పునీత వన చిన్నప్ప (పౌలు, ఋషి)
తొలి క్రైస్తవ ఋషి, మతసాక్షి
పండుగ జనవరి 15
పునీత జెరోముగారు ఆయన జీవిత చరిత్రను రాసారు.
పాలక పునీతుడు: సంప్రదాయ ప్రకారం ఒక పునీతున్ని ప్రత్యేక భక్తి విశ్వాసముతో ఒక స్థలములో కొనియాడడం, వారిని ప్రత్యేకముగా కాపాడేవానిగా, ఆయన ప్రార్థన వేడుక ద్వారా దేవునికి ప్రార్థనలు చేయడం జరుగుతుంది.
జననం: అలెగ్జాండ్రియా, ఈజిప్టు, 230 వ సంవత్సరము.
పండుగు, వేడుకలు మన జీవితములో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. మన జీవితాను నూతనోత్తేజముతో నింపుతాయి. దేవునితో, బంధుమిత్రులతో సత్సంబంధాలను బలపరచుకొనేలా చేస్తాయి. ఒకవైపు ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందిస్తూ, మరోవైపు మన జీవితాలను అర్థవంతముగా జీవించడానికి మనకు కావసిన ఆత్మస్ధైర్యాన్ని, దైవానుగ్రహాలను ఈ పండుగలు, వేడుకలు మనకు ఇస్తాయి.
ముఖ్యముగా, పాలక పునీతుల పండుగులు క్రీస్తునందు ధన్యమైన వారి జీవిత విశేషాలను ధ్యానిస్తూ, స్ఫూర్తిని మనలో నింపుకొంటూ ఉంటాము. పాలక పునీతుల ప్రార్ధన సహాయాన్ని కోరుకొంటూ ఉంటారు.
మన జీవితాలు ఉరుకులు పరుగులు బాధ్యతలు...అయినప్పటికినీ, మన బంధువులతో ఈ మహోత్సవమును కొనియాడుచున్నాము. సం॥లో ఎన్నో పండుగలు, వేడుకలు చూస్తూ ఉంటారు. అయితే, ఈ పండుగ మనందరికి ప్రత్యేకం కావాలి. ఈ ప్రత్యేకములో 1. దివ్యబలి ప్రధానమైనది: 2. వచ్చిన మన బంధువులతో మరియు వచ్చిన బంధువులు కూడా ఈ రోజు మన బంధాలను, బంధుత్వాలు, స్నేహాలను బలపరచుకోవాలి. మనకి కొన్ని పట్టింపులు అలగడాలు, మాట్లాడుకోకపోవటం వాటన్నింటిని వీడుదాం. మరీ! మన పాలక పునీతుడు, పునీత వన చిన్నప్పగారి గురించి తెలుసుకొని, ఈ మహోత్సవాన్ని అర్థవంతంగా జరుపుకొందాం.
పునీత వన చిన్నప్ప గారు, పౌలు ఋషి, తొలి క్రైస్తవ ఋషి, మతసాక్షి మన పాలక పునీతుడు: ఈ పునీతుడు ఈజిప్టు దేశములో తేబెస్ అనే గ్రామములో క్రీ.శ.229లో ఉన్నతమైన కుటుంబములో జన్మించారు. అయితే తన 15వ ఏటనే తల్లిదండ్రులు చనిపోయారు. అనాధగా మిగిలిపోయాడు. అయినప్పటికిని, ఉన్నత విద్యను అభ్యసించాడు. దేవుడంటే గొప్ప విశ్వాసం కలిగి జీవించాడు.
ఆ రోజుల్లో రోము సామ్రాజ్యం చాలా దేశాలను పరిపాలిస్తుంది. ఆనాటి రోము చక్రవర్తి డేసియస్, క్రైస్తవ వ్యతిరేకి. క్రైస్తవుపట్ల చాలా దౌర్జన్యాలు చేసాడు. గురువులను, విశ్వాసులను అవమానించాడు. చంపివేశాడు. క్రైస్తవులు తమ మతాన్ని విడనాడాలని లేకపోతే నేరస్తులుగా లెక్కింప బడతారని శాసించాడు. దీని కారణముగా, క్రైస్తవులందరు చెల్లాచెదరై పోయారు. రహస్య ప్రదేశాలకు పారిపోయారు. అక్కడే రహస్య క్రైస్తవులుగా జీవించారు. అప్పుడే వన చిన్నప్ప గారు కూడా, తన దృఢవిశ్వాసాన్ని కాపాడుకోవడానికి, భయంకర వేదహింసనుండి పారిపోయి రహస్య ప్రదేశాలో తల దాచుకొన్నాడు. అయితే, వన చిన్నప్పగారి బంధువు ఒకరు, క్రైస్తవ వ్యతిరేకి ఒకరు ఉండేవారు. వన చిన్నప్పగారి ఉనికిని తెలుసుకొని శత్రువులకు తెలియజేసేవాడు. వనములోనికి లేదా అరణ్యములోనికి పారిపోయి అక్కడ ఒక గహలో తలదాచుకొన్నాడు. తన జీవితం, పోషణ, ఆలనాపాలనా, అంతటినికూడా దేవునిపై భారంవేసాడు. తన విశ్వాస జీవితాన్ని దేవుడే చూసుకుంటాడని ధృఢముగా నమ్మాడు. ఆ దట్టమైన అడవిలో ఏ క్రూరమృగాలు ఆయనను దాడిచేయలేదు. ఎలాంటి కీడు ఆయనకు కగలేదు. ప్రభువే కనబడని కంచెగా ఆయనను కాపాడాడు.
