కొరోనా వైరస్ నిర్మూలనకై ప్రార్ధన
మహా కృపా సంపన్నుడవైన దేవా!
నీవు అన్నిటా, అంతటా నీ ప్రేమను కుమ్మరించుచున్నావు.
అందరిపై ముఖ్యముగా అనారోగ్యులపై నీ కరుణను, స్వస్థతను కురిపించెదవు.
కావున భయంకరమైన కొరోనా వైరస్ సోకిన వారందరిపై నీ దయగల హస్తాన్ని చాపండి.
ప్రభూ! ప్రపంచాన్ని వణికిస్తున్న ఆ వైరస్ సోకిన వారిని, దానికి బలైపోతున్న వారిని, వారి కుటుంబాలను ఒదార్చండి.
ఆ వైరసును పోరాడుటకు మందును కనుగొనుటకు చేసే పరిశోధనలను, ప్రయత్నాలను ఫలవంతం చేయండి. ఈ లోకమంతటిపై మీ స్వస్తతా వరాలను జడివానలా కురిపించండి.
ఈ ప్రార్ధనను పరమ వైద్యుడైన క్రీస్తు యేసు నామమున వేడుకొంటున్నాము. ఆమెన్. (1పర. 1 మంగళ. త్రిత్వస్తోత్రం)
No comments:
Post a Comment