దేవుని ప్రేమ
సందేశం:
అనుదిన ధ్యానాంశాలు (II)
క్రిస్మస్ 1వ
వారము
- గురువారం
1 యోహాను 2:12-17; లూకా 2:36-40
ధ్యానాంశము: బాలయేసు
సమర్పణ – అన్నమ్మ ప్రవక్తి
ధ్యానమునకు
ఉపకరించు వాక్యములు: అన్నమ్మ అనెడు ప్రవక్తి “ఉపవాసములు,
ప్రార్ధనలు చేయుచు, రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి యుండెను” (లూకా 2:37).
ధ్యానము: అన్నమ్మ ఒక ప్రవక్తి. అషేరు (యిస్రాయేలు
12 వంశీయులలో ఒకరు) వంశీయుడగు ఫనూవేలు పుత్రిక. వివాహమై ఏడు సంవత్సరములు
మాత్రమే సంసారము చేసి, ఆతరువాత 84 సంవత్సరాలు విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయెను.
ఉపవాసములు, ప్రార్ధనలు చేయుచు, రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి యుండెను.
బాలయేసును చూచి దేవునకు ధన్యవాదములు అర్పించెను. విముక్తికై నిరీక్షించు వారందరకు
ఆ బాలుని గురించి చెప్పెను. ఆమె వృధ్యాప్యం ఆమె నిరీక్షణను ఆపలేదు. దేవుని వాగ్దానమందు
దృఢముగా విశ్వసించినది. దేవుని ఆరాధించడం, ప్రార్ధించడం ఎన్నడు ఆపలేదు. అందులకే,
రక్షకుని చూసే భాగ్యాన్ని ఆమెకు కల్పించాడు. “నేను నీకు వెల్లడిచేయు సంగతి నిర్ణీత
కాలమున జరుగును. కాని ఆ కాలము త్వరలో వచ్చును. ఆ సంగతి నెరవేరి తీరును. అది ఆలస్యముగా
నెరవేరునట్లు కన్పించినను నీవు దానికొరకు వేచియుందుము. అది తప్పక జరుగును. ఇక
ఆలస్యము జరగదు” (హబ. 2:3).
క్రిస్మస్ కాలములో ఉన్నాము.
అన్నమ్మవలె క్రీస్తును కనుగొన్నామా? కనుగొని దేవుని స్తుతించామా? క్రీస్తు గురించి
ఇతరులకు తెలియ జేసామా?
No comments:
Post a Comment