శుక్రవారం, ఆగమన కాల మొదటి వారము (II)

దేవుని ప్రేమ సందేశంఅనుదిన ధ్యానాంశాలు

శుక్రవారంఆగమన కాల మొదటి వారము

పునీత ఫ్రాన్సిస్ శౌరి వారి మహోత్సవం

యెషయా 61:1-3; 1 కొరింథీ 9:16-19మార్కు 16:15-20 (లేదా)

యెషయా 29:17-24; మత్తయి 9:27-31


ధ్యానాంశము: ఇద్దరు గ్రుడ్డివారికి దృష్టిదానము (మత్తయి 9:27-31)

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: మీరు విశ్వసించినట్లు జరుగునుగాక!” (మత్తయి 9:29).

ధ్యానము: ఇద్దరు గ్రుడ్డివారు యేసు వెంటబడుచున్నారు. దావీదు కుమారా! మమ్ము కరుణింపుము అని మొరపెట్టుకున్నారు.వారు యేసును రక్షకునిగామెస్సయ్యగాపరమ వైద్యునిగా గుర్తించారు. ఆయనను అనుసరించారు. యేసు శక్తినందు నమ్మకముంచారు. ప్రభువునందు విశ్వసించారు. వారి విశ్వాసం వారి శారీరక అవరోధాలను కూడా అధిగమించేలా చేసింది. వారి విశ్వాసాన్ని బట్టియేసు వారికి దృష్టి దానము చేశారు. అంతేగాకవారు పోయి యేసు కీర్తిని దేశమంతటా ప్రచారం చేశారు. క్రీస్తుకు సాక్ష్యమిచ్చారు. "ఆ దినమున కారు చీకటిలో నున్న గ్రుడ్డివారు కన్నులు విప్పి చూతురు" అని యెషయా ప్రవచించాడు (29:18). మనము కూడా మన మానసికఆధ్యాత్మికనైతిక అంధత్వమును స్వస్థత పరచమని యేసును మొరపెట్టుకుందాం. "లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించు వాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును" (యోహాను 8:12) అని ప్రభువు చెప్పియున్నారు.

విశ్వాసం దేవుడు ఒసగు ఆధ్యాత్మిక ఔషధతైలం. యేసు నీ జీవితములో అద్భుతాలు చేయగలడని విశ్వసించు చున్నావాక్రీస్తు వెలుగులో జీవించడానికి సిద్ధముగా ఉన్నావానీ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నావా?

పునీత ఫ్రాన్సిస్ శౌరివారు 7 ఏప్రిల్ 1506వ సం.లో ఉత్తర స్పెయిన్ దేశములోని క్సవేరి అను నగరములోజువాన్ ది జాస్సోమరియ దంపతులకు జన్మించాడు. వారిది సంపన్నుల కుటుంబము. ఫ్రాన్సిస్ వారికి తొమ్మిది సం.ల వయస్సునే తండ్రి మరణించాడు. 1525వ సం.ము వరకు తన కుటుంబముతోనే ఉండి చదువులను పూర్తి చేసాడు. 1525వ సం.లో పైచదువుల నిమిత్తమై పారిస్ నగరములోని సెయింట్ బార్బర విశ్వవిద్యాలయమునకు వెళ్ళాడు. 1528వ సం.లో చదువులు పూర్తి చేసికొని పట్టభద్రులైనారు. ఆ తరువాత అక్కడే అధ్యాపకులుగా పనిచేసారు. పారిస్ నగరములో ఉన్నంతకాలము జీవితములో తనకంటూ ఓ ప్రత్యేక పేజీ ఉండాలని కోరుకొన్నాడు. ఈ లోకములో ఏదో సాధించాలనే పట్టుదలతో ఉండేవాడు. 1529వ సం.లో పునీత ఇన్యాసి వారిని కలిసి ఆయనకు విశ్వాసపాత్రుడైన సహచరునిగా మారాడు. ఇన్యాసివారు, "లోకమంత సంపాదించినీ ఆత్మను కోల్పోతే ఏమున్నది?" అని అడిగిన ప్రశ్నకుఫ్రాన్సిస్ వారిలో పరివర్తన కలిగింది. దేవునికోసంసువార్తకోసం జీవించాలని నిశ్చయించుకున్నాడు. 15 ఆగష్టు 1534 వ సం.లో మోంట్ మార్త్రే లోని చిన్న గుడిలోఇన్యాసివారుఫ్రాన్సిస్ వారుమరో ఐదుగురు సహచరులతో కలసిపేదరికముబ్రహ్మచర్యమువిధేయత అను వ్రతాలను దేవునికి ప్రతిజ్ఞ చేసియున్నారు. అలాగే మహమ్మదీయులను క్రైస్తవ విశ్వాసములోనికి నడిపింపవలయునని కూడా దీక్షబూనారు. అలా యేసుసభకు పునాదులు వేసారు. 1536వ సం.లో పారిస్ వదలి ఇటలీ దేశములోని వెనిస్ పట్టణానికి వెళ్లారు. అక్కడ 24 జూన్ 1537వ సం.లో గురువులుగా అభిషిక్తులైనారు. అక్టోబర్ చివరిలో ఏడుగురు సహచరులు బోలోగ్న పట్టణమునకు చేరుకొని అక్కడ స్థానిక ఆసుపత్రిలో సేవలు చేసారు. ఆతరువాత1538వ సం.లో ఫ్రాన్సిస్ వారు రోమునగరమునకు వెళ్ళి అక్కడ కొంతకాలం ఇన్యాసివారికి సెక్రేటరిగా పని చేసారు.

