బైబులు – నిబంధనము

బైబులు – నిబంధనము

‘నిబంధనము’ అను పదమునకు “ఒప్పందము, ఒడంబడిక, వాగ్ధానము” అని అర్ధము. హీబ్రూ పదమైన ‘బెరిత్’ దీనికి మూలము. దీనికి సరియైన గ్రీకు పదం ‘దియాతెకె’. నిబంధనము దేవునికి, మనుష్యునికి మధ్య, మనుష్యునికి మనుష్యునికి మధ్య జరుగును. ఈ నిబంధనలు రెండు రకాలు: షరతులు కలిగినవి, షరతులు లేనివి.

బైబులు ప్రధాన భాగమును, పూర్వ నిబంధన గ్రంథము అని పిలుస్తున్నాము. ఇది దేవుడు ఎన్నుకొనిన ఇశ్రాయేలు ప్రజలతో తాను చేసుకున్న ఒప్పందమును, నిబంధనమును సూచిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఏకైక దేవుడైన యావేకు విశ్వాసబద్ధులుగా ఉందురని ఈ నిబంధనమును అంగీకరించారు. అలాగే, యావే దేవుడు వాగ్ధత్త భూమియందు సుసంపన్నమైన దీర్ఘకాల జీవితాన్ని వారికి వాగ్ధానము చేసియున్నాడు. తరువాత కాలములో సినాయి కొండపై దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చేసుకున్న ఒడంబడిక ప్రధాన స్థానాన్ని సంచరించుకున్నది. కనుక పూర్వ నిబంధనము, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో సినాయి కొండపై చేసుకున్న నిబంధనను సూచిస్తున్నది.

బైబులు ద్వితీయ భాగమును, నూతన నిబంధన గ్రంథము అని పిలుస్తున్నాము. ఇది దేవుడు కల్వరి కొండపై తన కుమారుడైన క్రీస్తుద్వారా మానవాళితో చేసుకున్న  నిబంధనను సూచిస్తున్నది.

No comments:

Post a Comment