సామాన్య రెండవ వారం - గురువారం (II)

దేవుని ప్రేమ సందేశం
సామాన్య రెండవ వారం - గురువారం
పఠనాలు: 1 సమూ 18:6-9, 19:1-7; మార్కు 3:7-12

ధ్యానం: స్వస్థత పరిచర్య - దివ్య కారుణ్యం
ఊచ చేయి వాని స్వస్థత తరువాత, పరిస్సయ్యులు యేసును చంప ప్రయత్నాలు చేసిరి. ప్రభువు తన శిష్యులతో గలిలీయ సరస్సు తీరమునకు వెళ్ళెను.
యేసు ప్రభువు అనుదినము తన సువార్త పరిచర్యను, స్వస్థత పరిచర్యను కొనసాగించారు. ఆయనను అనేకమంది విశ్వసించి, స్వస్థత కొరకు ఆయన యొద్ధకు వచ్చారు.
ప్రభువు నిమిత్తమై ఆకలిదప్పులు గల వారందరికి, ఆయన వాక్కును ఆలకించు వారందరికి, వారివారి వ్యాధి బాధలనుండి విముక్తిని, స్వస్తతను కలుగ జేసారు. ప్రభువును తాకటానికి ప్రజలు (యూదులు, అన్యులు) ఎగబడ్డారు. వారు స్వస్థత పొందినప్పుడు ఆయన నుండి శక్తి బయటకు వెడలింది.
మంచికి, స్వస్థతకు ప్రభువే మూలం, ఆధారం. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అను మూడు సుగుణాలను నేటి సువిషేశములో చూడవచ్చు. ప్రభువు నందు విశ్వాసము వలన ప్రజలు గుంపులుగా అనేక ప్రాంతాల నుండి వచ్చారు. ప్రభువును ఎంతగా అనుసరిస్తే, అంతగా విశ్వాసం బలపడుతుంది.
నిరీక్షణ: పరలోక రాజ్యము, శాశ్వత జీవం మన నిరీక్షణ. ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రభువు చెంతకు వచ్చారు. స్వస్థత కొరకు నిరీక్షించారు. దివ్యసత్ప్రసాద రూపమున అదే ప్రభువు మన యొద్ధకు వచ్చుచున్నారు. మన నిరీక్షణ ఏమిటి?
ప్రేమ: దైవప్రేమ - సోదర ప్రేమ. ప్రభువు స్వస్థతలు దైవప్రేమకు నిదర్శనం.
నేడు శారీరక స్వస్థత కన్న, మనకు ఆధ్యాత్మిక స్వస్థత ఎంతో అవసరం.
దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అంటే, ప్రార్థన ఎంతో ముఖ్యం.

No comments:

Post a Comment