ఎలిశబెతమ్మను దేవమాత సందర్శన పండుగ

ఎలిశబెతమ్మను దేవమాత సందర్శన పండుగ

గాబ్రియేలు దేవదూత మరియకు శుభవార్త తెలిపిన కొద్ది కాలానికే తమకు వరుసకు అక్కయిన ఎలిశబేతమ్మ గర్భవతి అని తెలుసుకొని, ఆమెను సందర్శించడానికి వెళ్ళినది. ఎలిశబేతమ్మకు దినచర్యలో సహాయపడేందుకు మరియమ్మ అక్కడికి వెళ్ళినట్లు చరిత్ర చెబుతోంది. రెండు గ్రామాల మధ్య ప్రయాణ దూరం 70 మైళ్ళు. దారి కొండప్రాంతం. ఆ ఇద్దరు పవిత్ర స్త్రీలు కలుసుకోగానే ఎలిశబేతమ్మ, ఆమె గర్భములోనున్న శిశువు బప్తిస్త యోహానుగారిపై పవిత్రాత్మ ప్రభావం పడినది.

మొదటగా ఎలిశబేతమ్మగారు మరియను ‘‘దేవుని తల్లి’’ అని దీవించినది. అప్పుడు మరియ నా ఆత్మ ప్రభువును స్తుతించుచున్నది...అంటూ దైవ స్తోత్రం చేశారు. ఎలిశబేతమ్మ ప్రసవించే వరకూ మరియమ్మ అక్కడే ఉంటూ ఆమెకు పరిచర్యు చేస్తూ ఉండినదని సంప్రదాయక నమ్మకం.

మొదటిసారిగా ఈ సందర్శన ఉత్సవం క్రీ.శ. 1263లో ప్రారంభమైనట్లు తెలుస్తుంది. పునీత బొనవెంతూర్‌గారి సలహా మేరకు, పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ సభవారు ఈ సందర్శన ఉత్సవాన్ని ఆచరించడం ప్రారంభించారు. అనంతరం క్రీ.శ. 1389లో ఆరవ అర్బన్‌ పోపుగారి పాలనా కాలములో శ్రీసభలో ఉత్పన్నమైన గొప్ప చీలికను అంతమొందించేందుకు ప్రార్ధనా సూచనగా ఈ ఉత్సవాన్ని విశ్వ శ్రీసభ అంతటా కొనియాడాలని విజ్ఞప్తి చేశారు. ఎలిజబెత్‌ అనగా ‘దేవుడు చేసిన ప్రయాణం’, ‘దైవ పూజారి’ అని అర్ధం.

ధ్యానాంశం: మరియ తల్లి మనకు ఎన్నో మేులులు చేయాని, కృపావరాలు అందించాని ఎంతో మనోపూర్వకముగా ముందుకు వస్తోంది. కాని మనమే అంతే ఆశతో ఆసక్తితో వాటిని అందుకోలేక పోతున్నాము (పునీత బెర్నార్దీన్‌ దె బుస్తి).

No comments:

Post a Comment