పాస్కా మూడవ ఆదివారము (26.04.2020)
పఠనాలు: అ.కా. 2:14, 22-33, 1 పేతు. 1:17-21, లూకా. 24:13-35
అవహేళన నుండి ... ఆరాధన లోనికి...
క్రీస్తు ఉత్థాన పండుగను కొనియాడి, పెంతకోస్తు పండుగకు సిద్ధమవుతున్న దేవుని బిడ్డలారా!
ఈనాటి మొదటి పఠనములో, పవిత్రాత్మను పొందిన తర్వాత, యెరూషలేములో కూడిన యూదులు మరియుఅన్యులముందు ధైర్యముగా పేతురుగారు చేసిన ప్రసంగమును నజరేయుడైన యేసు క్రీస్తుకు, ఆయన మరియు ఇతర అపోస్తలులు యిచ్చిన సాక్ష్యమును మనం వినియున్నాము.
క్రీస్తు మరణం, ఉత్థానం తర్వాత, క్రీస్తును గూర్చి బహిరంగముగా మాట్లాడిన మాటలు! నూతన గ్రంథములో దేవుని రక్షణ ప్రణాళికను గూర్చి, ఆయన తన హస్తముద్వార జరిగిన కార్యములను గూర్చి ఇవ్వబడిన సాక్ష్యం! ఈ వాక్యపు సందర్భమును, సందేశమును ఈ రోజు ధ్యానించుదాము.

సందర్భం: క్రీస్తు ఉత్థానం తర్వాత యూదులకు భయపడి శిష్యులు మరియు ఇతర విశ్వాసులు అందరు కలిసి కట్టుగా ఉన్నారు. భయంకూడా వారిని విడదీయలేక పోయినది. భయముతో కలసి కట్టుగా ప్రార్ధనలో (అ.కా. 1:14), పరిచర్యలో, సహవాసములో కలిసి యుండిరి. యేసు వాగ్ధానము చేసిన పవిత్రాత్మకై వేచియుండిరి (అ.కా. 1:4). అపోస్తులతో కూడిన ఈ చిన్ని సమూహం, పవిత్రాత్మను పొందగా (అ.కా. 2:4) వారు దేవుని మరియు ఆయన ఈ లోకములో చేసిన గొప్ప కార్యములను వారు పొగడిరి. వారు దేవుని స్తుతించిరి. పెంతకోస్తు పండుగకు వచ్చిన వారందరూ అపోస్తలులు మరియు ఇతర విశ్వాసులు చేసిన ప్రార్ధనను, స్తుతి ఆరాధనను వారి వారి సొంత భాషలో విని (అ.కా. 2:7) ఆశ్చర్యపడిరి. కొందరు, ఇదేమి వింత అని, వెక్కిరింపుగా నవ్వారు. మరికొంత మంది, వారిని, "వీరు ప్రొద్దునే మద్యపానం చేసి, పిచ్చి వాగుడు వాగుతున్నారు" అని అవహేళన చేశారు, ఎగతాళి చేశారు (అ.కా. 2:13).
ఈ అవహేళనను, ఎగతాళిని పేతురు తన ప్రసంగానికి, తన సాక్ష్యమునకు ఆరంభముగా మలచుకొంటున్నాడు. అన్యులు, యూదుల అవహేళనను పేతురు అవకాశముగా, అదునుగా వాడుకొంటున్నాడు. ఆశ్చర్యపడిన వారిని, అవహేళన చేసినవారిని, పవిత్రాత్మ శక్తి అర్ధం కాని వారిని క్రీస్తు వైపుకు, క్రీస్తు ఆరాధనలోకి నడుపుతున్నాడు (అ.కా.2:41). అవహేళన చేసిన వారిని, ఆరాధనలోనికి నడిపినది పేతురుగారి యొక్క సందేశము, సాక్ష్యము.
ఈ సందేశములో, సాక్ష్యములో ఏమి నిక్షిప్తమై యున్నది? ఈ సందేశములోని సారమే వారి మనసులను మార్చింది. ఈ సందేశములో, యేసు క్రీస్తు యొక్క పరిచర్యను గురించి, యేసు క్రీస్తు యొక్క మరణమును గురించి, భూస్థాపితమును గురించి, దేవుడు ఆయనను మరణము నుండి లేవనెత్తినది విపులముగా వివరించాడు. క్రీస్తు సిలువ త్యాగం దేవుని యొక్క రక్షణ ప్రణాళికయని, అది దేవుని యొక్క బలహీనత కాదు, దేవుని యొక్క బలమని, దేవుని యొక్క శక్తియని, ప్రవక్తలద్వారా దేవుడు ప్రవచించిన వాక్యములు నిజమని నిరూపింపబడినవి.
అందుకే యావేలు ప్రవక్త ప్రవచనమును (యావేలు 2:28-29), క్రీర్తన 16:8-11 మరియు కీర్తన 110:1 ప్రస్తావిస్తున్నాడు. దావీదు సమాధికి మీరు సాక్ష్యులు. ఖాళీ (యేసు) సమాధికి మేము సాక్ష్యులము అని ధైర్యముతో క్రీస్తు కొరకు వాదించాడు. ఆ దినమున దాదాపు మూడు వేల మందిని క్రీస్తు సంఘములోనికి, క్రీస్తు సహవాసములోనికి, క్రీస్తు విశ్వాసములోనికి దేవునిచే నడిపింపబడినారు. ఇది దేవుని కార్యము. అందుకే, పేతురుగారు తన ప్రసంగములో చాలాసార్లు, "దేవుడు వానిని... మీ మధ్య చేసెను" (22 వచనం), "దేవుడు... ఆయనను మృతుల నుండి లేపెను" (24 వచనం), ఇది "దేవుని శక్తి" అని వారికి బోధించాడు.

