అంతర్జాతీయ మహిళా దినోత్సవం (8 మార్చి)

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (8 మార్చి)

మహిళలు ఈ సృష్టిలో సగం. ఈ సృష్టికి తమానికాలు వారు. నేటి సమాజములో ఇంటా బయటా బహుముఖ పాత్రల్లో జీవిస్తూ కుటుంబ, సమాజ జీవనాన్ని జీవనయోగ్యం చేస్తున్నారు. చదువు సంధ్యలో, ఆట పాటలో పురుషులతో సమానముగా రాణిస్తున్నారు. విద్యా, వైద్య, రక్షణ, రాజకీయ తదితర సేవా రంగాలలో విశిష్ట సేవలందిస్తున్నారు. సామాజిక చైతన్య దీపికలుగా వెలుగొందుచున్నారు. ఎంతోమంది స్త్రీలు చైతన్య స్రవంతులై సమాజాన్ని ప్రభావితం చేస్తున్నారు. వీరు నింగికెగసిన తారలు. వేగుచుక్కలై దారి చూపుతున్నారు. అందరూ సమాజానికి వారి శ్రమను, దయను, ప్రేమను, క్షమను వెరసి, స్త్రీ హృదయాన్ని అందించి జీవాన్ని రెట్టింపు చేస్తున్నారు.

మహిళ ఔన్నత్యాన్ని గుర్తించి, వారి పరువు, మర్యాదను, హోదా, అంతస్తును గౌరవించి నమస్కరించడానికి నేడు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవమును జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవాన్ని ప్రతీ సంవత్సరము మార్చి 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నాము. దీనిని మొదట అంతర్జాతీయ కార్మిక మహిళ దినోత్సవముగా జరిపేవారు. ఆర్ధిక, సామాజిక, రాజకీయ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను కొనియాడుతూ, వారి ప్రశంసలను, ఆభినందలను, ప్రేమను, అందించడానికి వేడుకను జరిపేవారు. 1909 ఫిబ్రవరి 28న అమెరికా సోషలిస్ట్‌ పార్టీవారు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో, మొట్టమొదట ఈ వేడుకలను జరిపారు. అమెరికా సోషలిస్టు ఆలోచనకు ప్రభావితులై జర్మనీ సోషలిస్ట్‌ పార్టీ వారు కూడా 1910లో ఈదినాన్ని మహిళా కార్మికుల గౌరవార్ధం కేటాయించాలని ప్రతిపాదించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవము జరపడానికి ఆస్ట్రియా, డెన్మార్కు, జర్మనీ, స్విడ్జర్లాండ్‌ దేశాలలో నడుం బిగించాయి. క్రమేణా తూర్పు, ఐరోపా దేశాలో, రాష్యాలోను 1913 నాటికి మహిళా దినోత్సవ వేడుకలు జరుపబడి సామాజిక మార్పుకు బాటలు వేశాయి. సమ సమాజ నిర్మాణానికి కట్టుబడిన కమ్యూనిష్టు సోషలిస్ట్‌ దేశాలో మహిళా దినోత్సవాలు జరుపబడ్డాయి. ఐక్యరాజ్య సమితి చొరవతో 1977 నుండి ప్రపంచ వ్యాప్తముగా జరుపబడుతుంది. మొదట్లోనున్న మహిళా విముక్తి పోరాట స్ఫూర్తి నేడు చల్లబడి, మహిళా ఔన్నత్య గుర్తింపు రోజుగా పాటించబడుతుంది.

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవము. మన చుట్టూ ఉన్న ఆడవారిని సన్మానించి గౌరవించే రోజు. సంవత్సరం పొడుగునా వారిని అభిమానించి గౌరవించడానికి పిలుపు రోజు. దేవుడు స్త్రీని ప్రత్యేక విధముగా సృష్టించాడు. దేవునితో నరునితో బంధానికి ప్రత్యేకించి రూపొందించబడినది. జీవం నుండి జీవాన్ని కల్గించు మహత్తర శక్తిని ఆమెకిచ్చాడు దేవుడు. వేదన, ఆవేదన పోటును ఆమె నరనరాలలో ప్రవహింప చేశాడు. ప్రసవ వేదనలో నరకాన్ని, మరణాన్ని చూస్తూ జీవాన్ని లోకానికి అందిస్తుంది.

క్రైస్తవ్యాన్ని స్ఫూర్తియగు స్త్రీను తన సమకాలీన సంస్కృతికి అతీతంగా అభిమానించాడు యేసు. వారి విశిష్టతను వ్యక్తిత్వ మలువను గుర్తించాడు, గౌరవించాడు. సువార్తను తిరగవేస్తే, అనేక మహిళలు భిన్న వయస్కు, భిన్న జీవన పరిస్థితులవారు తారస పడతారు. నజరేతు మరియ, లోక రక్షణ ఉద్యమంలో దేవునితో సహకరించి శ్రీయేసుని గర్భాన దాల్చింది, ప్రోత్సహించించి. సిలువ మార్గంలో తోడుగా నడిచింది. సిలువ క్రింద నిలిచింది.

యేసు అనేక స్త్రీలను స్వస్థత పరచాడు (లూకా 13:11, 7:15, మార్కు 1:30, 5:25, 5:34, 5:41, మత్త 15:28). అనేక మంది స్త్రీలు యేసును వెంబడించారు (లూకా 8:1-3). ప్రతి స్త్రీకి దేవుడిచ్చిన గుర్తింపు, గౌరవం అనాదిగా ఉన్నది. ఆమె విలువైనది. ప్రియమైనది. యేసు దీనిని రూఢీపరచినాడు.

పునీత రెండవ జాన్‌పాల్‌ పొప్‌గారు ‘‘మహిళ ఔన్నత్యం: పిలుపు’’ (Dignity and Vocation of Women) అను అపోస్తోలిక బోధనా లేఖలో మహిళా ఔన్నత్యంను గూర్చి వివరించారు. సృష్టికర్త ఉద్దేశములో స్త్రీ పురుషు సమానులు. స్థాయి భేదాలు వారి మధ్య లేవు. ఇరువురును దేవుని ప్రతిరూపాలే. ఇరువురికి సమ హోదా ఉన్నది.

స్త్రీతత్వం ఒక పిలుపు. ఈ పిలుపులో మాతృత్వం, కన్యత్వం రెండు అంశాలున్నాయి. మాతృత్వం ఒక్క శారీరక భౌతిక వాస్తవం మాత్రమే కాదు. స్త్రీ తననుతాను పూర్తిగా అర్పించుకొనడానికి గల సంసిద్ధత తన అర్పణ పర్యవసానంగా ఫలించు నూతన జీవంను స్వీకరించు సంసిద్ధత మాతృత్వం. జీవరహస్యంలో ఒక ప్రత్యేక భాగస్వామ్యం మాతృత్వం.

నేటి ప్రపంచం స్త్రీ పట్ల కనబరుస్తున్న దృక్పధం, చూపిస్తున్న ధోరణి స్త్రీ ఔన్నత్యంనకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పాలి. సమాజ దృక్పధంలో సంస్కరణ అత్యవసరం. ఆడపిల్ల రోదన అడవిని కాచిన వెన్నెల కాకుండా చేయడమే మన సంస్కారం. మన నాగరిత, నేటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ పిలుపు సవాలు.

No comments:

Post a Comment