కాపరి లేఖలు
పౌలు తిమోతికి
వ్రాసిన మొదటి లేఖ, రెండవ లేఖ మరియు తీతుకు వ్రాసిన లేఖ
ఉపోద్ఘాతము
లేఖల ఉద్దేశ్యం
గ్రంథకర్త
ఉపోద్ఘాతము
పౌలు తిమోతికి వ్రాసిన రెండు లేఖలు మరియు తీతుకు వ్రాసిన లేఖ సాధారణముగా ‘కాపరి లేఖలు’గా పేరు గాంచాయి. ఎందుకనగా, క్రైస్తవ సంఘాలను చైతన్య పరచుటకు పౌలు తన అనుచరులకు అవసరమైన సలహాలను ఈ లేఖల ద్వారా తెలియజేయు చున్నాడు.
ఈ లేఖలు సంఘాలను గురించిన సమాచారమును, ముఖ్యముగా సంఘాల యొక్క ‘నిర్మాణం’, ‘నిర్వహణ’, ‘కర్తవ్యం’ గురించి, సంఘ కాపరులు లేదా నిర్వాహకులు ఎలాంటి లక్షణాలను, సుగుణాలను కలిగి యుండాలో తెలియజేయు చున్నాయి. అలాగే క్రైస్తవ సంఘాలలో వచ్చిన మార్పులను, ముఖ్యముగా ‘నాయకత్వం’, సిద్ధాంతం’, ‘శ్రీసభ’ మరియు ‘సమానత్వం’ విషయాలలో మార్పు ఈ లేఖలలో మనకి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ లేఖలు శ్రీసభ (క్రైస్తవ సంఘాలు) అభివృద్ధిని గురించి కూడా తెలియజేయు చున్నాయి. అదేవిధముగా, సంఘాలలోనున్న సమస్యలకు పరిష్కార మార్గాలను కూడా చూపిస్తున్నాయి.
లేఖల
ఉద్దేశ్యం
అందరిని యూదులను, అన్యులను క్రీస్తు-విశ్వాసములోనికి నడిపించుటకు మరియు గతములోని పౌలు అపోస్తోలికత్వమును, బోధనలను ఈనాటి క్రైస్తవులకు అందించుటకు
గ్రంథకర్త
No comments:
Post a Comment