5.3.
ప్రధానాంశములు
5.3.1. పౌలు తన అపోస్తోలికత్వమును సమర్ధించుట (2:14-7:16)
5.3.1.1. పౌలు వాదనలు (2:14-3:6)
5.3.1.2. పౌలు యొక్క శ్రమలు తన అపోస్తోలికత్వమును ధృవీకరించుట (2 కొరి. 6:1-13)
5.3.1.3. అవిశ్వాసుల ప్రభావమును గూర్చిన హెచ్చరిక (6:14-7:16)
5.3.1. పౌలు
తన అపోస్తోలికత్వమును సమర్ధించుట (2:14-7:16)
పౌలు అపోస్తలుడుగా తాను పొందిన శ్రమలను వర్ణిస్తున్నాడు. ఖైదీలుగా, బానిసలుగా, మరణం వైపునకు నడిపించ బడ్డానని తెలియజేయు చున్నాడు. ఆ తరువాత, తన అపోస్తోలికత్వమును ప్రశ్నించిన వారిని సంబోధించు చున్నాడు. వీరు పౌలు శ్రమలను (2 కొరి. 4:7-15, 6:3-10, 11:23-33), పౌలు వ్యక్తిత్వమును (2 కొరి. 10:10, 1 కొరి. 2:1-5) మరియు తాను బోధించిన సువార్తను ప్రశ్నించిరి. దేవుని సందేశమును అల్పవస్తువులతో సమానముగా ఎంచినాడని (2 కొరి. 2:17), కొరింతీయులకు కీడు చేశాడని (2 కొరి. 7:7-15), సహాయము కొరకు కొరింతీయులను బాధించాడని, వారికి భారముగా ఉన్నాడని, తక్కరితనముతో, అసత్యములతో వారిని మోసగించాడని (2 కొరి. 12:13-19) వారు పౌలును తప్పు బట్టారు.
5.3.1.1. పౌలు
వాదనలు (2:14-3:6)
2 కొరి. 2:14-3:6 - రక్షింప బడువారు, నాశనమొందువారు అని రెండు వర్గాల వారిని గురించి పౌలు తెలియజేయు చున్నాడు (2:14-17). పౌలు హృదయ పూర్వకముగా సువార్త బోధించుట వలన శ్రమలను అంగీకరించెను (2:17).
తనపై మోపబడిన రెండు నిందలను పౌలు తిరస్కరిస్తున్నాడు. తనలో అహంకారము మరియు ప్రగల్భాలు లేవని తెలియజేయు చున్నాడు. యెరూషలేము అపోస్తలుల నుండి తనకు ఎలాంటి పరిచయ/ఆమోద పత్రము అవసరము లేదని పౌలు భావన. “ఇతరుల వలె ,మేమును, మీకుగాని, మీనుండిగాని పరిచయ పత్రములను సంపాదింప వలెనా? మీరే మా హృదయములపై వ్రాయబడి అందరును తెలిసికొన దగినదియు, చదువ దగినదియు అగు మా పరిచయ పత్రము. క్రీస్తే ఈ పరిచయ పత్రమును వ్రాసి మా ద్వారా పంపెననుట సుస్పష్టము. అది రాతి పలకపై సిరాతో వ్రాయబడలేదు. అది మానవ హృదయములపై సజీవుడగు దేవుని ఆత్మతో వ్రాయబడినది (2 కొరి. 3:1-3).
5.3.1.2. పౌలు
యొక్క శ్రమలు తన అపోస్తోలికత్వమును ధృవీకరించుట (2 కొరి. 6:1-13)
“పొందిన దేవుని కృపను వ్యర్ధము చేయరాదు” అని కొరింతీయులను పౌలు వేడుకొను చున్నాడు. ఏలయన, “అనుకూల సమయమున నిన్ను ఆలకించితిని. రక్షణ దినమున నీకు తోడ్పడితిని” (యెషయ 49:8, 2 కొరి. 6:1-2). “రక్షణ దినము” అనగా ‘ప్రభువు రాకడ’. ‘మారుమనస్సు పొందు సమయము’ అనగా క్రీస్తురాకడ మరియు రెండవ రాకడ మధ్య సమయము. ఈ మధ్య సమయము ఎంతకాలమో మనకి తెలియదు. ఈ కాలములో అనేక బాధలు, కష్టాలు, ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. పౌలు ప్రకారం, అంతయు త్వరలోనే యున్నది కనుక జాగరూకులై ఉండవలయును.
తను, తన అనుచరులు ఎవరును, ఎప్పుడును ఎవరి రక్షణ మార్గమునకు ఆటంకము కలిగించ లేదని పౌలు నొక్కి చెప్పుచున్నాడు. ఎన్ని ఇబ్బందులు, శ్రమలు పడినను ఇతరుల రక్షణము కొరకు పాటు బడితిమి.
