బైబులు –
దివ్యావిష్కరణం
బైబులు – సందేశము - బైబులు – నామము
“తన
సంపూర్ణ జ్ఞానము చేతను, విషయ పరిచయము చేతను, దేవుడు తాను ఉద్దేశించిన దానిని
నెరవేర్చెను. అంతేకాక, క్రీస్తుద్వారా తాను పరిపూర్తి చేయదలచిన చిత్తమును దేవుడు
మనకు ఎరిగించెను” (ఎఫెసీ. 1:9). బైబిలు, దేవుని వాక్కు. అలాగే, ఈ దేవుని వాక్కు,
ఆమోదయోగ్యమైన గ్రంథాలుగా దివ్యావిష్కరణమునకు (Divine
Revelation) మూలము.
ఆమోదయోగ్యమైన
గ్రంథాలతోపాటు అపోస్తోలిక ‘సంప్రదాయం’ (Tradition) శ్రీసభను
ఎంతగానో ప్రభావితం చేసినది. నిజానికి, అపోస్తోలిక ‘సంప్రదాయం’ ఆధారంగానే బైబులులో
ఉండదగిన ప్రామాణిక రచనల నిర్ధారణ జరిగింది[1].
కనుక, పవిత్ర గ్రంథాన్ని, పవిత్ర సంప్రదాయాన్ని సమానమైన భక్తి భావనతో
గౌరవప్రపత్తులతో ఆదరించాలి, అనుసరించాలి[2].
అపోస్తలులు
అందజేసిన దైవసందేశాలలో సంప్రదాయము, బైబులు గ్రంథ భాగాలు సమపాళ్ళలో ఉంటాయి. దైవ
వాక్కునకు, సంప్రదాయ దైవోపదేశాలకు భాష్యం చెప్పే అధికారం శ్రీసభ అధిష్టానం (పాలక
వర్గం) వారికి మాత్రమే ఉంటుంది. అది దైవ వాక్కులోని అంతరార్ధాలను వెల్లడి
చేస్తుంది.[3]
బైబులు –
సందేశము
బైబులు ప్రధాన సందేశము ఏమనగా, మానవాళికి దేవుని రక్షణ
ప్రణాళిక సందేశము. ఈ రక్షణ సత్యము దైవకుమారుడైన యేసులో సంపూర్ణముగా బయలుపరచబడినది.
కనుక, శాస్త్రీయ ఖచ్చితత్వము కొరకు బైబులులో వెతక కూడదు.
బైబులు –
నామము
“దేవుని
వాక్కు” పవిత్ర గ్రంథము, నిబంధనము,
బైబులు... మొదలగు పేర్లతో పిలువబడుచున్నది.. “బైబులు” అనే పదం గ్రీకు పదాలు “తా
బిబ్లియా” (the books) నుండి
ఉద్భవించినది. “తా బిబ్లియా” అనగా “గ్రంథాలు”
లేదా “పుస్తకాలు” అని అర్ధము. తరువాతి కాలములో, లతీను భాషలో, గ్రీకు పదమైన “బిబ్లియా”ను
“గ్రంథాలు” అని బహువచనములోగాక, “గ్రంథము” అని ఏకవచనములో తీసుకొనబడినది.
అందుకే, నేడు ‘బైబులు గ్రంథాలు’ అని గాక, ‘బైబులు గ్రంథం’ అని పిలువబడుచున్నది.
No comments:
Post a Comment