కార్మికుడైన పునీత యోసేపు

కార్మికుడైన పునీత యోసేపు



అది
1955 మే 1వ తేదీ. ఇటలీ దేశములోని రోము నగరములోనున్న పునీత పేతురు  దేవాలయ ఆవరణమంతా ఎంతో సందడిగా వుంది. ఇటలీ కతోలిక కార్మిక సంఘ సభ్యుతో కిటకిట లాడుతుంది. వారంతా శ్రీసభ అమలు చేస్తున్న సాంఘిక కార్యక్రమాల యెడల తమ సుహృద్భావాన్ని విధేయతను వ్లెడిస్తూ, పదవ వార్షికోత్సవం సందర్భంగా మరొకసారి తమ కార్మిక  సంఘం అంకితభావానికి ప్రతీకగా ప్రతిజ్ఞ చేసేటందుకు సంసిద్ధంగా ఉన్నారు. ఆరోజున 10వ పయస్‌ (భక్తినాధ) పోపుగారు అచట చేరిన వారందరి సమక్షంలో మే నెల 1వ తేదిన కార్మికుడైన పునీత యేసేపుగారికి అంకితం చేసి ఆ రోజున ప్రతి సంవత్సరము కార్మిక దినోత్సవం కొనియాడి ఆ దీన శ్రమైకజీవి ఆదర్శాన్ని,  ఆశీర్వాదాన్ని బడసి తరింపుడని శ్రీసభ మాటగా సందేశమిచ్చారు.

ఇంకా పోపుగారు తమ ఉపదేశంలో ప్రపంచములోని యావత్తు శ్రామిక వర్గానికి కాపరిగా, సంరక్షకుడుగా, తండ్రిగా పునీత యేసేపుగారు సహాయంగా సహకారిగా ఉంటారని ప్రకటించారు. స్వయంగా శ్రమజీవియైన యేసేపుగారు తన కాయకష్టంతో చెమటోడ్చి వడ్రంగి వృతిపై వచ్చే ఆదాయంతోనే యేసు, మరియ యేసేపునబడే పవిత్ర తిరు కుటుంబాన్ని  పోషించుకున్నట్లు బైబిుద్వారా స్పష్టమవుతుంది. ఈ కారణమునుబట్టి పునీత యేసేపుగారికి కార్మిక వర్గానికి సారుప్యత కలిగి అపూర్వ అవినాభావ సంబంధ ముందనడంలో సందేహంలేదు.

ఇదిలా వుండగా పరిశుద్ధ 13వ లియో (సింహరాయు) పోపుగారు 1889లో పునీత యోసేపుగారిని శ్రామికులు, కార్మికులు, కష్టజీవులు, నిర్లక్షం చేయబడిన దీన జనావళి కందరికీ పాలకునిగా, మార్గ దర్శకునిగా శ్రీసభ తరుపున పునరుద్ఘటించారు. అలాగే కార్మికులు, చెమటోడ్చి కుటుంబ పోషణ భారాన్ని మోసేవారంతా పునీత యోసేపుగారిని మాతృకగా గైకొని తమ ప్రత్యేక మర్గచూపరిగా భావించి, వారిని స్వర్గరాజ్య పోషకునిగా గౌరవించాని పొప్‌ 15వ బెనడిక్ట్‌గారు ఆదేశించారు. నాస్తికకమ్యూనిజానికి వ్యతిరేకంగా పోరాడేందుకు గాను శ్రీసభ సంరక్షకులుగా పునీత యోసేపుగారినే ఎంపికచేసారు 11వ పయస్‌ (భక్తినాథ) జగద్గురువు.

కార్మిక ప్రజా తరగతికి చెందిన యోసేపుగారు పేదరికపు భారాన్ని మోస్తూ, జీవితాంతము వరకు శ్రమించి, మొద్దు కష్టం చేసి పరిశుద్ధ తిరుకుటుంబ పోషకుగా నిలిచారు. అందుకే అనునిత్యం తమ భాధ్యతల్ని నిర్వర్తిస్తూ శరీర కష్టంతో చమటోడ్చి ఆహారాన్ని, సంపాదించే వారికి యోసేపుగారు ఆదర్శంగా వున్నారని 11వ పయస్‌ (భక్తినాథ) జగద్గురువులే వివరించారు.

