సోమవారం, ఆగమన కాల రెండవ వారము (II)

దేవుని ప్రేమ సందేశంఅనుదిన ధ్యానాంశాలు
సోమవారంఆగమన కాల రెండవ వారము
యెషయా 35:1-10; లూకా 5:17-26

ధ్యానాంశము: పక్షవాత రోగికి పాపక్షమాపణ-స్వస్థత

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: ఓయీ! నీ పాపములు క్షమింప బడినవి” (లూకా 5:20).

ధ్యానము: కొందరు పక్షవాత రోగిని యేసు వద్దకు తీసుకొని వచ్చారు. రోగి స్నేహితులైనసేవకులైన యుండవచ్చు. వారు అతనిని స్వస్థపరచలేరనిఆ దైవకార్యమును యేసు చేయగలడని విశ్వసించారు. వారి విశ్వాసం చాలా గొప్పది. జనసమూహము పెద్దదిగా ఉండుట వలనఇంటిపైకి ఎక్కికప్పును తీసివేసి మంచముతోపాటు రోగిని యేసు ముందట దించిరి. ఆటంకాలను అధిగమించారు. యేసు శిష్యులు చేయవలసిన ప్రేషిత కార్యము ఇట్టిదే! మనం ఆత్మలను రక్షించ లేనప్పుడుక్రీస్తు సేవకులవలె వారిని ఆయన చెంతకు తీసుకొని రావాలి. విశ్వాసులను దివ్యపూజలో పాల్గొనున్నట్లు చేయడంపాపసంకీర్తనమునకు వెళ్లునట్లు చేయడంక్రీస్తును గురించి మనం మంచి ఆదర్శమును ఇవ్వడం ద్వారా,ఇతరులను రక్షింపవచ్చు. యేసు అప్పుటికే ఎన్నో అద్భుతాలు చేశారు. అయినను పరిసయ్యులుధర్మశాస్త్ర బోధకులు ఆయనను విశ్వసించలేదు. పాప క్షమాపణ ద్వారా తన శక్తిని ప్రదర్శించుటకు యేసు నిశ్చయించుకొనెను. అందుకేరోగితో, "ఓయీ! నీ పాపములు క్షమింప బడినవి" అని చెప్పెను. యేసు కాలమునరోగమునకు కారణం పాపము అని భావించేవారు. పాపక్షసమాపణ లభిస్తేశారీరక స్వస్థత లభించును. అప్పుడుపరిసయ్యులుధర్మశాస్త్ర బోధకులు దేవుడు తప్ప పాపములను ఎవరు క్షమించగలరుయేసు దైవదూషణ చేయుచున్నాడని భావించారు. కానిమనుష్య కుమారునకు పాపములు క్షమించు అధికారము కలదని నిరూపించుటకు యేసు రోగిని స్వస్థ పరచెను. పాపసంకీర్తనం అను దివ్య సంస్కారము ద్వారామన పాపములను క్షమించుట ద్వారాయేసు తన లోతైన ప్రేమను మనపై క్రుమ్మరించుచున్నారు.

యేసువలె మనము ఇతరులను క్షమించుటకు సిద్ధముగా ఉన్నామాఇతరులను హృదయపూర్వకముగా క్షమించగలగాలి. మన సిలువ భారం కావచ్చుపాత్ర చేదుగా ఉండవచ్చుమార్గం కఠినముగా ఉండవచ్చుఅయినను మనం నిస్సహాయులం కాదుఎందుకంటేయేసు మనతో ఉన్నారు. ఖచ్చితముగా సహాయం చేస్తారు.

No comments:

Post a Comment