5.3. రోమను నేపథ్యము
పౌలు పుట్టుకతోనే రోము పౌరుడు (అ.కా. 16:37-39, 22:24-30, 25:8-12). కనుక పన్ను విధింపునుండి మినహాయింప బడినాడు. రోము పౌరసత్వమును పలు విధాలుగా సంపాదించుకొన వచ్చును. రోము పౌరసత్వము పుట్టుకతో వచ్చును లేదా డబ్బు ఖర్చుపెట్టి కొనవచ్చు (అ.కా. 22:28) లేదా రోమనుల వద్ద పనిచేస్తూ అర్హతను బట్టి రోము పౌరసత్వమును సంపాదించవచ్చు. బహుశా, పౌలు తండ్రిగాని, తాతగారుగాని రోమను ఆస్థానంలో పనిచేస్తూ అర్హతపై రోము పౌరసత్వమును పొంది యుండవచ్చు.
రోము పౌరసత్వము గలవారు కొన్ని ప్రత్యేక హక్కులను
కలిగి యుండేవారు: నివాస స్థలం, వ్యక్తిగత విచారణ మరియు కొరడాలతో కొట్టడం, సిలువ మరణం వంటి సాధారణ శిక్షలు రోమా పౌరులకు ఉండేవి
కావు (అ.కా. 22:22-29, చూడుము. 16:37, 22:29, 25:8-12, రోమీ. 13:1-5, 1 తిమో. 2:1-3).
No comments:
Post a Comment