పునీత అల్ఫోన్సమ్మ (28 జులై)

పునీత అల్ఫోన్సమ్మ (28 జులై)
కన్యస్త్రీ, మతసాక్షి (క్రీ.శ. 1910-1946)

కొన్ని సంవత్సరాల క్రితం కేరళ రాష్ట్రములోని ‘భరనంగానం’ చాలా మందికి తెలియని ప్రదేశం. ఆల్ఫోన్స  అనే ఒక పేద క్లారిస్ట్ సన్యాసిని యొక్క పావనతత్వము వలన దీనికి ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సిస్టర్ ఆల్ఫోన్స ఒక తెలివి కలిగిన సాదారణ మహిళ. తాను జీవించిన౦త కాలం అన్ని మానవ సద్గుణాలతో జీవించారు. ప్రేమ ఆమె వక్తిత్వం యొక్క ప్రత్యేక లక్షణం. ఒక బలమైన భావనతో ఆమె అందరిని ప్రేమించింది. కేవలం తనను ప్రేమించే వారిని కాకుండా తన మీద కోపంతో ఉన్న వాళ్ళను కూడా ప్రేమించింది.

పునీత ఆల్ఫోన్స కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలోని ‘కుడమలూరు’ అనే గ్రామంలో జోసెఫ్, మేరీ అనే దంపతులకు జన్మించారు. వారు పెట్టిన పేరు “అన్నా” (అన్నకుట్టి). 27 ఆగష్టు 1910న ‘కుడమలూరు’ సెయింట్ మేరీస్ చర్చిలో జ్ఞానస్నానం పొందారు. ఆమె చిన్నతనంలోనే తల్లి మరణించారు, కనుక ఆమె తన అత్త వద్ద పెరగడము జరిగింది. ఆల్ఫోన్స మూడు సంవత్సరాల వయసులో తామర వ్యాధితో ఒక సంవత్సరం పాటు భాద పడింది.

1916లో ఆమె తన విద్యను ప్రారంబించారు. ఆమె 27 నవంబర్ 1917న దివ్య సత్ప్రసాదమును స్వీకరించారు. 1923లో తాను ఒక ప్రమాదమునకు గురైనది. మంటలో ఆమె కాలు చిక్కుకోవడం వలన ఆమె పాదం కాలింది. 1927లో పెంతకోస్తు పండుగ రోజున ‘భరనంగానం’ వద్ద పునీత క్లారమ్మ (FCC -Franciscan Clarist Congregation) మఠములో చేరారు. ఆమె 2 ఆగష్టు 1928న మఠవాస జీవితమును (Postulant) ప్రాంభించి, ‘అల్ఫోన్స’గా పేరు మార్చుకున్నారు. మే 1929లో ఆమె ‘వాఱప్పల్లి’ వద్ద హైస్కూల్ ప్రవేశించి౦చారు. 1930లో ఆమెను పెంచిన తల్లి మరణి౦చారు. 19 మే 1930న, ఆమె ‘భరనంగానం’లో అంగీని స్వీకరించి మఠావాస జీవితమునకు పూర్తిగా అకింతమయ్యారు. 11 ఆగష్టు 1931లో ‘నొవిషియేట్’లో చేరి, 12 ఆగష్టు 1936లో ‘నిత్యమాటపట్టు’ను చేసారు. ఆమె ప్రాథమిక పాఠశాలలో ఒక ఉపద్యాయురాలిగా  బోధించారు, కాని తరచుగా జబ్బుపడుట వలన, బోధన చేయలేక పోయారు.

డిసంబరు 1936లో పునీత ‘తెరేసా’, ధన్య ‘కురియకోస్ ఎలయాస్ చావర’ మధ్యవర్తిత్వ ప్రార్ధనల వలన శరీర రుగ్మతలనుండి  ఆమె స్వస్థత పొందారు. కాని, 14 జూన్ 1939న ఆమె న్యుమోనియా అనే వ్యాధికి గురి అవడం వలన చాలా బలహీనపడిపోయారు. 18 అక్టోబరు 1940న ఒక దొంగ అర్ధరాత్రి ఒక దొంగ తన గదిలోనికి ప్రవేశించడం చూడటము వలన, భయముతో అమ్నేసియా అనే వ్యాధికి లోనవడము వలన, ఆమె మరింత  బలహీనపడింది. ఈవిధముగా, ఆమె ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణించినది. ఆమెకు 29 సెప్టెంబరు 1941న వ్యాధిగ్రస్తుల అభ్యంగనమును కూడా ఇచ్చారు. కాని ఆతరువాత కోలుకున్నారు. కొన్ని సం.ల వరకు ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నది. కాని మరల, జూలై 1945 నుండి కడుపుకు సంబందించిన సమస్యలతో చాలా కాలం బాధపడింది, తరుచుగా వాంతులు అవుతూ ఉండేవి.

తన 35వ యేట, 28 జూలై 1946న మరణించారు. ఆమెను ప్రస్తుత ‘పాలై’ మేత్రాసనంలోని ‘భరనంగానం’లో భూస్థాపితం చేయడము జరిగింది.

ఈ పునీతురాలు ఎక్కువగా శ్రమలతో బాధపడింది. బాధలన్నింటిని మౌనముగా భరించినది. ఎక్కువగా పాపాత్ముల కోసం ప్రార్ధన చేసింది. యేసు ప్రభువు పంచగాయాలను పొందింది. వ్యాధుల హింసాత్మక బాధల కారణంగా ఎన్నో రాత్రులు నిద్ర  లేకుండా గడిపింది. తీవ్రమైన బాధలను, ష్టాలను ఎన్నోసార్లు అనుభవించింది. ప్రజలు ఆమెలో యేసు ముఖంను కనుగొన్నారు త్వరలోనే, ఆమె మధ్యస్థ ప్రార్ధనల వలన ఎంతోమంది అద్భుత స్వస్తతలను పొందారు.

9 జూలై 1985లో ‘దైవ సేవకురాలు’గ శ్రీసభ ప్రకటించినది. 8 ఫిబ్రవరి 1986న రెండవ జాన్ పాల్ పోపు ఆమెను ‘ధన్యజీవి’గ ప్రకటించారు. 12 అక్టోబరు 2008న 16వ బెనడిక్టు పోపు ఆమెను ‘పునీతులు’గా ప్రకటించారు.

No comments:

Post a Comment