11. పౌలు యెరూషలేములో బంధీయై, కైసరియా చెరలో...
పౌలు తన మూడవ ప్రేషిత ప్రయాణమును క్రీ.శ. 58లో ముగించుకొని యెరూషలేము వచ్చినప్పుడు బంధీగావింప బడ్డాడు (అ.కా. 21:27-36). దేవాలయమును అవిత్రము చేసియున్నాడని యూదులు పౌలును నిందించారు. యెరూషలేములోనున్న రోమాధికారులు పౌలును బంధించి కోటలోనికి తీసుకొని పోయారు. యెరూషలేములోని యూదులతో మాట్లాడుచూ, తన ప్రేషిత కార్యము, క్రీస్తును గూర్చిన సువార్తా బోధన సమ్మతమైనదేనని దృఢముగా ప్రకటించాడు (అ.కా. 22:3-21). పౌలును యెరూషలేమునుండి కైసరియాలోని రాష్ట్రాధిపతియగు ఫెలిక్సు వద్దకు పంపారు. అచ్చట పౌలు రెండు సంవత్సరములు చెరసాలలో ఉంచబడెను. ఎందుకన, ఫెలిక్సు యూదుల అభిమానమునకై అభిలషించెను (అ.కా. 24:27).
రెండేండ్లు గడచిన పిదప ఫెలిక్సు స్థానంలో, పోర్సియు ఫెస్తు రాష్ట్రాధిపతిగ నియమింప బడినాడు (క్రీ.శ. 60లో). అప్పుడు చక్రవర్తికి తన అభ్యర్ధనను విన్నవించు కొనెదని పౌలు కోరియున్నాడు (అ.కా. 25:11). పౌలు రోము పౌరసత్వము కలిగి యుండుట వలన, తన విన్నపమును వెమ్మటే అనుమతించిరి.
ఆ తరువాత కైసరియాకు వచ్చిన అగ్రిప్ప రాజు, ఆయన సోదరి బెర్నీసు యెదుట పౌలు తన వాదనను వినిపించాడు (అ.కా. 26:2-23). పౌలు ఏ నేరము చేయలేదని అగ్రిప్ప, ఫెస్తు గ్రహించారు. అయితే, చక్రవర్తి యొద్దకు పోవలెనని పౌలు విన్నవించుకున్నాడు కనుక అక్కడికే పంపవలెనని వారు నిర్ణయించిరి.
No comments:
Post a Comment