పునీత జోజప్ప 19 మార్చి 2020

పునీత జోజప్ప, 19 మార్చి 

పుణ్యము పుణికి పుచ్చుకున్న పుణ్యమూర్తి పూజనీయ పునీతుడు పునీత జోజప్ప. 'జోసెఫ్‌' అంటే ‘కలుపుకొను’, ‘దేవుడు సమృద్ది చేయును’ అని అర్ధం.

పతనమైన మనిషిని దేవుడే స్వయంగా రక్షించి యుండవచ్చును. కాని, ఆవిధంగా చేయడం మానవుని స్వాతంత్రానికి, గౌరవ మర్యాదలకు భంగం కలిగించినట్లే అవుతుంది. మనిషిని మనిషే రక్షించుకుంటే వాని స్వాతంత్రానికి తగు విధంగానుంటుంది. అందుకే దేవుడు మనుష్యావతారం తాల్చి తాను నరుడై నరులకు రక్షణ ఒసగాడు. ఎండిపోతున్న బీళ్ళు, మొలలు చిగుర్చాయి. ఆ దేవాధి దేవుని, ఈ మానవ కుటుంబంలో ప్రవేశ పెట్టి దేవుని రక్షణ భాగ్యాన్ని, నిత్య జీవాన్ని ఈ మానవ కుటుంబం నుండే వచ్చేలా చేసిన విశిష్ట సాధనం మరియ తల్లే. ఆమెవల్లె దేవుడు మానవులో అవతరింప నోచుకున్నాం. మనల్ని మనం రక్షించుకున్నాం. మన గౌరవం మనం కాపాడుకున్నాం (దర్శన. 12:1-5).

దేవమాత, మానవులమాత అయిన ఈ జగజ్జనని సర్వమానవాళిని, క్రైస్తవ మానవాళిని ఐక్యంగా నిత్యజీవన పదంలో పయనింప జేస్తున్న, అలాంటి మహత్తర మాతృత్వం చేపట్టిన అమ్మకు ఈ లోకంలో జ్ఞాన భర్త, బాలయేసు సాకుడు తండ్రి, విశ్వ శ్రీసభ పాలక పోషకుడు, కార్మిక వర్గపాలక పునీతుడుగా మనం స్మరించుకుందాం. 

మనుష్యావతారమెత్తిన యేసుకు, మేరి (మరియ) మాతకు సంరక్షకుడుగా బాలయేసుకు సాకుడు తండ్రిగా భక్త జోజప్ప గారి గురించి సువార్తలు వ్లెడిస్తున్నాయి. కాని, వారు మాత్రం సువార్తల్లో ఎక్కడా ఒకమాటైనా మాట్లాడినట్లు లేదు. వారియొక్క ప్రవర్తన, చేసేపనిని నిర్వర్తించడం బట్టి దైవాదేశాను పాటించడం బట్టి వారు ఎలాంటి వారో అంచనా వేసుకోవచ్చును. గొప్ప విశ్వాసం, విరక్తత్వం, విధేయత, శ్రమైక జీవితం, బాధ్యాతా పాలన, వివేకం, వివేచనం, మితవ్యయం, మతభాషిత్వం, అమాయకత్వం, తననుతాను తగ్గించుకొనడం, దయ, దానధర్మ గుణం, దిక్కులేని వారిని, ఆపదలో నున్న వారిని ఆడుకోవడం, నిగర్వం, నిశ్చత, నిరాడంబరత్వం ఇలా మంచి గుణాన్నీ పుణికి పుచ్చుకున్న మహా మనిషి.

పునీత మత్తయి, పునీత లూకా సువార్తనుబట్టి జోజప్పగారు ‘‘న్యాయవర్తనుడు’’, ‘‘గొప్ప నీతిమంతుడు’’ అని తెలుస్తుంది. అప్రమానిక వార్తు, చారిత్రక సంఘటన ప్రకారం, జోజప్పగారు చాలా పెద్దవాడుగా ఉన్నప్పుడు కన్య మరియమ్మతో ప్రధానం జరిగిందని తొస్తుంది. అప్పటికి ఆయమ్మ వయస్సు 14 ఏండ్లు ఉండవచ్చును. గాబ్రియేలు దేవదూత శుభావర్తమానాన్ని మరియమ్మ గార్కి అందించక మునుపే ఈ నిశ్చితార్ధం జరిగింది.

పునీత జోజప్ప గారినే యోసేపు అనికూడ పిలుస్తాము. వీరు బెత్లేహేములో జన్మించారు. యేసుక్రీస్తు తమ సువార్త ప్రచారం మొదలు పెట్టక మునుపే నజరేతు గ్రామంలో క్రీ.శ. 20లో యేసు మరియ హస్తాల్లో వ్రాలి తమ వయోభారంతో పరిశుద్దమైన సహజ మరణం పొందినట్లుగా తెలియవస్తుంది.

