రెండు నిబంధనలమధ్య
కూర్పుకాల గ్రంథాలు
(Intertestamental Literature)
క్రీ.పూ.
150 నుండి క్రీ.శ. 50 మధ్యకాలమును పూర్వ నిబంధన మరియు నూతన నిబంధనల మధ్య కూర్పు
కాలము (Intertestamental Period) అని
పిలుస్తాము. ఈ మధ్య కాలములో అనేక గ్రంథాలు రచించబడినవి. వీటిని రెండు నిబంధనలమధ్య
కూర్పుకాల గ్రంథాలు అని లేదా అప్రమాణిక గ్రంథాలు (Deutero
Canonical / Apocryphal Books) అని పిలుస్తాము. అయితే, ఇవి పూర్వ
నిబంధనకు సంబంధించినవే!
కతోలిక
బైబులులో పూర్వ నిబంధనలో 46 గ్రంథాలు ఉంటాయి. కాని, హీబ్రూ, ప్రొటెస్టెంట్
బైబులులో 39 గ్రంథాలు మాత్రమే ఉంటాయి. వీటిని “ప్రధమ సమీకరణ గ్రంథాలు” (Proto
Canonical) అని పిలుస్తాము. ఇవి అందరిచేత అంగీకరింపబడినవి. ఆ ఏడు
గ్రంథాలు: యూదితు, తోబితు, సొలోమోను జ్ఞానగ్రంథము, సీరా పుత్రుడైన యేసు
జ్ఞానగ్రంథము, బారూకు, మక్కబీయులు మొదటి, రెండవ గ్రంథాలు. ఈ ఏడు గ్రంథాలు
హీబ్రూ బైబులులో కనిపించవు, కాని గ్రీకు సెప్తువజింత్ (LXX) మరియు లతీను
వల్గేటు బైబులులో కనిపిస్తాయి.
ఈ ఏడు
గ్రంథాలను, రోమను కతోలికులు మరియు ఆర్థడాక్స్ క్రైస్తవులు, “డ్యూటరో
కెనానికల్” (Deutero Canonical) గ్రంథాలు
లేదా ద్వితీయ సమీకరణ గ్రంథాలు అని, ఇతరులు (యూదులు, ప్రొటెస్టెంటులు) “అపొక్రిఫల్”
(Apocryphal) గ్రంథాలు అని పిలుస్తున్నారు. “అపొక్రిఫల్”
అనగా “వినిపించబడినవి, దైవరహస్యాలు, ఊహాజనితమైనవి” అని అర్ధము. ఈ గ్రంథాలను
“డ్యూటరో కెనానికల్” గ్రంథాలు అని పిలవడమే సమంజసము!
యూదులు,
హీబ్రూ పవిత్ర గ్రంథములోని ఇతర గ్రంథాలవలె, ఈ ఏడు గ్రంథాలు, యావే దేవునిచే
ప్రత్యక్షముగా ప్రేరేపింపబడలేదని భావించి నిరాకరించారు. అయితే, బైబులులోని ప్రతీది
దేవుని ప్రేరణయే అని కతోలికుల విశ్వాసం.
ఈ ఏడు
గ్రంథాలతో పాటు మరో అయిదు గ్రంథాలను కూడా కతోలికులు, “డ్యూటరో కెనానికల్” గ్రంథాలు
అని పిలుస్తారు. అవి: (1) ఎస్తేరు గ్రంథములోని అదనపు భాగాలు, (2) అజరయా గీతము
మరియు ముగ్గురు యువకుల కీర్తన (దానియేలు), (3) సూసన్న (దానియేలు), (4) బేలు మరియు
ఘటసర్పము (దానియేలు), (5) యిర్మియా లేఖ (బారూకు).
కతోలికులు 1,2 ఎస్డ్రాస్
(లేదా 3,4 ఎజ్రా) మరియు మనష్హే ప్రార్ధనను అధికారికముగా ఆమోదయోగ్యమైన గ్రంథాలుగా
అంగీకరించలేదు. అయినప్పటికిని, కతోలికులు వాటిని గౌరవించి
బైబులులో అనుబంధాలుగా (Appendices)
ముద్రిస్తుంటారు. ప్రొటెస్టెంటులు వీనిని “అపొక్రిఫల్” అని పిలుస్తారు.
పూర్వ
నిబంధన మరియు నూతన నిబంధనల మధ్య కూర్పు కాలములో (Intertestamental
Period) రచించబడి, హీబ్రూ బైబులు పట్టికలోను, కతోలిక బైబులు
పట్టికలోను చేర్చబడని ఇతర గ్రంథాలను “సూడెపిగ్రాఫ్రా” (Pseudepigrapha)
గ్రంథాలు అని పిలుస్తాము. “సూడెపిగ్రాఫ్రా” అనగా ‘తప్పుడు రచనలు’ అని అర్ధము.
అనగా, ఈ గ్రంథాలకు పురాతన వ్యక్తులను రచయితలుగా ఆపాదించడం. కేవలము,
ప్రొటెస్టెంటులు మాత్రమే ఈ పదాన్ని ఉపయోగిస్తారు.
యూదుల,
ప్రొటెస్టెంటుల సెప్తువజింత్ (LXX) తిరస్కారం
ఆరంభములో
గ్రీకు సెప్తువజింత్ (LXX) బైబులు యూదులకు అతి ప్రియమైనదిగా ఉండేది. కాని
ఎప్పుడైతే, క్రైస్తవులు గ్రీకు బైబులును అధికార బైబులుగా అంగీకరించారో, అనగా
క్రీ.శ. మొదటి శతాబ్ద చివరిలో, యూదులు హీబ్రూ బైబులును మాత్రమే అధికార బైబులుగా
అంగీకరించారు. క్రైస్తవులపై ద్వేషముతో, యూదులు గ్రీకు సెప్తువజింత్ (LXX)
బైబులును తిరస్కరించారని స్పష్టమగుచున్నది.
క్రీ.శ.
16వ శతాబ్దములో రోముపై తిరుగుబాటు చేసిన ప్రొటెస్టెంటులు కూడా గ్రీకు సెప్తువజింత్
(LXX) బైబులును తిరస్కరించి, హీబ్రూ బైబులును అధికార బైబులుగా అంగీకరించారు. వీరుకూడా,
క్రైస్తవులపై ద్వేషముతో, గ్రీకు సెప్తువజింత్ (LXX) బైబులును
తిరస్కరించారని స్పష్టమగుచున్నది. అందుకే, హీబ్రూ బైబులు పట్టికను బట్టి, యూదుల,
ప్రొటెస్టెంటుల బైబులులో 39 పూర్వ నిబంధన గ్రంథాలే ఉన్నాయి. గ్రీకు సెప్తువజింత్
(LXX) బైబులు పట్టికను బట్టి, కతోలికుల బైబులులో 46 గ్రంథాలు ఉన్నాయి.
ప్రొటెస్టెంటులకు
“అపొక్రిఫల్” గ్రంథాలు
No comments:
Post a Comment