పౌలుగారి లేఖలు - ఉపోద్ఘాతము
ప్రాముఖ్యత
నూతన నిబంధనలో 27 గ్రంథాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 21 లేఖలు ఉన్నాయి. వీటిలో 14 పౌలు లేఖలుగా పండితులు సూచిస్తారు. వీటిలో హెబ్రీయులకు వ్రాసిన లేఖను పౌలు స్వయంగా రాయలేదని వాదిస్తారు. పౌలు కొన్ని లేఖలను చెప్పి రాయించగా (రోమీ. 16:22 - తెర్తియ), కొన్ని భాగాలను తన చేతితో రాసానని చెప్పాడు (1 కొరి. 16:21, కొలొస్సీ. 4:18, 2:1, 2 తెస్స. 3:17). నూతన నిబంధనములో మొట్టమొదటిగా వ్రాయబడినవి పౌలుగారి లేఖలే! అప్పటివరకు ఇంకా సువార్త గ్రంథాలు కూడా వ్రాయబడలేదు.
విభజన
1. పౌలు
రచయితయని వివాదములేని లేఖలు: వీటిని పౌలుగారే స్వయంగా
వ్రాసియున్నారు.
తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన మొదటి
లేఖ
కొరింతీయులకు వ్రాసిన మొదటి లేఖ
గలతీయుకు వ్రాసిన లేఖ
ఫిలేమోనునకు వ్రాసిన లేఖ
కొరింతీయుకు వ్రాసిన రెండవ లేఖ
ఫిలిప్పీయలకు వ్రాసిన లేఖ
రోమీయులకు వ్రాసిన లేఖ
2. పౌలు
రచయితయని వివాదాస్పదమైన లేఖలు:
కొలొస్సీయులకు వ్రాసిన లేఖ
ఎఫెసీయులకు వ్రాసిన లేఖ
తెస్సలోనిక ప్రజలకు వ్రాసిన మొదటి
లేఖ
3. పౌలు రచయిత
(కాని) లేఖలు:
తిమోతికి వ్రాసిన మొదటి లేఖ
తిమోతికి వ్రాసిన రెండవ లేఖ
తీతుకు వ్రాసిన లేఖ
సారాంశం
పౌలు తన ప్రేషిత కార్య సిద్ధతలో ఎన్నో క్రైస్తవ సంఘాలను సందర్శించాడు, మరికొన్నింటిని స్థాపించాడు. ఒక సంఘ పెద్దగా, క్రీస్తు శిష్యుడిగా ఆయా సంఘాలలో క్రైస్తవ మత, ఆధ్యాత్మిక, వేదాంత, యదార్ధ నీతి నియమాలు, విశ్వాస జీవితాంశాలను తన లేఖలలో వివరించాడు మరియు పరిష్కరించాడు. పౌలు అందించిన క్రైస్తవ సిద్ధాంతాలు నేటికి ప్రాతిపదికలుగా ఉన్నాయి.
పౌలు తన లేఖలలో సంబోధించిన ప్రతి అంశం క్రైస్తవ సంఘాలలో నాటి పరిస్థితులను, సమస్యలను వివరించి, పరిష్కార మార్గాలను, సూచనలను నిర్దేశించాయి. అలాగే ఆయా సంఘాల ఆర్ధిక, సామాజిక, మత పరిస్థితులను వివరించాయి.
ఈనాటి మన సంఘాలు కూడా ప్రతి
కాలములో, ప్రతి
పరిస్థితులలో ఎన్నో రకాల సంక్షోభాలను, సమస్యలను ఎదుర్కొంటున్నాయి. పౌలు లేఖలనుండి ప్రతి
సమస్యకు పరిష్కారం దొరకాలని, మన సంఘాలు ఆధ్యాత్మికంగా బలపడాని ఆశిద్దాం!
No comments:
Post a Comment