ప్రేమానందం: కుటుంబ జీవితం – భాగం 01
01. దేవుని వాక్కు - ప్రేరణ (Inspiration)
కుటుంబము
అనే పాఠశాలలోనే మనం మనుషులుగా ఎలా జీవించాలో నేర్చుకుంటాము. ఇటుకలు ఇల్లును
నిర్మిస్తే, హృదయాలు మాత్రమే ఒక గృహాన్ని నిర్మిస్తాయి. గృహములోనే కుటుంబ నివాసము, పోషణ,
ఎదుగుదల, సార్ధకత కలుగుతుంది. ఆరంభములో, దేవుడు మానవులను ఒక కుటుంబముగా సృష్టించారు.
దేవుడు కుటుంబాన్ని యుక్తమైనదిగా పరిగణించి, కుటుంబములో నివసిస్తారు - క్రీస్తు
మనుష్యావతారం – దేవుని వాక్కు శరీరధారియై మన మధ్యలో వసించుట.
“ప్రేమానందం”,
అను ప్రాముఖ్యమైన ప్రబోధము ద్వారా, శ్రీసభ కుటుంబము గురించి ధ్యానించినది. కనుక, ఈ
ధ్యానాంశమును జగద్గురువులు పోపు ఫ్రాన్సిస్ రచించిన అపోస్తోలిక ప్రబోధం “Amoris Laetitia” (ప్రేమానందం)ను
ఆధారంగా, ప్రేరణగా రాయబడింది. నేటి కుటుంబ జీవితములో ఒకవైపు సుఖ-సంతోషాలు ఉన్నను,
మరోవైపు సమస్యలు, సవాళ్లు ఎక్కువగా ఉంటున్నాయి. కనుక, ఇది కుటుంబ వ్యవస్థకు,
కుటుంబ జీవితాలకు ప్రేరణగా ఉంటుందని భావిస్తున్నాను. కుటుంబాలు ప్రేమలో జీవిస్తూ,
జీవితములో వర్ధిల్లాలని ఆశిస్తున్నాను. కుటుంబ సభ్యులు దేవునికి, ఒకరికొకరికి
దగ్గరవ్వాలని ప్రార్ధిస్తున్నాను.
క్రైస్తవ
కుటుంబ జీవితానికి ప్రేరణ దేవుని వాక్కే! “నమ్మకమైన, ఫలవంతమైన కుటుంబ జీవితానికి” బైబులు
గ్రంథము ప్రేరణను కలిగిస్తుంది. బైబులు అనేక కుటుంబాలు, జననాలు, ప్రేమ గాథలు,
కుటుంబ సంక్షోభాలతో నిండియున్నదని మనందరికీ తెలిసినదే!
ప్రతీ కుటుంబం
కూడా మానవ సమాజము యొక్క ఉత్తమమైన, ప్రాథమిక వ్యవస్థగా పరిగణించ బడాలని బైబులు
ప్రేరేపిస్తున్నది. ఆ కుటుంబ వ్యవస్థ పురుషునికి, స్త్రీకి, అలాగే వారి పిల్లలకు అప్పగించ
బడినది. ప్రతీ కుటుంబము కూడా మరింత ఎక్కువగా “ప్రేమతో నిండిన వ్యక్తుల కలయిక”గా
మారాలి. ఆ వ్యక్తులు త్రిత్వైక దేవుని రూపములో, పోలికలో సృజింప బడినారు. అలాగే
వారు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుని కుటుంబములో ఉనికిని కలిగి యున్నారు.
ఈ
ప్రార్ధన విన్నపముతో ముందుగా, దేవుని వాక్యమును ఆలకించుదాం, ఆ తరువాత పోపు
ఫ్రాన్సిస్ ప్రబోధాన్ని ధ్యానిద్దాం.
దేవుని
మాట: ఆది. 1:26-27
"దేవుడు
‘ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము. మానవుడు మమ్ము పోలి, మావలె ఉండును. అతడు
నీళ్ళలోని చేపలపై, ఆకాశము నందలి పక్షులపై, నేలమీది పెంపుడు ప్రాణులపై, క్రూరమృగములపై,
ప్రాకెడు జంతువులపై అధికారము కలిగి యుండును’ అని అనెను. దేవుడు మానవ జాతిని
సృజించెను. తన పోలికలో మానవుని చేసెను. స్త్రీ పురుషులనుగా మానవుని సృష్టించెను.”
పోపు
ఫ్రాన్సిస్ ప్రబోధం:
యేసే స్వయముగా
ఒక నిరాడంబరమైన కుటుంబములో జన్మించారు. ఆ కుటుంబం త్వరలోనే పరాయి దేశానికి
పారిపోవలసి వచ్చినది. సీమోను పేతురు అత్త జ్వరముతో మంచము పట్టినపుడు, యేసు ఆ కుటుంబాన్ని
సందర్శించారు (మార్కు. 1:30-31). యాయీరు, లాజరు ఇంటిలో మరణవార్త విన్న యేసు సానుభూతిని
చూపించారు (మార్కు. 5:22-24, 35-43, యోహాను. 11:1-4).
నాయినులో
వితంతువు కుమారుడు మరణించినపుడు ఆ తల్లియొక్క ఆక్రందనను విన్నారు (లూకా. 7:11-15).
మూగ దయ్యము పట్టిన కుమారుని తండ్రి అభ్యర్ధనను యేసు ఆలకించాడు (మార్కు. 9:17-27).