వనచిన్నప్పగారిని దేవుడు అద్భుత రీతిన కాపాడాడు, పోషించాడు! ఆయన నివసిస్తున్న చోటుకి దగ్గరలోనే ఒక తాటిచెట్టు ఉండేది. అది ప్రతీ రోజు ఒక తాటి పండును క్రింద పడేసేదట! తాటి పండును తృప్తిగా తిని రోజు సంతోషముగా దేవుణ్ణి స్తుతించేవాడట! ఆ ప్రక్కనే ఉన్న సెలయేటి నీటిద్వారా తన దాహాన్ని తీర్చుకొనేవాడట! ఇలా 21 సం.ల తర్వాత ఆ తాటిచెట్టు మోడువారిపోయింది. పండ్లు కాయటం మానేసింది. అప్పుడు ఆయన తదేక దీక్షతో దేవునికి ప్రార్థన చేసాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రార్థనలో, ధ్యానములో గడిపాడు. సాయంత్రానికి ఆకలి వేసినప్పుడు, దేవుని చిత్తం కోసం, కళ్ళు తెరచి చూడగా, తన ప్రక్కన ఉన్న ఒక చెట్టుపై ఒక కాకిని చూసాడు. దాని నోటిలో అర రొట్టెముక్కను చూసాడు. వనచిన్నప్పగారు రెప్పవేయులోపే ఆ కాకి ఆ రొట్టె ముక్కను ఆయన చేతిలో పడేలా జారవిడచింది. దైవప్రసాదముగా రొట్టెను అందుకొని, దేవునికి కృతజ్ఞతా స్తోత్రము చెల్లించి, ఆ రొట్టెను భుజించి తన ప్రాణాను నిలబెట్టుకొన్నాడు. ఇలా ప్రతీరోజు ఒక అర రొట్టెముక్కను అందిస్తూ వచ్చింది.
దైవప్రేరణ వలన క్రైస్తవులను హింసించే చక్రవర్తి మరణించాడని, వేదహింసలు తగ్గాయని తెలుసుకొన్నాడు. వెంటనే తన ఇంటికి వెళ్లాలని అనుకొన్నాడు. కాని వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే, అరణ్యములో ప్రశాంతమైన జీవితం, దేవుడు అందిస్తున్నటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ ప్రార్ధనలో, ధ్యానములో జీవించడం మంచిది అని అనుకొన్నాడు. లోకములో హింసలు, దౌర్జన్యాలు పోయి, శాంతి సమాధానాలు ఉండాలని అందరూ నివసించడానికి ఈ లోకం ఓ చక్కని నివాస స్ధలముగా మారాలని ప్రార్ధన చేసేవాడు. ఇలా వారికి 113 సం.లు వచ్చేవరకు తన జీవితాన్ని అచ్చటే కొనసాగించాడు.
ఈ వనచిన్నప్పగారి గురించి దేవుడు ఈజిప్టుదేశ పునీత అంతోనివారికి తెలియజేశాడు. వెంటనే వన చిన్నప్పగారిని వెతుకొంటూ అంతోనివారు అరణ్యములోనికి వచ్చారు. మొదటగా ఒక తోడేలును చూసాడు. అది దాహముతో నీటికొరుకు వెదకుతూ అడవిలోనికి వెళ్ళింది. దాహముతో ఉన్న అంతోనివారు కూడా నీటి కొరకు ఆ తోడేలును అనుసరించాడు. అడవి మధ్యలోనున్న సెయేటి దగ్గరకు వచ్చాక, తన దాహాన్ని తీర్చుకొని దేవునికి స్తోత్రాలు చెల్లించి, కొద్దిసేపు సేద తీరుదామని దగ్గరలోనున్న చెట్టు దగ్గరికి వెళ్ళగా, వనచిన్నప్ప గారిని చూసాడు. ఆయన ప్రార్థనలో ఉన్నాడు. సాయంకాలం వరకు అంతోని వారు వేచిచూసాడు. వనచిన్నప్పగారు కనులు తెరువగా ఎదురుగా ఉన్న అంతోనివారిని పరిచయం చేసుకొన్నాడు. ఇక ఒద్దరికీ ఆహారం ఎలాగా అని అనుకున్నంతలోపే, ఆ కాకి ఈ సారి రెట్టింపు రొట్టెను తీసుకొని వచ్చింది. దైవభక్తులిద్దరు చెరిసగం తిని, తమ ఆకలిని తీర్చుకున్నారు.
