పోపు ఫ్రాన్సిస్
జనరల్ ఆడియన్స్
A. జెమెల్లి యూనివర్సిటీ హాస్పిటల్
ఆదివారం, 11 జూలై 2021
అందరికి ఆరోగ్య సంరక్షణ అత్యవసర సేవ, 11 జూలై 2021
పొప్
అనారోగ్యముతో “జెమెల్లి” ఆసుపత్రిలో ఉన్నప్పటికిని, 11 జూలై ఆదివారమున, తను ఉన్న 10వ
అంతస్తు బాల్కని కిటికీ నుండి, కింద సమావేశమైన ప్రజలను అభివాదముతో పలకరించారు. తన
అనారోగ్యములో వారి సాన్నిహిత్యానికి పొప్ ఫ్రాన్సిస్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బాధలలోనున్న
వారికోసం, సంరక్షణ అవసరమైన వారికోసం ప్రార్ధనలు చేసారు.
పొప్
ఫ్రాన్సిస్ ‘శుభోదయం’ అంటూ అందరికి అభివాదం చేసారు. పేగు శస్త్రచికిత్స జరిగి వారమై,
ఇంకా కోలుకుంటున్నప్పటికినీ, ఆసుపత్రినుండి, అక్కడ చికిత్స పొందుచున్న పిల్లలతో
ప్రజలకు అభివాదం చేసారు. ఆ పిల్లల కొరకు ప్రార్ధన చేయాలని కోరారు.
ప్రియ
సహోదరీ, సహోదరులారా! శుభోదయం!
ఈ
ఆదివారమున కూడా ఈ ఆసుపత్రినుండి మిమ్ములను కలుసుకుంటు న్నందులకు చాలా సంతోషంగా
ఉంది. మీ సాన్నిహిత్యానికి, ప్రార్ధనలకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నేటి సువిషేశములో
విన్నట్లుగా, యేసు పంపిన తన శిష్యులు “రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థ పరచిరి”
(మార్కు. 6:13). ఈ ‘తైలము’ ‘వ్యాధిగ్రస్తుల అభ్యంగనము’ను జ్ఞప్తికి చేయుచున్నది.
అది ఆత్మశరీరములకు ఓదార్పును ఒసగును. అలాగే ఈ ‘తైలము’ జబ్బుపడిన వారిని జాగ్రత్తగా
చూసుకొను వారి ఆలకించడం, సాన్నిహిత్యం, సున్నితత్వము, సంరక్షణకు సూచికగా నున్నది. ఇవి
అనారోగ్యులకు ఊరటను, సంతోషమును కలిగించును. సాన్నిహిత్యము, సున్నితత్వము అను ‘తైలము’
మనందరికీ అవసరం. అలాగే మనం సందర్శన వలన, ఒక ఫోన్ కాల్ వలన, అవసరంలో నున్నవారికి
చేయూత నివ్వడం వలన, ఇతరులకు ఈ ‘తైలము’ను ఇవ్వగలగాలి.
మత్తయి
25వ అధ్యాయంలో ‘తుది తీర్పు’న రోగులను పరామర్శించాలని ప్రభువు తప్పక అడుగుతారు.
ఈ రోజుల్లో
మంచి ఆరోగ్యం ఎంతో అవసరమని నేను తెలుసుకున్నాను. అందరికీ ఆరోగ్య సంరక్షణ ఎంతో
అవసరం. ఉచిత ఆరోగ్య సంరక్షణ మంచి సేవకు అభయమిస్తుంది. ఈ విలువైన ప్రయోజనాన్ని
ఎవరుకూడా కోల్పోకూడదు. దీనికై అందరూ కృషి చేయాలి. శ్రీసభలో కూడా కొన్ని ఆరోగ్య
సంస్థలలో నిర్వహణ లోపంవలన కలుగు ఆర్ధిక ఇబ్బందులు వచ్చినప్పుడు వచ్చే మొదటి ఆలోచన,
సంస్థలను అమ్మివేయడం. ఇది మంచిది కాదు. శ్రీసభనందు పిలుపులోని ప్రాముఖ్యమైనది
డబ్బు కాదు. సేవ చేయడం ప్రాధాన్యమైనది. సేవ ఎప్పుడూ ఉచితమే! దీనిని ఎవరూ మరచిపోకూడదు.
ఈ
సందర్భముగా, వైద్యులకు, వైద్య శ్రామికులకు, ఈ ఆసుపత్రి, ఇతర ఆసుపత్రుల సిబ్బందికి
నా ప్రశంసలు, ప్రోత్సాహాన్ని అందిస్తున్నాను. వారు ఎంతో కష్టపడుచున్నారు! రోగుల
కొరకు ప్రార్ధన చేద్దాం. ఇచ్చట అనేకమంది పిల్లలు చికిత్స పొందుచున్నారు. పిల్లలు
ఎందుకు బాధలు పడాలి? వారు ఎందుకు బాధలు పడాలి అనేది మన హృదయాన్ని తాకే ప్రశ్న! ప్రార్ధనతో
వారికి తోడుగా ఉండండి, అలాగే అనారోగ్యం పాలైన వారందరి కొరకు, ముఖ్యముగా చాలా
క్లిష్ట పరిస్థితులను ఎదుర్కుంటున్న వారి కొరకు ప్రార్ధన చేయండి. ఎవరుకూడా ఒంటరి
వారు కాకూడదు. ప్రతీ ఒక్కరు కూడా ఆలకించడం, సాన్నిహిత్యం, సున్నితత్వం, సంరక్షణ
అను ‘తైలము’ను స్వీకరించాలి. ఈ విన్నపాన్ని, ఆరోగ్యమాత అయిన మన తల్లి మరియ మధ్యస్థ
ప్రార్ధనల ద్వారా వేడుకుందాం!
No comments:
Post a Comment