10వ సామాన్య మంగళవారము
1 రాజు. 17:7-16; మత్త. 5:13-16
ధ్యానాంశము: ఉప్పు - వెలుగు
ధ్యానమునకు ఉపకరించు
వాక్యములు: “మీరు భూమికి ఉప్పు వలె నున్నారు. ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన యెడల దానిని
తిరిగి పొందలేము... మీరు లోకమునకు వెలుగై యున్నారు” (మత్త. 5:13-14)
ధ్యానము: నిజమైన శిష్యులు ఎవరు? సమాజంపట్ల
బాధ్యత కలిగి యుండాలి. శిష్యులు భూమికి ఉప్పువలె, లోకమునకు వెలుగై యుండాలని యేసు కోరారు.
నిజమైన శిష్యుడు పరిశుద్ధత కొరకు పోరాడుతాడు. పరిశుద్ధమైన శిష్యుడు భూమికి ఉప్పు,
లోకమునకు నిజమైన వెలుగు. ‘విశ్వాసులు ఉప్పదనమును కలిగి యుండాలి’ (మార్కు. 9:50). ఉప్పులేని
భోజనం రుచించునా! ఆహారం క్షీణించకుండా కాపాడే గుణం, నయంచేసే గుణం, మలినాలను శుద్ధిచేయు
గుణం ఉప్పుకు కలదు. కనుక, ఉప్పదనమును కలిగియుండుట అనగా, ఇతరుల జీవితాలకు అభిరుచి
కలిగించుట. వారి పవిత్రతను కాపాడుట. పాపముతో గాయపడిన వారికి స్వస్థత చేకూర్చుట.
ఇది చేయడం ఎలా? విశ్వాసమునకు సాక్ష్యమివ్వు; ఇతరులపట్ల శ్రద్ధవహించు; వారిలో
ధైర్యాన్ని నింపు; నీకున్నదానిని ఇతరులతో పంచుకో; ఇతరుల కొరకు ప్రార్ధించు.
No comments:
Post a Comment