పునీత జోజప్ప
గారి మహోత్సవము
మనుష్యావతారమెత్తిన
యేసుకు, మరియమ్మకు సంరక్షకుడుగా, బాలయేసుకు సాకుడు
తండ్రిగా, పునీత జోజప్ప గారి గురించి సువార్తలు వెల్లడిస్తున్నాయి.
కాని వారు మాత్రం సువార్తల్లో ఎక్కడా ఒక మాటైనా మాట్లాడినట్లు లేదు. వారియొక్క
ప్రవర్తన, చేసే పనిని నిర్వర్తించడంబట్టి, దైవాదేశాలను
పాటించడం బట్టి వారెలాంటివారో అంచనా వేసుకోవచ్చు. గొప్ప విశ్వాసం, విరక్తత్వం,
విధేయత, శ్రమైక జీవితం, భాత్యతా పాలన,
వివేకం, వివేచనం, మితవ్యయం,
మితభాషిత్వం, అమాయకత్వం, తననుతాను
తగ్గించుకొనడం, నిగర్వం, నిశ్చత, నిరాడంబరత్వం,
ఇలా మంచి గుణాన్నీ పుణికిపుచ్చుకున్న మహామనిషి.
జోజప్పగారు న్యాయవర్తనుడు, గొప్ప నీతిమంతుడు. వీరు బెత్లెహేములో జన్మించారు. మంచి భాత్యతగల జ్ఞానభర్తగా, మంచి సాకుడు తండ్రిగా అత్యుత్తమ బాధ్యతాయుత సంరక్షకుడుగా మనం సువార్తలో తెలుసుకుంటున్నాము. కాపురం చేయకముందే మరియ గర్భవతి అని తెలుసుకున్న జోజప్పగారు కలత చెందాడు. మరియమ్మను నొప్పింపక, అవమానింపక రహస్యముగా పరిత్యజించి మెల్లగా తప్పుకోవాలనే ప్రయత్నం చేసినట్లు (మత్త 1:19) వింటున్నాం. ఇక్కడ జోజప్పగారి గంభీర వ్యక్తిత్వం, ఘర్షణ ధోరణిలేని సాధుత్వం, పుట్టుకతో వచ్చిన సహజ పాపభీతి స్పష్టముగా కనిపిస్తున్నాయి. పిమ్మట దూత మాట ప్రకారం మారు మాటాడక మరియను చేర్చుకున్నారు. ఇక్కడే వారు తమ భాద్యత, విధేయత, పరిశుద్ధతకు పూర్తిగా లోబరచుకొని దైవాజ్ఞను తు.చ. తప్పక పాటించారు. ఇదే వారి విశ్వసనీయత, విజ్ఞత, ఘనత.
అప్పటినుండి
దైవచిత్తాన్ని ఎరిగి, దానిని ఆచరించ నడుం కట్టారు. తన పరిధిలో
సంరక్షకుడుగా, సహాయకుడుగా, సేవకుడుగా
తననుతాను మలచుకున్నారు. బాయేసును సాకుడు తండ్రిగా దేవుని ఏర్పాటుకు తలొగ్గి
దైవబాున్ని దీనతతో పెంచారు. సంరక్షకుడుగా, సాకుడు తండ్రిగా
తన జీవితాన్ని పూర్ణంకితం గావించుకున్న ఋషిపుంగవు పునీత జోజప్ప గారు. దేవునికి
అర్పించుకున్న ప్రతీ వ్యక్తికి ఆదర్శనీయు. పాలక పోషకులునూ వీరే! మరియమ్మను
కన్నకూతురులా కనిపెట్టుకున్నారు. దొరికిన పశువు కొట్టముతో సంతృప్తి పడి, శుభ్రపరచి
మరియమ్మ సుఖ ప్రసవానికి సిద్ధంచేశారు. బాలయేసును దేవాలయములో అర్పించినప్పుడు,
మరియతో సహా యేరూషలేము దేవాలయానికి వెళ్ళారు. పిమ్మట తల్లి బిడ్డను
సురక్షితముగా ఈజిప్టుకు చేర్చారు. ఆతరువాత నజరేతుకు చేరుకొని జీవనం
కొనసాగించారు. పునీత జోజప్పగారి ఓర్పు,
ఔదార్యం, దీనత, చురుకుదనం వర్ణింప రానివి.
1869-70 లలో జరిగిన
మొదటి వాటికన్ మహాసభలో 9వ పయస్ (భక్తినాధ) పొప్‌గారు
పునీత జోజప్పగారిని విశ్వ శ్రీసభకు పాలక పోషకుడుగా ప్రకటించారు. 1955లో 12వ పయస్
(భక్తినాధ) పొప్‌గారు జోజప్పగారిని కార్మికుల పాలకుడిగా గౌరవించారు. మంచి మరణాన్ని
కోరుకొనే వారందరూ పునీత జోజప్పగారిని ప్రత్యేకంగా ప్రార్ధిస్తారు.
No comments:
Post a Comment