త్లెవారు జామున వనచిన్నప్పగారు అంతోని వారితో తాను కొద్దిసేపట్లో మరణిస్తానని తెలియ జేసాడు. అంతోనివారిని భూస్థాపితం చేయాలని కోరారు. ఆయన చెప్పినట్లుగానే ఆయన మరణించారు. పునీత వన చిన్నప్పగారి ఆత్మ తెల్లని వర్ణముతో అమిత ప్రకాశముతో మహిమతో ఆకాశంవైపు ఎగరటం పునీత అంతోనివారు చూసారు. ఇంతలో రెండు బలమైన సింహాలు వచ్చి సమాధి గోతిని తమ పంజాతో గబగబా త్రవ్వాయి. వనచిన్నప్పగారి కోరిక మేరకు పునీత అంతోనివారు భూస్ధాపిత కార్యక్రమం నిర్వహించారు. 113 సం.లు నిండు జీవితాన్ని జీవించి క్రీ.శ. 342 లో మరణించియున్నారు.
ఈ పునీతుని నుండి మనం నేర్చుకోవసినవి:
మనందరికి ఎడారి అనుభవం అవసరం: ఏకాంత జీవితం, నిశ్శబద్ధ జీవితం, ధ్యాన జీవితం, ఆత్మ పరిశీలన జీవితం, ప్రార్థనా జీవితం, దేవునిపై పూర్తిగా ఆధారపడే జీవితం, పరివర్తన జీవితం. ఎడారి లేదా వనము అనే పరిస్ధితులకు మనము అనేకసార్లు నడిపించబడుచున్నాము.
బైబుల్‌లో: మోషే 40 సం॥లు ఎడారిలో నివసించి ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టు బానిసత్వము నుండి విడిపించాడు. ఈజిప్టునుంచి విడిపించి, 40 సం॥లు ఎడారిలో ప్రయాణం చేసారు.
దావీదు: రాజు కాకముందు విలాసాలు, దుష్టత్వమునుండి తప్పించుకొంటారు అనేకసార్లు ఎడారిలో జీవించాడు.
యేసు: జ్ఞానస్నానము పొందిన వెంటనే ఆత్మ ప్రభువును 40 రోజుపాటు ఎడారిలోనికి నడిపించింది.
మన జీవితంలోని ఎడారి: అనారోగ్యం, ఉద్యోగం దొరకక పోవటం, ఆర్ధిక సమస్యలు, భార్యభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, పిల్లలు చెడు జీవితం... ఇలా ఎన్నో, ఎన్నెన్నో ఇవన్నీ మన జీవితములో ఎడారి ప్రయాణాలే!
ఇలాంటి సమయాలో దేవుడు మనలను విడనాడాడని భావిస్తాం. మనలను పక్కన పెట్టేసాడని భావిస్తాం. అయితే, ఇలాంటి ఎడారి జీవితముని దేవుడు, మన జీవితంలో పని చేస్తూనే ఉంటాడు. మన ఎడారి జీవితాలను, దేవుడు అనేక విధాలుగా ఉపయోగించుకొంటాడు.
ద్వితియోపదేశకాండము 8:2,6 చదువుదాం:
ఎడారి జీవితం వినయాన్ని నేర్పుతుంది.
మన హృదయములో ఏమున్నదో నిరూపితమగును.
దేవుని వాక్యముచేత జీవించునట్లు చేయును.
దేవుడు అన్ని పరిస్థితులో మన అవసరము తీరుస్తాడు అని తెలుసుకొంటాము.
ఎడారి: దేవునిపట్ల భయమును, భక్తిని నేర్పుతుంది.
ద్వి.కాం.32:10 ప్రభువు ఇశ్రాయేలు ప్రజలను ఎడారిలో చూచెను, కనుపాపను వలె సంరక్షించి, పెంచి పెద్ద చేసెను.
బాప్తిస్మ యోహాను ఎడారిలో ఇలా బోధించెను: (మ 3:1`9) ఇదిగో ఆనాటి ప్రజల సమస్యలు /హృదయ కాఠిన్యం / పాప జీవితం / అనారోగ్యం / రాజకీయం / మొ.వి.
ఆధ్యాత్మికతను పెంపొందుటకు సహాయం చేస్తుంది. మన విశ్వాసం పరీక్షింపబడుతుంది.
No comments:
Post a Comment