బైబులు అనువాదము
బైబిలు
అనేక ప్రపంచ భాషలలోనికి అనువదించబడినది. బైబులు సొసైటీ, డిసెంబరు 2007 సమాచారం
ప్రకారం సంపూర్ణ బైబులు 438 భాషలలోనికి, రెండు నిబంధన గ్రంథాలలో ఏదైనా ఒక గ్రంథం
1618 భాషలలోనికి, బైబులులోని వివిధ
గ్రంథాలు 836 అదనపు భాషలలోనికి అనువదించబడినది. సంపూర్ణ బైబులుగాని,
బైబులులోని వివిధ గ్రంథాలుగాని, మొత్తం
2454 ప్రపంచ భాషలలోను, ప్రాంతీయ భాషలలోను అందుబాటులో ఉన్నది.
కొన్ని వేల
సంవత్సరముల క్రితం వ్రాయబడిన వేర్వేరు గ్రంథాల సంకలనమే బైబులు. ఈ గ్రంథాలు
బైబులుగా తుది రూపములోనికి రావడానికి సుమారు వెయ్యేండ్లు పైగానే పట్టినది.
సెప్తువజింత్
(గ్రీకు బైబులు)
మొట్టమొదటి
సారిగా, గ్రీకు మాట్లాడే యూదుల సౌలభ్యం కొరకు, యూద పండితులు హీబ్రూ బైబులును (తనఖ్)
గ్రీకు భాషలోనికి అనువదించారు. ఈ గ్రీకు బైబులునే సెప్తువజింత్ (LXX) అని
పిలుస్తున్నాము. సెప్తువజింత్ అనగా 70 గ్రంధాలు అని అర్ధము. ఈ పేరు
రావడానికి కారణం, గ్రీకు బైబులును 70(72) మంది పండితులు 70(72) రోజుల్లో
అనువదించారని సంప్రదాయము తెలియజేయు చున్నది (ఇది వాస్తవము కాకపోవచ్చు). ఇది ఐగుప్తు
దేశములోని అలెగ్జాండ్రియా పట్టణములో క్రీ.పూ. 300-200 సంవత్సరముల మధ్య కాలములో
అనువదించబడినది.
సెప్తువజింత్
(LXX) యొక్క ప్రాముఖ్యత ఏమనగా, పాత నిబంధనమును అర్ధము చేసుకోవడానికి, గ్రీకు
మాట్లాడే అనాధి క్రైస్తవులు దీనిపైనే ఎంతగానో ఆధారపడి యున్నారు. నూతన నిబంధన
రచయితలు కూడా పాత నిబంధన వాక్యాలను గ్రీకు బైబులు నుండియే ఉదహరించడం జరిగింది.
సెప్తువజింత్
(LXX) యొక్క విశిష్ట లక్షణాలు ఏమనగా, హీబ్రూ బైబులుకు ఇది ‘సరిదిద్దబడిన గ్రంథము’
అని చెప్పవచ్చు. నూతన నిబంధన రచయితలు గ్రీకు బైబులునే ఉపయోగించారు. శ్రీసభ పితరులు
కూడా గ్రీకు బైబులునే ఉపయోగించారు.
అరమాయిక్
బైబులు (తార్గుం)
హీబ్రూ
బైబులునుండి అనువాదం చేయబడినది. బాబిలోనియా ప్రవాసం తరువాత, హీబ్రూ భాష స్థానములో,
అరమాయిక్ భాష బాగా ప్రసిద్ధి గాంచినది. సాధారణ ప్రజలు బైబులును అర్ధం
చేసుకోవడానికి, హీబ్రూ బైబులు, అరమాయిక్ భాషలోనికి అనువాదం చేయబడినది. అనువాదకుని
పేరున (turgeman), ఈ అనువాదమును తార్గుం (Targum) అని పిలుస్తారు. యూదుల
సంప్రదాయం ప్రకారం, ఈ అనువాదానికి ముఖ్య కారకులు ఎజ్రా (నెహె. 8:8) అని
తెలియుచున్నది.
సిరియక్
బైబులు (పెషిత)
సిరియక్
భాష హీబ్రూ భాషకు దగ్గరి సంబంధం కలిగియున్న భాష. సిరియక్ బైబులు క్రీ.పూ. ఒకటవ,
రెండవ శతాబ్దాలలో అడియబెనే (ప్రస్తుత ఇరాకులో), ఎడెస్సా (ప్రస్తుత టర్కీలో) అను
ప్రదేశాలలో అనువాదం చేయబడింది.