ఇలా కార్మిక దినోత్సవం రోజున పునీత యోసేపుగారి ఉత్సవాన్ని ఏర్పాటు చేయబడటం వల్ల ఈ దినానికి గొప్ప విశిష్టత ఆపాదింప బడిందనవచ్చును. శ్రమ, పని, కృషి, మానవ ప్రయత్నమునకు, ఎనలేని గౌరవం, ప్రాధాన్యత, ఘనత, మలువ, గుర్తింపు ఇవ్వబడిందన వచ్చును. పనికి దగ్గ ప్రతిఫలం గుర్తింపులేని యెడల మానవ హృదయం ఒకింత కలత పడుతుంది. వ్యధచెందుతుంది. కాని పునీత యోసేపుగారి మధ్యవర్తిత్వంన కాయకష్టం ఏనాడు వృధా పోదు. కష్టే ఫలి అని తన జీవితంలో దీనత్వం, పేదరికం వల్ల పునీత యోసేపు గారు ఆశీర్వదింపబడి మంచి మరణం పొందారు. యేసు మరియ హస్తాల్లో పట్టుకొనబడి, పరలోక ప్రాప్తినొందారు. సజీవ మహిమ కిరీటాన్ని ధరించారు. భూపరలోకాల్లోని, ఆస్తి పాస్తులకు, శ్రమైక జీవులకు సంరక్షకునిగా, పోషకునిగా, తండ్రిగా, దైవంచే ఎన్నుకొనబడినారని అనడంలో ఏమాత్రం అనుమానం లేదు.
        
కార్మిక కుటుంబాలను పునీత యోసేపుగారు అనునిత్యం తన జ్ఞాన ధృక్కులతో, దీవెనతో కాచికాపాడుతారు. అసు వారి తత్వమే అది కదా! క్రైస్తవ కార్మికుడికి సజీవ మాతృకయై నిరంతర మాదిరియై ఆదర్శ ప్రాయులైన పునీత యోసేపుగారిని గౌరవించడం, మన కుటుంబాల్లోకి ఆహ్వానించి మర్యాద చేయడం మన కనీస భాద్యత. శ్రమను గౌరవించడమే యోసేపుగారిని గౌరవించినట్లు. భాధ్యతతో అమరికలు లేక కష్టపడి పని చేయడంలో ఎలాంటి సమస్యలు, చిక్కులు తారసిల్లినా వాటిని సామరస్యంగా పరిష్కరింప యోసేపుగారు తయారుగా వున్నారు. వారు కార్మికులకు అన్నివిధాలా వారి నైజంను బట్టి తోడ్పడతారు.

అందువల్ల ప్రతీ క్రైస్తవ కార్మికుడు ఏ సంస్థలో, ఏ వృత్తిలో, ఏ హోదాలో ఎలాంటి పని చేస్తున్నా శ్రమ యెడల పూజ్యభావం కలిగి, పని అంటే ప్రభుని పూజించటమేయని భావించి సమయమును వ్యర్ధ పరచక భాద్యతగల కార్మికునిగా ఆ పునీత యోసేపుగారి అడుగు జాడలలో పయనింప ప్రయత్నించాలి. శ్రమైక జీవులంతా ఒక్కటే. యోసేపు అంటే ‘దేవుడు సమృద్ధి చేయును’, ‘హెచ్చించును’ లేక ‘ఎక్కువ చేయును’ అని అర్ధం. నేడు ప్రపంచ కార్మిక దినోత్సవము.

ధ్యానాంశం: నీవు ఏమి తిన్నా, త్రాగినా, ఏమి చేసినా, దేవుని మహిమ కోసం చేయాలి (1 కొరి. 10:31).

No comments:

Post a Comment