తపస్సు కాలము: క్రొత్త
స్వభావమును, క్రీస్తు సారూప్యమును ధరించు కాలము
పరిశుద్ద గ్రంధములో నలుబది
(40) అనే సంఖ్యకు గొప్ప ప్రాముఖ్యత, ప్రత్యేకత కలదు.
దీనికి బలమైన కారణం: నోవా కాలములోని జలప్రళయం నలుబది రోజు సాగింది (ఆది. 7:22).
ఏలియా ప్రవక్త హోరేబు పర్వతం చేరుటకు పట్టిన రోజు నలుబది (1 రాజు. 19:81).
యేసు ప్రభువు ఈ లోకములో జీవించినప్పుడు ఉపవాసము చేసినది నలుబది రోజు (మత్త. 4:2).
ఉత్థానము తర్వాత క్రీస్తు ఆరోహణమునకు ముందు తననుతాను ప్రత్యక్ష పరచుకొని
సంచరించినది నలుబది రోజు (అ.కా. 1:3). ఈ విధముగా, నలుబది రోజుకు ఒక
ప్రత్యేకత ఏర్పడినది. ఈ నలుబది దినాల కాల పరిమితి ఒక ప్రత్యేక ఉద్దేశ్యముతో
ఏర్పాటు చేయబడినది. ఇది హృదయ పరిశీలన చేసుకొని, పరివర్తన చెందే కాలం.
ఇది ప్రాయశ్చిత్త కాలం, శుద్ధీకరణ కాలం. దేవుని కృప వలన శరీరేఛ్చను,
సాతాను క్రియను జయించి, దేవుని సన్నిధికి తిరిగి
వచ్చు కాలం. దేవుడు మనకు ఇచ్చిన కృపా కాలమే ఈ తపస్సు కాలం.
వెను తిరిగి వచ్చు కాలం (లూకా. 5:20):
తండ్రి మాటను ధిక్కరించి వెళ్ళిపోయిన చిన్న
కుమారుడు తన తప్పును, తన తండ్రి ప్రేమను తెలిసికొని, తప్పును
సరిదిద్దుకొని, క్షమాపణ కోరడానికి తండ్రి వద్దకు ‘‘తిరిగి వచ్చాడు.’’
మనము కూడా ఈ చిన్న కుమారునివలె మన పాపస్థితిని వదిలి తండ్రి వద్దకు తిరిగి
రావడానికి ఈ తపస్సు కాలం తోడ్పడుతుంది.
ఆత్మ శుద్ధీకరణ కాలం:
తపస్సు కాలం ఆత్మ శుద్ధీకరణ కాలం అని చెప్పవచ్చు. వాక్యం
చదివి, ధ్యానించి, ఉపవాసము, ప్రార్ధన,
ధర్మక్రియలు చేయుట ద్వారా ఆత్మ ప్రక్షాళన జరుగును.
నూత్నీకరించు కాలం:
ఈ 40 రోజు ఉపవాసము
ద్వారా మనలను శుద్దీకరించుకొని, నూత్నీకరించుకొను కాలం.
మన పాత పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి, నూతన స్వభావమును ధరించి
జీవించుటకు ఇది మంచి అవకాశం. క్రీస్తు నలుబది దినాల ఉపవాస ప్రార్ధనను అనుసరిస్తూ,
ఈ నలుబది రోజు తపస్సు కాలమును ప్రవేశపెట్టడం జరిగింది. క్రీస్తు శకం మొదటి శతాబ్దములో
ప్రారంభమైన ఈ తపస్సు కాలం 5వ శతాబ్దమునకు 40 దినాలుగా
మార్చబడి పరిపూర్ణతను పొందినది. ఆనాటి నుండి ఈనాటి వరకు దీనిని పాటిస్తూ పవిత్రతను
పొందిన వారు ఎందరో ఉన్నారు. ప్రతీ శుభ కార్యమునకు, ప్రతీ పనికి
ఆయత్తపడు కాలం ఒకటి ఉంటుంది. అదేవిధముగా, ఈ తపస్సు కాలము క్రీస్తు
పాస్కా పండుగను యోగ్యరీతిగా కొనియాడుటకు ఆయత్తపడు కాలము.
గొంగళి పురుగును చూస్తే మనకు
చాలా అసహ్యం వేస్తుంది. శరీరం మీద పాకితే దద్దు, దురదు వస్తాయి.
తన చుట్టు ఒక గూడు కట్టుకొని, ఏ ఆహారం తీసుకోకుండా నలుబది
రోజు ఆ గూటిలో గడుపుతుంది. నలుబది రోజు తర్వాత అందమైన రంగురంగు సీతాకోక చిలుకలాగా
బయటకు వస్తుంది. గొంగళి పురుగుకి - సీతాకోక చిలుకకు ఎక్కడా పోలిక ఉండదు. దీనిలో ఒక
గొప్ప ఆత్మ సత్యము దాగి ఉన్నది. మనము కూడా 40 రోజు తపస్సు కాలము
తర్వాత క్రొత్త స్వభావ్వముతో కనిపించాలి.
క్రొత్త స్వభావమును, క్రీస్తు సారూప్యమును ధరించు కాలం:
చాలా సార్లు మనం పాపములో జీవించినప్పుడు మన
స్థితి గొంగళి పురుగు కంటే అసహ్యముగా ఉంటుంది. పశ్చాత్తాపం అనే గూడు కట్టుకొని నలుబది
రోజు దేవుని వాక్యమును భుజిస్తూ, ధ్యానిస్తూ జీవిస్తే,
నూతన స్వభావమును ధరించుకొని అందమైన సీతాకోక చిలుకవలె క్రీస్తుతో ఉత్థాన
పండుగలో ఆనందిస్తాం. ఇటువంటి సందర్భములో పునీత పౌలుగారి మాటను గ్రహించుదాం: ‘‘మీ పూర్వ జీవితపు
పాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము, మోసకరమగు దుష్ట
వాంఛచే భ్రష్టమై పోయినది. మీ మనస్తత్వమును నూత్నీకరించు కొనుడు. సత్యమైన నీతిని,
పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు’’
(ఎఫేసీ 4:22). ఈ నలుబది రోజును సద్వినియోగము చేసుకొని నూతనమైన
జీవితమును జీవించుటకు ప్రయత్నించుదాం. అందుకు కావసిన దేవుని కృప మనకు తోడై
నడిపించునుగాక!
దేవుని బిడ్డమైన మనము సత్
సంక్పముతో ఈ నలుబది రోజు ఉపవాసముండి దైవ ధ్యానము చేస్తూ, ఆయననే మదిలో తలంచుచూ
ప్రార్ధిస్తే ఆయన మన వేడికోలును ఆలకిస్తాడు. అందుకేనేమో, పరిశుద్ధ
గ్రంధములో అనేకమంది భక్తులు 40 రోజు ఉపవాస ప్రార్ధను
చేసి దైవవరమును పొందారు.
No comments:
Post a Comment