12వ సామాన్య ఆదివారము – దివ్య సత్ప్రసాద పండుగ Year C

12వ సామాన్య ఆదివారము – దివ్య సత్ప్రసాద పండుగ Year C
ఆది. 14:18- 20; 1 కొరి. 11:23-26; లూకా. 9:11-17

ధ్యానాంశము: దివ్యసత్ర్పసాదం - ఆత్మీయ భోజనం
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్ధము చేయుడు. ఈ పాత్ర నా రక్తములోనైన నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయునప్పుడెల్ల, నా జ్ఞాపకార్ధము చేయుడు” (1 కొరి. 11:24-25)
ధ్యానము: దివ్యసత్ర్పసాదంమన క్రైస్తవ జీవితానికి కేంద్ర బిందువు. క్రీస్తు ప్రభువు మన హృదయాలలో నివసించుటకు మన ఆత్మలను పెంచి పోషించుటకు, దివ్యసత్ర్పసాదాన్నిస్థాపించారు. దివ్యసత్ర్పసాదంయేసు ప్రభువు సర్వమానవాళికి ప్రసాదించిన గొప్ప వరం. ఇది శ్రీసభకు గొప్ప ఆధ్యాత్మిక సిరి సంపద. దివ్యసత్ర్పసాదములో దైవ సాన్నిధ్యంనెలకొని ఉంటుంది. మనకు దివ్యసత్ర్పసాదంలో నాలుగు ప్రభావాలు కనిపిస్తాయి: 1. నిత్య జీవితం: నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నిత్యజీవము పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును” (యోహాను. 6:54). “దివ్యసత్ర్పసాదంతో” మనకు లభించే కృపానుగ్రహము మనల్ని కడవరకు నడిపిస్తుంది. పౌష్టికాహారం ఏ విధముగా అయితే మనకు బలాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందో, “దివ్యసత్ర్పసాదంకూడా దైవజీవమును అనగా దేవునిలో ఐక్యతను ప్రసాదించునంత వరకు, శాశ్వత జీవము ఇచ్చునంత వరకు, ఈ భోజన ప్రభావము ఏ మాత్రం ఆగిపోదు. 2. పునరుత్థానము: దేవునితో బసచేయబడిన మహిమ కొరకు అనగా మరణానంతరం పునరుత్థాన మహిమతో మనలను లేవనెత్తి పరలోక బహుమానమైన నీతి కిరీటము మనకు అందించు వరకు ఈ దివ్య భోజనం మనలో తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. 3. ప్రభువుతో సహవాసం: నా శరీరమును భుజించి, నా రక్తమును పానము చేయువాడు నా యందు, నేను వానియందు ఉందును” (యోహాను. 6:56). “దివ్యసత్ర్పసాదం” స్వీకరించడం ద్వారా మన శరీరం క్రీస్తు శరీరముగా, మన హృదయం క్రీస్తు హృదయముగా రూపాంతరం చెందుతుంది. “దివ్యసత్ర్పసాద” రూపంలో క్రీస్తు మన హృదయంలోనికి వచ్చిన తర్వాత మనము ఆయనతో ఏకమవుతున్నాము. క్రీస్తుతో పాటు మనము జీవిస్తున్నాము. 4. క్రీస్తు ద్వారా నూతన జీవితం: పరలోకము నుండి దిగివచ్చిన జీవముగల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవరేని భుజించినచో వారు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగ చెప్పుచున్నాను” (యోహాను. 6:51). భౌతిక ఆహారం మనకు శక్తిని, బలాన్ని ఇస్తుంది. రోజువారీ పనులను చేసుకోవటానికి కావలసినటువంటి శక్తిని అనుగ్రహిస్తుంది. మన ఆత్మలను పోషించటానికి కావలసిన ఆధ్యాత్మిక ఆహారాన్ని దివ్యసత్ర్పసాదముగామనకు యేసు అనుగ్రహించారు. అయితే భౌతికాహారాన్ని జీర్ణించుకుని శక్తిని పొందడానికి ఆరోగ్యకరమైన దేహం ఎంత అవసరమో, అలాగే యేసు క్రీస్తు ప్రసాదించే దివ్యసత్ర్పసాదాన్నిస్వీకరించి ఆధ్యాత్మిక శక్తిని, బలాన్ని పొందటానికి మన ఆత్మలు ఆరోగ్యంగా ఉండటానికి పవిత్రంగా ఉండటానికి కూడా ఈ జీవాహారం అంతే అవసరం. పరిపూర్ణ విశ్వాసముతో యోగ్యమైన రీతిలో నిండు పూజలో పాల్గొని దివ్యసత్ర్పసాదాన్నిస్వీకరించాలి. ఈ పండుగ నాడు, క్రీస్తు ప్రభువు మన అందరిని కూడా యోగ్యమైన రీతిలో తన శరీర, రక్తములను స్వీకరించమని మనలను కోరుతూ ఉన్నారు. ఈమధ్య కాలములో, చాలామంది కతోలికులు దివ్యసత్ర్పసాదవిషయంలో అనేక పొరపాట్లు చేస్తూ ఉన్నారు. అవి ఏమనగా, పూజకు ఆలస్యంగా రావడం, నిండు పూజలో సరైన విధముగా పాల్గొనని వారు, ఆ మహా ప్రసాదాన్ని స్వీకరించడానికి అనర్హులు, (1 కొరి. 11:27-31). క్రీస్తు చూపిన ప్రేమ, క్షమాగుణ సిద్ధాంతాలను మనం పాటిస్తున్నామా? అలా పాటించకపోతే మనలో దివ్యసత్ర్పసాదశక్తి, ఏ మాత్రం పని చేయదు. కనీసం ఇకనుండైనా యోగ్యరీతిలో ప్రభువు సర్వమానవాళికి ప్రసాదించిన ఈ గొప్ప జీవాహారాన్ని స్వీకరించుదాం.

No comments:

Post a Comment