9. పౌలు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ - 04
9.7.3. ప్రధానాంశాలు
9.7.3.1. క్రీస్తు శాస్త్రము
9.7.3.2. శ్రీసభ గూర్చి బోధన
9.7.3.3. పునరుత్థానము
9.8. ముగింపు (6:21-24)
9.7.3. ప్రధానాంశాలు
9.7.3.1. క్రీస్తు
శాస్త్రము
శ్రీసభ క్రీస్తు శరీరము. క్రీస్తు దేవుని పరిపూర్ణము. సర్వము పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవసంఘము (ఎఫెసీ. 1:23). మనముకూడా దేవుని పరిపూర్ణత్వముతో సంపూర్ణముగా నింపబడుదుము (ఎఫెసీ. 3:19).
దేవుడు సమస్తమును క్రీస్తు
పాదముల క్రింద ఉంచెను. సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా
అనుగ్రహించెను (ఎఫెసీ. 1:22). దివ్యులగు ప్రభువులకును, అధికారులకును, శక్తులకును,
నాధులకునుఅధికుడై క్రీస్తు పరిపాలించును (ఎఫెసీ. 1:21). ఇప్పుడు సర్వమును
పరిపూర్ణము చేయగలడు (ఎఫెసీ. 1:23). మనము క్రీస్తు యేసు ద్వారా సృజింప బడితిమి
(ఎఫెసీ. 2:10). లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తు నందు తన వారిగా
ఎన్నుకొనెను (ఎఫెసీ. 1:4).
9.7.3.2. శ్రీసభ
గూర్చి బోధన
శ్రీసభ ‘ఏక’ శ్రీసభ (ఎఫెసీ. 2:15-16, 4:4-6), ‘పవిత్ర’ శ్రీసభ (ఎఫెసీ. 1:4, 2:21), ‘కతోలిక’ శ్రీసభ (ఎఫెసీ. 4:4-6) మరియు ‘అపోస్తోలిక శ్రీసభ (ఎఫెసీ. 2:20) అని ఈ లేఖలో బోధించ బడినది. శ్రీసభ క్రీస్తు శరీరము. క్రీస్తు శ్రీసభకు శిరస్సు (ఎఫెసీ. 1:21-23, 3:9-11). క్రీస్తు శ్రీసభను ఎన్నటికిని పోషించును (ఎఫెసీ. 5:29-30). క్రీస్తు యేసు మూలరాయిగా అపోస్తలుల చేతను, ప్రవక్తల చేతను వేయబడిన పునాదిపై శ్రీసభ నిర్మించ బడినది (ఎఫెసీ. 2:20).
క్రీస్తు యేసు మూలరాయి (ఎఫెసీ. 2:20). శ్రీసభ అనెడి భవనము నంతయు ఒకటిగా నిలిపి, దానిని ప్రభువు నందు పవిత్ర దేవాలయముగా పెంపొందించు వాడు క్రీస్తే. ఆయనతో ఏకత్వము వలన అందరును ఒక గృహముగ నిర్మింపబడు చున్నారు. అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసించును.
క్రీస్తు శ్రీసభకు భర్త: పూర్వ నిబంధనలో ఇస్రాయేలుకు భర్తగా యావేను ప్రస్తావించడం జరిగింది. యావే స్థానములో యేసును, ఇస్రాయేలు స్థానములో శ్రీసభను గ్రంథకర్త మార్చుతున్నాడు (ఎఫెసీ. 5:25-32).
క్రీస్తు తన దేహమగు శ్రీసభకు రక్షకుడు (ఎఫెసీ. 5:23). శ్రీసభను క్రీస్తు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. క్రీస్తుకు శ్రీసభపై అధికారము కలదు (ఎఫెసీ. 5:23).
9.7.3.3. పునరుత్థానము
ఈ లేఖలో పునరుత్థానము ‘ఇప్పటికే జరిగినట్లుగా’ చూస్తున్నాము. “ఆధ్యాత్మికముగ నిర్జీవులమై ఉన్న మనలను, క్రీస్తుతో కూడ దేవుడు పునర్జీవులను చేసెను... ఆయనతో పాటు మనలను పునర్జీవులను చేసి పరలోకములో ఆయనతో పాటు కూర్చుండ చేసెను (ఎఫెసీ. 2:5-6).
9.8. ముగింపు
(6:21-24)
No comments:
Post a Comment