జోజప్పగారు మంచి బాధ్యతగల జ్ఞానభర్తగా, మంచి సాకుడు తండ్రిగా అత్యుత్తమ బాధ్యతాయుత సంరక్షకుడుగా సువార్త వ్ల మనం గ్రహించగుగుతాం. మత్తయి గారి ప్రకారం యేసుక్రీస్తు వంశావళి (మత్త. 1:17)లో అబ్రహాము నుండి దావీదు వంశం వరకు జోజప్పగారి ముందు తరాల పేర్లు ఇవ్వబడినాయి. అయితే జోజప్ప గారికి మరియమ్మగారితో వివాహానికి నిశ్చితార్ధం జరిగాక, వారు సంసార పక్షంగా కాపురం చేయక ముందే మరియమ్మ గర్భవతి కావడం జోజప్పగారిని కచివేసింది. ఆయమ్మను నొప్పింపక, అవమానింపక, రహస్యంగా పరిత్యజించి మెల్లగా తప్పుకోవాలనే ప్రయత్నం చేసినట్లు మత్తయి 1:19లో చెప్పబడినది. ఇక్కడ జోజప్పగారి గంభీర వ్యక్తిత్వం, ఘర్షణ దొరణిలేని సాధుత్వం పుట్టుకతో వచ్చిన సహజమైన పాపభీతి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పిమ్మట ప్రభువు దూత మాట ప్రకారం మారుమాటలాడక మరియను చేర్చుకున్నారు. ఇక్కడే వారు తమ బాధ్యత, విధేయత, పరిశుద్దతకు పూర్తిగా లోబడి దైవాజ్ఞలను తు.చ. తప్పక పాటించారు. ఇదే వారి విశ్వసనీయత, విజ్ఞత, ఘనత.  

అప్పటి నుంచి దైవచిత్తాన్ని ఎరిగి, దాన్ని ఆచరింప నడుంకట్టారు, ఒకవైపు దేవుని తల్లి కాబోతున్న కన్య మరియాంబ వ్యక్తిత్వానికి ఏమాత్రం గౌరవభంగం కాకుండా పేరుకు మాత్రం భర్తగాను, వాస్తవానికి తన పరిధిలో సంరక్షకుడుగాను, సహాయకుడుగాను, సేవకుడుగాను, సద్భక్తుడుగాను తననుతాను మలచుకున్నారు. మరోవైపు దివ్య బాలయేసుకు తండ్రి కాకున్నా, లోకం దృష్టిలో అపార్ధం రాకుండా ఆనవాయితీగా - సాకుడు తండ్రిగా దేవుని ఏర్పాటుకు తలొగ్గి దైవబాలుని దీనతతో పెంచాడు, శ్రమించారు, ఆరాధించారు, ఆనందించారు. తన జీవితాన్ని ఈ రెండు అంశాలతో అనగా సంరక్షకుడు, సాకుడు తండ్రిగా పూర్ణంకితం గావించుకున్న ఋషిపుంగవులు వీరే. దేవునికి అర్పించుకున్న ప్రతివ్యక్తికి ఆదర్శనీయులు వీరు. పాలక పోషకులునూ వీరే.

ఆగస్తు చక్రవర్తి జనాభా లెక్కల విషయమై తన రాజ్యప్రజలు వారివారి స్వస్థలాలకు వెళ్లాల్సిందిగా ఆజ్ఞనివ్వగా (మత్త. 2:11) దావీదు వంశస్తుడైన జోజప్పగారు నిండుచూలాలు మరియమ్మను ఒక గాడిదపై కూర్చుండబెట్టి, తాను నడుస్తూ, అతి జాగ్రత్తతో కొండు, గుట్టు, ఎడారి నేలలు దాటుతూ నజరేతునుండి వంద కొది మైళ్ళు ప్రయాణించి బెత్లెహేము చేరుకున్నారు. మరియను కన్నకూతురులా పొదివి పట్టుకుని తిరుగాడుతూ తలదాచుకొన స్థం కోసం అక్కడ యిళ్ళ వారిని బ్రతిమాలు కున్నారు. ఆఖరుకు పశువుల కొట్టమైనా దొరికినందుకు సంతృప్తిపడి గబగబా దాన్ని శుభ్రపరచి, ఆయమ్మ సుఖ ప్రసవానికి తాను చేయగల్గిన శ్రమనంతా చేసారు. గొల్లలు వచ్చినప్పుడుగాని, జ్ఞానులు వచ్చినప్పుడుగాని వారు విలువైన బహుమానాలు ఇచ్చినప్పుడుగాని అక్కడి పరిస్థితును బట్టి జోజప్పగారే వారందరితో తగువిధంగా వ్యవహరించి ఉండవచ్చును.