వల్గేటు(లతీను
బైబులు)
అప్పటికే
లతీను భాషలో బైబులు అనువాదాలు ఉన్నప్పటికినీ, పునీత జెరోము (347-420), శ్రీసభ
పండితుడు, బైబులు శాస్త్ర పితామహుడు, క్రీ.శ. 390-405 మధ్య కాలములో, హీబ్రూ బైబులును,
వాడుక లతీను భాష లోనికి అనువదించి యున్నాడు. లతీను బైబులు వల్గేటు అను
పేరుతో ప్రసిద్ధి గాంచినది. అయితే, చివరిగా 1546వ సంవత్సరములో జరిగిన ‘ట్రెంటు మహాసభ’లోనే
కతోలిక శ్రీసభ వల్గేటును అధికారిక బైబులుగా ఆమోదించడం జరిగినది.
ఇథియోపిక్
బైబులు
క్రీ.శ. నాలుగవ శతాబ్దపు మధ్య
కాలములో, ఇథియోపియా రాజ్యము క్రైస్తవ మార్గాన్ని అంగీకరించడము వలన,
గ్రీకు బైబులును పాత ఇథియోపియన్ భాషలోనికి అనువాదం చేయబడినది.
ఆర్మేనియన్ బైబులు
క్రీ.శ.
ఐదవ శతాబ్దము వరకు ఆర్మేనియన్ క్రైస్తవ సంఘము గ్రీకు మరియు సిరియక్ బైబులును
ఉపయోగించినది. మెస్రోబ్ (క్రీ.శ. 361-439) ఆర్మేనియన్ వర్ణమాలను కనుగొని, బైబులును
అనువదించాడు. సంప్రదాయం ప్రకారం, క్రీ.శ. 414లో, సిరియక్ బైబులు (పెషిత)
ఆధారముగా, మొదటి ఆర్మేనియన్ అనువాదం చేయబడినది. తరువాతి సవరణలు సెప్తువజింత్
(LXX) ఆధారముగా చేయబడినవి.
అరబిక్
బైబులు
విజయవంతమైన
ఇస్లామిక్ ఆక్రమణల వలన, క్రైస్తవులు మరియు యూదుల మధ్యన అరబిక్ భాష, విస్తరించినది.
దీనివలన, బైబులును అరబిక్ భాషలోనికి అనువదించాల్సిన అవసరత ఏర్పడినది. హీబ్రూ,
గ్రీకు, సిరియక్ బైబులునుండి అనేక అనువాదాలు అరబిక్ భాషలోనికి చేయబడినవి.
ప్రస్తుతం క్రీ.శ. 10వ శతాబ్దములో చేసిన అనువాదము అందుబాటులో ఉన్నది.
బైబులు ఆంగ్లానువాదం
గత
శతాబ్దములో ఎన్నో బైబులు ఆంగ్లానువాదములు చేయబడినవి. వాటిలో కొన్నింటిని ఇక్కడ
పేర్కొందాము.
కతోలిక
అనువాదాలు:
(1). పునీత
బీడ్ బైబులు: ఈ అనువాదం, గురువు, శ్రీసభ పండితుడు, ఆంగ్లచారిత్ర పితామహుడు,
మతసాక్షి అయిన పునీత బీడ్ (క్రీ.శ.
673-735) గారికి ఆపాదించ బడినది. ప్రస్తుతం ఇది అందుబాటులో లేదు.
(2).
వైక్లిఫ్ బైబులు: ఈ అనువాదం వైక్లిఫ్ (క్రీ.శ. 1380) మరియు అతని అనుచరులకు ఆపాదించ
బడినది.
3). ది డువే
(Douay) బైబులు: ఇది లతీను వల్గేటు నుండి అనువదించ బడినది (క్రీ.శ. 1582-1609)
(4). ది న్యూ
అమెరికన్ బైబులు (NAB): క్రీ.శ. 1952-70
(5). ది జెరూసలేం
బైబులు (JB): క్రీ.శ. 1966
(6). ది రివైజ్డు
స్టాండర్డ్ వెర్షన్ (RSV) – కతోలిక అనువాదం: క్రీ.శ. 1965-66
(7). ది గుడ్
న్యూస్ బైబులు (GNB): క్రీ.శ. 1966, 1976, 1979, 1992
(8). ది న్యూ
జెరూసలేం బైబులు (NJB): క్రీ.శ. 1985
(9). ది క్రిస్టియన్
కమ్యూనిటి బైబులు (CCB): క్రీ.శ. 1986
(10). ది న్యూ
రివైజ్డు స్టాండర్డ్ వెర్షన్ (NRSV) – కతోలిక అనువాదం: క్రీ.శ. 1989
(11). ది న్యూ
కమ్యూనిటి బైబులు (NCB): క్రీ.శ. 2008.