ఈ ప్రసంగములో దేవుని మనుష్యావతారము నుండి దేవుని 'మహిమవతారం' వరకు (అనగా యేసు మహిమలో దేవుని కుడి ప్రక్కన కూర్చున్న వరకు, అ.కా. 2:33) క్లుప్తముగా వారికి వివరించి, వారిని క్రీస్తు కొరకు జయించాడు. క్రీస్తులోనికి, దేవుని మార్గములోనికి, దేవుని రాజ్యములోనికి వారిని నడిపించాడు. క్రీస్తు మరణ, ఉత్థానమే, పేతురు సందేశము యొక్క బలము. అదే అతని ప్రసంగము యొక్క సారము, సందేశము.
సందేశం: ప్రియ సోదరా, సోదరీ! నీవు క్రైస్తవుడవైనందుకు, క్రీస్తును నమ్ముకున్నందుకు, క్రీస్తులో నడుస్తున్నందుకు, క్రీస్తును నీ జీవితానికి మార్గదర్శకం చేసుకున్నందుకు, క్రీస్తు మాటలను చదువుచున్నందుకు, క్రీస్తు సందేశమును ప్రకటిస్తున్నందుకు, ఎవరైనా నిన్ను అవహేళన చేస్తున్నారా? ఎగతాళి చేస్తున్నారా? భయపెడుతున్నారా? బెదిరిస్తున్నారా?
నీవు కలవర పడవలదు! అదరకు! బెదరకు!
నీవు కలవర పడవలదు! అదరకు! బెదరకు!
వారి అవహేళనను, పేతురులాగా, నీ జీవిత సాక్ష్యమునకు ఆరంభముగా చేసుకో! వాళ్ళు నీపై విసిరిన రాళ్ళను, నీ విజయానికి మెట్లగా మార్చుకో! క్రీస్తును ప్రకటించడానికి అవకాశముగా మార్చుకో! క్రీస్తు మనకు యిచ్చిన వాక్యమును ఆయుధముగా మార్చుకో! నీ ఆలోచనలు, ఆ పవిత్ర గ్రంథముపై కేంద్రీకరించు. నీకు కావలసిన మాటను, ధైర్యమును (మత్త.10:19) ఆయన నీకు ఇస్తాడు. నిన్ను నడిపిస్తాడు, నీతో నడుస్తాడు. నీ ద్వారా ఎంతో మందిని మంచి మార్గములో, దేవుని మార్గములో, క్రీస్తు మార్గములో నడిపిస్తాడు.
ఒక నిరక్ష్యరాసుడైన పేతురు ద్వారా, చేపలు పట్టే పేతురుద్వారా, దేవుడు అతనికి జ్ఞానమును ప్రసాదించి, అతనిద్వారా ఒక్క పెంతకోస్తు పండుగ దినమున మూడు వేల మందిని సంపాదించుకొంటె, నీ ద్వారా కూడా, దేవుడు ఎంతో మందిని సంపాదించుకుంటాడు. పేతురు లాగా, నిన్ను నీవు సంపూర్ణంగా అర్పించు కొనుటకు సిద్ధముగా ఉన్నావా?

అవహేళను,
ఎగతాళిని,
ఎదురింపులను,
అవమానములను,
దూషణములను,
శ్రమలను,
నిందలను,
నీ సాక్ష్యమునకు ఆరంభముగా మార్చుకో!
దానికి క్రీస్తు వాక్కును ఆయుధముగా వాడుకో!
ఆమెన్!
(రెవ. ఫాదర్. జాన్ అంథోని, కపూచిన్)
No comments:
Post a Comment