పూర్వ నిబంధనము – విభజన

పూర్వ నిబంధనము – విభజన

సాధారణముగా, బైబులు రెండు భాగాలుగా విభజించబడినది: పూర్వ నిబంధనము, నూతన నిబంధనము. యూదులు మరియు క్రైస్తవులు బైబులు గ్రంథాలను వివిధ భాగాలుగా విభజించి యున్నారు.

యూదు బైబులు (తనక్)

యూదులు తమ పవిత్ర గ్రంథాన్ని తనఖ్ (TANAKH) అని పిలుస్తారు. ‘’ అనగా తోరా లేదా చట్టం అని, ‘న’ అనగా నెబీమ్ లేదా ప్రవక్తలు అని ‘ఖ్’ అనగా కెతుబీమ్ లేదా లేఖనములు అని అర్ధము. దీనినిబట్టి, వారి పవిత్ర గ్రంథాన్ని మూడు విభాగాలుగా విభజించారు:

(1). తోరా లేదా చట్టం (మొదటి ఐదు గ్రంథాలు): ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయ కాండము, సంఖ్యా కాండము, ద్వితీయోపదేశ కాండము. 

(2). నెబీమ్ లేదా ప్రవక్తలు (21): ప్రవక్తల గ్రంథాలను రెండు భాగాలుగా విభజించారు:

(అ). ప్రమ ప్రవక్తలు (6): యెహోషువా, న్యాయాధిపతులు, సమూవేలు మొదటి గ్రంథము, సమూవేలు రెండవ గ్రంథము, రాజులు మొదటి గ్రంథము, రాజులు రెండవ గ్రంథము.

(ఆ). ద్వితీయ ప్రవక్తలు (15): యెషయా, యిర్మియా, యెహెజ్కేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహుము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ.

(3). కెతుబీమ్ లేదా లేఖనములు (13): రాజుల దినచర్య మొదటి గ్రంథము, రాజుల దినచర్య రెండవ గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, రూతు, యోబు, కీర్తనలు, సామెతలు, ఉపదేశకుడు, పరమగీతము, దానియేలు, విలాప గీతాలు.

క్రైస్తవ బైబులు

పూర్వ నిబంధనమునకు సంబంధించి సంఖ్యలోనూ, క్రమములోనూ భేదాలను చూస్తూ ఉంటాము. వివిధ క్రైస్తవ సంఘాలు వివిధ బైబులు గ్రంథాల విభజనలను అనుకరిస్తున్నాయి. కతోలిక బైబులు పూర్వ నిబంధనములో 46 గ్రంథాలను ఆమోదయోగ్యముగాను, అధికారికముగాను అంగీకరిస్తే, ప్రొటెస్టంటు బైబులు కేవలం 39 గ్రంథాలను మాత్రమే అంగీకరిస్తున్నాయి.

ఆ మిగతా 7 గ్రంథాలు: యూదితు, తోబీతు, సొలోమోను జ్ఞాన గ్రంథము, సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము, బారూకు, మక్కబీయులు మొదటి గ్రంథము, మక్కబీయులు రెండవ గ్రంథము. వీటిని కతోలిక శ్రీసభ “డ్యూటెరో కెనానికల్” గ్రంథాలు (అనగా ద్వితీయ సమీకరణ గ్రంథాలు) అని పిలువగ, ఇతరులు “అపొక్రిఫల్” గ్రంథాలు (అనగా ఊహాజనితమైనవి) అని పిలుస్తున్నారు. ఈ 7 గ్రంథాలు గ్రీకు అనువాదమయిన సెప్తువజింత్ (LXX) బైబులులో కనిపిస్తాయి. ఇతర గ్రంథాలవలె యావే దేవునిచే ప్రేరేపించ బడలేదని భావించి యూదులు ఈ గ్రంథాలను తిరస్కరించారు. అయితే బైబులులోని ప్రతీది దేవుని ప్రేరణయే అని కతోలిక విశ్వాసం.

కతోలిక బైబులు (46 గ్రంథాలు)

వివిధ కతోలిక ముద్రణలు, వివిధ బైబులు గ్రంథ విభజనలను అనుకరిస్తున్నాయి. ఉదాహరణకు,

(అ). చారిత్రక గ్రంథాలు, ఉపదేశక గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు

(ఆ). పెంటెట్యూక్, చారిత్రక గ్రంథాలు, జ్ఞాన గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు

(ఇ). చారిత్రక గ్రంథాలు, జ్ఞాన గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు.

(అ). చారిత్రక గ్రంథాలు (21): ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయ కాండము, సంఖ్యా కాండము, ద్వితీయోపదేశ కాండము, యెహోషువా, న్యాయాధిపతులు, సమూవేలు మొదటి గ్రంథము, సమూవేలు రెండవ గ్రంథము, రాజులు మొదటి గ్రంథము, రాజులు రెండవ గ్రంథము, రాజుల దినచర్య మొదటి గ్రంథము, రాజుల దినచర్య రెండవ గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, యూదితు, తోబీతు, ఎస్తేరు, రూతు, 1, 2 మక్కబీయులు.

(ఆ). ఉపదేశక గ్రంథాలు (7): కీర్తనలు, యోబు, సామెతలు, ఉపదేశకుడు, పరమగీతము, సీరా పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము.

(ఇ). ప్రవక్తల గ్రంథాలు (18): యెషయా, యిర్మియా, యెహెజ్కేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహుము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ, దానియేలు, బారూకు, విలాప గీతాలు.

ప్రొటెస్టంటు బైబులు (39 గ్రంథాలు)

(అ). చట్టం లేదా పెంటెట్యూక్ (5): ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయ కాండము, సంఖ్యా కాండము, ద్వితీయోపదేశ కాండము.

(ఆ). ప్రవక్తలు (21): ప్రమ ప్రవక్తలు: యెహోషువా, న్యాయాధిపతులు, సమూవేలు మొదటి గ్రంథము, సమూవేలు రెండవ గ్రంథము, రాజులు మొదటి గ్రంథము, రాజులు రెండవ గ్రంథము. ద్వితీయ ప్రవక్తలు: యెషయా, యిర్మియా, యెహెజ్కేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహుము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జెకర్యా, మలాకీ.

(ఇ). లేఖనములు: రాజుల దినచర్య మొదటి గ్రంథము, రాజుల దినచర్య రెండవ గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, రూతు, యోబు, కీర్తనలు, సామెతలు, ఉపదేశకుడు, పరమగీతము, దానియేలు, విలాప గీతాలు.

No comments:

Post a Comment