పౌలు లేఖలు
పౌలు తన
సువార్త పరిచర్యలో అనేక సంఘాలను ఏర్పాటు చేసాడు. ఆ సంఘాలకు వివిధ సందర్భాలలో తన
లేఖలను వ్రాసియున్నాడు. పౌలు తన లేఖలను వ్రాయడానికిగల కొన్ని కారణాలు:
తాను
స్థాపించిన సంఘాలకు సూచనలు ఇవ్వడానికి, ప్రోత్సహించడానికి వ్రాసాడు.
ఆనాటి
క్రైస్తవ సంఘాలు అనేక సంక్షోభాలను, ముఖ్యముగా తప్పుడు బోధనలు మొదలగు క్లిష్ట
పరిస్థితులను నిర్వీర్యం చేయుటకు, వాటికి సరియైన పరిష్కార మార్గాలను చూపుటకు పౌలు
తన లేఖలను వ్రాసాడు.
కొన్నిసార్లు
విశ్వాసుల మధ్యన ఉత్పన్నమైన అపార్ధములను స్పష్టపరచుటకు పౌలు తన లేఖలను సమాచార
సాధనాలుగా ఉపయోగించాడు.
విశ్వాసము,
నైతికపరమైన ప్రశ్నలు సంఘాలలో తలెత్తినప్పుడు, వాటికి సమాధానాలు ఇవ్వడానికి పౌలు తన
లేఖలను వ్రాయడం జరిగింది.
సంఘాలలో
ఏదైనా అవసరత లేదా సమస్య తలెత్తినప్పుడెల్ల, పౌలు ఆయా సంఘాలను సందర్శించడం
సాధ్యముకాని పరిస్థితులలో, లేఖల ద్వారా తన సందేశాన్ని తెలియజేసేవాడు.
అలాగే,
తాను స్థాపించిన క్రైస్తవ సంఘాలు, విశ్వాసములో మరింతగా బలపరచడానికి పౌలు తన లేఖలను
వ్రాసాడు.
No comments:
Post a Comment