పాస్కా రెండవ మంగళవారము (I)

 పాస్కా రెండవ మంగళవారము
అ.కా. 4:32-37; యోహాను 3:7-15
ధ్యానం: ఆత్మ వలన జన్మ

నేటి సువిషేశములో ప్రభువు అంటున్నారు: గాలి తనకు ఇష్టమైనటుల వీచును. నీవు దాని శబ్దమును వినెదవే కాని అది ఎక్కడ నుండి వచ్చునో, ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతివాడును అటులనే ఉండును” (3:8). ఇక్కడ చెప్పబడిన గాలిపవిత్రాత్మను సూచిస్తుంది. గ్రీకు పదం న్యూమ’, హీబ్రూ పదం రూహఅనగా గాలి’, ‘ఊపిరి’, ‘ఆత్మఅని అర్ధం. ప్రకృతిలో గాలి ఎటుల వీచునో, దేవుని ఆత్మ, మనలో అలాగే వీచును. “మనుష్యుడు నూతనముగా జన్మించిననే తప్ప...” అన్న ప్రభువు మాటలు నికోదేము అర్ధం చేసుకోలేక పోయాడు కనుక, ప్రభువు ఈపై మాటలను చెప్పాడు. ప్రభువు ఇక్కడ ఆత్మయొక్క రూపాంతరం మరియు పునరుద్ధరించే శక్తిని సూచిస్తున్నాడు. కనుక, ప్రభువు ఆధ్యాత్మిక నూతన జన్మము గూర్చి ప్రభువు వివరిస్తున్నారు. నీటివలన, ఆత్మవలన జన్మించు వారందరు ఈ నూతన జన్మభాగ్యమును పొందుదురు. ఎందుకన, శరీర మూలముగ జన్మించునది శరీరము. ఆత్మ మూలముగ జన్మించునది ఆత్మయునై యున్నది. శరీరము మానవ స్వభావం. ఆత్మ దైవస్వభావం. ఆత్మలేనిది దేవుని తెలుసుకోలేము. అప్పుడే దేవుని రాజ్యమును చూడగలము’. నిత్యజీవమును పొందగలము.

మన జ్ఞానస్నానమందు, జీవమిచ్చు జలములద్వారా, నూతన జీవితములో జన్మించాము. ఈ నూతన జీవితం, మనలోని దేవుని జీవము. ఇది పరిదుద్ధాత్మయొక్క చర్యద్వారా కలిగిన నూతన జీవము. ఇది దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, సత్యస్వరూపియగు ఆత్మ, జ్ఞానంయొక్క ఆత్మ. పరిశుద్దాత్మలో జ్ఞానస్నానం పొందిన మనం ఆత్మప్రభావాన్ని మరియు ఫలాలను మన అనుదిన జీవితములో కనబరచాలి. అవిశ్వాసులకు మన జీవితాదర్శముద్వారా సాక్షమిచ్చుట వలన అలా జీవింపవచ్చు. దైవసాన్నిధ్యాన్నికి మన జీవితములో సాక్ష్యమివ్వాలి. వీలైనంత మంచి చేయుట వలన మనం ఇతరులకు బోధించగలం. సాక్ష్యులుగా ఉండగలం. 

జ్ఞానస్నానం పొందిన క్రైస్తవులుగా మరియు పరిశుద్దాత్మలో నూతనముగా జన్మించిన మనం ఎల్లప్పుడు క్రీస్తునందు మంచి జీవితాన్ని జీవించాలి.

No comments:

Post a Comment