“ప్రపంచ సముద్ర దినోత్సము”: ప్లాస్టిక్’ను సముద్రములో పడవేయకండి!
(Vatican News)ప్లాస్టిక్'లో చిక్కుకున్న చేప
“ప్రపంచ
సముద్ర దినోత్సము”ను ప్రతీ ఏటా జరుపుకుంటాము. సముద్ర రక్షణ గురించి ప్రజలలో అవగాహన
తెచ్చేందుకు ఈ దినమును ఏర్పాటు చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి అధికారికముగా
2008లో ‘ప్రపంచ సముద్ర దినోత్సవము’ను ప్రకటించింది. నేడు సముద్రాలు ఎన్నో విధాలుగా
కాలుష్యానికి గురవుతున్నాయి. ‘ప్రపంచ సముద్ర దినోత్సవ’ సందర్భముగా, పొప్
ఫ్రాన్సిస్ సముద్ర కాలుష్యాన్ని నివారించాలని, ముఖ్యముగా ప్లాస్టిక్ కాలుష్యమును నివారించాలని,
ప్లాస్టిక్’ను సముద్రములో పడవేయరాదని కోరారు.
11 జూన్
ఆదివారమున, పొప్ ఫ్రాన్సిస్, నేడు “ప్రపంచ సముద్ర దినోత్సము” అని గుర్తుచేశారు.
ఈరోజు మనం సముద్రముపై ఆధారపడి జీవించుచున్న వారి కొరకు ప్రార్ధన చేయాలి. వారు మన
జీవితములో పోషిస్తున్న ప్రాత్రను బట్టి, వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే,
సముద్రము పట్ల మనం సరియైన జాగ్రత్తలు తీసుకోవాలి. కాలుష్యం చేయరాదు, ముఖ్యముగా, సముద్రాలలో
ప్లాస్టిక్ వేయరాదు అని తెలియ చేశారు.
ప్రతీ
సంవత్సరం 8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ సముద్రములో చేరుతుందని UN తెలుపుతుంది. అది సముద్ర జీవనాన్ని నాశనం చేస్తుంది. ఆ కాలుష్యము
మన ఆహారములోకి కూడా వచ్చి చేరుతుంది. ప్లాస్టిక్ కాలుష్యం క్షీరాదులకు ఎంతో హాని
కలిగిస్తుంది. ప్లాస్టిక్ కాలుష్యం వలన, అనేక సముద్ర జీవాలు మరణిస్తున్నాయి. ఈ
విషయం గురించి పొప్ ఫ్రాన్సిస్ తన విశ్వలేఖ ప్రబోధం “Laudato Sì” (నం. 40-41)లో స్పష్టం చేసియున్నారు. “మన సముద్రాలను, మహాసముద్రాలను అంతులేని
ప్లాస్టిక్’తో తేలియాడే క్షేత్రాలుగా మార్చడానికి వీలు లేదు” అని పొప్ ఫ్రాన్సిస్ 2008లో ఒక
వాటికన్ సదస్సులో తెలిపారు.
No comments:
Post a Comment