10వ సామాన్య శనివారము – పునీత
బర్నబాసు
అ.కా. 11: 21-26, 13:1-3; మత్త. 10:7-13
ధ్యానాంశము: వేదప్రచారం మన కర్తవ్యం
ధ్యానమునకు ఉపకరించు
వాక్యములు: “మీరు ఉచితముగా పొందితిరి. ఉచితముగానే ఒసగుడు” (మత్త. 10:8).
ధ్యానము: నేడు అపోస్తలుడు, పునీత పౌలు సహచరుడు, వేదసాక్షి
పునీత బర్నబాసు (క్రీ.శ. 1-60) మహోత్సవమును కొనియాడుచున్నాము. యూదలేవీ వంశానికి
చెందిన గొప్ప ధనవంతుడైన ‘యోసేపు’, పెంతకోస్తు తరువాత క్రీ.శ. 29 లేక 30లో క్రీస్తు
విశ్వాసిగా మారి ‘బర్నబాసు’ అను పేరు మార్చుకున్నారు. ‘బర్నబా’ అనగా
‘ఉత్సాహపరచువాడు’ అని అర్ధము (అ.కా. 4:36). “ఈ బర్నబా మంచివాడు. అతడు పవిత్రాత్మతోను,
విశ్వాసముతోను నిండియుండెను” (అ.కా. 11:24), అలాగే, “అతడు తన సొంత భూమిని అమ్మి,
వచ్చిన పైకమును తెచ్చి అపోస్తలుల పాదముల చెంత పెట్టెను” (11:37) అని చదువుచున్నాము.
పరివర్తన పొందిన పౌలును యెరూషలేము అపోస్తలులకు పరిచయం చేసినది ఈ బర్నబానే (9:27).
యెరూషలేములోని క్రీస్తు సంఘము బర్నబాసును అంతియోకియా సందర్శనకు పంపిరి. బర్నబాసు పౌలును
అచటకు తీసుకొని రాగా, వారిరువురు, ఒక ఏడాది అచట క్రీస్తు సంఘమును కలుసుకొని
అనేకులకు బోధించిరి (11:26). పౌలుతో కలిసి, అపూర్వ సేవలు అందించినందులకు, 12మందిలో
ఒకరు కాకున్నను, శ్రీసభ అతనిని ‘అపోస్తలుడు’గా గౌరవించినది. సైప్రసులో వేదప్రచారం
చేయుచుండగా, రాళ్ళతో కొట్టబడి చంపబడ్డారు. పునీత బర్నబా మనకు గొప్ప ఆదర్శం. ఆయన
గొప్ప విశ్వాసి.
No comments:
Post a Comment