యేసు సుంకరులైన మత్తయు, జక్కయ్య గృహాలకు వెళ్ళారు (మత్త. 9:9-15, లూకా.19:1-10).
పరిసయ్యుడైన సీమోను ఇంటిలో ఉండగా ఒక స్త్రీ, పాపాత్మురాలుతో యేసు సంభాషించారు
(లూకా. 7:36-50). కుటుంబాలలో ఉండెడి ఆందోళనలు, ఉద్రిక్తతలను యేసు ఎరిగి యున్నారు (ప్రేమానందం,
నం. 21).
ప్రతీ
కుటుంబము కూడా నజరేతు తిరు కుటుంబము వైపు చూడాలి (ప్రేమానందం, నం. 30).
సవాలుతో
కూడిన ధ్యానాంశాలు:
ఒక
కుటుంబం యొక్క జీవన స్థలం, “[స్థానిక] గృహస్థ శ్రీసభగా” మారగలదు. రోజువారి
జీవితములోనున్న ‘ఎత్తు పల్లాల’తో ఒక కుటుంబం పరిపక్వమైన కుటుంబముగా ఎదగ గలదు.
“వివాహము
ఒక ప్రేమగల ఆసుపత్రి” (జర్మన్ సామెత). దీనిలో చికిత్సలు, ప్రోత్సాహాలు, ఔషధం,
టానిక్, దిద్దుబాట్లు, సహకారాలు ఉంటాయి. వివాహము ఒక పదం కాదు; అది ఒక వాక్యం. అది
ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఇది “కుటుంబము” అని పిలువబడే ఒక “ప్రక్రియ.” అది జంట,
అలాగే పిల్లల జీవితాల ద్వారా నిత్యము అభివృద్ధి చెందుతూ ఉంటుంది.
కుటుంబం
ఉత్తమమైన, ప్రధమ సమాజము. కనుక సమాజము అనగా “అనేక కుటుంబాల అందమైన, అద్భుత కలయిక.
కుటుంబం లేనిదే సమాజము లేదు.
క్రైస్తవ
కుటుంబాలు దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించుటకు రోజువారి ప్రార్ధనలో గడపాలని, అలాగే
అందరు కలిసి దివ్యసత్ప్రసాదములో కుటుంబ జీవితాన్ని కొనియాడాలని దయతో పిలువ
బడుచున్నాయి. ఈవిధముగా, క్రైస్తవ కుటుంబాలు క్షమించడములోను, ప్రేమలోనూ ఎదగ గలవు.
ఒక కుటుంబము యుక్తమైన ‘దేవుని ఆలయము’గా మారగలదు.
[కుటుంబ
సభ్యులు, పై విషయాల గురించి వారివారి అభిప్రాయాలను పంచుకోవచ్చు]
ప్రార్ధన
విన్నపాలు:
సమాధానం:
ప్రభువా! దయతో మా ప్రార్ధన ఆలకించండి.
1. మా
విచారణలోని కుటుంబాలన్నియు ప్రేమలో, విధేయతలో ప్రజ్వరిల్లు ఆదర్శ కుటుంబాలుగా
ఎదుగునట్లు చేయండి.
2. కుటుంబములోని
ప్రతీ ఒక్కరు కుటుంబ ఐఖ్యతకు కృషి చేయునట్లు చేయండి.
3. మా
కుటుంబాలు దేవుని వాక్యమును జీవించునట్లుగా, తద్వారా మానవీయ, క్రైస్తవ విలువలలో
స్థిరముగా ఎదుగునుగాక.
(మీ కుటుంబ
అవసరాల కొరకు, స్వంత ప్రార్ధనలను జత చేయండి).
కుటుంబ
ప్రార్ధన
(కుటుంబ
సభ్యులంతా ప్రేమతో ఒకరి చేతులు ఒకరు పట్టుకొని, ఈ క్రింది పోపు ఫ్రాన్సిస్ వారి పవిత్ర
కుటుంబ ప్రార్ధనను ప్రార్ధించండి).
యేసు,
మరియ, జోజప్పలారా!
నిజ
ప్రేమలోని వెలుగును మీ యందే గాంచగలము,
నమ్మకముతో
మీవైపే చూస్తున్నాం.
పవిత్రమైన
నజరేతు కుటుంబమా,
మా
కుటుంబాలు కూడా
ఐఖ్యతకు,
ప్రార్ధనకు చోటుగా,
సువార్తకు
నిజాయితీ పాఠశాలలుగా,
చిన్నపాటి
గృహస్థ శ్రీసభలుగా
మారునట్లు
అనుగ్రహించుము.
పవిత్రమైన
నజరేతు కుటుంబమా,
హింస,
నిరాకరణ, విభజనలు
కుటుంబాల
దరి చేరకుండా దయచేయుము.
గాయపడినవారు,
దూరమైనవారు
సఖ్యతను,
స్వస్థతను పొందగలుగుదురుగాక.
పవిత్రమైన
నజరేతు కుటుంబమా,
కుటుంబ
పవిత్రతను, శాశ్వతత్వమును,
దైవ
ప్రణాళికలో దాని సౌందర్యమును
గుర్తించేలా
మమ్ము దీవించుము.
యేసు,
మరియ, జోజప్పలారా!
కృపతో
మా ప్రార్ధన ఆలకించండి. ఆమెన్
(పోపు ఫ్రాన్సిస్)
No comments:
Post a Comment