బైబులు విభజన
అధ్యాయాలుగా
విభజన
స్టీఫెన్
కార్డినల్ లాంగ్టన్ (క్రీ.శ.1150- 9 జులై 1228) కాంటర్బరి అగ్ర పీఠాధిపతులు,
క్రీ.శ.1214వ సంవత్సరములో బైబులు గ్రంథాలను అధ్యాయాలుగా విభజించారు. నేటికీ ఈ
అధ్యాయాల విభజననే వాడుకలో ఉన్నది.
వచనాలుగా
విభజన
క్రీ.శ.13 శతాబ్దములో హ్యూగో దె సెయింట్-చెర్ ప్రతీ
అధ్యాయాన్ని 7 విభాగాలుగా విభజించాడు. ఆ తరువాత, బైబులు పండితుడు అయిన సాన్తెస్
పాగ్నినో (క్రీ.శ. 1470-1541) క్రీ.శ.1528వ సంవత్సరములో అధ్యాయాలను వచనాలుగా
విభజించి బైబులును ప్రచురించాడు. క్రీ.శ. 1555వ సంవత్సరములో రాబర్ట్ స్టీఫెన్స్
(క్రీ.శ. 1503-1559) ప్రామాణిక సంఖ్యలతో అధ్యాయాలను వచనాలుగా విభజించి బైబులును
ప్రచురించాడు. నేటికీ ఈ విభజనే ప్రాచుర్యములో ఉన్నది.
No comments:
Post a Comment