9. పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ

9. పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ
9.1. ఉపోద్ఘాతం
9.2. గ్రంథకర్త
9.3. ఎఫెసు పట్టణం

9.1. ఉపోద్ఘాతం

నూతన నిబంధన రచనలలో ఈ లేఖ చాలా ప్రత్యేక మైనది. ఎందుకన, ఈ లేఖ శ్రీసభ గురించి బోధిస్తుంది: ‘ఏక’ శ్రీసభ (ఎఫెసీ. 2:15-16, 4:4-6), ‘పవిత్ర’ శ్రీసభ (ఎఫెసీ. 1:4, 2:21), ‘కతోలిక’ శ్రీసభ (ఎఫెసీ. 4:4-6) మరియు ‘అపోస్తోలిక శ్రీసభ (ఎఫెసీ. 2:20). ఈ లేఖ కొంతవరకు కొలొస్సీయులకు వ్రాసిన లేఖపై ఆధారపడు చున్నది. ఈ లేఖను కూడా పౌలు చెరలో నుండి వ్రాసాడు.

9.2. గ్రంథకర్త

పౌలు గ్రంథకర్తయని లేఖ పరిచయం చేస్తుంది (ఎఫెసీ. 1:2, 3:1).

అయితే, కొందరి బైబులు పండితుల అభిప్రాయం ప్రకారం, ఈ లేఖను పౌలుగాక, పౌలు అనుచరులలో ఒకరు వ్రాసి యుండవచ్చు. అలాగైతే, క్రీ.శ. 90లలో ఎఫెసు నగరము నుండి ఈ లేఖ వ్రాయబడినది. ఈ వాదనకు ముఖ్యమైన కారణాలు:

9.2.1. శ్రీసభ: ఇతర లేఖలలో శ్రీసభ యనగా ‘స్థానికముగా ఉండే విశ్వాసుల సంఘము’ అని పేర్కొనబడినది. కాని, ఈ లేఖలో శ్రీసభ యనగా ‘విశ్వవ్యాప్తముగా ఉండే విశ్వాసుల సంఘము’ అని పేర్కొనబడినది. ఇతర లేఖలలో శ్రీసభ క్రీస్తుపై నిర్మించబడినది అని చెప్పబడినది. కాని, ఈ లేఖలో శ్రీసభ అపోస్తలుల మరియు ప్రవక్తల పునాదిపై నిర్మించ బడినది అని చెప్పబడినది. ఇతర లేఖలలో క్రైస్తవులు క్రీస్తు శరీరము అను అంశమును నొక్కి చెప్పబడినది. కాని, ఈ లేఖలో క్రీస్తు శ్రీసభకు శిరస్సుగా అని చెప్పడం జరిగినది.

9.2.2. క్రీస్తు రాకడ: ఇతర లేఖలకు భిన్నముగా, క్రీస్తు రెండవ రాకడ “త్వరలో” వచ్చును అని ఈ లేఖలో చెప్పబడ లేదు.

9.2.3. వివాహము: ఈ లేఖలో శ్రీసభ క్రీస్తుకు వధువు అని చెప్పబడినది. ఈ విషయం ఇతర లేఖలలో చెప్పబడ లేదు. ఇతర లేఖలలో, క్రీస్తు రాకడ “త్వరలో” వచ్చును అన్న సందర్భములో వివాహమును గురించి తక్కువ చేసి మాట్లాడటం జరిగినది. కాని, ఈ లేఖలో వివాహము గురించి గౌరవపూర్వకముగా, గొప్పగా చెప్పబడినది.

9.3. ఎఫెసు పట్టణం

ఆసియా మైనరులో ఎఫెసు అతి ప్రాముఖ్యమైన పట్టణం. ఇది ప్రసిద్ధమైన రేవు పట్టణముగా పేరు గాంచినది. అందులకే పెద్ద వ్యాపార కేంద్రముగా మారినది. ప్రస్తుత టర్కీ దేశములో ఉన్నది. ఒకప్పుడు ఇది గ్రీకు కాలని. తరువాత రోమను సామ్రాజ్యపు ఆసియా మండలానికి రాజధాని అయింది. ఎఫెసు పట్టణం అన్యదేవత ఆరాధనకు నిలయము మరియు ఇంద్రజాలమునకు ప్రసిద్ధి. ‘డయానా’ దేవతారాధనకు ప్రసిద్ధి. ‘డయానా’ దేవత పేర పెద్ద గుడి ఉండెను. క్రీ.శ. 6వ శతాబ్దము నుండి ఈ గుడి ‘అర్తెమి’ దేవత (అ.కా. 19:27, 28) పేరుమీదుగా పిలువబడి యున్నది. ఈ గుడి పూర్వ ప్రపంచములో ఏడు అద్భుతాలలో ఒకటి. 

No comments:

Post a Comment

Pages (150)1234 Next