4. పౌలు నామార్ధము

 4. పౌలు నామార్ధము

పౌలు తన లేఖలలో తననుతాను ఎప్పుడు, గ్రీకు, రోమీయ నామమైన ‘పౌలు’గానే పరిచయం చేసుకున్నాడు (1 తెస్స. 1:1, 2:18, రోమీ. 1:1, 1 కొరి. 1:1, 12-13...). పేతురుకూడా తన లేఖలో ‘పౌలు’ అను నామమునే ఉపయోగించాడు (2 పేతు. 3:15). లూకా అపోస్తలుల కార్యములులో మొదటగా ‘సౌలు’ నామమును ఉపయోగించాడు (7:58, 8:1, 3, 9:1, 8, 11, 22, 24, 11:25, 30, 12:25, 13:1, 2, 7). ఆ తరువాత, 13:9లో “పౌలు అని పిలువ బడుచున్న సౌలు” అని తెలుపుతూ ఆపై పౌలుఅను పేరును మాత్రమే ఉపయోగించాడు.

బెన్యామీనీయుడు అయిన ఇశ్రాయేలీయుల ప్రధమ రాజు సౌలు (1 సమూ. 9:1) నామమును అతని తల్లిదండ్రులు ఆయనకు పేరు పెట్టిన పేరు. హీబ్రూ నామము అయిన సౌలు (שָׁאוּל) అనగా ‘అడగబడినవాడు’ (దేవుని నుండి) అని అర్ధం. అనగా తల్లి ఒక బిడ్డ కొరకు దేవున్ని ‘అడిగింది’. దానికి బదులుగా దేవుడు ఆ తల్లికి ఒక బిడ్డను దయచేశాడు. ఆ బిడ్డకు ఆ తల్లి హీబ్రూ నామమైన ‘సౌలు’ అని పిలచుకున్నది. అందుకే పౌలు కూడా, “నా తల్లి గర్భము నందే దేవుడు దయతో నన్ను తన సేవకై ప్రత్యేకించి పిలిచెను” (గలతీ. 1:15) అని చెప్పాడు.

“పౌలు” (Παύλος – Pávlos) అనే గ్రీకు నామము పుట్టుకతోనే పిలువబడినది. ఇది అతని రోమను పౌరసత్వానికి చెందినది మరియు అతని రోమీయ నేపధ్యాన్ని సూచిస్తుంది. ‘సౌలు’ అని అతని యూద నేపథ్యములో పిలువబడినాడు. ఆ కాలములో అనేకమంది యూదులు రెండు పేర్లను కలిగి యుండేవారు.

లతీను భాషలో పౌలుస్‌ (Paulus) అనగా 'చిన్న' అని అర్ధం. మనం తెలుగులో “చిన్నప్ప” (Paul) అని పిలుస్తూ ఉంటాము.

No comments:

Post a Comment