ప్రొటెస్టంటు
అనువాదాలు:
(1). టిండేల్
బైబులు: క్రీ.శ. 1523-31
(2). ది కింగ్
జేమ్స్ వెర్షన్ (KJV): క్రీ.శ. 1611. దీనికి ఆథరైజ్డు వెర్షన్ (AV) అని కూడా
అంటారు. ఇది అత్యంత ప్రజాదరణ
పొందిన ప్రొటెస్టంటు బైబులు వెర్షన్.
(3).
రివైజ్డు వెర్షన్ (RV): క్రీ.శ. 1881-85
(4).
అమెరికన్ స్టాండర్డ్ వెర్షన్ (ASV): క్రీ.శ. 1901
(5). రివైజ్డు
స్టాండర్డ్ వెర్షన్ (RSV): క్రీ.శ. 1946-52
(6). న్యూ
ఇంగ్లిష్ బైబులు (NEB): క్రీ.శ. 1961-70
(7). న్యూ అమెరికన్
స్టాండర్డ్ వెర్షన్ (NASV): క్రీ.శ. 1971
(8). గుడ్
న్యూస్ బైబులు (GNB): క్రీ.శ. 1976
(9). న్యూ
రివైజ్డు స్టాండర్డ్ వెర్షన్ (NRSV): క్రీ.శ. 1989
(10). ఇంగ్లిష్
స్టాండర్డ్ వెర్షన్ (ESV): క్రీ.శ. 2001
యూదు
అనువాదాలు:
(1). జుయిష్
పబ్లికేషన్ సొసైటీ ఆఫ్ అమెరిక వెర్షన్ (JPS): క్రీ.శ. 1917
(2). జుడైక
ప్రెస్: క్రీ.శ. 1963
(3).
కోరెన్ జెరూసలేం బైబులు: క్రీ.శ. 1962
(4). ది
లివింగ్ తోరా బై ఆర్యెహ్ కప్లన్: క్రీ.శ. 1981
(5). న్యూ
జుయిష్ పబ్లికేషన్ సొసైటీ ఆఫ్ అమెరిక వెర్షన్ (NJPS): క్రీ.శ. 1985
(6).
కంప్లీట్ జుయిష్ బైబులు (CJB): క్రీ.శ. 1998.
సెప్తువజింత్ అనువాదాలు:
(1). బ్రెంటన్స్
ఇంగ్లిష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది సెప్తువజింత్: క్రీ.శ. 1951
(2). ది
అపోసల్స్ బైబులు: క్రీ.శ. 2004
(3). ది
ఈస్టర్న్ ఆర్ధడాక్స్ బైబులు: క్రీ.శ. 2007
(4). న్యూ
ఇంగ్లిష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది సెప్తువజింత్: క్రీ.శ. 2007
బైబులు
తెలుగు అనువాదం:
తెలుగు
బైబులు అనువాదం 18వ శతాబ్దములో ప్రారంభమైనది. క్రీ.శ.1727వ సంవత్సరములో
త్రాంక్విబారు మిషనుకు చెందిన జర్మన్ లూథరన్ మిషనరీ రెవ. డా. బెంజమిన్ కాట్జ్
తెలుగులో నూతన నిబంధన అనువాదాన్ని పూర్తి చేసాడు. బ్రౌన్ అనువదించిన తెలుగు బైబులు
వ్రాత ప్రతిని లండనులోని బైబులు హౌస్ గ్రంథాలయములో భద్రపరచారు. 1854వ సంవత్సరములో పూర్వ
నిబంధనను ప్రచురించారు. లండన్ మిషనరీ సొసైటీకి చెందిన ఎస్. వార్టులా, జాన్ హే
అనువారు గ్రీకు బైబులు ఆధారముగా నూతన నిబంధనను అనుసరించి 1856వ సంవత్సరములో
ప్రచురించారు. పూర్వ, నూతన నిబంధనలను కలిపి 1857వ సంవత్సరములో మద్రాసు ఆక్సిలరీ
వారు ప్రచురించిన సంకలనమే తొలి తెలుగు బైబులు గ్రంథము.
తెలుగు
కతోలిక బైబులు అనువాదం:
No comments:
Post a Comment