ఎనిమిది దినాలు గడిచిన తరువాత సున్నతి గావింపజేసి, ‘‘యేసు’’ అని పేరు పెట్టబడినది. అలాగే మోషే చట్ట ప్రకారం నలభై దినాల ప్రాయంలో బాలయేసును దేవాలయంలో అర్పించే నిమిత్తం మరియతో సహా యేరుషలేము దేవాలయానికి వెళ్ళారు. అక్కడ దైవభక్తుడైన సిమియోను, ప్రవక్తి అన్నమ్మ ప్రవచనాలు, ధన్యతా మాటలు జోజప్పగారు చెవులారా విని ధ్యానించారు. పిమ్మట ప్రభువు దూత పలుకును శిరసావహించి హేరోదు రాజు శిశుహత్యకు వెరచి, తల్లీ బిడ్డను సురక్షితంగా ఈజిప్టుకు చేర్చారు. ఆ తర్వాత కొండమీద నిర్మితమైన నజరేతు గ్రామం చేరుకొని జీవనం కొనసాగించారు. ఈ దూర ప్రయాణాల్లోని వ్యయ ప్రయాసలన్నీ తాను ప్రేమించే దేవుని కోసం భరించారు.

పునీత జోజప్పగారి ఓర్పు, ఔధార్యం, దీనత, చురుకుదనం, జ్ఞానదృడం వర్ణింపనవి కానివి! బాునికి విద్య, వృత్తి పని నేర్పించడంలో మరియమ్మ గారితో పాటు తనవంతు కృషి సల్పారు. యేసుకు పండ్రెండేళ్ల ప్రాయమప్పుడు మరియమ్మగారు, జోజప్పగారు ఆదివ్య బాుని తీసుకొని పాస్క పండుగ కొనియాడటానికి యెరుషలేము వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో పురుషు గుంపులో ముందు నడుస్తుండగా, స్త్రీ గుంపు వెనుక నడచుకుంటూ వస్తున్నారు. బాయేసు సాకుడు తండ్రి యోసేపుతో ఉన్నాడని తల్లి, తల్లితో ఉన్నాడని జోజప్పగారును అనుకోని ఒక మజిలీకి చేరుకున్నాక, బాలుడు తమ యిద్దరితోను లేడని గ్రహించి కలత చెందారు, ఆవేదన పడ్డారు. ఆతృతతో వెనకకు వెళ్లి వేదపండితులను తన ప్రజ్ఞతో దైవ సత్యాను వెల్లడించి, విస్మయ పరుస్తున్న బాలయేసుని కనుగొన్నారు. మరియమ్మతో పాటు ఆ కలవరాన్ని జోజప్పగారును పంచుకున్నారు. ఒక భర్తగా, ఒక తండ్రిగా సంరక్షణ బాధ్యతకు న్యాయం చేశారు. ఇంతవరకే సువార్త ప్రకారం చరిత్ర ఉంది.

యేసు బహిరంగ జీవితం ప్రారంభించక ముందే జోజప్పగారు సుమారు క్రీ.శ. 20లో స్వర్గస్తులై యుండవచ్చును. వీరి ఉత్సవాన్ని మాత్రం నాలుగో శతాబ్దం నుండే జరుపుకుంటున్నట్లు ఆధారాలున్నాయి. ముఖ్యంగా ఐర్లాండు దేశంలోనూ, మధ్యయుగంలో యూరపులోను వారిపై అనేక పరిశుద్ద కధలు చెప్పబడి వారి మధ్యవర్తిత్వాన ప్రార్ధనలు ఆరంభమైనాయి.

క్రీ.శ. 1869-70 లో జరిగిన మొదటి వాటికను మహాసభలో పాల్గొన్న 300 మంది పీఠాధిపతుల కోరికపై 9వ పయస్‌ (భక్తినాధ) పోపుగారు పునీత జోజప్ప గారిని విశ్వశ్రీసభకు పాలక పోషకుడుగా ప్రకటించారు. శ్రీసభ ఆస్తిపాస్తులకు వారినే సంరక్షకులుగా ఏర్పరిచారు. మార్చి మాసంలో గల అన్ని బుధవారాల్లో జోజప్పగారి ప్రార్ధనకై ప్రత్యేకంగా కేటాయించారు. క్రీ.శ. 1955 లో 12వ పయస్‌ (భక్తినాధ) జగద్గురువు జోజప్పగారిని కార్మికుల పాలకుడిగా బిరుదమునిచ్చి గౌరవించారు. మంచి మరణాన్ని కోరుకునే వారందరూ పునీత జోజప్పగారిని ప్రత్యేకంగా ప్రార్ధిస్తారు.

‘‘కొంత మంది పునీతులు వాళ్ళ ప్రత్యేక కార్యసాధకతతో కొన్ని అవసరాల్లోనే వాళ్ళ సహకారాన్ని మనకందిస్తారు. కాని, మన పవిత్ర పాలకులైన భక్త జోజప్పగారు ప్రతీ అవసరం, ప్రతీ పనిలో అన్ని సందర్భాలలో మనకు సహాయం చేసే శక్తి కలిగి ఉన్నారు’’ (పునీత థామస్‌ అక్వినాస్‌).

‘‘పునీత జోజప్పగారిని అడిగినదంతా నేను ఎన్నడూ పొందకుండాలేను. దీనిని నమ్మనివారు పరీక్ష చేయవచ్చును. ఆ పరమ పితాపితృని గౌరవించుట ఎంతో మేలని తాము తెలుసుకొందురు’’ (పునీత తెరేసమ్మగారు).

No comments:

Post a Comment