పోర్చుగల్ రాజైన జాన్భారత దేశానికి గురువులను పంపవలసినదిగా ఇన్యాసివారిని కోరినప్పుడుఫ్రాన్సిసు వారిని ఈ కార్యానికి ఎన్నుకోవడం జరిగింది. ఫ్రాన్సిస్ వారుభారత దేశానికి మిషనరీగా వెళ్ళుటకు ఎంతో సంతోషముగా అంగీకరించాడు. తనతో శ్రీసభ ప్రార్ధనా పుస్తకంధ్యాన పుస్తకం మాత్రమే తీసుకొని వెళ్ళాడు. యేసుసభ మొదటి మిషనరీగా 7 ఏప్రిల్ 1541వ సం.లో భారత దేశానికి ప్రయాణమైమార్గమధ్యలో మోజాంబిగ్ లో సువార్తా ప్రచారం చేసిరోగులకు సేవలు చేసి6 మే 1542వ సం.లో గోవా పట్టణమునకు చేరుకొన్నాడు. అచ్చటి స్థానిక భాషను నేర్చుకొని సువార్తను భోదించాడు. అనారోగ్యులకు సేవలు చేసాడు. ఆయన బోధనలను ఆలకించుటకు అనేకమంది ఆయన చుట్టూ గుమికూడెడివారు. అక్కడ చాలా అద్భుతాలు చేస్తూచుట్టూ ప్రక్కల గ్రామాలలో కూడా సంచారము చేసి లెక్కలేని పరపరులకు జ్ఞానస్నానమిచ్చియున్నాడు. గోవా చేరిన కొన్ని మాసముల తర్వాతనేదక్షిణ భారత దేశమున కేప్ కొమొరిన్ కు వెళ్ళిఅక్కడ 3 సం.లు చేపలు పట్టువారుపరపరుల మధ్య పనిచేసాడు. ఏప్రిల్ 1544వ సం.లో మైలాపురంలోని అపోస్తలుడు పునీత తోమాసువారి సమాధిని సందర్శించిఅక్కడ నాలుగు మాసాలపాటు ఉండి చుట్టుప్రక్కల సువార్తా ప్రచారం చేసాడు. 

ఆయన తన మిషనరీ కార్యములో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. గోవానుండి తన సువార్తా ప్రచారాన్ని సిలోనుఇండోనేషియాశ్రీలంకజపాను దేశాలకు విస్తరించాడు. 17 ఏప్రిల్ 1549వ సం.లో గొప్ప ఉత్సాహముతో సువార్తా ప్రచారమునకై జపాన్ దేశమునకు ప్రయాణమైయ్యాడు. అక్కడ రెండు సం.ల మూడు నెలల పాటు సువార్తా ప్రచారం చేసిఅనేకమందిని క్రైస్తవ విశ్వాసములోనికి నడిపించగలిగాడు.

ఆగష్టు 1552వ సం.లో గోవాకు తన తిరుగు ప్రయాణములో సువార్తా ప్రచారాన్ని చైనాలో కూడా విస్తరింప జూసాడు. కానితన ప్రయాణములో అనేక ఇబ్బందులకుప్రతిఘటనలకు గురికావలసి వచ్చింది. 21 నవంబర్ 1552న తీవ్రముగా జబ్బుపడిబలహీనుడై3 డిశంబర్ 1552నతన 46వ ఏట భాగ్యమైన మరణమును పొందియున్నాడు. మరుసటి రోజునమొదటిగా శాంగ్చువాన్ ద్వీపములో సమాధి చేయబడ్డాడు. ఆతరువాత 22 మార్చి 1553వ సం.లో మలాక్కలోని పునీత పౌలుగారి దేవాలయములో సమాధిచేయబడ్డాడు.

పుణ్య జీవితమునుబట్టిప్రఖ్యాతి పొందియుండుటచేరెండు నెలలకుపై తరువాతఆయన సమాధిని తెరచినప్పుడుకుళ్ళని ఆయన శరీరమును కనుగొనిరి. ఆయన పవిత్ర శరీరమును గోవాకు 11 డిశంబర్ 1553వ సం.లో తీసుకొని రావడం జరిగింది. ఆయన పవిత్ర శరీరమును నేటికిని గోవా పట్టణములోని16వ శతాబ్దములో నిర్మించబడిన పెద్ద దేవాలయములో చూడవచ్చును.

తన జీవితాన్ని సంపూర్ణముగాహృదయపూర్వకముగాదేవునికితన ప్రజలకు అర్పించారు. ఎక్కడకు వెళ్ళినపేదరికములో జీవించారు. చాల మితముగా భోజనం చేసెడివారు. ఎక్కువగాపేదలతోపనివారితో గడిపేవారు. అనారోగ్యులకు సేవలు చేసెడివారు. రాత్రంతయు ప్రార్ధనలో గడిపేవారు. పునీత ఫ్రాన్సిస్ శౌరివారు ఎన్నో అద్భుతాలను చేసారు. ఆయన ఆత్మ ప్రేరితుడై అనేక భాషలలో మాట్లాడేవారని చెప్పేవారు. మరణించిన వారిని సైతం సజీవముగా లేపారు.

25 అక్టోబరు 1619వ సం.లో ఐదవ పౌలుపాపుగారిచే ధన్యత పట్టమును12 మార్చి 1622వ సం.లో గ్రెగోరి పాపుగారిచే పునీత పట్టమును పొందియున్నారు. 1748వ సం.లో తూర్పు దేశాల చర్చికి పాలక పునీతునిగా1904వ సం.లో 'ప్రోపగేషన్ ఆఫ్ ఫేయిత్' (Propagation of Faith)కు పాలక పునీతునిగా1927వ సం.లో మతబోధకుల పాలక పునీతునిగా ప్రకటింపబడియున్నాడు. ఆయన ఓడ ప్రయాణికులకు కూడా పాలక పునీతుడు.

1 comment: