గురువారం, ఆగమన కాల మొదటి వారము (II)

దేవుని ప్రేమ సందేశంఅనుదిన ధ్యానాంశాలు
గురువారం, ఆగమన కాల మొదటి వారము
యెషయా 26:1-6; మత్తయి 7:21, 24-27

ధ్యానాంశము: యేసు మన పునాదికోట

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: పరలోక మందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును” (మత్తయి 7:21).

ధ్యానము: ఎలాగైతే యిల్లును రాతి పునాదిపై కట్టుకుంటామోమన ఆధ్యాత్మిక జీవితాన్ని యేసు అను రాతిపై నిర్మించుకోవాలి. ఎన్ని శోధనలుశ్రమలుహింసలుఅవమానములుబాధలు వచ్చిననుమన ఆధ్యాత్మిక జీవితాలు కూలిపోవు. యేసు అను రాతి అనగా ఆయన బోధనలుఆయన జీవితంఆయన ఆదర్శం. యేసు బోధనలను ఆలకించి పాటించాలి (7:24)అప్పుడే మన ఆధ్యాత్మిక జీవితాలుగృహాలు దృఢముగాపదిలంగా ఉంటాయి. "ప్రభూ! ప్రభూ! అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు" అని యేసు గుర్తుకు చేస్తున్నారు. దేవుని చిత్తమును నెరవేర్చాలి. కనుకయేసు మాటలను వినుటవాటిని ఆచరించుట మన జీవితాలకు పునాది అని అర్ధమగుచున్నది. దేవునితో మన బంధం బలపడాలంటేయేసు అను రాతిపై పునాదిని నిర్మించుకోవాలి. అభద్రతాభావముతోగాకదేవునియందు భద్రతాభావముతో జీవించాలి. యేసునందు సంపూర్ణ నమ్మకాన్ని ఉంచినచో రాతి అయిన యేసు మన కోటగా మారును. అప్పుడు ఏ శక్తులు మనలను విచ్చిన్నం చేయలేవు.

క్రీస్తును రాయిగాకోటగా అంగీకరిస్తున్నామాదేవుని చిత్తాన్ని వెతకుచున్నామాయేసు మాటలను పాటిస్తున్నామా

No comments:

Post a Comment