1. బైబులు - భౌగోళిక స్వరూపము - ప్రదేశాలు

 1. బైబులు - భౌగోళిక స్వరూపము - ప్రదేశాలు

బైబులు - మానవ చరిత్రలో దేవుడు జోక్యము చేసుకొన్న మానవాళి రక్షణ వృత్తాంతమే బైబులు. దేవుని జోక్యం మానవుల సహకారముతో జరిగినది. కనుక, ఇది రక్షణ చరిత్ర - భౌగోళిక రక్షణ అని చెప్పుకోవచ్చు. యావే ఎన్నుకున్న 'ఇశ్రాయేలు' ప్రజలు, ఒక జాతిగా మధ్య-తూర్పు దేశమైన పాలస్తీనా / కనాను దేశములో అభివృద్ధి చెందడం ప్రారంభించారు. పాత నిబంధన రక్షణ చరిత్ర అంతయు, ఈ పాలస్తీనా చుట్టూ ప్రక్కలే అవగతం చేయబడినది. దైవ కుమారుడు యేసుక్రీస్తు, పాలస్తీనా దేశము, గలిలీయ ప్రాంతము నజరేతు నగరములోని యూద కుటుంబములో జన్మించుట ద్వారా పాత నిబంధన రక్షణ చరిత్ర చొరవ అంతిమ ఘట్టానికి చేరుకుంటుంది. దైవ కుమారుడు, మెస్సయ్య యేసుక్రీస్తు జన్మతో, తన సాన్నిధ్యముతో పావనపరచిన భూమి క్రైస్తవలోకానికి 'పవిత్ర భూమి'గా సుపరిచితము.

ఈ భాగములో ప్రధానముగా, బైబులులో కనిపించెడు స్థలాలు, ప్రదేశాలు, పట్టణాల గురించి అధ్యయనం చేస్తాము. క్లుప్తముగా చెప్పాలంటే, బైబులు-భౌగోళికం అనగా ఐగుప్తు, యూఫ్రటీసు నది మధ్యననున్న సిరో-పాలస్తీనా ప్రాంతం అని అర్ధం. మరింత పరిమితముగా చెప్పాలంటే, దావీదు మరియు సొలోమోనులు తమ రాజ్య భౌగోళిక విస్తరణ గావించిన పాలస్తీనా అని అర్ధము. రాజకీయముగా, ప్రస్తుతం ఈ ప్రాంతం సిరియా, లెబానోను, జోర్డాన్, ఇశ్రాయేలు, పాలస్తీనా, సినాయి ద్వీపకల్పం (ఐగుప్తులో భాగం) మరియు ఇశ్రాయేలు ఆక్రమించిన ట్రాన్స్-జోర్డాన్ ప్రాంతములుగా ఆక్రమించ బడినది. ఈ ప్రాంతాలన్నింటిని కలిపి, బైబులు భౌగోళికములో సిరో-పాలస్తీనా ప్రాంతముగా పిలుస్తున్నాము. సిరో-పాలస్తీనా ప్రాంత సరిహద్దులు: ఉత్తరమున అంతియోకు దరిలోని పర్వతము, తూర్పున యూఫ్రటీసు నది లోయ, దక్షిణమున అరేబియా ఎడారి మరియు ఎర్ర సముద్రము, పశ్చిమమున మధ్యధరా సముద్రము. ఉత్తారాన దాను, దక్షిణాన సినాయి మధ్యనగల భూమి పొడవు 300-375 కిలోమీటర్లు.  దాను, కాదేషు-బార్నెయా మధ్యన 300 కిలోమీటర్లు; దాను, ఎలాతు మధ్యన 375 కిలోమీటర్లు.

నదులు
1. ఒరోన్తెసు మరియు లితని: ఈ రెండు నదులు ఉత్తర భూభాగాన ఉన్నాయి.
2. యోర్దాను నది: హేర్మోను పర్వత వాలుల నుండి ఉద్భవిస్తుంది. ఇది హులె మరియు గలిలీయ సరస్సులలోనికి ప్రవహించి, అక్కడనుండి మృత సముద్రములో కలుస్తుంది.
3. యార్ముకు మరియు జబ్బోకు: యోర్దాను నదికి ఉపనదులు
4. అర్నోను: మృత సముద్రములోనికి ప్రవహిస్తుంది
5. బ్రూకు అఫ్ జేరేదు: మృత సముద్రములోనికి ప్రవహిస్తుంది
6. అయిన్ జలుదు: గెల్బో పర్వత వాలుల నుండి ఉద్భవిస్తుంది.
7. కిశోన్ మరియు యార్కొను: రెండు చిన్న నదులు మధ్యధరా సముద్రములోనికి ప్రవహిస్తున్నాయి
8. ఐజలోను: యార్కొను నదికి ఉపనది
9. ఎలాః మరియు సోరేకు: రెండు చిన్న నదులు మధ్యధరా సముద్రములోనికి ప్రవహిస్తున్నాయి

మైదానాలు
1. అషేరు లేదా అక్కో: హైఫా, అక్కో మధ్యన కర్మెలు పర్వతమునకు ఉత్తర భాగము 
2. షారోను: మధ్యధరా తీరమున కర్మెలు పర్వతమునకు దక్షిణ భాగము
3. ఫిలిస్తేయ: మధ్యధరా తీరమున, ఐగుప్తు సరిహద్దుల వరకు
4. షెఫేలః: ఫిలిస్తేయ మైదానం, యూదయా పర్వతముల మధ్యన
5. ఎస్ద్రాలోను / యెస్రెయేలు: గలిలీయ, కర్మెలు, యూదయా పర్వతముల మధ్యన
6. బాషాను: 
7. మోవాబు: మృత సముద్రమునకు ఈశాన్యమున

పర్వతములు
1. లెబానోను; 2. సిరియోను; 3. హెర్మోను; 4. కర్మెలు; 5. తాబోరు; 6. గిల్బోవా; 7. ఎఫ్రేము; 8. గెరిసీము; 9. యూదయా; 10. ఓలీవు; 11. సియోను; 12. మోరీయా; 13: నెగేబు; 14. హోరేబు; 15. నెబో.

లోయలు
1. లెబానోను (బెఖా); 2. యెస్రెయేలు; 3. యోర్దాను; 4. కీద్రోను; 5. హిన్నోము; 6. తైరోపియను (పాత యెరూషలేము పట్టణ మధ్యన; ప్రస్తుతం కట్టడాల వలన కనుమరుగైపోయింది)

ఎడారులు
1. యూదయా; 2. సమరియ; 3. అరేబియా; 4. సినాయి; 5. నెగేబు

ప్రాంతములు / మండలములు
1. లెబానోను (తూరు, సిదోను); 2. గలిలీయ; 3. సమరియ; 4. యూదయా; 5. ఫిలిస్తియ; 6. ఇదూమయ; 7. సిరియా; 8. బాషాను; 9. గిలాదు; 10. అమ్మోను; 11. మోవాబు; 12. ఎదోము; 13. ఇతూరయా, అబిలేనే; 14. గోలాను, బతనెయ త్రకోనితిసు; 15. పెరియ (యోర్దాను నదికి ఆవలి దిక్కు); 16. దెకపొలి; 17. నబతెయ (యూఫ్రటీసు-ఎర్రసముద్రము మధ్య ప్రాంతము).

గలిలీయ సముద్రము: 212 మీటర్లు సముద్ర మట్టం క్రింద; 54 మీటర్ల లోతు; 21 కిలోమీటర్ల పొడవు; 13 కిలోమీటర్ల వెడల్పు; శుభ్రమైన నీరు.
మృత సముద్రము: 792 మీటర్లు సముద్ర మట్టం క్రింద; 408 మీటర్ల లోతు; 76 కిలోమీటర్ల పొడవు; 17 కిలోమీటర్ల వెడల్పు; విపరీతమైన ఉప్పునీరు.

కనాను దేశములో యిస్రాయేలు గోత్రములు
I. యోర్దాను నదికి పశ్చిమ వైపున:
1. దాను (= తీర్పు); 2. ఆషేరు (= భాగ్యము); 3. సెబూలూను (= కానుక); 4. నఫ్తాలి (= పోరాటము); 5. ఇసాఖార్ (= కొనుగోలు); 6. మనష్హే (సగం); 7. ఎఫ్రాయీము; 8. బెన్యామీను (= కుడిచేయి పుత్రుడు); 9. యూదా (= స్తుతింపు); 10. షిమ్యోను (= వినుట);
II. యోర్దాను నదికి తూర్పు వైపున:
మనష్హే (సగం); 11. గాదు (= అదృష్టము); 12. రూబేను (= ఇదిగో కుమారుడు) 

బైబులులో ముఖ్య పట్టణాలు, స్థలాలు
I. పాత నిబంధనలోని కొన్ని ముఖ్య పట్టణాలు 
1. లేషేము (దాను); 2. హాసోరు; 3. మెగిదో; 4. షెకెము, షిలో, బేతేలు; 5. యెరూషలేము; 6. హెబ్రోను; 7. సొదొమ, గొమొఱ్ఱా; 8. బెర్షేబా, కాదేషు-బార్నెయా; 9. ఎలాతు; 10. ఆశ్దోదు, అష్కేలోను, ఎక్రోను; 11. గాతు, గాసా.
II. నూతన నిబంధనలోని కొన్ని ముఖ్య స్థలాలు 
1. తూరు, సిదోను; 2. కైసరయా ఫిలిప్పు, బెత్సాయిదా; 3. కొరాజీను, కఫర్నాము, గెన్నెసరేతు; 4. తిబేరియా; 5. కనాను, నజరేతు, తాబోరు, నయీను; 6. దెకపొలి, గెరాసేను, గదరేను; 7. యెరికో; 8. యెరూషలేము; 9. బెత్లెహేము; 10. యోప్పా, లిద్దా; 11. జామ్నియ, బెతానియా, బెత్ఫగే, ఎమ్మావు.

No comments:

Post a Comment