కొరింతులోని అబద్ధపు బోధకులు
దేవునితో సఖ్యపడవలయునని పిలచు చున్నాడు (2 కొరి. 6:3-13). ఈవిధముగా, తన శ్రమలు తన
అపోస్తోలికత్వమును ధృవీకరిస్తున్నాయని తన వాదనల ద్వారా తెలియజేయు చున్నాడు.
పౌలు పొందిన
శ్రమలు:
- తన పనియందు తప్పుపట్టబడినాడు
- బాధలు, కష్ఠములు, ఇబ్బందులు పడినాడు
- ఓర్పుతో సహించాడు
- కొట్టబడినాడు
- చెరయందు ఉంచబడినాడు
- అల్లరి మూకల అలజడికి
గురియైనాడు
- అధికముగా పనిచేయ వలసి వచ్చి,
నిద్రహారములు మానాడు
- అవమానింప బడినాడు, నిందింప
బడినాడు
- అసత్యవాదిగా అవమానింప బడినాడు
- అనామకుడిగా ఉన్నాడు,
మరణావస్థలో నున్నాడు, శిక్షింప బడినాడు
- విషాదాత్మునిగా, పేదవానిగా
ఉన్నాడు
- ఏమియు లేనివానిగా అనిపించు
కున్నాడు
5.3.1.3. అవిశ్వాసుల
ప్రభావమును గూర్చిన హెచ్చరిక (6:14-7:16)
క్రైస్తవ
విశ్వాసులు, సంఘములోని అవిశ్వాసుల యొక్కయు మరియు అన్యుల యొక్కయు కార్యాలపట్ల (అవిశ్వాసము,
విగ్రహారాధన...) జాగరూకులై ఉండవలయునని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఈ కార్యాలు సంఘమును
విభజించి, ప్రభువునుండి వేరు చేసే అవకాశము ఉన్నది.
కొరింతీయులు అన్యులచేత ప్రభావితమయ్యే అవకాశము ఎక్కువగా ఉన్నది. కనుక, అవిశ్వాసులతో, అన్యులతో జాగ్రత్తగా ఉండవలయునని పౌలు హెచ్చరిస్తున్నాడు. పౌలు ఐదు ప్రశ్నల రూపములో, ఐదు విషయాలలో అసమతుల్యత ఉన్నట్లుగా తెలియజేయు చున్నాడు: నీతి-అవినీతి, వెలుతురు-చీకటి, క్రీస్తు-సైతాను, విశ్వాసి-అవిశ్వాసి, దేవుని ఆలయము-విగ్రహములు.
ఈ
భాగములో ముఖ్యమైన ప్రకటన, “మనమే సజీవుడగు దేవుని ఆలయము” (2 కొరి 6:16, 1 కొరి
3:16, 6:19). ఐదు ప్రశ్నలు:
నీతి,
అవినీతి ఎట్లు కలిసి ఉండగలవు?
చీకటి,
వెలుతురు ఎట్లు ఒకచోట కలిసి ఉండగలవు?
క్రీస్తుకు
సైతానుతో ఏమి సంబంధము?
విశ్వాసికి,
అవిశ్వాసికి సామ్యమేమి?
దేవుని
ఆలయము, అవిశ్వాసుల విగ్రహములతో ఎట్లు ఏకీభవింపగలదు?
క్రైస్తవ
సంఘము సజీవుడగు దేవుని ఆలయము అని పౌలు నొక్కి చెప్పుచున్నాడు. దీనిని మద్దతు
నిమిత్తమై, పౌలు పూర్వ నిబంధన నుండి ఉదహరించు చున్నాడు.
1. లేవీయ కాండము 26:12, “నేను నా నివాసమును వారితో
ఏర్పరచుకొందును, వారి మధ్యనే జీవింతును” (2 కొరి. 6:16).
2. యిర్మియా 32:38, “నేను వారికి దేవుడనగుదును వారు నా
ప్రజలగుదురు” (2 కొరి. 6:16).
3. యెహెజ్కేలు 37:27, “నేను వారితో వసింతును. నేను వారికి
దేవుడనగుదును వారు నా ప్రజలగుదురు” (2 కొరి. 6:16).
4. యెషయ 52:11, “మీరు వారిని విడువ వలెను, వారి నుండి
వేరుపడవలెను, అపరిశుద్ధమగు దానితో ఎట్టి సంబంధమును ఉంచుకొనకుడు. అప్పుడే మిమ్ము
చేరదీసెదను” (2 కొరి. 6:17).
5. 2 సమూ. 7:14, “మీకు నేను తండ్రిని అగుదును. మీరు నా బిడ్డలగుదురు” (2 కొరి. 6:18).
పౌలు
ఎవరిని నిందించుట లేదు, ఖండించుట లేదు. తన శ్రమలలో కూడా సంతోషముగా ఉన్నాడు.
కొరింతీయులు వారి హృదయాలను తెరువాలని పౌలు కోరుచున్నాడు (7:2-5).
No comments:
Post a Comment