10వ సామాన్య శుక్రవారము
1 రాజు. 19:9, 11-16; మత్త. 5:27-32
ధ్యానాంశము: విడాకులు వద్దు – కలిసి
ఉండుట ముద్దు
ధ్యానమునకు ఉపకరించు
వాక్యములు: “నీ దేహమంతయు నరకము పాలగుట కంటే నీ అవయవములలో ఒక దానిని కోల్పోవుట మేలు”
(మత్త. 5:30).
ధ్యానము: యేసు కాలములో, యూదులు వ్యభిచారమును తీవ్రమైన నేరముగా భావించి, కఠినముగా శిక్షలు అమలుచేసేవారు. అయితే, ఈ శిక్షలన్నీ స్త్రీలకు మాత్రమే ఉండేవి. అందుకే, ఒక పత్రముచే విడాకులు ఇవ్వడాన్ని యేసు రద్దుచేస్తున్నారు.
అటులైన విడాకుల పత్రమునిచ్చి భార్యను విడనాడ వచ్చునని మోషే ఏల ఆజ్ఞాపించెను?” అని పరిసయ్యులు ప్రశ్నింపగా, “మీ హృదయ కాఠిన్యమును బట్టి, మీ
భార్యలను మీరు విడనాడుటకు మోషే అనుమంతించెనే కాని, ఆరంభము నుండి ఇట్లు లేదు” (మత్త.
19:7-8) అని యేసు సమాధానమిచ్చాడు. “ఒక స్త్రీని కామేచ్ఛతో చూచు ప్రతివాడు ఆ
క్షణముననే తన హృదయములో వ్యభిచరించినట్లే!” (మత్త. 5:28). కామపు చూపులు, తలంపులద్వారా
కూడా ఆరవ ఆజ్ఞను మీరిన వారమవుతాము. “వివాహము అందరిచేతను గౌరవింప బడవలెను. వివాహ
బంధము నిష్కల్మషమైనదిగా ఉండవలెను. వ్యభిచారులు దేవుని తీర్పుకు గురియగుదురు” (హెబ్రీ. 13:4). “దేవుడు జతపరచిన జంటను మానవుడు
వేరుపరపరాదు” (మత్త. 19:6; మార్కు. 10:9). “అంతర్యుద్ధం దేశానికి ఎలాంటిదో, విడాకులు కుటుంబ జీవితానికి అంతే” అని క్రీస్తుకు చాలాకాలం ముందే అరిస్టాటిల్ చెప్పాడు.
భార్యాభర్తల బంధం బలంగా ఉండాలంటే, శోధనలు, ప్రమాదకర పరిస్థితులను నివారించాలి (మత్త. 5:29-30).
జీవిత భాగస్వామిలోని అనుకూల అంశములను గుర్తించి ప్రశంసించాలి. ఒకరినొకరు గౌరవించు
కోవాలి. ఒకరితోనొకరు ఉల్లాసముగా ఉండాలి. “కృతజ్ఞతలు”, “నన్ను క్షమించు”,
“నిన్ను ప్రేమిస్తున్నాను” అన్న మాటలను క్రమం తప్పకుండా ఒకరితో ఒకరు
చెప్పుకోవాలి. హృదయం స్వచ్చముగా ఉంటే, ప్రేమించే మన సామర్ధ్యాన్ని పెంచుతుంది; స్వార్ధపూరిత ఆలోచనలు మన అంత:ర్గత జీవితాన్ని నాశనం చేస్తాయి.
No comments:
Post a Comment