒప్పచెప్పబడినదని అర్ధము (1 కొరింతి 9:17). పౌలుగారు యేసువలెనె దైవకార్యాలను చేసియున్నాడు. అన్ని ఇబ్బందులను, బాధలను ధైర్యముతో ఎదుర్కొని, సువార్తను బోధించి తన జీవితాన్ని అర్పించాడు. యో 9:4 లో ప్రభువు చెప్పిన మాటలను తన జీవితములో పాటించాడు: "పగటి వేళనే నన్ను పంపిన వాని పనులు మనము చేయుచుండవలెను. రాత్రి దగ్గర పడుచున్నది. అపుడు ఎవడును పని చేయలేడు." మనం ఏ పని చేసిన ప్రభువు పేరిట చేసినచో ఆనందాన్ని పొందగలము. ప్రతీది ఆయన కొరకు చేద్దాం. మన బాధలను, కష్టాలను, మన అనుదిన కార్యాలను ఆయన చెంతకు తీసుకొని వద్దాం. "భారముచే అలసి సొలసి యున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను" (మ 11: 28).

5th SUNDAY Ordinary Year B – 5 February

5th SUNDAY Ordinary Year B – 5 February
Job 7:1-4, 6-7; Psalm 147: 1-6; I Cor. 9:16-19; 22-23; Mark 1: 29-39

Fr. Charles Sérignat OFM Cap.

No time to pray?

What do we see about Jesus in today’s Gospel?

• We see a strong, energetic, busy Jesus, working hard to spread the Good News of the Kingdom. From the synagogue where he cast out the evil spirit from a possessed man he goes straight to Simon’s house and cures his mother-in-law. Then crowds come and after sunset he is still working. Long before dawn he gets up for prayer: let us go elsewhere (let us keep moving) … he went all through Galilee.

• As in the whole gospel of Mark, there is a sense of urgency, of mission, of energy. Jesus is like the sower of seed who doesn’t stop to look back where the seed has fallen but who goes on sowing and trusts that some of it at least will bear fruit.

• We see a man of great simplicity and power. Jesus comes to the bed of Simon’s mother-in-law and takes her by the hand and helps her up – her illness now gone. The words of Jesus and the deeds of Jesus are one and the same thing, equally powerful. Simplicity and power!

• We see a man of prayer, a man who keeps his priorities straight. No matter how busy he is, his relationship to his Father stays in the first place. He refuses to let the busy routine dictate the terms of his life.

• Finally, we see a man who is busy teaching us. Not only by what he says but by what he does.

And so, looking at our own lives:

How often have we said, or thought: “I’m too busy to pray”?

Are we people of prayer? Do we put energy into our prayer? Do we make time for prayer, even getting up early, like Jesus? Do we look for a time and a place, every day? Christian prayer is Jesus praying in and through us: he offers us the very same relationship he has with his Father! If we Christians realised this, we would pray; nothing could stop us!