దేవుని ప్రేమ
సందేశం:
అనుదిన ధ్యానాంశాలు (II)
ఆగమన కాల మూడవ
వారము
- శుక్రవారం
ఆది. 49:2, 8-10; మత్తయి 1:1-17
ధ్యానాంశము: యేసు క్రీస్తు వంశావళి
ధ్యానము: నేటి
సువార్తలో యేసు క్రీస్తు వంశావళిని చదువుచున్నాము. (1). పాత నిబంధనలో వాగ్దానం
చేయబడిన మెస్సయ్య అయిన యేసు మానవునిగా జన్మించి, మానవ కుటుంబములో, చరిత్రలో
ప్రవేశించడాన్ని సూచిస్తుంది. దేవుడు వాగ్దానం చేసిన మెస్సయ్య యేసేనని
సూచిస్తుంది. అబ్రహామునుండి యేసు వరకు దేవుని రక్షణ ప్రణాళిక కొనసాగింపు
స్పష్టమగుచున్నది. అలాగే, వంశావళి యేసు మానవ కుటుంబ వంశావళిని తెలియజేస్తుంది.
మనలాగే, యేసు పూర్వీకుల జాబితాలో, మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. ఇంకా గమనించినట్లయితే,
ఈ జాబితాలో ఐదుగురు స్త్రీలు ఉండటం చూస్తున్నాము: తామారు, రాహాబు, రూతు, బత్సెబా,
మరియ. యూదేతరులు కూడా దీనిలో ఉండటం, దేవుని రక్షణ సర్వమానవాళికి అని అర్ధం
అగుచున్నది. అలాగే యేసు, “నేను పాపులను పిలువవచ్చితిని కాని, నీతిమంతులను
పిలుచుటకు రాలేదు” అని చెప్పారు (మత్తయి 9:13). యేసు అంతిమ సందేశములో, “వెళ్లి,
సకల జాతి జనులను తనకు శిష్యులను చేయుమని” తన శిష్యులకు ఆజ్ఞాపించారు (మత్తయి
28:19).
(2). “దావీదు కుమారుడు”, “అబ్రహాము
కుమారుడు” “క్రీస్తు” (మెస్సయ్య) (1:1) అన్న బిరుదులు, దేవుడు చేసిన వాగ్దానాన్ని
బట్టి, యేసు దావీదునకు వారసున్ని చేస్తుంది (2 సమూ 7:16). “అబ్రహాము కుమారుడు”
అన్న బిరుదు “భూమండలమందలి సకల జాతుల వారు నీ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు” (ఆది 22:18) అన్న దేవుని వాగ్దానాన్ని
సూచిస్తుంది.
(3). యేసు క్రీస్తు వంశావళి
యూదుల చరిత్రలోని మూడు కాలాలను సూచిస్తుంది: మొదటగా అబ్రహామునుండి దావీదు వరకు (ఇశ్రాయేలు
గొప్పతనం), రెండు దావీదునుండి బాబులోనియ ప్రవాసము వరకు (ఇశ్రాయేలు పతనం), మూడు బాబులోనియ ప్రవాసమునుండి యేసు జననం వరకు (ఇశ్రాయేలు పునరుద్ధరణ).
No comments:
Post a Comment