మంగళవారం, ఆగమన కాల రెండవ వారము (II)

 దేవుని ప్రేమ సందేశంఅనుదిన ధ్యానాంశాలు
మంగళవారంఆగమన కాల రెండవ వారము
యెషయా 40:1-11; మత్తయి 18:12-14

ధ్యానాంశము: దేవుని అనంతమైన ప్రేమ

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: తప్పిపోయిన దానిని వెదకి రక్షింప వచ్చియున్నాడు” (మత్తయి 18:11)

ధ్యానము: త్రోవ తప్పిన గొఱ్ఱె ఉదాంతము ద్వారాపాపము వలన తప్పిపోవుచున్న మానవున్ని దేవుడు తప్పక వెదకునని యేసు తెలియజేయు చున్నాడు. దేవుడు ఏకారణం చేతను ఎవరిని ఉపేక్షింపడు. తప్పిపోయిన దానిని వెదకి రక్షింప తన కుమారున్ని ఈ లోకమునకు పంపియున్నాడు. మనలో ప్రతీ ఒక్కరిని ఆయన ప్రేమించుచున్నాడు. ప్రతీ ఒక్కరు ముఖ్యమైనవారేవిలువైనవారే. మనలను రక్షించడానికి దేవుడు ఏమైనా చేస్తాడుతన కుమారుని ప్రాణాలను సైతం అర్పిస్తాడు. ఎందుకనఒకడైనను నాశనమగుట పరలోకమందున్న తండ్రి చిత్తము కాదు. "పశ్చాత్తాపము అవసరము లేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల కంటేహృదయ పరివర్తనము పొందు ఒక పాపాత్ముని విషయమై పరలోకమున ఎక్కువ ఆనందము ఉండును" (లూకా 15:7). కనుకపాపములో పడి రక్షణ మార్గమును తప్పిన వాడుహృదయపరివర్తనము చెంది తిరిగి దేవుని దరికి చేరినప్పుడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. తన అనంతమైన ప్రేమ కౌగిలిలో బంధిస్తాడు. పరలోకములో పండగ చేస్తాడు. ముఖ్యమైన విషయం ఇమిటంటేమన పరివర్తనకు దేవుడు తప్పక సహాయం చేయును. 

యెషయా దేవుని ఆగమనం’ గురించి ప్రస్తావిస్తూదేవుడు కాపరివలె తన ముందను మేపును. గొర్రె పిల్లలను చేతులలోనికి తీసికొనిరొమ్ముమీద పెట్టుకొని మోసికొనిపోవును" (40:11) అని దేవుని గాఢమైన ప్రేమను వ్యక్తపరచాడు. యేసు మన మార్గంసత్యంజీవం. ఆయనను అనుసరిస్తేమనం ఎప్పటికీ తప్పిపోము. ఒక వేళ తప్పిపోయిననుఆయన మనలను కనుగొని తన మందలోనికి చేర్చుకొనును.

No comments:

Post a Comment